real
-
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
అసలైన ముత్యాలను గుర్తించండి : ఇలా భద్రపర్చుకోండి!
ముత్యాల పేరుతో మనకు మార్కెట్లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు. ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి. ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు. ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. --విశేషిణి రెడ్డి, జిఐఏ జెమాలజిస్ట్ -
నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?
అందమైన ఓ మహిళ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అది నిజంగా అందమైన అమ్మాయి ఫోటోనా లేదా ఏఐ ఫోటోనా అని అందరిలోనూ పలు సందేహాలు రేకెత్తించింది. ఐతే ఆ ఫోటో అధికారిక ప్రయోజనాలకోసం పెట్టిందని కొందరూ లేదు పోలీస్ రికార్డుల్లోనిది అంటూ పలు కామెంట్లు చేస్తూ పోస్టు పెట్టారు నెటిజన్లు. ఏదీఏమైన ఒక అందమైన మహిళ ఫోటో నెటిజన్ల మనుసుల్లో చాలా ఉత్సుకతనే రేపింది. మరొకందరూ ఇంతలా ఆ మహిళ ఎవరని? అంతలా ఆరా తీస్తున్నారంటే..మగవాళ్ల బుద్ధి అలానే ఉంటుంది కాబోలు అని కౌంటర్లు ఇచ్చారు. ఎక్కువ మంది ఏఐతో క్రియోట్ చేసిన ఫోటో అని చెప్పగా చాలామంది మాత్రం ఇది సెల్ఫీ ఫోటో అయ్యి ఉండొచ్చని లేదా దేనికో ఉపయోగించేందుకు తీసిన ఫోటో అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ ఫోటో ఏఐ ఆధారిత ఫోటోనే అనేది క్లియర్‌గా తెలియదు గానీ వెబ్సైట్ ప్రకారం అది ఏఐ ఫోటో అని 99.4% మంది చెప్పడం గమనార్హం. ఇక్కడొక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంతకు మునుపు ఏ అమ్మాయి ఫోటో కనిపించినా ఎవరా బ్యూటీ అని ఆరా తీసేవారు. ఏ ఊరు ఏం చేస్తుంది ఈ తరహాలో ప్రశ్నలు ఉండగా. ఇప్పుడూ అదసలు రియలేనా లేక ఏదైన ప్రకటన కోసం ఉపయోగిస్తున్న ఫోటో అయ్యి ఉండొచ్చనే డౌట్లు లేవెనెత్తుతున్నారు. టెక్నాలజీ తోపాటు మనుషుల్లోనే ఆలోచనల్లో మార్పు వచ్చిందనాలా లేకా టెక్నాలజీ పుణ్యమా! అని అన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అనాలా ఆలోచించండి. మీకైతే ఈ ఫోటో ఏమనిపిస్తుంది రియల్ అనా? లేక ఏఐ ఆధారిత ఫోటోనా?. గెస్ చేయండి. (చదవండి: అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే కాన్వాస్‌గా..వీడియో వైరల్!) -
‘స్పెర్మ్ డొనేషన్’తో జన్మించిన ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి?
లోకంలోని ప్రతీ చిన్నారి తన తల్లిదండ్రుల అండ కోరుకుంటుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలల జీవితంలో ఎప్పుడూ శూన్యం తాండవమాడుతుంటుంది. అట్లాంటాకు చెందిన టిఫనీ జీవితంలో కూడా అటువంటి శూన్యతే ఏర్పడింది. ఆమె తన నాలుగేళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇదే విషయాన్ని ఆమెకు తరచూ చెప్పేది. అయితే ఆమెకు చాలాకాలానికి తండ్రి గురించిన నిజం తెలియడంతో నివ్వెరపోయింది. మిర్రర్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ తన నిజమైన తండ్రిని మిస్సయ్యింది. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. తరువాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరయ్యింది. అయితే తన అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది. 2018లో టిఫనీ 36వ పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది. టిఫనీ ఇన్నాళ్లూ ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో, అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది. తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది. అంతే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని, తన తల్లి ఎవరినుంచో స్పెర్మ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థం అయ్యింది. టిఫనీ తల్లి మొదటి భర్త.. టిఫనీని సొంత కూతురులా చూసుకున్నాడు. టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. టిఫనీ 1982లో జన్మించింది. ఇటీవల టిఫనీ డీఎన్ఏ పరీక్ష చేయించుకుంది. దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది. అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా, ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు. ఇదేవిధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి. ప్రస్తుతం టిఫనీకి 41 ఏళ్లు. 17 ఏళ్ల క్రితం టిఫనీకి వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. -
ఈ సినిమాలో రియల్ కార్లతో స్టంట్స్ చేసినపుడు ..!
-
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
-
విడాకులు ఫిక్స్..?
-
ఏం సాహసం చేసినవ్ తాతా.. నీ తెగువకు సలాం
పిడుగులు పడ్డట్లు భారీ శబ్ధం.. ఆపై భూ ప్రకంపనలు.. హఠాత్తుగా ముందుకొచ్చిన సముద్రపు అలలతో సునామీని కళ్లారా వీక్షించింది టోంగా. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం బద్ధలైన ఘటనతో ఆ చిన్న ద్వీప దేశానికి తీరని నష్టం వాటిల్లింది. అయితే సముద్రపు అలల్లో 27 గంటలపాటు ఈది.. ప్రాణాలతో బయటపడ్డ ఓ పెద్దాయన సాహసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత శనివారం పసిఫిక్‌లోని భారీ అగ్నిపర్వతం హుంగా టోంగ-హుంగ హాపయ్ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ధాటికి సునామీ చెలరేగగా.. ఆ మహాసముద్రం అలలు వేల కిలోమీటర్ల దూరంలోని తీరాలను సైతం తాకాయి. ఇదిలా ఉంటే దగ్గర్లో ఉన్న టోంగాను అతలాకుతలం చేసింది ఈ ఘటన. అయితే సముద్రపు అలల్లో చిక్కుకుపోయిన 57 ఏళ్ల లిసలా ఫోలావ్.. తన చావు ఖాయమని అనుకున్నాడు. అలాగని చావుకి లొంగిపోలేదు. ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో వైకల్యాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించి గెలిచాడు. టోంగా రాజధాని నుకువాలోఫాకు ఈశాన్యంవైపు 8 కి.మీ. దూరంలోఉంది అటాటా అనే ఓ చిన్న దీవి. ఈ దీవి జనాభా 60 మంది. లిసలా ఫోలావ్ తన కొడుకుతో పాటు ఆ దీవిలో జీవిస్తున్నాడు. వైకల్యం ఉన్న ఆ పెద్దాయన సరిగా నడవలేడు కూడా. సునామీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా నేల ప్రాంతం వైపు పరుగులు తీశారు. కానీ, ఆ పెద్దాయన మాత్రం పాపం నీటి ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. మొదట ఒడ్డులోని ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడిన ఆ పెద్దాయన.. ఆ టైంలో దూరంగా కనిపిస్తున్న తన కొడుక్కి తన అరుపుల్ని వినిపించాలని ప్రయత్నించాడు. ఇంతలో రెండో అల భారీగా రావడంతో ఆయన సముద్రంలోకి కొట్టుకునిపోయాడు. ఇక తన పని అయిపోయిందని నీళ్లలో మునిగిపోతున్న ఆయన.. వచ్చిన కొద్దిపాటితో ఈతతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రాణ తీపి ఆయన్ని అలా 27 గంటలపాటు ముందుకు తీసుకెళ్లింది. మధ్యలో తొమ్మిదిసార్లు నీటి అడుగుభాగానికి చేరుతూ జీనవర్మణ పోరాటం చేశాడట ఆ పెద్దాయన. చివరికి ఏడున్నర కిలోమీటర్లు ఆపసోపాలు పడుతూ ఈదాక.. టోంగాటపు నేల భాగానికి చేరుకున్నాడు. ఆ టైంలో రెస్క్యూ టీం ఆయన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించింది. అలా పెద్దాయన మృత్యుంజయుడిగా బయటపడడంతో పాటు సోషల్ మీడియాలో హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంత ఓర్పుతో ఆయన చేసిన ప్రయత్నం గురించి చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే రియల్ లైఫ్ అక్వామ్యాన్గా ఈ పెద్దాయన్ని అభివర్ణిస్తున్నారు. ప్రయత్నించకుండా ఫలితం ఆశించడం మనిషి నైజం. అది మారనంత వరకు జీవితంలో ముందుకు వెళ్లలేరన్న విషయం ఈ పెద్దాయన కథ ద్వారా స్పష్టమవుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 ఇదిలా ఉంటే సునామీ ధాటికి లక్షకు పైగా జనాభా ఉన్న టోంగా ద్వీపదేశం కుదేలు అయ్యింది. ముగ్గురు చనిపోయారని అధికారులు ప్రకటించగా.. తీర ప్రాంతంలోని నివాసాలు, రిసార్టులు ఘోరంగా దెబ్బతిన్నాయి. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం నెల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
వివాదంలో యాడ్ షూటింగ్! అసలు నిజమేంటంటే..
Emirates Airlines Viral Ad Video: ఫ్లై బెటర్ అంటూ ఎమిరేట్స్ రూపొందించిన తాజా అడ్వర్టైజ్మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది. అత్యంత ఎత్తులో దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఇటీవల కొత్త యాడ్‌ని రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్ హోస్టెస్ నిల్చుని... ఎమిరేట్స్ విమానాల్లో దుబాయ్ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్ అవుట్ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్ హోస్టెస్ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు. Reconnect with your loved ones or take a fabulous vacation. From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo — Emirates Airline (@emirates) August 5, 2021 ఇది నిజం కాదు ఎమిరేట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ని ఆగష్టు 5న విడుదల చేసింది. చూసినవారంతా యాడ్ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. మరికొందరు అంత ఎత్తులో ఎయిర్ హోస్టెస్‌తో షూట్ చేయడం దారుణమని, ఏదైనా జరిగితే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్ విడుదల చేసింది. షూటింగ్ ఇలా ఈ యాడ్ చిత్రీకరించేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది ఎమిరేట్స్. నెలల తరబడి రిహార్సల్ నిర్వహించింది. ముఖ్యంగా ఈ యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్ లుడ్విక్కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్ షూట్ చేశామంటూ ఎమిరేట్స్ వీడియో రిలీజ్ చేసింది. అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్ లుడ్విక్ తెలిపింది. Real or fake? A lot of you have asked this question and we’re here to answer it. Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe — Emirates Airline (@emirates) August 9, 2021 -
భగత్ సింగ్, వివేకానంద ఫోటోలకు ప్రాణం వస్తే...!
మన పూర్వీకులు మనతో లేకపోయినా, వారి ఫోటోలను జ్ఞాపకాలుగా దాచుకుంటాం. మరి ఆ ఫోటోలకు హావభావాలు వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా..! ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా! ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో ఏదైనా చేయవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టూల్‌తో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ టూల్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మై హెరిటేజ్ సంస్థ రూపొందించిన డీప్ నోస్టాల్జియా అల్గారిథంతో ఫోటోలకు హావభావాలను ఇవ్వొచ్చు. భగత్ సింగ్, స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, కస్తూర్భా గాంధీ, పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలను కీర్తిక్ శశిధరణ్ ట్విటర్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఫొటోల్లో స్వాతంత్ర్య సమర యోధుల హావభావాలు చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. వారి ఫోటోలను ఆన్లైన్లో తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా తాజా టూల్‌తో నెటిజన్స్ తమ పూర్వీకుల ఫొటోలకు ప్రాణం పోస్తున్నారు. వీడియోలను బంధువర్గంతో పంచుకుంటున్నారు. Kind of surreal to take a photo of the singularly inspiring Bhagat Singh -- a revolutionary voice in 1920s India, who was hung by the British in 1931, at the age of 24 -- run it through the Heritage AI algorithm, and see him reanimated. pic.twitter.com/CfC0Gu6Gxk — Keerthik Sasidharan (@KS1729) February 28, 2021 -
ఏది నిజం?
-
నకిలీ నాణేలను ఇలా గుర్తించండి
కర్నూలు: నకిలీ రూ.10 నాణేలు మార్కెట్లో హల్చల్ చేస్తుండడం, ఏదీ నకిలీ, ఏదీ ఒరిజినల్ తెలియని పరిస్థితి ఉండడంతో వ్యాపారులు ఈ కాయిన్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రైతుబజార్లు, హోటళ్లు ఇలా అన్ని చోట్ల రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆర్టీసీ డిపోలు, కొన్ని పెట్రోలు బంకుల్లో అసలు, నకిలీ నాణేలను ప్రదర్శనకు ఉంచారు. - అసలు నాణేనికి బొరుసు వైపు (రూ)పైన ఉండి దానికింద 10 ఉంటుంది. నకిలీ నాణేనికి బొరుసు వైపు (రూ)లేకుండానే నాణేం మధ్య పూర్తిగా 10 ఉంటుంది. కింద రూపీస్ అని ఉంటుంది. - బొమ్మ వైపు తీసుకుంటే అసలు నాణేనికి బొమ్మ కింద చిన్నగా సత్యమేవ జయతే అని హిందిలో ఉంటుంది. నకిలీ నాణేనికి సత్యమేవ జయతే అనేది కొంత పెద్దదిగా ఉంటుంది. అసలు నాణేనికి బొమ్మకు ఒకవైపు ఇండియా అని ఇంగ్లీషులో, మరోవైపు భారత్ హిందీలో ఉంటుంది. నకిలీ నాణేనికి బొమ్మపైనే హిందీలో భారత్, ఇంగ్లీషులో ఇండియా అని ఉంది. వీటిని ఆర్టీసీ కండక్టర్లు రూ.10 ఉన్న నాణేలను మాత్రం తీసుకుంటున్నారు. -
జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
నిబంధనలకు నీళ్లొదిలిన తుని మున్సిపల్ అధికారులు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లూ కరువే.. టీడీపీ వారి లేఅవుట్‌కు రూ.28 లక్షలతో కాలువ నిర్మాణం ఎగువ నుంచి నీరు పోవడానికేనని సాకులు తుని : వడ్డించే వాడు మనవాడైతే చాలు.. బంతి చివర కూర్చున్నా నష్టం లేదన్నది సామెత. దీన్ని తుని పురపాలకసంఘం అధికారులు కొంచెం మార్చి ‘మనవాడైతే అసలు బంతిలో కూర్చోకపోయినా విందుకు లోటు లేదు’ అంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీసం రోడ్లు, కాలువలు లేవు. వీటికి సంబంధించి ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు విజ్ఞాపనలిచ్చినా నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అదే అధికారులు ప్రైవేటు లే అవుట్ కోసం ప్రజాధనంతో అధికారికంగా కాలువ నిర్మాణం చేపట్టారు . అది అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్‌కు సంబంధించిన వారి లే అవుట్ కావడంతో నిబంధనలు సడలించారు. రూ.28 లక్షలతో యుద్ధప్రాతిపదికన కాలువ పనులు చేపట్టారు. నిబంధనలు ఇలా.. ఏదైనా వ్యవసాయ భూమిని లే అవుట్ వేయాలంటే మార్కెట్ విలువలో పది శాతం భూమి మార్పిడి ఫీజు చెల్లించాలి. కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయం లే అవుట్ వేసినవారే సమకూర్చాలి. మొత్తం స్థలంలో పది శాతాన్ని ప్రజావసరాలకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీపీసీ లేదా ఉడా అనుమతులు ఇస్తాయి. గతంలో తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల్లో అనధికార లే అవుట్లు వేశారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల మేర చెల్లించాలని ఉడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పట్టణానికి ఆనుకుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబసభ్యులకు చెందిన 15 ఎకరాల్లో ఉడా లే అవుట్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 60 అడుగుల రోడ్లు, మేజర్ డ్రెయిన్లను ఏర్పాట చేయాల్సిన బాధ్యత లే అవుట్ వేసే వారిదే. ఇందుకు భిన్నంగా మున్సిపల్ అధికారులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో అధికార పార్టీకి చెందిన రియల్ఎ స్టేట్ వ్యాపారికి చెందిన లే అవుట్ లో కాలువ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అదే లే అవుట్‌కు అనుకుని మరో లే అవుట్ వ్యాపారి పక్కా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైను ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది. కనీస సదుపాయాలకు నోచని 18కి పైగా మురికివాడలు పట్టణంలోని 18కి పైగా మురికివాడల్లో కనీస సదుపాయాలు లేవు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత ఉందని చెప్పి అధికారులు తప్పించుకుంటన్నారు. కొండవారిపేట, డ్రైవర్స్ కాలనీ, బ్రహ్మాల కాలనీ, సాయినగర్, వారదరపు పేట, రామకృష్ణా కాలనీ, ఇసుకలపేట, ఉప్పరగూడెం తదితర ప్రాంతాల్లో కచ్చా కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తమ ప్రాంతాల్లో పరిస్ధితిని వివరించినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారానికి మేలు చేకూర్చేందుకు రూ.28 లక్షలను ధారపోయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి అనుచితాలు మాని, ప్రజాధనాన్ని ప్రజోపయోగానికే ఖర్చు పెట్టాలంటున్నారు. కాగా ఎగువ ప్రాంతంలో నీరు పోవడానికి దారి లేకపోవడంతో సదరు లే అవుట్ యజమానిని అభ్యర్థించి అటుగా కాలువను ప్రజల కోసం కాలువను నిర్మిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిబంధనల ప్రకారం లే అవుట్ యజమాని రోడ్లు, కాలువలు నిర్మించాల్సే ఉంటుందని అన్నారు. -
ఆర్పీ బయోలో కేళీలు వాస్తవమే
తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో ఆర్పీ బయో 226 వరి రకం సాగుచేసిన పొలాల్లో కేళీలు వచ్చిన మాట వాస్తవమేనని మార్టేరు వ్యవసాయ పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ద్వారా జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ విత్తనాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో మార్టేరు పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు, ఏరువాక శాస్త్రవేత్తలు, ఏపీ సీడ్స్ బృందం బుధవారం తొర్రేడులోని వరి పొలాలను పరిశీలించారు. పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ సత్యనారాయణ మాట్లాడుతూ బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా ఆర్పీబయో రకం సరఫరా చేశారన్నారు. కేళీలు రావడం వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఏరువాక శాస్త్రవేత్తలు ప్రవీణ, నందకిషోర్, మార్టేరు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మల్లికార్జునరావు, చాముండేశ్వరి, కృష్ణంరాజు, రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఎఫ్ఏసీ) కె.సూర్యరమేష్, వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన దానం
జ్యోతిర్మయం చాలాసార్లు మెహర్‌బాబా నిస్వార్థ సేవ గురించి, ఇతరులకు సేవ చెయ్యటం గురించి, తన సుఖం చూసుకోకుండా, ఇతరులను సుఖపెట్టడం గురించి చెబుతుండేవారు. అయితే, ఇతరులకు సహాయం చెయ్యడం అనేది అంత తేలికయిన విషయం కాదు. ఏవిధంగా తెలిసి ఉండాలో నీకు తెలిసి ఉండాలి. గుళ్లదగ్గర అడుక్కునే వాళ్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఏమైనా దానం ఇద్దామని నీకు అనిపించ వచ్చు. కాని ఇచ్చేముందు ఎవరికి ఇవ్వాలో తెలి యాలి. దానం ఇవ్వటం అంటే జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీసి అడుక్కునేవానికి ఇవ్వడం మాత్రమే అను కుంటే పొరపాటు. అడుక్కునేవానికి అలా ఇచ్చావే అనుకుందాం. అప్పుడు నీవు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లి వాళ్లను కొడితే అప్పుడు నీ దానం ఎవరికి ఉపయోగపడింది? నీవు ఎవరికి సహాయం చేసినట్టు? అందుకనే, బీదలకు సహాయం చేసేటప్పుడు, ఆ బీదలు నిజంగా బీదలు అవునో కాదో ముందు నిర్ధారించుకోవల సిందిగా మెహర్‌బాబా తన శిష్యు లకు గట్టిగా చెప్పేవారు. వీధిపక్క జోలె పట్టుకుని చేతులు చాచిన ప్రతివాడిని బీదవాడని అనుకోవడా నికి వీల్లేదు. ఒకప్పుడు బాగా బతికి, తరువాత చితికి పోయిన కుటుంబాలు ఉంటాయి. వారు కటిక బీదరి కంలోనూ, ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. వారు బయ టకు వచ్చి అడుక్కోలేరు. అలాంటివారే సహాయం పొందటానికి నిజంగా అర్హులు. అలాంటివారికి కూడా మనం ఆలోచించి సహాయం చెయ్యాలి. గుడ్డిగా చెయ్యకూడదు. ఆ చేసే సహాయం ఎలా చెయ్యాలి అంటే, ఆ సహాయం వాళ్లని వాళ్ల కష్టాల్లో సమయానికి ఆదుకోవాలి. దానం చేసిన ప్రతిసారీ నేను సహాయం చేశాను, నేనో మంచిపని చేశాను అని నీకు అనిపించి నీలో గర్వం, అహంకారం పెరిగితే, అది నీకు మంచి చెయ్యదు. అహంకారంతో ఎప్పుడైతే నీవు సహాయం చేస్తావో, అప్పుడే సహాయం పొందేవాని అహంకారం కూడా నీ అహంకారానికి స్పందిస్తుంది. దానం తీసు కున్నవాడు, దానం ఇచ్చినవానికి రుణపడిపోయానని అనుకుంటాడు. ఆ భారం అతడిని కుంగదీస్తుంది. ఫలితంగా, అతడు దానం ఇచ్చినవాడి నుంచి దూ రంగా జరుగుతాడు. నీవు ఎవరికి సాయం చేసినా, అది నీకు నీవు చేసుకున్నట్లుగా ఎప్పుడనుకుంటావో, అప్పుడు అది నిజమైన సాయం అవుతుంది. గొప్ప కోసం, పేరుకోసం చేసేది దానం అనిపించుకోదు. నీ కుడిచేయి చేసిన సాయం, నీ ఎడం చేయికి తెలియకూడదు. నీవు చేసిన దానం అప్పుడే మరిచి పోవాలి. సహాయం పొందినవాడు నిన్ను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు కృతజ్ఞుడిగా ఉండాలి అను కుంటే, నీకు నిరాశ మిగులుతుంది. అంతిమంగా మెహర్‌బాబా చెప్పేది ఏమంటే, చేసేది నేను కాదు. భగవంతుడు నా చేత ఈ సాయం చేయిస్తున్నాడని నీవు భావించినప్పుడు, అది ఉత్తమోత్తమంగా సహా యం చేయడం అవుతుంది. - దీవి సుబ్బారావు -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. -
రియల్‌కు ఈ-కామర్స్ దన్ను!
ప్రతీది నట్టింట్లోకి వచ్చి వాలాలనే యువత ఆలోచనలకు అనుగుణంగానే విస్తరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు.. స్థిరాస్తి రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరత, ప్రతికూల ఆర్ధిక పరిస్థితుల కారణంగా విస్తరణ ప్రణాళికలను పక్కన పెట్టేసిన కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసుల స్థాపన, విస్తరణ యోచన చేస్తున్నాయి. దీంతో దేశంలో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. - దేశంలో ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతోన్న గిరాకీ - గతేడాది 29.5 మిలియన్ చ.అ.ల్లో విస్తరించిన ఈ-కామర్స్ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా ఈ-కామర్స్ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మొత్తం రిటైల్ వ్యాపారం రూ.38 లక్షల కోట్లు కాగా.. ఇందులో ఈ-కామర్స్ వ్యాపారం వాటా దాదాపు లక్ష కోట్లు. దీన్లో ఆన్లైన్ రిటైల్ వ్యాపారం రూ.24,000 కోట్లు. అందుకే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు తమ కార్యాలయాలు, గిడ్డంగుల స్థాపనకు, విస్తరణకు సిద్ధమయ్యాయి. 2013లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ మొత్తం 22.2 మిలియన్ చ.అ.లుగా ఉంటే.. గతేడాది 29.5 మిలియన్ చ.అ.లకు పెరిగిందని కుష్‌మెన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది నిధుల సమీకరణ, ఒప్పందాలపై దృష్టిసారించిన ఈ కంపెనీలు.. ఈ ఏడాది ఆఫీసు స్పేస్‌ను అద్దెకు తీసుకోవటంపై దృష్టిసారించాయని పేర్కొంది. ఇతర నగరాల్లో ఆఫీస్ స్పేస్: 2013 ఢిల్లీలో 84,000 చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ-కామర్స్ ఆఫీస్ స్పేస్.. గతేడాదికి 5,67,499 చ.అ.లకు చేరింది. 2013లో బెంగళూరులో 4,53,495 చ.అ.లుంటే.. గతేడాదికి 6,22,811 చ.అ.లకు పెరిగింది. ఇదిలా ఉంటే ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన గణాంకాలు కన్పించాయని కుష్‌మెన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక పేర్కొంది. రెండేళ్లుగా ముంబై, కోల్కత్తా నగరాల్లో ఆఫీసు స్పేస్ గిరాకీలో ఎలాంటి మార్పు కన్పించలేదని స్పష్టం చేసింది. గతేడాది ముంబైలో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ 27,000 చ.అ.లుగా ఉంది. కోల్‌కతాలో 4,600 చ.అ.లుగా ఉందని నివేదిక చెబుతోంది. హైదరాబాద్‌లో రెట్టింపు: 2013తో పోల్చితే గతేడాది హైదరాబాద్‌లో ఈ-కామర్స్ కంపెనీల ఆఫీసు స్పేస్ గిరాకీ రెట్టింపయ్యిందని నివేదిక పేర్కొంది. 2013లో 4,100 చ.అ.లుగా ఉన్న ఆఫీస్ స్పేస్.. గతేడాది 8,542 చ.అ.లకు పెరిగింది. అయితే సమీప భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం, త్వరతగతిన అనుమతులు జారీ చేయటం వంటివి ఇందుకు కారణమని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెరైక్టర్ కళిశెట్టి పద్మభూషణ్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ లాజిస్టిక్ హబ్‌గా ఎదుగుతోంది. హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారం కూడా. అలాగే నాగార్జున్‌సాగర్ రోడ్ మీదుగా చెన్నైకి, రాజేంద్రనగర్ మీదుగా బెంగళూర్‌కు, మెదక్ మీదుగా ముంబైలకు రవాణా సదుపాయం ఉండటం ఈ-కామర్స్ కంపెనీలకు కలిసొచ్చే అంశాలని’’ చెప్పారు. త్వరలోనే 160 కి.మీ. పొడవునా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుంది. దీంతో నగరం చుట్టూ ఈ-కామర్స్ కంపెనీలు గిడ్డంగులను ఏర్పాటుచేసే అవకాశముంది. ప్రత్యేకించి బెంగళూర్, నాగ్‌పూర్, ముంబై హైవేలు గిడ్డంగుల స్థాపనకు అనుకూలమని వారి అభిప్రాయం. 36.8 మిలియన్ చ.అ.లకు: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేలా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటి కారణంగా రానున్న రోజుల్లో రియల్ వ్యాపారం పుంజుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి దేశం మొత్తం మీద ఈ-కామర్స్ కంపెనీల ఆఫీస్ స్పేస్ 36.8 మిలియన్ చ.అ.లకు.. 2016 నాటికి 40.1 మిలియన్ చ.అ.లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘సీఆర్డీఏ’లో లేఅవుట్లకు గ్రీన్‌సిగ్నల్
గుట్టుచప్పుడు కాకుండా 130 అనుమతులు మంత్రి నారాయణ ఆదేశంతో పరుగులు పెడుతున్న ఫైళ్లు సాక్షి, విజయవాడ బ్యూరో: మూడు నెలల కిందట నిలిచిపోయిన లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సీఆర్డీఏ వాయువేగంతో అనుమతులు మంజూరు చేస్తోంది. మరిన్ని ఫైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన సీఆర్డీఏ పరిధిలోని లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులివ్వాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ నాలుగురోజుల కిందట మౌఖిక ఆదేశాలిచ్చారు. ఆందోళనలు, ఉద్యమాల వల్ల పని జరగదనే వాస్తవాన్ని గ్రహించిన కొందరు రియల్ పెద్దలు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే టీడీపీ ముఖ్య నాయకుడి అనుగ్రహం సంపాదించారు. ఆయన ఈ సాయం ఉచితంగా చేసిపెట్టారా? లేక చేతుల మార్పిడి వ్యవహారం ఏమైనా జరిగిందా అనేది తెలియక పోయినప్పటికీ ఏదో జరిగిందని మాత్రం అధికారవర్గాలు ఘంటాపథంగా ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేస్తున్నాయి. జూన్‌లో అనుమతులు నిలిపివేత రాజధాని భూసమీకరణకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో అప్పటి వీజీటీఎం ఉడా పరిధిలో కొత్త లేఅవుట్లు, గ్రూపు భవనాలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం నిలిపేసింది. పట్టపగ్గాలు లేకుండా దూసుకెళుతున్న రియల్ వ్యాపారానికి కళ్లెం వేసే ఆలోచన కూడా అనుమతులు నిలిపేయడానికి మరో కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రియల్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది. లేఅవుట్లకు అనుమతి రాకపోవడంతో రియల్ వ్యాపారులు అప్పటికే వేసిన వెంచర్ల అమ్మకాలు నిలిచిపోయాయి. కొత్త వెంచర్లకు అవకాశం లేకుండాపోయింది. నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోవడంతో అపార్టుమెంట్లు, గ్రూప్ భవనాల పరిస్థితి కూడా అలాగే మారింది. ప్రభుత్వం అనుమతులు నిలిపేసే నాటికి గత సంవత్సరం జూన్‌కు ముందు స్వీకరించిన లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను ఉడా పరిశీలిస్తోంది. కొత్త మార్గదర్శకాలు లేకుండానే.. సీఆర్డీఏ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తుందని, అప్పటివరకు అనుమతులు ఉండవని అధికారులు చెబుతూ వచ్చారు. దీంతో రాజధాని మాస్టర్‌ప్లాన్ వచ్చేవరకు అనుమతులు ఇవ్వరనే ప్రచారం జరిగింది. మాస్టర్‌ప్లాన్ వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి అనుగుణంగా రోడ్ల వెడల్పు, కామన్ సైట్లు వంటి నిబంధనలు మారతాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చినప్పుడు లేఅవుట్లు, నిర్మాణాల ఫైళ్లను క్లియర్ చేయాలని, కొత్త వాటికి అనుమతివ్వాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ ప్లానింగ్ విభాగం అధికారులు ఫైళ్ల దుమ్ము దులిపి ఆగమేఘాల మీద వాటిని క్లియర్ చేయడం ప్రారంభించింది. నాలుగు రోజుల్లోనే లేఅవుట్లు, నిర్మాణాలు, భూమార్పిడికి సంబంధించిన 130కి పైగా ఫైళ్లను క్లియర్ చేశారు. మిగిలిన ఫైళ్లను పండుగ తర్వాత క్లియర్ చేయనున్నారు. అనుమతులు నిలిపేసే సమయంలో ఆ విషయం గురించి ప్రచారం చేసిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిన విషయాన్ని పెద్దగా ప్రాధాన్యత లేని అంశంగా చూడడం విశేషం. ఇటీవల టీడీపీ నేత నగరానికి వచ్చినప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రియల్ వ్యాపారులు ఆయనతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే వారిమధ్య ఒక అంగీకారం కుదిరిందని, ఆ మేరకే మాస్టర్‌ప్లాన్, నిబంధనల గురించి కనీసం ఆలోచించకుండా లేఅవుట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
పచ్చని దృశ్యం.. ఇక అదృశ్యం!
చోడవరం- గోవాడ మధ్య రియల్ జోరు చోడవరం రూరల్: పంట భూములు రూపు మారుతున్నాయి. పచ్చని పంటలతో కనిపించే దృశ్యాలు అదృశ్యమవుతున్నాయి. వాణిజ్య కూడళ్లుగా మారిపోతున్నాయి. పట్టణాలు పల్లెలు కలిసిపోతున్నాయి. మండల కేంద్రం చోడవరం- గోవాడ మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరిచేలు, చెరకు తోటలు దర్శనమిచ్చేవి. పెరుగుతున్న వ్యాపార, వాణిజ్య అవసరాల దృష్ట్యా ఏడాదికి రెండు పంటలు పండే భూములు సైతం రూపు మారుతున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న భూములు వ్యాపార కూడళ్లుగా తయారవుతున్నాయి. భూమిని నమ్ముకున్న రైతులు ప్రస్తుతం రోడ్డు పక్క భూములకు ధరలు వస్తుండడంతో అమ్ముతున్నారు. చోడవరం- గోవాడ మార్గ మధ్యలో రెండు పెట్రోల్ బంక్‌లు, మూడు ద్విచక్రవాహన షోరూంలు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్, రెండు డాబాలు, వేబ్రిడ్జి కేంద్రాలు, పలు రకాల షోరూంలు, గోడౌన్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా భారీ వెంచర్లు కూడా ఏర్పాటవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు మార్చే క్రమంలో నిబంధనలు పాటించాలి. దీని దృష్ట్యా రెండేళ్లు వ్యవసాయ భూములలో పంటలు వేయడం మానేసి ఉంచుతున్నారు. తర్వాత వీటిని సరి చేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇక రోడ్డకిరువైపులా వాణిజ్య, వ్యాపార కూడళ్లు మినహా పంటలు కనిపించే పరిస్థితి ఉండదు. -
రవాణా ‘రియల్' ఎత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/దర్గామిట్ట: ఇప్పటిదాకా డబ్బులు సంపాదించేందుకు కొందరు వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. వారిని రియల్టర్లుగా పిలుస్తున్నాం. తాజాగా వ్యాపారుల స్థానంలో అధికారులే రియల్టర్ల అవతారం ఎత్తుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన కొందరు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసుకుని.. అందులో ప్లాట్లు వేసి విక్రయాలు సాగిస్తున్నారు. అందులో రవాణాశాఖ అధికారులు కూడా ఉన్నారు. పనిలో పనిగా తమ శాఖ కార్యాలయాన్ని కూడా ఆ ప్లాట్ల వద్దకే మార్చుకుని వాటి విక్రయానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే గూడూరు శివారు ప్రాంతంలో ఆదివారం ప్రారంభం కానున్న ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే గూడూరు సమీపంలోని పురిటిపాళేనికి వెళ్లాల్సిందే. గూడూరు పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి నుంచి పోటుపాళెం పంచాయతీ పరిధిలోని పురిటిపాళెం వెళ్లే మార్గంలో కొందరు రవాణాశాఖ అధికారులు కలిసి ‘అప్ టౌన్ వింటేజ్’ వెంచర్ ఏర్పాటు చేశారు. 2011 నవంబర్‌లో కొండయ్య బాలసుబ్రమణ్యం, గోగినేని సురేష్‌బాబు, అన్నవరపు కాశీవిశ్వనాథం, సిల్వర్ సౌండ్స్ షెల్టర్ ప్రైవేట్ లిమెటెడ్ పేరుతో సర్వే నంబర్ 1052 నుంచి 1066 వరకు ఉన్న 28.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వెంచర్ల కోసం కన్వర్షన్ చేశారు. అందులో ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. అయితే ఆ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం ఈ భూమిని వ్యవసాయ భూమి కింద వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్వర్షన్‌గా మార్చిన భూమిని వ్యవసాయ భూమిగా మార్చేందుకు వీల్లేదు. అయితే అధికార పలుకుబడితో విశాఖపట్నంలో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిగా మారాలంటే వ్యక్తి పేరుమీద పాసుపుస్తకం, టైటిల్‌డీడ్, అండంగల్ ఉంటేనే వీలవుతుంది. అయితే ఇవేమీ లేకుండానే వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమినికలిపేసుకున్న ఘనులు పురిటిపాళెం వెళ్లేమార్గంలో వేసిన అప్‌టౌన్ వింటేజ్ వెంచర్లో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధ్రువీకరించటానికి భయపడుతున్నారు. అందులో ఎకరం ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా అందులో ఐదెకరాలకుపైనే ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ ఉన్నతాధికారులు దీనిపై పూర్తి విచారణ జరిపితే అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంద ని అధికారుల అభిప్రాయం. బినామీల పేరుతో కొనుగోలు అప్‌టౌన్ వెంచర్‌ను రవాణాశాఖలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు కలిసి బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. రవాణా కార్యాలయంలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ఏజెంట్లే బినామీలుగా పెట్టుకున్నట్లు తెలిసింది. ప్లాట్లు దిగువ ప్రాంతంలో ఉండటం.. గూడురు పట్టణానికి దూరంగా ఉంటం.. వర్షం వస్తే ముంపునకు గురవుతుందనే భావనతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు ఎలాగైనా ప్లాట్లను అధిక ధరలకు విక్రయించేందుకు పథకం వేశారు. జన సంచారమే లేని చోటుకు ప్రాంతీయ కార్యాలయం జన సంచారమే లేని ప్రాంతానికి రవాణా ప్రాంతీయ కార్యాలయాన్ని మార్చారు. ఆ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. పట్టణం ఎక్కడా భవనాలే దొరకనట్టు..గూడూరుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రైవేటు వ్యక్తి కట్టించిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ భవన యజమాని కూడా వెంచర్లో ఒక భాగస్తుడని తెలిసింది. కొత్త కార్యాలయానికి చేరుకోవాలంటే జాతీయ రహదారి నుంచి కి లోమీటరుకు పైగా లోనికి వెళ్లాలి. అప్‌టౌన్ వింటేజ్‌లో ప్రవేశించాక చిట్టచివర రవాణా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కార్యాలయం చివర్లో ఉంటే.. వచ్చే వారంతా ముందున్న ప్లాట్లను చూసుకుంటూ వస్తారు. వందలో కనీసం పది మందైనా ప్లాట్లను కొనుగోలు చేయకపోతారా? అనే భావనతో అధికారులు పథకం ప్రకారమేచివర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. -
ఆదర్శం... వాస్తవం!
దేశంలో అవినీతిని అంతమొందించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించి వారంరోజులు కూడా కాలేదు. మహారాష్ట్రలో వెల్లడై అందరినీ దిగ్భ్రాంతిపరిచిన ఆదర్శ్ హౌసింగ్ స్కాంను అక్కడి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కప్పెట్టడానికి ప్రయత్నిస్తోంది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన రోజు కాంగ్రెస్ పెద్దలు ఆ ఘనత తమదేనని చెప్పుకున్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ బిల్లు సాకారం కావడానికి పట్టుదలగా పనిచేశారని, ఆయన అభీష్టం మేరకు ఈ వరసలో మరిన్ని బిల్లులు తీసుకురావడం కోసం త్వరలోనే మళ్లీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్నామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని మాటలు చెప్పిన పెద్దలు... మహారాష్ట్రలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆదర్శ్ కుంభకోణంపై వ్యవహరిస్తున్న తీరును మౌనంగా వీక్షిస్తున్నారు. ఆదర్శాలు చెప్పడానికి, ఆచరించడానికి ఎంత తేడా! ఈ స్కాంలో ఉన్న డజనుమంది నిందితుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి సీబీఐ అనుమతి కోరితే మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ తిరస్కరించారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ సైతం చవాన్‌ను దోషిగా చూపింది. క్విడ్ ప్రో కో జరిగిందని నిర్ధారించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జడ్)-2 నిబంధనలకు విరుద్ధంగా భవనం ఎత్తును పెంచడానికి ఆయన అనుమతించారని, అందుకు ప్రతిగా ఆయన బంధువులకు ఇందులో ఫ్లాట్లు దక్కాయని కమిషన్ తెలిపింది. అయినాసరే, ఆయనను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలు విచారణ కమిషన్ నివేదికను సభ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకుని దీనిపై ప్రశ్నించేసరికి తప్పనిసరై నివేదికను సభకు సమర్పించారు. అదికూడా సమావేశాల ముగింపురోజున! ఈ స్కాంపై సభలో చర్చిస్తే రచ్చవుతుందని, తమ పరువుప్రతిష్టలు పాతాళానికి పోతాయని కాంగ్రెస్ పెద్దలు భయపడ్డారు. పరిమాణంలో చూస్తే ఆదర్శ్ హౌసింగ్ స్కాం యూపీఏ పాలనలో బయట పడిన ఇతర కుంభకోణాలకన్నా పెద్దదేమీ కాదు. ముంబై మహానగరంలో ప్రఖ్యాత తాజ్ హోటల్‌కు సమీపంలోని అత్యంత విలువైన భూమిలో వెలిసిన 31 అంతస్తుల భవన సముదాయమది. సైన్యానికి చెందిన జాగాలో 2002లో ఈ భవన నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పుడు చెప్పింది వేరు. అటు తర్వాత జరిగింది వేరు. సైన్యంలో పనిచేస్తున్న, రిటైరైన సిబ్బంది సంక్షేమం కోసం ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు ఫ్లాట్లు అందజేయడమే దీని వెనకున్న లక్ష్యమని చెప్పారు. కాలక్రమంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సైనిక ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి తమకోసం, అయినవాళ్ల కోసం ఫ్లాట్లను కైంకర్యం చేయడం ప్రారంభించారు. రూ.8 కోట్ల విలువైన ఫ్లాట్‌ను రూ.60 లక్షలకు సొంతం చేసుకున్నారు. అయినవాళ్లకు పంచిపెట్టారు. కొందరైతే బినామీ పేర్లతో రెండు, మూడు ఫ్లాట్లు కూడా కాజేశారు. అన్ని కుంభకోణాల్లాగే ఇందులో కూడా కాంగ్రెస్ నేతలదే ప్రధాన పాత్ర. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోసహా నలుగురు ముఖ్యమంత్రులు ఆ పార్టీకి చెందినవారే. మరో ఇద్దరు మంత్రులు మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందినవారు. ఇందులో డజను మంది ఉన్నతాధికారులు భాగస్వాములని దర్యాప్తు మొదలెట్టినప్పుడు సీబీఐ తెలిపింది. తమ పదవులను అడ్డుపెట్టుకుని నిబంధనలను ఉల్లంఘించి వీరంతా దీన్ని కాజేయడానికి చూశారని ఆరోపించింది. నగర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేయడానికి అధికారంలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలియడానికి ఆదర్శ్ స్కాం ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నిస్తున్న అశోక్ చవాన్ ముఖ్యమంత్రిగానే కాదు... రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. రక్షణ సిబ్బందికి చెందిన ఈ సొసైటీలో రక్షణేతర వ్యక్తులకు సభ్యత్వం కల్పించాలని షరతు విధించింది ఆయనే. అక్కడ నుంచి మొదలుకొని భవంతి ఎత్తు పెంచడానికి అనుమతించడం వరకూ ఆయన ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఆదర్శ్ పేరు పెట్టుకున్నందుకైనా కాస్తయినా నిజాయితీగా వ్యవహరిద్దామని ఎవరూ అనుకోలేదు. అందరూ కలిసి నిస్సిగ్గుగా వ్యవహరించారు. కోట్లాది రూపాయల ఆస్తులున్నవారు, ప్రభుత్వంలో కీలక పదవులు వెలగబెడుతున్నవారు తమ నెలసరి ఆదాయం రూ.13,000గా అఫిడవిట్లు దాఖలుచేసి ఈ సొసైటీలో సభ్యత్వం సంపాదించారు. ఒకరిని చూసి ఒకరు అత్యాశకు పోయి ఒకటికి మించి ఫ్లాట్లు సొంతంచేసుకుందామని ప్రయత్నించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారి కుటుంబాల పేరు చెప్పి మొదలెట్టిన ందుకైనా అలాంటివారిలో కొందరికైనా లబ్ధి చేకూరుద్దామని వీరెవరూ అనుకోలేదు. దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ ఎంపీ పదవిని రక్షించడానికి యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోయినప్పుడు, లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ అవినీతి వ్యతిరేక ఛాంపియన్‌గా కనబడేందుకు తాపత్రయపడిన రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర పరిణామాలు తెలియవని అనుకో లేం. అయినా ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు! పారదర్శకత లేనిచోట, జవాబుదారీతనం కరువైనచోట ఎలాంటి కుంభకోణాలు చోటుచేసుకుంటాయో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ అన్నీ నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా స్వీయ రక్షణ ప్రయత్నాలకు స్వస్తిచెప్పి ఆదర్శ్ స్కాంలో దోషుల దండనకు మహారాష్ట్ర సర్కారు ముందుకు రావాలి. కాంగ్రెస్ పెద్దలు ఆ దిశగా వారిని కదిలించాలి.