Emirates Airlines Viral Ad Video: ఫ్లై బెటర్ అంటూ ఎమిరేట్స్ రూపొందించిన తాజా అడ్వర్‌టైజ్‌మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది.
అత్యంత ఎత్తులో
దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఇటీవల కొత్త యాడ్‌ని రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్ హోస్టెస్ నిల్చుని... ఎమిరేట్స్ విమానాల్లో దుబాయ్ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్ అవుట్ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్ హోస్టెస్ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు.
Reconnect with your loved ones or take a fabulous vacation.
— Emirates Airline (@emirates) August 5, 2021
From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo
ఇది నిజం కాదు
ఎమిరేట్స్ ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ని ఆగష్టు 5న విడుదల చేసింది. చూసినవారంతా యాడ్ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. మరికొందరు అంత ఎత్తులో ఎయిర్ హోస్టెస్‌తో షూట్ చేయడం దారుణమని, ఏదైనా జరిగితే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్ విడుదల చేసింది.
షూటింగ్ ఇలా
ఈ యాడ్ చిత్రీకరించేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది ఎమిరేట్స్. నెలల తరబడి రిహార్సల్ నిర్వహించింది. ముఖ్యంగా ఈ యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్ లుడ్‌విక్‌కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్ షూట్ చేశామంటూ ఎమిరేట్స్ వీడియో రిలీజ్ చేసింది. అడ్వర్‌టైజ్‌మెంట్‌తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్ లుడ్‌విక్ తెలిపింది.
Real or fake? A lot of you have asked this question and we’re here to answer it.
— Emirates Airline (@emirates) August 9, 2021
Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe
Comments
Please login to add a commentAdd a comment