ten rupee coins
-
రూ.10 నాణేలు చట్టబద్ధమైనవి
సుల్తాన్‌బజార్: పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవి. వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ సూచించారు. గురువారం కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ప్రజలకు, వినియోగదారులకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు రూ.10 నాణేల వాడకంపై విస్తృత అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లుబాటవుతున్నాయన్నారు.పది రూపాయల నాణేలు అన్ని చోట్లా తీసుకోవచ్చు.. అనే పోస్టర్లను రద్దీ ప్రాంతాల్లో, ప్రజా రవాణా ప్రాంతాల్లో ప్రజల అవగాహన కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. రూ.10 నాణేల వినియోగంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. రూ.10 కరెన్సీ నోట్లు త్వరగా చిరిగిపోవడం, వాటి ముద్రణ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నాణేలను రిజర్వ్ బ్యాంక్ తీసుకువచి్చందన్నారు. ఇప్పటికైనా ప్రజలు రూ.10 నాణేల వాడకాన్ని ఉపయోగించాలన్నారు. -
రూ.10 నాణేలతో లక్షలు ఖరీదు చేసే కారు...కారణం వింటే షాక్ అవుతారు
ఇంతవరకు తమకు నచ్చిన స్కూటీ, లేదా మంచి ఖరీదు చేసే బైక్ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ ఇక్కడొక వ్యక్తి వారిలానే నాణేలను పోగుచూసి తన కలల కారుని కొనుకున్నాడు. కానీ అతను వారందరికీ భిన్నం. పైగా అతను ఎందుకు అలా చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను సుమారు రూ. 6 లక్షలు పోగుచేసి వాటితో తనకు నచ్చిన కారుని కొనుకున్నాడు. ఐతే మొదటగా ఆ షాప్ డీలర్ ఈ రూ. 10 నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు అంగీకరించ లేదు. వెట్రివేల్ ధృడ నిశ్చయం విని షాప్ డీలర్ ఈ విక్రయానికి అంగీకరించాడు. ఇంతకీ అతను ఎందుకు ఏకంగా రూ. 6 లక్షల రూ. 10 నాణేలను పోగు చేశాడంటే...అతని తల్లి ఒక దుకాణం నడుపుతుంటుందని చెప్పాడు. ఐతే కస్టమర్లు రూ. 10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించాడంతో చాలా పెద్ద మొత్తంలో రూ.10 నాణేలు ఉండిపోయాయి. పైగా పిల్లలు కూడా ఆ రూ. 10 నాణేలు విలువ లేనివని ఆడుకోవడం చూశానని చెప్పాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలతోనే కారు కొనుక్కుని చూపి.. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నట్లు తెలిపాడు. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడూ ఎందుకు బ్యాంకులు స్వీకరించడంలేదంటూ ప్రశ్నించాడు. తాను ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలు విలువైనవేనని చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ పని చేశానని చెప్పాడు. అందుకోసం తాను దాదాపు నెలరోజులకు పైగా పది రూపాయల నాణేలను రూ. 6 లక్షలు పోగుచేశానని చెప్పుకొచ్చాడు. (చదవండి: సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్) -
చిల్లర వేషాలు!
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ‘‘బ్యాంకులే రూ.పది నాణేలు ఇచ్చాయి. మరలా వాటిని తిరిగి బ్యాంకులో వేద్దామంటే తీసుకోవడం లేదు. పసుపు కుంకుమ పేరిట ఇచ్చిన సొమ్ముల్లో భాగంగానే అవి బ్యాంకు అధికారులు ఇచ్చారు. వాటిని బయట మారుద్దామంటే ఎవ్వరూ తీసుకోవడం లేదు. పోనీ బ్యాంకులకు వెళితే వారు కూడా వద్దంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు’’ ఇదీ ప్రస్తుతం పలు డ్వాక్రా సంఘాల మహిళల ఆవేదన. ఎందుకో ఏమో తెలీదు.. కొన్ని నెలలుగా రూ.10 నాణెం మారడం లేదు. నేడు మార్కెట్లో ఆ నాణేనికి విలువ లేకుండా పోయింది. బ్యాంక్‌లు గానీ, చివరకు ఆర్బీఐ గాని రూ.పది నాణేలు మారవని అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా ప్రతి వ్యాపారి రూ.పది నాణేన్ని తిరస్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిలకు కొద్ది రోజుల ముందు పసుపు–కుంకుమ పథకం పేరుతో మూడు విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళకు రూ.పది వేలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.పది నాణేలను పెద్ద మొత్తంలో ఈ పథకంలో బ్యాంక్‌లు డ్వాక్రా మహిళలకు అంటగట్టాయి. బ్యాంక్‌లు ఇచ్చిన రూ.పది వేల సొమ్ముల్లో రూ.వెయ్యి పదిరూపాయల నాణేలను అంటగట్టడంతో వాటిని మార్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. చివరకు వ్యాపారులు, వివిధ రకాల దుకాణదారులే కాదు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో కూడా కండెక్టర్ రూ.పది నాణేన్ని తీసుకోకపోవడంతో ఈ నాణేలు ఇంక మారవన్న నిర్ణయానికి వచ్చేసి తమ వద్దే వాటిని అలా నిరుపయోగంగా ఉంచుకున్నారు. సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ డ్వాక్రా మహిళ బుధవారం ఉదయం అంబాజీపేటలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. అంబాజీపేటలోని ఓ బేకరి దుకాణంలో కొన్ని పదార్థాలు కొనుగోలు చేసి నోట్లతో పాటు ఓ రూ.పది నాణెం కూడా ఇచ్చింది. దుకాణదారుడు ఆ నాణేన్ని తిరస్కరించి ఇది మారడంలేదు. రూ.పది నోటు ఇవ్వమని చెప్పాడు. ఆ మహిళ చాలా అసహనంగా ‘చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులండి బాబు... ఆర్టీసీ బస్సులో కండెక్టర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీరు తీసుకోవడం లేదు. గత నెల రోజులుగా ఈ నాణేలను మార్కెట్లో ఏమైనా కొన్నప్పుడు ఇవ్వడం, వారు మారదనడం మాకు మామాలైపోయింది’ చెప్పడం గమనార్హం. ఈ పథకం కింద బ్యాంక్‌లు పరోక్షంగా బాబు ప్రభుత్వం అంటగట్టిన రూ.పది నాణేలను మార్చడం డ్వాక్రా మహిళలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇదే విషయాన్ని చాలా మంది మహిళలు సంబంధిత బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ‘అవి ఎందుకు మారవు’ అని అంటున్నారే తప్ప, ‘తిరిగి మీ బ్యాంక్‌లోనే ఈ నాణేలను జమ వేసుకోండి’ అని మహిళలు అంటుంటే‘ మేము జమ చేసుకోబోమ’ని బదులిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా పలు మండలాల్లో డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న రూ.పది నాణేల సమస్యను ఓట్ల లెక్కింపు హడావుడిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.వెయ్యి అంటే జిల్లాలో లక్షల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ఈ నాణేల వల్ల నష్టం కూడా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. బ్యాంక్‌లు ఇచ్చిన మారని ఈ నాణేలను తిరిగి బ్యాంక్‌ల్లో జమ చేసే అవకాశాన్ని కల్పించాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమ్మో ...రూ.10 నాణెమా..!
టేక్మాల్(మెదక్): పది రూపాయాల కాయిన్ దీనికోసం బ్యాంకుల చుట్టూ జనం తిరుగుతారు. కష్టం మీద ఎదోలా సంపాదించి భద్రంగా ఇంట్లో దాచుకుంటున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదిరూపాయల బిల్ల పట్టుకోవడానికి భయపడుతున్నారు. వ్యాపారులైతే తీసుకోవడానికి వణుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెల్లవని పుకార్లు రావడమే. గత కొన్ని నెలల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎలాంటి భయం అనుమానం అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పది రూపాయల కాయిన్లు వచ్చిన కొత్తలో ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదిరూపాయాల కాయిన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇన్నాళ్లు దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నా రు. అయితే చాలా మంది వ్యాపారులు తీసుకోవడానికి ఇష్టత చూపడంలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న వాటిని ప్రజలకు అంటకట్టడానికి చూస్తున్నారు. దీంతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లె వారికి కండక్టర్ చిల్లర రూ.10 కాయిన్ ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి బ్యాంకుల్లో కూడా తీసుకోవడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోహలు వదలండి.. ఆర్బీఐ నిబందనల ప్రకారం రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుంది. పదిరూపాయాల బిల్ల రద్దు కాలేదు. రూ.10కాయిన్ చెల్లుబాటుపై ప్రజలు వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాపారులు, ప్రజలు ఇచ్చుపుచ్చుకోవడం చేయాలి. -
ఆర్టీసీలో 'టెన్' షన్
పది రూపాయల బిళ్ల తెగ టెన్షన్ పెడుతోంది.. ఇటు ఆర్టీసీ, అటు బ్యాంకులు నానా హైరానా పడాల్సి వస్తోంది. రూ.పది నాణెం చలామణిలో లేదన్న తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్లడమే ఇందుకు కారణం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణి కులు తమ వద్ద ఉన్న రూ.పది బిళ్లను టికెట్ కొనేప్పుడు కండక్టర్లకు ఇస్తున్నారు. కానీ కండక్టర్లు చిల్లర రూపంలో తిరిగిస్తే మాత్రం తీసుకోవటం లేదు. దీంతో ఆర్టీసీలో పెద్ద మొత్తంలో రూ.పది బిళ్లలు పేరుకుపోతున్నాయి. వాటిని బ్యాంకుల్లో జమ చేయబోతే, ఆర్బీఐ నిబంధన చూపి అంత చిల్లర తాము తీసుకోబోమంటూ బ్యాంకు సిబ్బంది తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. చాలా డిపోల్లో ఆ బిళ్లల మూటలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు విషయాన్ని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం, ఆర్బీఐ, బ్యాంకు అంబుడ్స్మెన్లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. – సాక్షి, హైదరాబాద్ తిరిగి ప్రయాణికులకే ఇబ్బంది ప్రయాణికులు తీసుకోకపోతుండటం, బ్యాంకులు తిరస్కరిస్తుండటంతో డిపో అధికారులు కండక్టర్లను నియంత్రిస్తున్నారు. రూ.వేలల్లో నాణేలు వస్తున్న నేపథ్యంలో వాటిని వీలైనంత తక్కువకే పరిమితం చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కండక్టర్లు ప్రయాణికుల నుంచి పది నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వెరసి హైదరాబాద్ నగరంలో గతంలో సగటున ఒక్కో డిపో పరిధిలో రోజుకు రూ.10 వేల విలువైన రూ. పది నాణేలు వచ్చిపడగా, ఇప్పుడా మొత్తం రూ.5–రూ.6 వేలకు పడిపోయింది. మరోవైపు రూ.10 నాణేలు తీసుకోవటం లేదంటూ ఉన్నతాధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు నేరుగా ఆర్బీఐ, స్టేట్‌బ్యాంకు, బ్యాంకు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ ఖాతా స్టేట్ బ్యాంకులో ఉండటంతో ఓ ఉన్నతాధికారి స్వయంగా ఆ బ్యాంకు చీఫ్‌ను కలసి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంకు ఉన్నతాధికారులు.. ఒక్కో బ్రాంచి వారీగా ఆరా తీసి పరిస్థితిని సరిదిద్దే పని ప్రారంభించినట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధన మార్చమన్నాం: ఆర్టీసీ ‘రోజుకు రూ.వేయికి మించి రూ.10 నాణేలు బ్యాంకులో జమ చేయవద్దనే నిబంధన ఉందని స్టేట్ బ్యాంకు అధి కారులు చెబుతున్నారు. కానీ అది వ్యక్తిగత ఖాతాలకే అన్వయించాలి తప్ప.. నిత్యం లక్షల మంది ప్రయాణికుల తో వ్యవహారం నడిపే ఆర్టీసీకి వర్తింపజేస్తే ఎలా. ఇదే విషయాన్ని స్టేట్ బ్యాంకు ఉన్నతాధికారుల దృíష్టికి తీసుకెళ్లాం. నిత్యం రూ.కోట్లలో మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసే ఆర్టీసీని ఆ నిబంధన నుంచి మినహాయించాలని అడిగాం. సానుకూలంగా స్పందిస్తున్నారు’ ఒక్క నిబంధన.. నానా హైరానా! పది రూపాయిల నాణేలు చాలాకాలంగా చలా మణిలో ఉన్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దు సమ యం లో ఆ బిళ్లలు చెల్లవంటూ ఓ వదంతి వ్యాపించింది. అప్పటికే నోట్ల టెన్షన్‌తో ఉన్న ప్రజలు ఆ నాణేలను తీసుకోవటం మానేశారు. వీలైనంత వరకు తమ వద్ద ఉన్న వాటిని బ్యాంకులకు జమ చేసేందుకు క్యూ కట్టారు. రూ.పది నాణేలు చెల్లుబాటవుతాయని, అవి చెల్లవనే వదంతి తప్పని స్వయంగా రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. అయినా వాటిని తీసుకునేం దుకు నిరా కరిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి పెద్ద సమస్యగా మారింది. డిపోలకు సగటున నిత్యం రూ.10 వేల విలువైన రూ.పది బిళ్లలు వస్తున్నాయి. కండక్టర్లు చిల్లర ఇచ్చే క్రమంలో వాటిని ఇస్తే ప్రయాణికులు తీసుకో వటం లేదు. వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు వెళ్తే.. రూ.పది బిళ్లలను రోజుకు రూ.వేయి విలువకు మించి తీసుకోవద్దనే నిబంధన ఉందంటూ తీసుకోవటం లేదు. ఇతర ఖాతాదారుల ద్వారా పెద్ద సంఖ్యలో రూ.పది బిళ్లలు వస్తుండటంతో వాటిని నిల్వ చేయటం బ్యాంకులకూ సమస్యగా మారు తోంది. చెస్ట్ (డబ్బు నిల్వ చేసే ప్రత్యేక ఏర్పాటు) వసతి లేని బ్రాంచిలలో డబ్బు నిల్వ చేసే ప్రదేశం నాణేలతో నిండిపోవటంతో కొత్తగా నాణేలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఎక్కడ నిల్వ చేయాలి ‘రూ.10 నాణేలను జమ చేసుకోకుండా తిరస్కరించకూడదు. మేం కూడా తీసుకోవాల్సిందే. కానీ నిత్యం కుప్పలుతెప్పలుగా నాణేలు వచ్చిపడుతుంటే ఇబ్బందే కదా. ఇప్పటికే రూ.35 లక్షల విలువైన నాణేలు ఉన్నాయి. వాటిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియటం లేదు. సాధారణ క్యాష్ ఉంచాల్సిన ప్రాంతమంతా ఈ బిళ్లలతోనే నిండిపోతున్నాయి’ – ఓ బ్యాంకు బ్రాంచి మేనేజర్ కొన్ని చోట్ల తీసుకోవడం లేదు... ‘రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంకు బ్రాంచీలో రూ.30 లక్షల విలువైన రూ.పది నాణేలు పేరుకు పోయాయని, స్థలం సరిపోక ఇబ్బందిగా ఉందని ఆ బ్రాంచి అధికారులంటున్నారు. కానీ మా పరిస్థితి గమనించి వారు నాణేలను స్వీకరించి సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం నిరాకరిస్తున్నారు’ – రాజేంద్రనగర్ డిపో మేనేజర్ వెంకటరెడ్డి -
రూ.10 నాణేలు తీసుకోకుంటే ఫోన్ చేయండి
సాక్షి, చెన్నై: పది రూపాయల నాణేలు చట్ట ప్రకారం చెల్లుతాయని భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వెల్లడించింది. వాడుకలో ఉన్న రూ.10 నాణేలు ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నారు. ముందుగా వాడుకలో ఉన్న రూ.10 నాణేల నుంచి అవి కొంచెం మార్పు కలిగినా అన్నీ చట్ట ప్రకారం చెల్లుతాయని ఆర్బీఐ తెలిపింది. రూ.10 నాణేలు చెల్లవని దేశవ్యాప్తంగా వదంతులు వ్యాపించడంతో చాలా మంది వీటిని తీసుకోవడానికి వెనుకంజ వేస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ వదంతులను నమ్మవద్దని రిజర్వు బ్యాంక్ తరచూ ప్రచారం చేస్తూ వస్తుంది. రూ.10 నాణేలు చట్టప్రకారం చెల్లుతాయని తాజాగా మరోసారి ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త, పాత రూ.10 నాణేలు వాడుకలో ఉన్నాయని రూ.10 నాణేలను తీసుకోవడానికి అంగీకరించని వారి గురించి 044–25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని రిజర్వు బ్యాంక్ కార్యాలయం ప్రకటించింది. -
నకిలీ నాణేలను ఇలా గుర్తించండి
కర్నూలు: నకిలీ రూ.10 నాణేలు మార్కెట్లో హల్చల్ చేస్తుండడం, ఏదీ నకిలీ, ఏదీ ఒరిజినల్ తెలియని పరిస్థితి ఉండడంతో వ్యాపారులు ఈ కాయిన్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రైతుబజార్లు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆర్టీసీ డిపోలు, కొన్ని పెట్రోలు బంకుల్లో అసలు, నకిలీ నాణేలను ప్రదర్శనకు ఉంచారు. - అసలు నాణేనికి బొరుసు వైపు (రూ)పైన ఉండి దానికింద 10 ఉంటుంది. నకిలీ నాణేనికి బొరుసు వైపు (రూ)లేకుండానే నాణేం మధ్య పూర్తిగా 10 ఉంటుంది. కింద రూపీస్ అని ఉంటుంది. - బొమ్మ వైపు తీసుకుంటే అసలు నాణేనికి బొమ్మ కింద చిన్నగా సత్యమేవ జయతే అని హిందిలో ఉంటుంది. నకిలీ నాణేనికి సత్యమేవ జయతే అనేది కొంత పెద్దదిగా ఉంటుంది. అసలు నాణేనికి బొమ్మకు ఒకవైపు ఇండియా అని ఇంగ్లీషులో, మరోవైపు భారత్ హిందీలో ఉంటుంది. నకిలీ నాణేనికి బొమ్మపైనే హిందీలో భారత్, ఇంగ్లీషులో ఇండియా అని ఉంది. వీటిని ఆర్టీసీ కండక్టర్లు రూ.10 ఉన్న నాణేలను మాత్రం తీసుకుంటున్నారు.