నకిలీ నాణేలను ఇలా గుర్తించండి
కర్నూలు: నకిలీ రూ.10 నాణేలు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తుండడం, ఏదీ నకిలీ, ఏదీ ఒరిజినల్ తెలియని పరిస్థితి ఉండడంతో వ్యాపారులు ఈ కాయిన్‌లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రైతుబజార్లు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆర్‌టీసీ డిపోలు, కొన్ని పెట్రోలు బంకుల్లో అసలు, నకిలీ నాణేలను ప్రదర్శనకు ఉంచారు.
- అసలు నాణేనికి బొరుసు వైపు (రూ)పైన ఉండి దానికింద 10 ఉంటుంది. నకిలీ నాణేనికి బొరుసు వైపు (రూ)లేకుండానే నాణేం మధ్య పూర్తిగా 10 ఉంటుంది. కింద రూపీస్ అని ఉంటుంది.
- బొమ్మ వైపు తీసుకుంటే అసలు నాణేనికి బొమ్మ కింద చిన్నగా సత్యమేవ జయతే అని హిందిలో ఉంటుంది. నకిలీ నాణేనికి సత్యమేవ జయతే అనేది కొంత పెద్దదిగా ఉంటుంది. అసలు నాణేనికి బొమ్మకు ఒకవైపు ఇండియా అని ఇంగ్లీషులో, మరోవైపు భారత్ హిందీలో ఉంటుంది. నకిలీ నాణేనికి బొమ్మపైనే హిందీలో భారత్, ఇంగ్లీషులో ఇండియా అని ఉంది. వీటిని ఆర్‌టీసీ కండక్టర్‌లు రూ.10 ఉన్న నాణేలను మాత్రం తీసుకుంటున్నారు.