Specialist Officer posts
-
యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం ఉంటే.. మూడంచెల్లో జరిగే ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో చక్కటి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా యూబీఐకి పేరుంది. డిజిటలైజేషన్ ఊపందుకుంటున్న నేపథ్యంలో.. వినియోగదారులకు ఆన్లైన్ సేవలను మరింత వేగంగా అందించేందుకు బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమిస్తుంటాయి. అందులో భాగంగా యూబీఐ.. 2021 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ► మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య –347 ► పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146. ► విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటింగ్, టెక్నికల్ ఆఫీసర్. అర్హతలు ► పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్,సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్,ఎంబీఏ, సీఏ /సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం, సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి. వయసు ► సీనియర్ మేనేజర్ స్థాయి పోస్టులకు 30–40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్లకు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం ► యూబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలుత ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇలా మూడు దశల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 200 మార్కులకు రాత పరీక్ష ► రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మల్టిపుల్ ఛాయిస్ విధానం(ఎంసీక్యూలు)లో ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌లో 50 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు–100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 పశ్నలకు– 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యూబీఐ రాత పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వంతు మార్కు తగ్గిస్తారు. సమాధానాలు గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎటువంటి నెగిటివ్ మార్కుల నిబంధన వర్తించదు. గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పోస్టులను బట్టి 3:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అంటే.. ఒక పోస్టుకు ముగ్గురు పోటీపడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి అకడెమిక్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆలోచనల్లో స్పష్టత, హాబీలు, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్, వ్యక్తిత్వం, ఉద్యోగానికి తగిన లక్షణాలు ఉన్నాయా.. ఇలా వివిధ కోణాల్లో పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ కనీస అర్హత మార్కులు 25. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు పొందని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. వేతనాలు సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ. 63,840–78,230, మేనేజర్ స్థాయి అధికారులకు రూ.48,170–69,810, అసిస్టెంట్ మేనేజర్లుకు రూ.36,000–63,840 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇవే కాకుండా హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ కంపన్సేటరీ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటివి లభిస్తాయి. ప్రొబేషన్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని యూబీఐ బ్రాంచీలలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గతంలో యూబీఐ ఎస్ఓ నియామకాలను చూస్తే.. తొలుత రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా పనిచేయాల్సి ఉండేది. ఇప్పుడు కూడా ఆదే నిబంధన అమలయ్యే అవకాశం ఉంది. కెరీర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు యూబీఐలో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ పదోన్నతుల విధానానికి అనుగుణంగా అనుభవం, పనితీరుకు ఆధారంగా ఉన్నతస్థాయి హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.unionbankofindia.co.in -
ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 68 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(సివిల్)–36, అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(ఎలక్ట్రికల్)–10,అసిస్టెంట్ మేనేజర్–మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్–04, డిప్యూటీ మేనేజర్(అగ్రికల్చర్ స్పెషల్)–10, రిలేషన్షిప్ మేనేజర్(ఓఎంపీ)–06, ప్రొడక్ట్ మేనేజర్(ఓఎంపీ)–02. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.04.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:13.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:02.09.2021 ► పరీక్ష తేది: 25.09.2021 ► వెబ్సైట్: https://sbi.co.in -
సిండికేట్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వ రంగ బ్యాంకుగా మంచి పేరున్న సిండికేట్ బ్యాంకు 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ సమాచారం... డిప్యూటీ జనరల్ మేనేజర్(లా) వయసు: కనీసం 40 ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్లు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ‘లా’లో గ్రాడ్యుయేట్/ఇంటెగ్రేటెడ్ లా కోర్సు గ్రాడ్యుయేట్. పని అనుభవం: కనీసం పదకొండేళ్ల పని అనుభవం ఉండాలి. అందులో మూడేళ్లు ఏదైనా కోర్టులో ఇండిపెండెంట్‌గా పనిచేసి ఉండాలి. దీంతో పాటు 8 ఏళ్లు ఏదైనా కమర్షియల్ బ్యాంకులో లా ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి. అందులో మూడేళ్లు చీఫ్ మేనేజర్ లేదా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసి ఉండాలి. పోస్టుల వివరాలు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎకానమిస్ట్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 సంవత్సరాలు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మానిటరీ/ఫైనాన్షియల్ ఎకనమిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌తో ఎకనామిక్స్‌లో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కనీసం 5 ఏళ్లు ఎకనమిక్ రీసెర్చ్‌పై పనిచేసి ఉండాలి, ఫైనాన్షియల్ మార్కెట్/డొమెస్టిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్‌లోని క్వాంటిటేటివ్ టెక్నిక్స్‌లో సామర్థ్యం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(స్టాటిస్టీషియన్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో స్టాటిస్టిక్స్/అప్లైడ్ టిస్టిక్స్/ఎకనోమెట్రిక్స్లలో పీజీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి. పని అనుభవం: కనీసం 3 నుంచి 5 ఏళ్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులో/ ఎకనోమెట్రిక్ టెక్నిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో పని అనుభవం. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు.విద్యార్హత: కంపెనీ సెక్రటరీ(ఏసీఎస్) ఉత్తీర్ణులై, లా డిగ్రీ ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) మెంబర్ అయి ఉండాలి.పని అనుభవం: ప్రభుత్వ/ప్రైవేటు రంగ బ్యాంకులో కంపెనీ సెక్రటరీగా కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. సర్టిఫైడ్ బ్యాంకింగ్ కంప్లయన్స్ ప్రొఫెషనల్ కోర్సు, ఐఐబీఎఫ్‌లో ఉత్తీర్ణత ఉండాలి. మేనేజర్ (లా) వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు. విద్యార్హత: ఎల్ఎల్బీ డిగ్రీ ఉండాలి.పని అనుభవం: బార్/జ్యుడీషియల్ సర్వీస్‌లో రెండేళ్ల పని అనుభవం లేదా ఏదైన ప్రముఖ కమర్షియల్ బ్యాంకులో లీగల్ డిపార్ట్మెంట్లో లా ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి. మేనేజర్ (సెక్యూరిటీ ఆఫీసర్) వయసు: కనీసం 25 ఏళ్లు, గరిష్టంగా 45 ఏళ్లు. పని అనుభవం: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కనీసం 5 ఏళ్లు కమిషన్డ్ ఆఫీసర్లుగా పనిచేసి ఉండాలి లేదా ఏఎస్పీ/డీఎస్పీ హోదాతో 5 ఏళ్లు పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం/కనీసం 5 ఏళ్లు పారా మిలిటరీ ఫోర్స్‌లో పనిచేసి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్స్ వయసు: కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు. విద్యార్హత: చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం: బ్యాంకులో పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-సివిల్) వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం. అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్-ఎలక్ట్రికల్) వయసు: కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు.విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉండాలి.గమనిక: అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేలు(జేఎంజీ/ఎస్) కింద ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ అభ్యర్థులకు ఒకేడాది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఏ ప్రదేశంలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ: జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/స్కేల్ కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్, సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అనుగుణంగా రాతపరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష: ఆన్లైన్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. అంశం {పశ్నలు మార్కులు రీజనింగ్ 50 25 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 పోస్టుకు సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 100 ఇంగ్లిష్ 50 25 మొత్తం 200 200 గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ: అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల సాధనలో అభ్యర్థి చొరవ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసే నైపుణ్యాలను పరీక్షించేందుకు గ్రూప్ డిస్క షన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి. పీఐ/జీడీ ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే తుది ఎంపికకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50. దరఖాస్తు ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. ముఖ్య తేదీలు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015. పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై. వెబ్సైట్: www.syndicatebank.in