ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు.
దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు.
స్మిత్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్‌ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు.
ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక!
Comments
Please login to add a commentAdd a comment