వీటిని అన్ని లావాదేవీలకు ఉపయోగించవచ్చు
సుల్తాన్‌బజార్: పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవి. వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ సూచించారు. గురువారం కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ప్రజలకు, వినియోగదారులకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీఐ ఉత్తర్వుల మేరకు రూ.10 నాణేల వాడకంపై విస్తృత అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లుబాటవుతున్నాయన్నారు.
పది రూపాయల నాణేలు అన్ని చోట్లా తీసుకోవచ్చు.. అనే పోస్టర్లను రద్దీ ప్రాంతాల్లో, ప్రజా రవాణా ప్రాంతాల్లో ప్రజల అవగాహన కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. రూ.10 నాణేల వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. రూ.10 కరెన్సీ నోట్లు త్వరగా చిరిగిపోవడం, వాటి ముద్రణ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నాణేలను రిజర్వ్ బ్యాంక్ తీసుకువచి్చందన్నారు. ఇప్పటికైనా ప్రజలు రూ.10 నాణేల వాడకాన్ని ఉపయోగించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment