బ్యాంకుల వద్ద నగదుకోసం అగచాట్లు పడుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు.
శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు మృతి
నరసన్నపేట: బ్యాంకుల వద్ద నగదుకోసం అగచాట్లు పడుతూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారుకు చెందిన జగన్నాథం(60) తన కుమారుడు గోవిందరావు హైదరాబాద్ నుంచి తన పేరిట పంపిన నగదును తీసుకోడానికి రెండు రోజులుగా తిలారు నుంచి నరసన్నపేట బ్యాంకుకు వస్తున్నాడు.
ఈ ఆవేదనలో శనివారం ఇంటికి వెళ్లిపోవడానికి బస్సు కోసం నరసన్న పేట బస్సు కాంప్లెక్స్‌కు వచ్చిన ఆయన అక్కడే చనిపోయాడు.బ్యాంకు నుంచి నగదు అందకపోవడం, పాడి రైతులకు డబ్బులు చెల్లించలేకపోవడంతో ఆందోళన చెంది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామానికి చెందిన బొజ్జా నాగమునిరెడ్డి(44) అనే పాలకేంద్ర ం నిర్వాహకుడు మృతిచెందాడు. అతను ఉల్లగల్లులోని సిండికేట్ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఆవేదనతో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు.