Burj Khalifa
-
కిలోమీటర్ బిల్డింగ్!
ఇప్పటివరకూ మనం ఒక భవనం ఎత్తును మీటర్లలోనే చెప్పుకుంటున్నాం... ఇకపై మాత్రం కిలోమీటర్లలో చెప్పుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి కిలోమీటరు ఎత్తైన భవనం తాలూకూ నిర్మాణం పూర్తవుతోంది మరి! ఎక్కడుందీ భవనం? ఎవరు కడుతున్నారు? ఎందుకు? ఖర్చెంత?...ఎడారి దేశం సౌదీ అరేబియాలో కొత్త కొత్త ప్రపంచ రికార్డులు నమోదు కావడం కొత్త కాదు. ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవైన నగరం ‘ద లైన్’ నిర్మాణ దశలో ఉండగానే బోలెడన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. తాజాగా ‘జేఈసీ టవర్స్’ పేరుతో సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న కిలోమీటరు భవనం కూడా కొత్త రికార్డును సృష్టించింది. అన్నీ సవ్యంగా సాగితే సుమారు 1007 మీటర్లు అంటే కిలోమీటరు కన్నా పిసరంత ఎక్కువ ఎత్తు ఉన్న ఈ భవనం 2028 నాటికి అందుబాటులోకి రానుంది. కిలోమీటర్ ఎత్తు అంటే ఎంత? అని అనుకుంటూ ఉంటే కొన్ని పోలికలు చూద్దాం. ఈఫిల్ టవర్‌కు మూడు రెట్లు ఎక్కువ. లేదా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకు రెట్టింపు. భారత్‌లోనే అతి ఎత్తైన బిల్డింగ్ లోఖండ్వాలా మినర్వా (78 అంతస్తులు, 301 మీటర్ల ఎత్తు) కంటే మూడు రెట్లు ఇంకొంచెం ఎక్కువన్నమాట. మొదట్లో ఈ జేఈసీ టవర్స్‌కు ‘కింగ్డమ్ టవర్’ అని పేరు పెట్టారు. కాకపోతే అప్పుడు లక్ష్యం ఒక మైలు ఎత్తు. ఇసుక నేలల్లో ఇంత ఎత్తైన భవనం కట్టలేమని స్పష్టమైన తరువాత దీన్ని కిలోమీటరుకు పరిమితం చేశారు. పేరు కూడా ముందు ‘జెడ్డా టవర్స్’ అని తాజాగా ‘జెడ్డా ఎకనమిక్ టవర్’ అని మార్చారు. దుబాయిలోని ఎత్తైన భవం ‘బుర్జ్ ఖలీఫా’ (828 మీటర్ల ఎత్తు)ను డిజైన్ చేసిన ఆడ్రియన్ స్మిత్, గార్డన్ హిల్లు ఈ జేఈసీ టవర్‌కూ రూపకల్పన చేశారు. ఎడారిలో పెరిగే ఓ చెట్టు ఆకుల మాదిరిగా త్రికోణ ఆకారంలో ఆకాశాన్ని అంటేలా ఉంటుందీ భవనం. ఎర్ర సముద్ర తీరంలోని జెడ్డా నగరం బీచ్ ఒడ్డునే కడుతున్నారు.భవనం ఎత్తు పెరిగిన కొద్దీ పై అంతస్తుల్లో గాలి చాలా బలంగా వీస్తుంటుందని మనకు తెలుసు. అందుకే జేఈసీ టవర్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. బలమైన గాలులను తట్టుకోవడమే కాకుండా.. సూర్యుడి ఎండ ప్రతాపాన్ని తగ్గించేందుకూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక నేలలో సుమారు 344 అడుగుల లోతైన 270 కాంక్రీట్ దిమ్మెల పునాదులపై నిర్మాణమవుతోంది. అంతస్తులు ఎన్నో తెలుసా?లోఖండ్ వాలా మినర్వాలో మొత్తం 78 అంతస్తులు ఉండగా.. జేఈసీ టవర్‌లో ఏకంగా 157 అంతస్తులు ఉండబోతున్నాయి. మొత్తం 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బుర్జ్ ఖలీఫాలో దుబాయి నగరం మొత్తన్ని వీక్షించేందుకు 128వ అంతస్తులో ఏర్పాట్లు ఉంటే.. జేఈసీ టవర్‌లో ఇంతకంటే ఎత్తైన అంతస్తులో వ్యూపాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ హోటల్, కార్యాలయాలు కూడా భవనం లోపల ఏర్పాటవుతాయి. జేఈసీ టవర్ నిర్మాణం పదేళ్ల క్రితమే మొదలైనా 60వ అంతస్తు స్థాయికి చేరేటప్పటికి ఆగిపోయింది. కొన్నేళ్ల విరామం తరువాత మూడేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలై పూర్తి చేసుకోబోతోంది. ఇంతకీ ఈ భవనం కట్టేందుకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పలేదు కదా... అక్షరాలా... 720 కోట్ల సౌదీ అరేబియా రియాళ్లు! రూపాయల్లో చెప్పుకోవాలంటే 159,662,700,000! పదిహేను వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువన్నమాట!!!-జి.గోపాలకృష్ణ మయ్యా -
విఘ్నేశ్ శివన్ బర్త్ డే.. బుర్జ్ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మ తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా భర్త బర్త్ డే వేడుకను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్ కోసం బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్‌ను గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా 'మన్నంగట్టి 1960' మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీక చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
టీ20 వరల్డ్‌కప్.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. -
ఆరడుగుల స్థలంలో ‘బుర్జ్ ఖలీఫా: దుబాయ్‌లో కాదు.. మరెక్కడ?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అనగానే దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా గుర్తొస్తుంది ఎవరికైనా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో సహా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వాస్తవానికి నిర్మాణ శైలికి, ఇంజినీరింగ్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలిచే భవానాలకు నిలయం దుబాయ్. నగరంలోని సుదూర ప్రాంతాలనుంచి కూడా 160-అంతస్తుల టవర్‌ను ఈజీగా గుర్తు పట్టేయొచ్చు. మన దేశంలో కూడా బుర్జ్ ఖలీఫా అంటూ ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అదే బిహార్ బుర్జ్ ఖలీఫా. మరి ఈ ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గన్నిపూర్ ప్రాంతంలో ఉంది ఈ భవనం. కేవలం ఆరడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇంటి వెడల్పు కూడా ఐదు అడుగుల మాత్రమే. క్యాండీమేన్ వ్లాగర్ ప్రకారం స్థానికులు ముచ్చటగా దీన్ని ఈఫిల్ టవర్ అని పిలుస్తుంటారట. అంతేకాదు 2015లో సంతోష్ అనే వ్యక్తి తన భార్యకు బహుమతిగా దీన్ని నిర్మించాడట. అందుకే దీన్ని ఐకానిక్ తాజ్ మహల్‌తో పోల్చాడు. పెళ్లి తరువాత భార్యతో కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఇంత తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సౌకర్యాలతో భవనం నిర్మించాలనే ఆలోచనతో సంతోష్ ఓ ఇంజినీర్‌ను కలిసాడు. ఫలితంగా అద్భుతమై భవనాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు ఇంజినీర్. సమీప గ్రామాల ప్రజలు ఈ భవనాన్ని చూసేందుకు తరచూ వస్తుంటారట. దీంతో ఇది టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారిపోయిందంటూ ఈ భవనం విశేషాలు పంచుకున్నాడు ఈ వీడియోలో. ఇక దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇల్లు చాలా తక్కువ స్థలం ఉన్నప్పటికీ, వంటగది, బాత్రూమ్ పడకగదితో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించారు. ఇది రెండు భాగాలుగా ఇంటి మొదటి భాగంలో మెట్లు , రెండో భాగంలో గదులు ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. కానీ దీని స్పెషల్ లుక్ చూసి అబ్బురపడుతూ ఉంటారట సందర్శకులు. View this post on Instagram A post shared by Jay (@candymanvlog) -
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్‌ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్‌లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్‌లో కూడా కనిపిస్తుంది. దుబాయ్‌వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్ అంతటా కనిపిస్తాయి. దుబాయ్‌లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్‌లోని మార్కెట్లు, మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్‌ను విరివిగా విక్రయిస్తుంటారు. దీపావళి నాడు దుబాయ్‌లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్ ఉక్కుపాదం! -
మెకానిక్ నుంచి వేలకోట్లు.. బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్స్..!!
మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంతోమంది నిరూపించారు. ఇప్పటికి కూడా చాలామంది సాధారణ పౌరుల నుంచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు కేరళలో జన్మించి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన 'జార్జ్ వి నేరేపరంబిల్' (George V Nereamparambil). ఇంతకీ ఈయనెవరు, సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన జార్జ్ తన 11 ఏళ్ల వయసు నుంచి తన తండ్రికి వాణిజ్య పంటల వ్యాపారంలో సహాయం చేశాడు. అంతే కాకుండా మార్కెట్‌కు వస్తువులను రవాణా చేయడం.. బేరం చేయడం వంటివి చేసేవాడు. దీంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్నాడు. జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈయన కొంత కాలం మెకానిక్‌గా కూడా పనిచేశాడు. ఆ తరువాత 1976లో షార్జాకు రావడంతో అతని జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో ఎడారి వేడికి తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ రంగం పురోగతి సాధిస్తుందని గ్రహించాడు. ఈ ఆలోచనే నేడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని పిలిచే ఒక భారీ సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ రోజు గల్ఫ్ ప్రాంతంలో ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజాలలో 'జార్జ్ వి నేరేపరంబిల్' ఒకరుగా పాపులర్ అయ్యాడు. ఈ రోజు బుర్జ్ ఖలీఫాలో ఏకంగా 22 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా జార్జ్ అపార్ట్మెంట్ల గోడలు, సీలింగ్‌లు, అంతస్తులు బంగారంతో చేసిన డెకర్‌తో కప్పబడి ఉన్నట్లు నివేదించారు. మొత్తం సంపద నిజానికి ఒకప్పుడు తన బంధువుల్లో ఒకరు నువ్వు బుర్జ్ ఖలీఫాలో ప్రవేశించలేవని ఆటపట్టించాడు, కానీ 2010లో జార్జ్ ఆ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకోగలిగాడు. ప్రస్తుతం ఏకంగా 22 అపార్ట్మెంట్లను కొన్నట్లు చెబుతారు. భవిష్యత్తులో మరిన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నట్లు, ఈయన మొత్తం ఆస్తి రూ. 4800 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు ఆస్తి ఎన్ని కోట్లంటే? ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా అందించే 900 అపార్ట్మెంట్లలో దాదాపు 150 అపార్ట్మెంట్లలో భారతీయులే ఉన్నారని చెబుతారు. అందులో కూడా ఎక్కువ అపార్ట్మెంట్లను కలిగిన వ్యక్తి నేరేపరంబిల్ కావడం విశేషం. ఒకప్పుడు మెకానిక్‌గా పనిచేసి నేడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యాడంటే దీని వెనుక అతని కృషి ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. -
స్వాతంత్య్ర వేళ పాకిస్తాన్‌కు ఘోర అవమానం
దుబాయ్: ఏదైనా దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటే వారికి శుభాకాంక్షలు చెబుతూ బుర్జ్ ఖలీఫాపై ఆ దేశపతాకాన్ని గౌరవ ప్రదర్శనగా లైట్లతో ప్రదర్శించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ఆవిష్కృతమైంది. భారత దేశానికి ఒక రోజు ముందుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న పాకిస్తాన్ తమ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను అక్కడ ఆవిష్కరించలేదు. నిరాశ చెందిన పాకిస్తానీయులు దుబాయ్ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆగస్టు 15, భారత దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్న వేళ దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై లైట్ల వెలుగు జిలుగులతో భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ అంతకు ముందు రోజున భారతదేశం లాగే పాకిస్తాన్ జెండా కూడా ప్రదర్శిస్తారేమోనని భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు పాకిస్తానీయులు. కానీ వారిని నిరాశ పరుస్తూ వారి జెండాను ఆవిష్కరించలేదు. దీంతో నిరాశ చెందిన పాకిస్తానీయులు బుర్జ్ ఖళీఫా అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేళా సంఖ్యలో వచ్చి బుర్జ్ ఖలీఫా వద్ద గుమికూడిన పాకిస్తాన్ దేశీయులు 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఒక పాకిస్తానీ మహిళ మాట్లాడుతూ.. ఇప్పుడు సమయం 12.01, కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండాను ఆవిష్కరించడం లేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఇప్పుడిది మాకు పరువు సమస్యగా మారింది. అక్కడితో ఆగకుండా వేలాది సంఖ్యలో పాకిస్తానీయులు ఇక్కడ చేరి నినదిస్తున్నారు.. అయినా కూడా వారు పట్టించుకోవడంలేదు. ఇది పాకిస్తాన్ దేశాన్ని అవమానించడమేనని అన్నారు. A Pakistani lady narrates, How Pakistan flag didn't show up on Burj Khalifa on their Independence day😂😂🤣🤣 pic.twitter.com/WNbEOetANL — Gems of Politics (@GemsOf_Politics) August 14, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు చిరుద్యోగిని -
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలో ఎత్తైన భవనాలు, లగ్జరీ మాన్షన్స్ అనగానే మనకి దుబాయ్ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్ నిర్మాణం ఆసక్తికరంగా మారింది. పాపులర్ పెంటగాన్, బుర్జ్ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్ కేంద్రంగా. డైమండ్స్ అనగానే జెమ్ క్యాపిటల్, గుజరాత్‌లోని సూరత్ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్ బ్రేకింగ్ బిల్డింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో రానున్న భవనం పెంటగాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. (యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు ) Surat Diamond Bourse showcases the dynamism and growth of Surat's diamond industry. It is also a testament to India’s entrepreneurial spirit. It will serve as a hub for trade, innovation and collaboration, further boosting our economy and creating employment opportunities. https://t.co/rBkvYdBhXv — Narendra Modi (@narendramodi) July 19, 2023 బెల్జియన్ నగరమైన ఆంట్వెర్ప్ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ నగరం ఇపుడు యుఎస్‌లోని ఆర్లింగ్టన్లోని పెంటగాన్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్‌లో నిలిచింది. ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్ ప్రపంచంలో టాప్‌లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్ నిర్మించడానికి నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్‌తో అద్భుతమైన ఈ భవనంలో ఈ సంవత్సరం 65వేల ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది నవంబర్‌లో అఫీషియల్‌గా కార్యకలాపాలను ప్రారంభించనుంది. కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్ సీఈవో మహేష్ గాధవి మాటల్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ రిపోర్ట్ చేసింది. -
బూర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణ పతాకం ప్రదర్శన
-
దుబాయ్‌లో ‘పఠాన్’ ట్రైలర్ రిలీజ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన షారుక్
బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పఠాన్'. ఎన్నో వివాదాల అనంతరం.. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ వేడుకలో పాల్గొన్న హీరో షారుక్ ఖాన్ అభిమానులతో కలిసి సందడి చేశారు. ట్రైలర్ ప్రదర్శించినప్పుడు ఆ ప్రాంతమంతా ఆయన అభిమానులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. షారుఖ్ ఖాన్ 'ఝూమ్ రే పఠాన్' అనే పాటకు డ్యాన్స్ చేశాడు. అంతకుముందు రణ్వీర్ సింగ్ నటించిన'83' ట్రైలర్‌ను బుర్జ్‌ఖలీఫాపై ప్రదర్శించారు. OFFICIAL VIDEO…#Pathaan Trailer screened on Burj Khalifa amid #ShahRukhKhan’s presence….pic.twitter.com/joLJH4Xt9q — Nishit Shaw (@NishitShawHere) January 15, 2023 -
బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
దుబాయి: ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధిగాంచిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయి. పదుల సంఖ్యలోని అంతస్తుల్లో అగ్ని కీలలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. దుబాయి ప్రభుత్వ అధీనంలోని ఎమార్ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్ వాక్ అపార్ట్మెంట్లో ప్రమాదం జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మంటలను అదుపు చేసిన తర్వాత పలు అంతస్తులు పూర్తిగా కాలిపోయి, నల్లగా మారిపోయినట్లు వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తోంది. In #Dubai, the #Emaar skyscraper caught fire near the #BurjKhalifa, the tallest building in the world. At the moment the fire was extinguished, there is no information about victims. pic.twitter.com/QtPmRBHSTq — NEXTA (@nexta_tv) November 7, 2022 ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్! -
దుబాయి లేజర్ షోకు ధీటుగా.. తెలంగాణలో కోటి చప్పట్ల బతుకమ్మ!
దుబాయిలో ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా ఉన్న బుర్జ్ ఖలీఫా నమూనాను తయారు చేసి దాని శిఖరంపై చెరుకుగడల ఆకులు, గల్ఫ్ జెఏసీ జెండా నిలిపి దాని చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ వినూత్నమైన బతుకమ్మ వేడుకలు జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం బీమారం, కోరుట్ల మండలం చిన్న మెటుపల్లి గ్రామాలలో శనివారం (08.10.2022) రాత్రి మహిళలు నిర్వహించారు. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేలా... 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు అయ్యేలా దీవించాలని బతుకమ్మను వేడుకుంటూ పాటలు పాడారు. చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల మహిళలతో గ్రామంలోని ఆడపడుచులు అందరూ ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. వీడియోకాల్ లో ఉయ్యాలో... ఆట చూత్తావానే ఉయ్యాలో... ఆడియోకాల్ లో ఉయ్యాలో... పాట వింటవానే ఉయ్యాలో... అంటూ ఒక చెల్లెలు... గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోధిస్తూ పాడే పాట అందరినీ ఆకర్షించింది. దుబాయి లేజర్ షో కు దీటుగా... తెలంగాణలో కోటి చప్పట్ల బతుకమ్మ ! ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేల సమక్షంలో గత సంవత్సరం 2021 అక్టోబర్ 23న దుబాయి లోని బుర్జ్ ఖలీఫా వద్ద కోటి రూపాయలు ఖర్చు చేసి ఎడారి ఆకాశంలో బతుకమ్మ సంబరాల లేజర్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. బుర్జ్ ఖలీఫా స్క్రీన్ (తెర) పై లేజర్ షో ద్వారా బతుకమ్మ దృశ్య నివేదన జరిగింది. ఆకాశంలో పూల పండుగ చూసి ప్రపంచం అబ్బుర పడింది. దుబాయి లేజర్ షోకు పోటీగా తాము ఈ సంవత్సరం తెలంగాణ గడ్డపై కోటి చప్పట్ల బతుకమ్మ నిర్వహించామని బీమారం గ్రామానికి చెందిన గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు, గల్ఫ్ నుంచి వెనక వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ 30 లక్షల మంది కార్మికులు, వీరందరి కుటుంబ సభ్యులు కలిసి 'ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు' ఏర్పడిందని ఆయన అన్నారు గల్ఫ్ నిర్మాణాల పునాదులు వారి చెమటతో తడిశాయి గల్ఫ్ దేశాలలోని రంగు రంగుల ఆకాశ భవనాల నిర్మాణం వెనుక తెలంగాణ కార్మికుల కష్టం ఉంది. ఈ నిర్మాణాల పునాదులు కార్మికుల చెమటతో తడిశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ ప్రవాసుల పాత్ర అమోఘం. గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరులు, అజ్ఞాత శిల్పులైన మన ప్రవాసీ కూలీలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో వలస కార్మికులు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ సాధనలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుంచి ఈనాటి వరకు గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 కు పైగా తెలంగాణ కార్మికులు మరణించారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారు 2,000 కు పైగా మరణించారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ ప్రవాసీయులు కోరుకుంటున్నారు. -
విఘ్నేశ్ శివన్‌కు నయన్ బర్త్‌డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్ సమ్‌థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్‌తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanthara (@nayantthara) . -
ఓర్నీ.. బుర్జ్ ఖలీఫాను ఇలా కూడా వాడేస్తున్నారా ?
ప్రచారంలో ఎప్పుడూ కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. నలుగురిలోకి తమ ప్రొడక్టును తీసుకెళ్లేందుకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి కంపెనీలు. ఈ క్రమంలో ఇంత వరకు చూడని కొత్తదనం పరిచయం చేస్తుంటాయి. ఈ క్రమంలో వాణిజ్య ప్రకటనల్లో లేటెస్ట్ ఎట్రాక్షన్‌గా వచ్చి చేరింది బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డులెక్కింది దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. ఈ భవనం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి లక్షల మంది టూరిస్టులను ఆకర్షించింది. ఎన్నో సినిమా షూటింగ్‌లకు వేదికగా మారింది. ఇలా రోజురోజుకి బుర్జ్ ఖలీఫా క్రేజ్ పెరిగిపోతుంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బూర్జ్ ఖలీఫా గురించి చెప్పుకుంటారు. మరి ఆ భవనం చిట్టచివర నిలబడి ఏదైనా వస్తువు గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో ముందుకు వచ్చింది ఓ విమానయాన సంస్థ. ఎంతో రిస్క్ చేసి అనేక జాగ్రత్తలు తీసుకుని ఓ మోడల్ని ఎయిర్‌హోస్టెన్ గెటప్ వేయించి ఆ భవనం అంచున నిల్చోబెట్టి యాడ్ షూట్ చేసింది. వందల మీటర్ల ఎత్తులో బూర్జ్ ఖలీఫా చిట్ట చివరన కేవలం నిలబడేందుకు మాత్రమే సరిపడే చోటు ఉన్న స్థలంలో మోడల్ని నిలబెట్టి షూట్ చేయడం వివాస్పదమైంది. మీ ప్రచారం కోసం మనిషి ప్రాణాలను రిస్క్‌లో పెడతారా అంటూ ఆ యాడ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా బోలెడంత ప్రచారం దక్కింది. దీంతో దుబాయ్ ఎక్స్పో 2020 టీం సైతం సేమ్ కాన్సెప్ట్‌ని ఫాలో అయ్యింది. నెలల తరబడి సాగుతున్న ఈ ఎక్స్పోను ఉద్దేశించి ‘మీ కోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీకు వెల్కమ్’ అని చెబుతూ యాడ్ వదిలింది. భారీ ప్రచారం దక్కించుకుంది. ఇక ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ భారత్. దీంతో ఇండియాలో తమ వస్తువుల ప్రచారానికి బూర్జ్ ఖలీఫానే ఎంచుకుంది ఓ శీతల పానీయం కంపెనీ. సౌతిండియా స్టార్‌గా ఉంటూనే ఆలిండియా కమర్షియల్స్ యాడ్స్‌లో నటిస్తున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబుని ఈ యాడ్‌కి ఎంపిక చేసుకుంది. బుర్జ్ ఖలీఫా చిట్ట చివరకు సూపర్‌స్టార్‌ను తీసుకెళ్లి .. అక్కడి నుంచి ఓ ఎడ్వెంచర్ బైక్ రైడ్ కాన్సెప్ట్‌తో యాడ్ వదిలింది. ఇప్పుడది ఇండియాలో సెన్సెషన్‌గా మారింది. కమర్షియల్ యాడ్స్‌కే కాదు సినిమా ట్రైలర్స్, న్యూ ప్రొడక్ట్స్ లాంఛింగ్, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల బర్త్‌డేలు, పలు ఈవెంట్స్‌ని సైతం బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం కామన్‌గా మారింది. ఇలాంటి ప్రదర్శనలకు భారీగానే ఖర్చు అవుతుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య 3 నిమిషాల పాటు ఏదైనా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించాలంటే రూ. 50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. వారాంతాల్లో అయితే ఇది ఏకంగా రూ.70 లక్షల వరకు ఉంటోంది. బూర్జ్ ఖలీఫా నిర్మించే సమయంలో ఎత్తైన భవనంగా రికార్డు సృష్టిస్తుంది. పర్యాటకులను ఆకర్షిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. కానీ కమర్షియల్ యాడ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే బుర్జ్ ఖలీఫా క్రేజ్ మొత్తం సీన్‌ని మార్చేసింది. -
దుబాయ్‌లో మహేశ్‌బాబు న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలె మోకాలి సర్జరీ కోసం దుబాయ్ వెళ్లిన మహేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఆయన తాజాగా న్యూ ఇయర్ వేడకలు జరుపుకుంటున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం ఫ్యామిలీతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీంతో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాపై అర్హ బర్త్‌డే వేడుకలు
Allu Arjun And Sneha Celebrates Arha 5th Birthday At Burj Khalifa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నేడు(నవంబర్ 21) ఆరో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ బర్త్‌డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు బన్నీ. ఇందుకోసం ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాను ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చెక్కేశాడు. బుర్జ్ ఖలీపాపై అర్హతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ఈ భవంతిపై ఈ రేంజ్లో బర్త్‌డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అర్హ బర్త్‌డే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అర్హ 'శాకుంతలం' సినిమాతో వెండితెరపై అడుగు పెడుతున్న విషయం తెలిసిందే! క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్హ భరతుడిగా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది. -
హాలీవుడ్ స్టార్ సాహసం.. బుర్జ్ ఖలీఫా భవనం ఎక్కి..
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఓ సాహసకృత్యం చేసి తన అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పైకి ఎక్కాడు. 2,909 మెట్ల ద్వారా 160 అంతస్తును చేరుకున్నాడీ బ్యాడ్ బ్యాయ్స్ హీరో. అతని బరువు తగ్గించే విధానాన్ని డాక్యుమెంట్ రూపంలో చిత్రీకరిస్తున్నాడు విల్. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' అనే కొత్త యూట్యూబ్ సిరీస్‌లో భాగంగా బుర్జ్ ఖలీఫా ఎక్కినట్టు పేర్కొన్నాడు. 2,909 మెట్ల ద్వారా చివరి అంతస్తును చేరుకునే సరికి తన కార్డియో వర్క్అవుట్ పూర్తయిందని తెలిపాడు. 160 అంతస్తులు ఉన్న ఈ భవనం పెకి ఎక్కడానికి 51 నిమిషాలు పట్టిందట. బుర్జ్ ఖలీఫాలో ముందుకు సాగుతున్నప్పుడు చెమటలు పట్టి అలసిపోయాడు. 160వ అంతస్తు చేరుకున్నప్పుడు, అతను సాధించేది ఇంకా ఉందని అనుకున్నాడట. హార్నెస్, హెల్మెట్ కట్టుకుని నిచ్చెన ద్వారా శిఖరంపైకి ఎక్కాడు. శిఖరంపైకి చేరుకున్నాక 'భూమిపై మానవులు నిర్మించిన వాటిలో మనుషులు ఉండగల వ్యక్తిగత స్థానం' అని విల్ అభిప్రాయపడ్డాడు. అలాగే విల్ స్మిత్ యూట్యూబ్ సిరీస్ గ్రామీ అవార్డ్ గెలుచుకున్న నటుడు ఫిట్నెస్, ఆరోగ్యం ప్రయాణంపై ఉంటుందట. 'బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్' మొదటి రెండు ఎపిసోడ్లు నవంబర్ 8న విడుదలయ్యాయి. మిగిలిన 4 ఎపిసోడ్లు విల్ స్మిత్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రతిరోజు ప్రదర్శితమవుతాయి. -
బుర్జ్ ఖలీఫా: "నేను కూడా మీ అభిమానినే"
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2 పురస్కరించుకుని దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు 'హ్యాపీ బర్త్‌డే' శుభాకాంక్షలు తెలుపుతూ అతని చిత్రాన్ని ప్రదర్శించి సత్కరించింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) ఆ తర్వాత ఆకాశహర్మ్యంపై 'హ్యాపీ బర్త్‌డే షారూఖ్' అనే సందేశాన్ని తోపాటు " మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ ఒక లవ్ సింబల్ కనిపిస్తుంది. ఈ విధంగా షారూఖ్ ఖాన్ బుర్జ్ ఖలీఫా భవనంపై కనిపించడం మూడోసారి. అయితే దీనికి సంబంధించిన వీడియోతో పాటుగా "ఈ భవనం నీ కోసం మెరుస్తుంది" అనే క్యాప్షన్ జోడించి మరీ వ్యాపారవేత్త మొహమ్మద్ అలబ్బర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు మనందరిలాగే బుర్జ్ ఖలీఫా కూడా షారుఖ్ ఖాన్ని ప్రేమిస్తుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది) Happy birthday @iamsrk from the @noon family كل عام وأنت بخير @iamsrk من عائلة نون pic.twitter.com/TIG3zURQjk — Mohamed Alabbar محمد العبار (@mohamed_alabbar) November 2, 2021 -
Dubai: బుర్జ్ ఖలీఫాపై బంగారు ‘బతుకమ్మ’
తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మన సాంస్కృతిక వైభవం ‘జై బతుకమ్మ’, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ బుర్జ్ ఖలీఫాపై జిగేల్మని మిరుమిట్లుగొలిపింది. పూల సంబురం విశ్వవిఖ్యాతికెక్కింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో దుబాయిలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా తెరపై బతుకమ్మ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. ‘జై తెలంగాణ’, ‘జై హింద్’నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫా తెరపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను తిలకించారు. దేశానికే గర్వకారణం: కవిత బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. -
దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో బతుకమ్మ సంబరాలు
-
ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి
Team India New Jersey Displayed On Burj Khalifa : టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే సరికొత్త జెర్సీకి సంబంధించిన చిత్రాలను ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ 'బుర్జ్ ఖలీఫా'పై బుధవారం రాత్రి ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ ట్వీట్ చేస్తూ.. చరిత్రలో తొలిసారి టీమిండియా జెర్సీని ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారని పేర్కొంది. 'బిలియన్ చీర్స్ జెర్సీ'గా పిలువబడే ఈ జెర్సీని వంద కోట్ల మంది అభిమానుల చీర్స్ స్ఫూర్తితో తయారు చేశామని వెల్లడించింది. ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలు ధరించి కనిపించారు. For the first time ever, a Team India Jersey lit up the @BurjKhalifa The #BillionCheersJersey inspired by the cheers of a billion fans reached new heights, quite literally 🤩 Are you ready to #ShowYourGame & back Team India 🥳 pic.twitter.com/LCUxX6NWqz — MPL Sports (@mpl_sport) October 14, 2021 ఇదిలా ఉంటే, గతేడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్ల ఫొటోలను ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం ఈ టవర్‌పై ప్రదర్శించారు. కాగా, అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. చదవండి: IND Vs PAK: 'మౌకా మౌకా'... అరె భయ్యా ఈసారైనా -
ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?
World Skyscraper Day 2021: జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు.. కట్టడానికి సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతుంటాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది. ఇవాళ ప్రపంచ బహుళ అంతస్తుల భవన దినోత్సవం(స్కైస్క్రాపర్ డే). ► స్కైస్క్రాపర్స్ డే ప్రధాన ఉద్దేశం.. 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులు, ఆర్కిటెక్టర్లను గౌరవించుకోవడం, వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం. ► మొదటి బహుళ అంతస్తుల భవవాన్ని మొదటగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ విలియమ్ లె బారోన్ జెన్నెకి గుర్తింపు దక్కింది. ► చికాగోలోని హోం ఇన్సురెన్స్ భవవాన్ని(1984).. ప్రపంచంలోని మొట్టమొదటి స్కైస్క్రాపర్గా గుర్తించారు. ► సెప్టెంబర్ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్ లూయిస్ సుల్లైవన్ పుట్టినరోజు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్కైస్క్రాపర్స్ అంటారు. ► ఈయన మోడ్రనిజానికి కూడా ఫాదర్లాంటి వాడనే పేరుంది. అమెరికాలోని వెయిన్‌రైట్ బిల్డింగ్, ది క్రౌజ్ మ్యూజిక్ స్టోర్, యూనియన్ ట్రస్ట్ బిల్డింగ్, ది ప్రూడెన్షియల్ బిల్డింగ్.. ఇలా ఎన్నో బిల్డింగ్‌లను చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ► అందుకే ఈ రోజును(సెప్టెంబర్ 3ను) ‘వరల్డ్ స్కైస్క్రాపర్’డేగా నిర్వహిస్తున్నారు. ► స్కైస్క్రాపర్స్(బహుళ అంతస్తుల భవంతి) ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. ► కనీసం వంద మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే.. అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు.(కంపల్సరీ అనేం లేదు). కాకపోతే పది అంతస్తుల కంటే ఎక్కువ మాత్రం ఉండాలి. అన్ని వసతులూ ఉండాలి. ► ప్రపంచంలో అతిఎత్తైన బహుళ అంతస్తుల భవనం.. బుర్జ్ ఖలీఫా ► యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా కట్టడం.. ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్ అడ్రియాన్ స్మిత్ దీనిని రూపొందించగా.. స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్ బేకర్ నిర్మాణ ఇంజినీర్‌గా వ్యవహరించాడు. ఎమ్మార్ ప్రాపర్టీస్ దీని ఓనర్. బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు(2, 722 అడుగులు), 168 అంతస్తులు 12 వేల మంది ఈ బిల్డింగ్ కోసం పని చేశారు ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు జనవరి 4, 2010 నుంచి ఇది ఓపెన్ అయ్యింది లిఫ్ట్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అంటే రెండు నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చు. ► ప్రపంచంలో రెండో పెద్ద బహుళ అంతస్తుల భవనం.. షాంగై టవర్(చైనా). ఎత్తు 632 మీటర్లు(2,073 అడుగులు)-163 అడుగులు. ఇది మెలికలు తిరిగి ఉండడం విశేషం. అమెరికన్ ఆర్చిటెక్ట్ మార్షల్ సస్రా్టబలా, చైనా ఆర్కిటెక్ట్ జన్ గ్సియాలు దీనిని డిజైన్ చేశారు. ► భారత్‌లో అతిపెద్ద భవనంగా ముంబై ‘పోలయిస్ రాయల్’కు పేరుంది. దీని ఎత్తు 320 మీటర్లు(1,050 అడుగులు)-88 అంతస్తులు. నోజర్ పంథాకీ నేతృత్వంలోని తలాటి పంథాకీ అసోషియేట్స్ ఈ భవనాన్ని రూపకల్పన చేసింది. - సాక్షి, వెబ్ స్పెషల్ చదవండి: పేన్లను పచ్చడి చేసి వ్యాక్సిన్ తయారు చేశాడు -
వివాదంలో యాడ్ షూటింగ్! అసలు నిజమేంటంటే..
Emirates Airlines Viral Ad Video: ఫ్లై బెటర్ అంటూ ఎమిరేట్స్ రూపొందించిన తాజా అడ్వర్టైజ్మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది. అత్యంత ఎత్తులో దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఇటీవల కొత్త యాడ్‌ని రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్ హోస్టెస్ నిల్చుని... ఎమిరేట్స్ విమానాల్లో దుబాయ్ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్ అవుట్ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్ హోస్టెస్ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు. Reconnect with your loved ones or take a fabulous vacation. From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo — Emirates Airline (@emirates) August 5, 2021 ఇది నిజం కాదు ఎమిరేట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ని ఆగష్టు 5న విడుదల చేసింది. చూసినవారంతా యాడ్ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. మరికొందరు అంత ఎత్తులో ఎయిర్ హోస్టెస్‌తో షూట్ చేయడం దారుణమని, ఏదైనా జరిగితే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్ విడుదల చేసింది. షూటింగ్ ఇలా ఈ యాడ్ చిత్రీకరించేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది ఎమిరేట్స్. నెలల తరబడి రిహార్సల్ నిర్వహించింది. ముఖ్యంగా ఈ యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్ లుడ్విక్కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్ షూట్ చేశామంటూ ఎమిరేట్స్ వీడియో రిలీజ్ చేసింది. అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్ లుడ్విక్ తెలిపింది. Real or fake? A lot of you have asked this question and we’re here to answer it. Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe — Emirates Airline (@emirates) August 9, 2021 -
యాక్షన్ ఇన్ బూర్జ్ ఖలీఫా
రెండేళ్ల విరామం తర్వాత షారుక్ ఖాన్ చేస్తున్న చిత్రం ‘పతాన్’. ఇందులో దీపికా పదుకోన్ కథానాయిక. జాన్ అబ్రహామ్ విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బూర్జ్ ఖలీఫాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట ‘పతాన్’ చిత్రబృందం. బూర్జ్ ఖలీఫాలో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ వంటి హాలీవుడ్ సినిమాలను ఈ భవనంలో చిత్రీకరించారు. ‘పతాన్’ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం
కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
వైరలైన యువీ ఫొటో.. ‘హాయ్! అందగాడా’
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బుర్జ్ ఖలీఫా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలా.. వైట్ టీషర్టు, బ్లూ జీన్స్‌తో దిగిన ఫొటోను గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు యువీ. ఆ ఫొటో తోటి క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, హర్భజన్ సింగ్‌లను ప్రత్యేకంగా ఆకర్షించింది. దీనిపై వారు స్పందించారు. ‘‘ ఎందుకు నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు?’’ అని పీటర్సన్.. ‘‘ పాజీ అదిరింది!’’ అని హర్భజన్ అన్నారు. యువరాజ్ సింగ్ భార్య హజల్ కీచ్ కూడా ఆ ఫొటోపై ‘హాయ్! అందగాడా’ అని కామెంట్ చేశారు. చదవండి : బ్రో.. డీఆర్ఎస్ను మరచిపోయావా? View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
కరోనా: బుర్జ్ ఖలీఫా..12 లక్షల భోజనాలు!
దుబాయ్ : దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ఇబ్బందులు పడే పేద ప్రజలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా దాతలెవరైనా 10 దిర్హామ్‌ల విరాళం(ఒక భోజనానికి అయ్యే ఖర్చు) అందిస్తే బుర్జ్ ఖలీఫా భవనం ముందు భాగంలో ఒక లైటు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల మంది విరాళాలు అందించడంతో 1.2 మిలియన్ల లైట్లు అమ్ముడుపోయాయని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా 12 లక్షల లైట్లను వెలిగించి దాతల్లో స్పూర్తి నింపారు. (ఒక్కరోజులో 3,525 కేసులు ) కాగా రంజాన్ సందర్భంగా ఎంబీఆర్జీఐ(ఆర్గనైజింగ్ బాడీ ద మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్) ద్వారా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దాదాపు 10 మిలియన్ల భోజనానికి సరిపడే నిధులు సమకూర్చేందుకు ఈ విరాళ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. ఇక కరోనా కారణంగా దుబాయి ఆర్థిక పరిస్థితి విపరీతంగా దెబ్బతింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. యూఏఈలో ఇప్పటి వరకు 19,881 కరోనా కేసులు నమోదవ్వగా 203 మంది ప్రాణాలు కోల్పోయారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా! ) -
అబ్బా... ఎంత అద్భుతమైన దృశ్యం!
దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ యునైటెడ్ స్టేట్ ఎమిరెట్సలోని ‘బుర్జ్ ఖలిఫా’. దాదాపు 2,720 అడుగులతో ఆకాశాన్ని తాకేలా కనింపించే బుర్జ్ ఖలీఫా ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటి. ఇంతటి అందమైన అద్దాల మేడ చూడటానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. ఈ కట్టడాన్ని రాత్రి వేళ ఆకాశంలో మెరిసే మెరుపు వచ్చి తాకితే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. ఊహించుకుంటుంటూనే అంత అందంగా అనిపిస్తే.. మరి నిజంగానే మెరుపు వచ్చి తాకిన దృశ్యం మీకు కనబడితే.. ఎలా ఉంటుందో చూస్తారా. అయితే దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ శుక్రవారం షేర్ చేసిన అత్యంత అరుదైన వీడియోను చూసేయండి. ఈ అత్యంత అందమైన దృశ్యాన్ని కెమారాలో బంధించిన ఫొటోగ్రాఫర్ పేరు జోహైబ్ అంజుమ్. దీన్ని తన కెమోరాల్లో బంధించించడానికి దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న అంజుమ్ చివరకు 2020లో తన కలను నిజం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అంజుమ్ మాట్లాడతూ.. ‘ఈ అరుదైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడానికి ఏడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇందుకోసం ఎడారి దేశంలో వర్షం పడినపుడల్లా ‘బుర్జ్ ఖలిఫా’ బయట ఎన్నో రాత్రిళ్లు మెళకువతో గడిపాను. ఈ క్రమంలో గత శుక్రవారం దుబాయ్‌లో వర్షం పడటంతో యథావిధిగా అక్కడికి వెళ్లాను. ఇక దేవుడు నా కష్టాన్ని గుర్తించి ఈ ఏడాది నా కల సాకారం చేశాడు’ అని చెప్పుకొచ్చాడు. -
బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం
దుబాయ్: బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కింగ్‌ఖాన్ బర్త్‌డే సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఆయన పేరును ప్రదర్శించారు. కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్‌ఖాన్ హ్యాపీ బర్త్‌డే అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగానే ఆయన అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి. షారుఖ్ ఖాన్ శనివారం 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
టీహబ్.. ఇంక్యుబెటర్
సాక్షి, హైదరాబాద్:బుర్జ్ దుబాయ్ మాదిరిగా మన నగరంలోనూ ఓ బుర్జ్ రూపుదిద్దుకుంటోంది. అదే టీ–హబ్ 2వ దశ భవనం. ఇది అంకుర పరిశ్రమల స్వర్గధామంగా నిలవనుంది. ఈ భవంతి మార్చి 2020 నాటికి పూర్తి కానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్(ఇంక్యుబేటర్) ఇదేనని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వెయ్యి స్టార్టప్ కంపెనీలకు ఇది ఆలవాలం కానుంది. 4 వేల మంది సాంకేతికనిపుణులు తమ సృజనకు పదును పెట్టే వేదికగా ఈ భవనాన్ని హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గంలో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఐటీ శాఖ నిర్మిస్తోంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిలో.. దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిని పోలినరీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం సాగుతోంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణపనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్ శాండీ కంపెనీ ప్రతినిధులే టీహబ్ రెండోదశ భవన నిర్మాణంలోనూ పాల్గొంటుండటం విశేషం. బయటి నుంచి చూసేవారికి ప్రధాన కేంద్రం నుంచి 4 పిల్లర్లు, రెండు స్టీలు దూలాలతో వేలాడే భవంతిలా కనిపించనుంది. 9 అంతస్తుల్లో 60 మీటర్ల ఎత్తు, 90 మీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం, మరో మూడు లక్షల అడుగుల పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ 6,500 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పునాది నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి. దీనిని 3డి భవనంగా భావిస్తున్నారు. ఈ భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని విధంగా నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది.అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతస్తుకో ప్రత్యేకత గ్రౌండ్ ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది.చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట పచ్చికబయలు, పలు సౌకర్యాలు మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణశైలి, ఇంక్యుబేషన్ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. రెండోఅంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశ మందిరాలు, చర్చా ప్రాంగణాలు ఉంటాయి. 3, 4వ అంతస్తులు: అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన హంగులు.. ఆకుపచ్చని మొక్కలు. హరితతోరణంలా ఉంటుంది. 5వ అంతస్తు: అటవీప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్న, చిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు. 6, 7, 8, 9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు, అంకుర పరిశ్రమలు. ఉద్యోగులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులు. ఇన్డోర్గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కెఫెటేరియాలు కొలువుదీరుతాయి. -
బుర్జ్ ఖలీఫాపై ఆమె చిత్రాన్ని ప్రదర్శించారు!
సాక్షి, వెల్లింగ్టన్: యూఏఈ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన తమ కట్టడం బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ నెల 15న న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్పై ప్రదర్శించింది. న్యూజిలాండ్ జరిగిన ఆ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అలీ మక్తమ్ ముస్లింలకు బాసటగా నిలిచిన జసింగా ఆర్డర్న్‌కు ధన్యవాదాలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఆమె ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన దాడితో మొత్తం ముస్లిం సమాజం భయాందోళనలకు గురైందని.. సరైన సమయంలో బాధితులకు భరోసాగా నిలిచిన జసిండా 1.5 బిలియన్ల ముస్లింల మనసులను గెలుచుకున్నారనేది ఆయన ప్రశంసించారు. ఈ ట్వీట్‌కు జసిండా బదులిస్తూ.. ‘న్యూజిలాండ్‌లో పుట్టకపోయినా, ఈ ప్రాంతంలో జీవించడానికి నిర్ణయించుకొని వలస వచ్చిన వారికి రక్షణ కల్పించే బాధ్యత మా మీదే ఉంది. తమ సంస్కృతీ, సంప్రదాయాలను స్వేచ్ఛగా పాటించే హక్కు ఇక్కడ నివసిస్తున్న వలస ప్రజలకూ ఉంది. అలాంటి వారికి మేం అండగా ఉంటాం’ అని తెలిపారు. మార్చి 15న జరిగిన కాల్పుల నుంచి న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తోపాటు, పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు తృటిలో తప్పించుకున్నాయి. రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్ రద్దు చేసి, బంగ్లా టీమ్‌ను వెంటనే స్వదేశానికి పంపే ఏర్పాట్లను చేసింది అక్కడి ప్రభుత్వం. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి బ్రెండన్ టరెంట్ (28)ను ఆస్ట్రేలియన్‌గా భావిస్తున్నారు. ఏప్రిల్ 5న టరెంట్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. -
బుర్జ్ ఖలీఫా వెలుగు జిలుగుల్లో..
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలు త్రివర్ణ పతాక రంగులతో కళకళలాడాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడీఎన్ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ ‘దుబాయ్ ఫ్రేమ్’లు మన జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలస్తీనా నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకుంటారు. యూఏఈ పర్యటనలో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం దుబాయ్‌లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగిస్తారు. -
బుర్జ్ ఖలీఫాను తలదన్నేలా..!
రియాద్ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని తలదన్నే కట్టడం మరొకటి అతి త్వరలో రాబోతోంది. బుర్జ్ ఖలీఫా కంటే 590 అడుగులు ఎక్కువ పొడవు ఉండబోతుంది. అదే సౌదీ అరేబియాలోని ఏడారి ప్రాంతంలో నిర్మితమవుతున్న జెడ్డా టవర్. 2020లో జెడ్డా టవర్‌ను ప్రారంభించనుంది సౌదీ అరేబియా. దాదాపు 1.4 బిలియన్ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. దీని ఎత్తు 3,280 అడుగులు(1000మీటర్లు). ఇప్పటికే 239 అడుగుల పాటు(72మీటర్లు) నిర్మాణాన్ని పూర్తి చేశారు. దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా ఎత్తు 2690 అడుగులు(828 మీటర్లు). మొత్తం ఐదు కోట్ల డెబ్భై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెడ్డా టవర్‌ను నిర్మిస్తున్నారు. కమర్షియల్ భవనాలు, హోటళ్లు, ఇళ్లు, ఆఫీస్‌లు, టూరిస్ట్‌లకు సంబంధించిన కాంప్లెక్స్‌లు జెడ్డా టవర్‌లో కొలువుదీరతాయి. సౌదీ అరేబియా ఆర్థిక నగరమైన జెడ్డాకు ఈ టవర్ మణిహారంగా మారుతుందని అంటున్నారు. ప్రాజెక్ట్‌కు అడుగడునా అడ్డంకులే.. జెడ్డా టవర్ ప్రాజెక్టు 2013లో ప్రారంభమైంది. ఆ తర్వాతి కొద్దికాలానికే సౌదీ అరేబియా రాజు అల్ వాలిద్ బిన్ తలాల్, జడ్డా కన్స్ట్రక్షన్ కంపెనీ ‘బిన్ లాడెన్ గ్రూప్’ చైర్మన్ బాకర్ బిన్ లాడెన్లు అవినీతి కేసులో చిక్కుకున్నారు. దీంతో టవర్ నిర్మాణ వేగం మందగించింది. ముందస్తుగా అనుకున్న ప్రకారమే 2020 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జెడ్డా ఎకానమిక్ కంపెనీ అధికారులు వెల్లడించారు. -
అహో టీ హబ్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. భాగ్యనగరానికి తలమానికంగా, దేశంలోనే వినూత్న నిర్మాణ శైలిలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. స్టార్టప్స్‌కు (అంకుర పరిశ్రమలు) కొంగు బంగారంగా మారిన రాయదుర్గం ప్రాంతంలో టీహబ్ రెండో దశ భవనం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ నిర్మాణ శైలిని పోలిన రీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. సుమారు 10(9+1) అంతస్తులు.. 60 మీటర్ల ఎత్తు.. 90 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. 3 లక్షల చదరపు అడుగుల వైశాల్యం.. 2 లక్షల చదరపు అడుగుల సువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో దాదాపు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో కేపీసీ సంస్థ ఈ పనులు చేపట్టింది. గత ఆరు నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తోపాటు ఇంక్యుబేషన్ ల్యాబ్ ఉపాధి కల్పన వంటి అంశాల్లో 3 వేల మంది పనిచేసేందుకు వీలుగా అంతస్తులు నిర్మించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులను వచ్చేఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయనునున్నారు. బుర్జ్ ఖలీఫా తరహాలో.. దుబాయ్‌లో 163 అంతస్తుల ఎత్తున నిర్మించిన బుర్జ్ ఖలీఫా టవర్స్ నిర్మాణ శైలి తరహాలో ఈ భవంతి నిర్మాణం ఉంటుంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్సాండై కంపెనీ ప్రతినిధులే టీహబ్ రెండో దశ భవన నిర్మాణంలోనూ పాలుపంచుకుంటుండటం విశేషం. 3ఈ నిర్మాణ శైలి.. నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి కావడంతో ఈ భవనాన్ని 3డీ నిర్మాణంగా భావిస్తున్నారు. భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్ 456–2000 ప్రకారం బీములు, ఆర్సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునే స్థాయిలో ఐఎస్ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ టవర్ల నిర్మాణ పనితీరుకు రెస్పాన్స్ స్పెక్ట్రం విశ్లేషణ నిర్వహిస్తుండటం విశేషం. ప్రామాణిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి గోడలు, శ్లాబులు, మెట్లు, పునాదులను డిజైన్ చేశారు. అధిక ఒత్తిడిని తట్టుకునేలా.. రీ ఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీటు మిశ్రమంతో ఏర్పాటు చేసిన బీం శ్లాబ్ పద్ధతిన పునాది నుంచి రెండో అంతస్తు వరకు నిర్మిస్తున్నారు. మూడో అంతస్తు నుంచి టెర్రస్ వరకు అధిక ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా స్టీలు ఫ్రేం(వీరెండిల్ గర్డర్స్) ఏర్పాటు చేస్తారు. ప్రతి అంతస్తుకు సంబంధించిన శ్లాబ్‌ను డెక్శ్లాబ్ విధానంలో పటిష్టంగా నిర్మించనున్నారు. 9,000 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఈ భవంతిని అత్యాధునిక ఇంజనీరింగ్ డిజైన్లు, సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. భవన నిర్మాణంలో నాలుగు పిల్లర్ల ఆధారంగా రెండు పునాదులు.. గ్రౌండ్‌ఫ్లోర్.. దానిపై పలు అంతస్తులతో స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్ఫోర్స్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్ మీటర్లు కావడం విశేషం. 7 వేల క్యూబిక్ మీటర్ల మేర పునాదిని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో 25 మంది ఇంజనీర్లు.. 200 మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఒక్కో అంతస్తు.. ఒక్కో ప్రత్యేకత గ్రౌండ్‌ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చిక బయలు, వివిధ సౌకర్యాలు ఈ ఫ్లోర్ సొంతం. 1 అంతస్తు విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. 2 అంతస్తు విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ ఫ్లోర్ నిర్మాణ శైలి ఉంటుంది. ఇంక్యుబేషన్ కేంద్రంతోపాటు భవనంలో జరిగే రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. 3,4 అంతస్తులు అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో అలరారే ఈ ఫ్లోర్లలో వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి. 5 అంతస్తు ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తుంది ఈ అంతస్తు. 6,7 8,9 అంతస్తులు ఇందులో వివిధ కార్యాలయాలు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందం, ఆహ్లాదం ఇచ్చేలా వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్డోర్ గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కెఫిటేరియాలు ఇందులో ఉంటాయి. -
పెద్ద గీత.. చిన్న గీత కాబోతోంది!
ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఏది? దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా! కానీ ఈ ముచ్చట ఇంకో మూడేళ్లే! బుర్జ్ ఖలీఫాకు కొంచెం దూరంలోనే ఇంకో ఎత్తైన భవనాన్ని కట్టేసి దుబాయి తన రికార్డును తానే బద్ధలు కొడుతోంది. మల్లెపూవు ఆకారాన్ని పోలినట్టు ఉండే ఆ భవనం ఎలా ఉండబోతోందో ఫొటోలో చూడవచ్చు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈ ఎత్తైన భవంతిని కడుతోంది. డిజైన్ చేసింది శాంటియాగో కలట్రావాస్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ. దాదాపు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కట్టే ఈ భవనం ఎత్తు దాదాపు 3,045 అడుగులు. బుర్జ్ ఖలీఫా కంటే 300 అడుగులు ఎక్కువ. దుబాయ్ అంటేనే ఏడారి దేశం కాబట్టి.. ఇసుక నేలలపై భవనాలు కట్టడం అంత ఆషామాషీ ఏం కాదు. అందుకే ఈ కొత్త భవనానికి పునాది ఎంత గట్టిగా వేశారంటే.. అది కాస్తా 236 అడుగుల లోతుకు చేరేంత. పైగా ఒక్క పునాదుల్లోనే దాదాపు 16 లక్షల ఘనపుటడుగుల కాంక్రీట్‌ను దిమ్మరించారు. ఇక ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత... దీనికి ఊతమిచ్చేందుకు దాదాపు 110 కిలోమీటర్ల పొడవైన ఇనుపతీగలను వాడటం. బలమైన గాలులకు భవనం ఊగిపోకుండా అన్నమాట! అన్నీ బాగానే ఉన్నాయిగానీ దీంట్లో ఏముంటాయి? దుబాయ్ మొత్తాన్ని పై నుంచి చూసేందుకు పది వరకూ అబ్జర్వేషన్ డెక్స్ ఉంటాయి. అంతేకాకుండా బాబిలోనియాలోని వేలాడే ఉద్యానవనాల మాదిరిగా దీంట్లోనూ బోలెడన్ని మొక్కలు, పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్ లోపల చల్లగా ఉంచేందుకు అత్యంత çసమర్థవంతమైన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా సేకరించే నీటితో బిల్డింగ్ ముందుభాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంట్లో ఉన్న కొన్ని బాల్కనీలు అవసరమైనప్పుడు బిల్డింగ్ బయటభాగానికి వచ్చేస్తాయి. ఆ తరువాత లోనికి తిరిగేస్తాయి. గత ఏడాది ఈ భవన నిర్మాణం మొదలుకాగా.. ఇంకో మూడేళ్లలో అంటే 2020లో జరిగే దుబాయ్ ఎక్స్పో సమయానికి నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
త్రివర్ణంలో మెరిసిన బుర్జ్ ఖలీఫా
-
త్రివర్ణంలో బుర్జ్ ఖలీఫా
దుబాయ్ : ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం భారత జాతీయపతాకంలోని త్రివర్ణాలతో మెరిసిపోయింది. భారతదేశ 68వ గణతంత్ర వేడుకల్లో భాగంగా బుధ, గురువారాల్లో దుబాయ్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకంలోని మూడు రంగుల వెలుగులతో బుర్జ్ ఖలీఫా టవర్ ముస్తాబయింది. ఓడ్ మెతాలోని ఇండియన్ హై స్కూల్‌తో పాటూ భారత రాయభార కార్యాలయంలో గురువారం కాన్సులేట్ అనురాగ్ భూషణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 'ఆజ్ కీ షామ్ దేశ్కే నామ్' పేరుతో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్‌లో ఇండియన్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. 68వ గణతంత్ర వేడుకల్లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్– నహ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆయనకు భారత్ ఆహ్వానం పంపింది. 2006లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. 2016 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు. కాగా, ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు నహ్యన్ బుధవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య బంధాన్ని బలపరిచేందుకు ఇద్దరు నేతలునిర్ణయాలు తీసుకున్నారు. -
బుర్జ్ ఖలీపా కన్నా మన ఆలయానికే..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం 'చంద్రోదయ మందిరం' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడమైన బూర్జ్ ఖలీఫా కన్నా లోతైన పునాదితో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. బూర్జ్ ఖలీఫా పునాదికి 50 మీటర్ల లోతు ఉండగా.. అంతకన్నా ఐదు మీటర్ల ఎక్కువ లోతు పునాదితో ఉత్తరప్రదేశ్ బృందావన్ లో 'చంద్రోదయ మందిరం' నిర్మాణమవుతోంది. ఈ ఆలయానికి 55 మీటర్ల లోతు పునాది ఉంటుందని, వచ్చే ఏడాది మార్చిలోగా పునాది నిర్మాణం పూర్తి అవుతుందని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహా దాస్ తెలిపారు. ఎత్తుపరంగానే కాకుండా ఇందులోని అటవీప్రాంతం, థీమ్ పార్కుల విషయంలోనూ ఎన్నో విశిష్టతలు ఈ ఆలయం కలిగి ఉంది. ఆ ఆలయం పరిసరాల్లో ఏర్పాటుచేస్తున్న థీమ్ పార్కులో డార్క్ రైడ్స్, లైటింగ్, సౌండింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్, శ్రీకృష్ణుని జీవితాన్ని ప్రతిబింబించేలా లేజర్ షోలు వంటివి ఉంటాయని నరసింహ దాస్ వివరించారు. ఏడు వందల అడుగుల ఎత్తుతో, రూ. 700 కోట్ల వ్యయంతో 2022 నాటికి ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఆలయం నిర్మాణం పూర్తికానుంది. బెంగళూరు ఇస్కాన్ భక్తుల ఆలోచనకు అనుగుణంగా నిర్మితమవుతున్న ఈ ఆలయంలో 12 అటవీ ప్రాంత నమూనాలు ఉంటాయి. మధువనం, తాలవనం, కుముదవనం, బహుళవనం, కామ్యవనం, ఖదిరవనం, బృందావనం, భద్రావనం, బిల్వవనం, లోహవనం, భాందిరవనం, మహావనం పేరిట ఈ అటవీ నమూనాలు నిర్మాణం కానున్నాయి. ఇక రాధాకృష్ణులు, కృష్ణాబలరాములు, చైతన్య మహాప్రభు, స్వామి ప్రభుపాద తదితరులు నలుగురి ఆలయాలు కూడా ఇందులో ఉంటాయి. మ్యూజిక్ ఫౌంటెయిన్లు, గార్డెన్లు వంటివెన్నో అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. -
మెకానిక్కు బుర్జ్ ఖలీఫాలో 22 అపార్టుమెంట్లు
దుబాయ్: ఒక్కోసారి ఓ మాట వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుందంటారు. అతడికి లేని శక్తులు వచ్చేలా తయారుచేస్తుందని చెప్తుంటారు. సరిగ్గా ఓ భారతీయుడి విషయంలో ఇదే జరిగింది. తన స్నేహితుడు అపహాస్యం చేసినట్లుగా మాటలు అన్నందుకు ఆ వ్యక్తి దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. విన్నవారంతా అవాక్కయ్యే స్థాయికి వెళ్లాడు. అతడే మెకానిక్ నెరియాపరాంబిల్. నెరియాపరాంబిల్ ఓ భారతీయుడు. 1976 మధ్యాసియాకు వెళ్లిపోయాడు. స్వతహాగా మెకానిక్ అయిన అతడు అదే పనిచేసుకుంటూ గడపడంతోపాటు తండ్రి చేసే పనిలో సహాయంగా ఉండేవాడు. ఒకసారి అతడి స్నేహితుడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనాన్ని చూపిస్తూ.. ఇందులోకి నీ జీవితంలో వెళ్లలేవు అంటూ అపహాస్యం చేసి వెకిలి నవ్వు నవ్వాడు. ఓ రోజు ఆ భవనంలో ప్లాట్ లు అద్దెకు ఉంటాయని పేపర్ లో చదివి సరిగ్గా 2010లో అందులో అద్దెకు దిగాడు. అనంతరం ఒక బిజినెస్‌మేన్‌గా మారి తన తెలివితేటలతో అనతికాలంలోనే ఏకంగా అందులో 22 అపార్టుమెంట్లు సొంతం చేసుకున్నాడు. 828మీటర్లు ఉండి మొత్తం 900 అపార్ట్మెంట్లు ఉన్న బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్మెంట్లు మన మెకానిక్ నెరియాపరాంబిల్వే. అయితే, తన కలను ఇంతటితో ఆపనని, ఇలా కలకంటూనే మరెన్నో అపార్టు మెంట్లను కొనుగోలు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ అనితర మెకానిక్. -
'యోగా 100 శాతం సెక్యులర్ విధానం'
దుబాయ్: యోగా మతానికి సంబంధించింది కాదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. యోగా శాస్త్రీయమైందని, విశ్వమంతటికీ చెందినదని పేర్కొన్నారు. ఇది వందశాతం సెక్యులర్ విధానం అని వ్యాఖ్యానించారు. దుబాయ్ లోని బూర్జ్ ఖలీపాలో ఆయన శనివారం సాయంత్రం యోగా శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వివిధ దేశాలకు చెందిన 20 వేల మందితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ... దుబాయ తనకెంతో నచ్చిందని రాందేవ్ అన్నారు. '2009లో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంద'ని రాందేవ్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా యోగా నేర్చుకున్నారని తెలిపారు. -
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
-
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఘటన.. 63 అంతస్తుల ఫైవ్‌స్టార్ హోటల్లో మంటలు దుబాయ్: యూఏఈలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలోని 63 అంతస్తుల అడ్రస్ డౌన్‌టౌన్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో 20వ అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఆ మంటలు హోటల్ వెలుపలి వైపు నుంచి 40వ అంతస్తు వరకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో హోటల్ పై అంతస్థుల నుంచి దాదాపు 300 మీటర్ల ఎత్తు నుంచి శకలాలు కిందకు పడుతున్నాయి. ఈ హోటల్లో నివాస గదులు (రెసిడెన్షియల్ రూమ్స్) కూడా ఉన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసం.. పెద్దమొత్తంలో టపాసులను భవనంపైకి తీసుకు వెళ్లినట్లు చెప్తున్నారు. మంటలు మొదలైన వెంటనే గుర్తించి హోటల్లోని అందరినీ ఖాళీ చేయించటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా బయటకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 14 మందికి చిన్న గాయాలు కాగా, ఓ వ్యక్తికి గుండె పోటు వచ్చినట్టు అధికారులు చెప్పారు. హోటల్ లోపలి వైపు మంటలు విస్తరించలేదని అధికారులు పేర్కొన్నారు. -
గౌతం పోజిచ్చి.. మహేశ్ క్లిక్ చేస్తే.. ఖలీఫా అదృశ్యం!
నిజమే మన హీరోలకు సినిమాల్లో ఏదైనా సాధ్యమే. వారు తలుచుకుంటే ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైనా బూర్జు ఖలీపానైనా కనపించకుండా కనుమరుగు చేయగలరు. కానీ నిజజీవితంలోనూ అలాంటి రేరెస్ట్ ఫీట్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, ఆయన తనయుడు గౌతం ఆల్మోస్ట్ సాధించారు! విషయమేమిటంటే షూటింగ్‌లతో బిజీగా ఉన్న మహేశ్‌బాబు కాస్తా తీరిక చేసుకొని.. కుటుంబంతో కలిసి దుబాయ్ విహారానికి వెళ్లారు. దుబాయ్ ఆయన ఫేవరెట్ హాలీడే స్పాట్. ప్రస్తుతం అక్కడ ఎంజాయ్ చేస్తున్న మహేశ్‌బాబు ఓ అరుదైన ఫొటోను తన అభిమానులతో ట్వీట్టర్లో పంచుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణమైన బూర్జు ఖలీఫా వాతావరణ ప్రభావంతో మేఘాలలో కలిసిపోగా.. దాని ఎదురుగా గౌతం పోజును మహేశ్ ఫొటోలో బంధించారు. ఆ ఫొటోను ట్విట్టర్లో పెట్టి.. 'అరుదైన దృశ్యం. బూర్జు ఖలీఫా మేఘాలలో అదృశ్యమైంది. అవాస్తవిక వాతావరణం దుబాయ్‌లో ఇది. లవ్ ఇట్' అంటూ ఆయన పంచుకున్నారు. అన్నట్టు మహేశ్‌బాబు తాజా సినిమా 'బ్రహోత్సవం' టీజర్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదల కానుంది. A rare sight ..The Burj Khalifa disappears into the clouds ..unreal weather in Dubai .love it. pic.twitter.com/dRhTkIi0rr — Mahesh Babu (@urstrulyMahesh) December 26, 2015 -
బుర్జ్ ఖలీఫాను మించేలా చత్రపతి టవర్!
ముంబయి: దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలిఫాలాంటి నిర్మాణాన్ని అంతకంటే ఎత్తులో ముంబయిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠ వీరుడు చత్రపతి శివాజీకి గుర్తుగా దానిని నిర్మించాలని ఉందన్నారు. అయితే, ఇది అధికారిక ప్రకటన కాదని కేవలం తన మనసులో మాట అని మాత్రమే చెప్పారు. ప్రపంచంలో ఎత్తయిన బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తయిన భవనం ముంబయి సముద్ర తీరంలో ఉండాలని, దానిని చత్రపతి శివాజీ టవర్ అని పిలిస్తే చూడాలనేది తన కోరిక అని అన్నారు. అందులో 30 ఫ్లోర్స్ కేవలం సమావేశాలకోసమే ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరో 30 ఫ్లోర్లు రెస్టారెంట్లు, మరో 30 హోటల్స్, 20 షాపింగ్ మాల్స్, మరెన్నో ఫ్లోర్స్ పార్కింగ్ కు ఉండాలని చెప్పారు. బుర్జ్ ఖలీపా ప్రపంచంలోనే 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా ఉంది. -
ఆకాశం అంచులు చూద్దాం
హుస్సేన్‌సాగర్ చుట్టూ రానున్న టవర్లు సింగపూర్, దుబాయ్, షాంఘై నిర్మాణాల పరిశీలన కసరత్తు ప్రారంభించిన జీహెచ్ఎంసీ ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్‌కు చోటు! పట్టుదలతో ఉన్న రాష్ట్ర సర్కార్ ఈ భవంతిని చూశారా... ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా. దుబాయ్(యూఏఈ) లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717అడుగులు). దీనిలో 163 అంతస్తులున్నాయి. ఎక్కడో దుబాయ్‌లో ఉన్న భవనం ప్రస్తావన ఇప్పుడెందుకూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఇలాంటి సుందర భవనాలు మన గ్రేటర్ నగరంలో త్వరలో కనువిందు చేయనున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తథాగతుని సాక్షిగా... విద్యుల్లతల మధ్య ఠీవీగా దర్శనమిచ్చే ఇలాంటి భవంతులను చూసిన వారు ఆనందాశ్చర్యాలకు గురయ్యేలా నిర్మించాలనేది ప్రభుత్వ యోచన. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించే పనిలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన దేశం...మన నగరంలో ఉన్న బహుళ అంతస్తులభవంతుల విశిష్టతలు తెలుసుకుందాం. ఆకాశహర్మ్యాలకు అనువైన ప్రదేశాలను జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటి నిర్మాణాలకు గాను నిబంధనలు, ప్రతిబంధకాలు, అనుమతులపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు అనుమతి పొందాల్సి ఉండడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. సాగర్‌కు సమీపంలో 18 మీటర్ల కన్నా ఎత్తయిన భవంతులు నిర్మించాలంటే ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తప్పనిసరి. నిర్మాణ సమయంలో సెట్బ్యాక్లు, రహదారి వెడల్పు తదితర నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం ఒకింత ఊరట. ఆకాశహర్మ్యాలు ఇక్కడే... టవర్ల నిర్మాణానికి లోయర్ ట్యాంక్‌బండ్, బీఆర్కే భవన్, పాటిగడ్డ తదితర ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం స్థానే బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ భవనాలకు డిజైన్, డ్రాయింగ్, ఆర్కిటెక్చర్ రూపొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోనున్నారు. విశ్వనగరం బాటలో... షాంఘై, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ తదితర దేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా సాగర అందాలు వీక్షించేలా అధునాతన టవర్స్ నిర్మించాలన్న సర్కార్ ఆలోచన బాగానే ఉన్నా... వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం వేల కోట్లపైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫా వంటి భవంతిని మన నగరంలో నిర్మించాలంటే సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందా? లేక పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటి నిర్మాణాన్ని చేపడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. షాంఘై టవర్స్.. చైనాలోని షాంఘై నగరంలో ఉందీ టవర్. దీని ఎత్తు 632 మీటర్లు (2,073 అడుగులు). ప్రపంచంలో రెండో ఎత్తయిన భవంతిగా పేరొందింది. నిర్మాణ వ్యయం 4.2 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ భవంతిలో 121 అంతస్తులున్నాయి. హైదరాబాద్ నగరంలో.. లోధాబెలీజా1: దక్షిణ భారత దేశంలో ఎత్తయిన కట్టడంగా పేరొందిన లోథాబెలీజా టవర్స్ మన నగరంలోనే ఉంది. కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌కు వెనకవైపున ఉన్న ఈ భవంతి ఎత్తు 140 మీటర్లు(459 అడుగులు). ఇందులో 42 అంతస్తులున్నాయి. కాగా గ్రేటర్ నగరంలో 20 అంతస్తులు ఆపైబడిన భవంతులు సుమారు 50 వరకు ఉన్నాయి. మరో వంద వరకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉండడం విశేషం. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా టవర్ దుబాయ్ (యూఏఇ)లో ఉంది. దీని ఎత్తు భూమట్టం నుంచి 828 మీటర్లు (2,717 అడుగులు). ఈ భవంతిలో 163 అంతస్తులుండడం విశేషం. దీని నిర్మాణాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ 2010లో పూర్తి చేసింది. నిర్మాణానికి 150 కోట్ల అమెరికా డాలర్లు (రూ.9వేల కోట్లు) ఖర్చు చేశారు. 900 నివాసాలు, 37 కార్యాలయ అంతస్తులు, 160 అతిథి గదులున్న ఆర్మనీ హోటల్, 144 ప్రైవేటు నివాసాలు, క్లబ్‌లు, రూఫ్‌గార్డెన్‌లు, ఫిట్నెస్ క్లబ్‌లు ఈ భవంతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మన దేశంలో.. మన దేశంలోనే ఎత్తయిన భవంతిగా పేరొందిన ఇంపీరియల్ టవర్-1 ముంబై దక్షిణ ప్రాంతంలో ఉంది. 120 అంతస్తుల భవంతి. ఫ్లోర్ ఏరియా 1.30 లక్షల చదరపు అడుగులు.ఎత్తు 254 మీటర్లు(833 అడుగులు).