mountain
-
ఒత్తిడి వేధిస్తోంటే.. అద్భుతమైన ఆసనం ఇదే!
పర్వతాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని మౌంటెయిన్ పోజ్ అంటారు. పిల్లలు,పెద్దలు ఎవరైనా ఈ ఆసనాన్ని సులువుగా సాధన చేయవచ్చు. ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు పాదాలను దగ్గరగా ఉంచి, నిటారుగా నిల్చోవాలి. భుజాలు వంచకుండా, చేతులను నేలవైపుకు చాచాలి. రెండు నుంచి ఐదు శ్వాసలు తీసుకొని, వదులుతూ ఉండాలి. తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి, చేతులను తల మీదుగా తీసుకెళ్లి, ఒక చేతివేళ్లతో మరొక చేతివేళ్లను పట్టుకోవాలి. శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసక్రియ కొనసాగించాలి. శరీర కండరాలను బిగుతుగా ఉంచాలి. ఆ తర్వాత భుజాల నుంచి చేతులను పైకి లేపాలి. అరచేతులు రెండూ ఆకాశంవైపు చూస్తూ ఉండాలి.ఈ విధంగా చేసే సమయంలో కాలి మునివేళ్ల మీద నిలబడుతూ, శరీరాన్ని పైకి లేపాలి. కొద్దిసేపు అలాగే ఉండి, తిరిగి యథాస్థానంలోకి రావాలి. ∙తర్వాత కాళ్లను ఒకదానికొకటి దూరంగా ఉంచుతూ, చేతులను కిందకు దించి, విశ్రాంత స్థితికి రావాలి. తాడాసనం సాధన చేయడం జాయింట్స్‌పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లల చేత చేయిస్తే వారి ఎదుగుదలకు అమోఘంగా పనిచేస్తుంది. – జి.అనూషారాకేష్, యోగా గురుసమస్థితికి మౌంటెయిన్ -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
కిరాక్ క్లైంబింగ్.. గోడల నుంచీ కొండగుట్టల దాకా ఎక్కేసెయ్..!
సాక్షి, సిటీబ్యూరో: చెట్టులెక్కగలరా ఓ నరహరి పుట్టలెక్కగలరా.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలరా.. ఓ నరహరి చిగురు కోయగలరా.. చెట్టులెక్కగలమే ఓ చెంచిత పుట్టలెక్కగలమే.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలమే. ఓ చెంచిత బ్రమలు తీయగలమే.. అని అలనాటి చిత్ర కథానాయకుడు ఏఎన్ఆర్ పాడిన పాట ఎంతో పాపులర్.. ఆ మాదిరిగానే.. నేడు నగరంలో చెట్లు పుట్టలు ఎక్కడం సర్వసాధారణ ట్రెండ్‌గా మారుతోంది.. అయితే గుట్టలు, పుట్టలు, చెట్లు ఎక్కడం పల్లెల్లో సర్వసాధారణం..కానీ నగరంలో నాల్గు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడడం ఇక్కడి ప్రజల నైజం. అయితే కొందరు నగరవాసులు మాత్రం గోడలు, గుట్టలు కూడా చకచకా ఎక్కేస్తున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే సరదా క్రీడగా క్లైంబింగ్ హాబీ దినదిన ప్రవర్ధమానమవుతోంది.సూచనలు..– క్లైంబింగ్ చేయడానికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి.– స్పోర్ట్స్ డ్రెస్సింగ్ కావాలి. అలాగే ప్రత్యేకమైన షూస్ తప్పనిసరి.– ఇందులో ఒకరికొకరు మంచి సపోరి్టంగ్గా ఉండాలి. ఎక్కే సమయంలో పడిపోవడం వంటివి ఉంటాయి.– అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలి.– అవుట్‌డోర్‌లో ప్రాథమిక దశలో చేసినప్పటికీ... రెగ్యులర్ క్లైంబర్‌గా మారాలంటే ఇన్డోర్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం.క్లైంబింగ్ అనేది ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. అయితే ఇటీవలి కాలంలో నగరంలో దీన్ని ఒక మంచి ఎనర్జిటిక్ ఎంజాయ్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. ఇలా ఫన్గానూ ఫిట్నెస్ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం పలు చోట్ల వాల్స్ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్స్, అడ్వెంచర్ జోన్స్‌లో అన్నింటితో పాటు క్లైంబింగ్ ప్రదేశాలు కూడా ఉండగా, కేవలం క్లైంబింగ్ కోసమే కొన్ని ప్రత్యేకమైన సెంటర్లు, హాబీగా చేసే క్లబ్స్ కూడా వచ్చేశాయి. ఈ అభిరుచి వాల్స్ నుంచి రాక్స్ దాకా విస్తరించి సిటీయూత్‌కి చక్కని వ్యాపకంగా మారిపోయింది.క్లైంబింగ్ కథా కమామీషు ఇలా.. క్లైంబింగ్ వాల్ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30–40 అడుగుల ఎత్తుపైన ఉంటుంది. సరిపడా ఆత్మవిశ్వాసం ఉండి, భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్ చేయగలరు. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి. ఈ రెండూ కాకుండా వేగం ప్రధానంగా సాగే ఈ స్పీడ్ క్లైంబింగ్ చాలా వరకూ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎంచుకుంటారు. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. ఎంత స్పీడ్ ఉంటుందంటే చూడడానికి నేల మీద పరుగులు తీసినట్టు ఉంటుంది.పర్సనల్‌గా.. ఇంట్లోనే..వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరి్టఫీషియల్ వాల్ని ఫైబర్‌తో చేసి సపోర్ట్ స్ట్రక్చర్ సాలిడ్ వుడ్, లేదా స్టీల్ ఉంటుంది. అయితే వుడ్ ఖరీదు ఎక్కువ కాబట్టి.. స్టీల్ బెటర్. క్లైంబింగ్ సర్ఫేస్‌గా ప్లైవుడ్ లేదా ఫైబర్ గ్లాస్ గాని వాడి చేసే 8 విడ్త్ 12 ఫీట్ హైట్ వాల్కి రూ.లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24 ఫీట్ వాల్కి అయితే రూ.4 లక్షలు వరకూ అవుతుంది.ఎక్కేయాలంటే.. లుక్కేయాలి..నగరం ఒకప్పుడు రాక్స్‌కి నిలయం.. అద్భుతమైన రాళ్ల గుట్టలు, కొండ గుట్టలు మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండేవి. అభివృద్ధి బారిన పడి చాలా వరకూ కనుమరుగయ్యాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాజాగూడ, మహేంద్రా హిల్స్, ఘర్ ఎ మొబారక్, అడ్డకల్, మర్రిగూడెం, పాండవుల గుట్ట, భువనగిరి లతో పాటు కర్నూలు దాకా వెళ్లి ఓర్వకల్ రాక్ గార్డెన్స్‌లో సైతం క్లైంబింగ్ చేస్తున్నారు. ఫన్ ప్లస్ ఫిట్నెస్..లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు ఈ క్రీడను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే కావడంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. దీంతో జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ వాల్స్ కొలువుదీరుతున్నాయి. గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని, ఒక గంటలో చేసే పరుగు అరగంట పాటు చేసే క్లైంబింగ్‌తో సమానమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక శరీరంలో టాప్ టూ బాటమ్ అన్ని అవయవాలనూ ఇది బలోపేతం చేస్తుందని అంటున్నారు. వయసుకు అతీతంగా దీన్ని సాధన చేయవచ్చు. హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ బాగా నప్పే హాబీగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నలుగురితో కలిసి చేసే గ్రూప్ యాక్టివిటీ కాబట్టి అలసట ఎక్కువగా రాదు. శరీరానికి బ్యాలెన్సింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కోర్ మజిల్స్ శక్తివంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్ టోనప్ అవుతాయి.కొండకు తాడేసి..వీకెండ్ క్లైంబింగ్ ఈవెంట్స్ జరగడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. నగరంలో హైదరాబాద్ క్లైంబర్స్ పేరుతో ఒక క్లబ్ కూడా ఏర్పాటైంది. ఈ క్లబ్ సభ్యులు ప్రతి వారం ఒక రాక్ ఏరియాను ఎంచుకుని క్లైంబింగ్‌కి సై అంటున్నారు. అయితే ఇక్కడ కూడా నిపుణుల ఆధ్వర్యంలోనే రోప్‌ల బిగింపు తదితర ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. చాలా మంది అవుట్డోర్ క్లైంబింగ్ తర్వాత అది సీరియస్ హాబీగా మారిన తర్వాత ఇన్డోర్ క్లైంబింగ్‌కు మళ్లుతున్నారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. మంచి వ్యాయామంగా..25 నుంచి 40 మధ్య వయస్కులు వస్తున్నారు. ఫిట్‌నెస్‌లో వెరైటీని కోరుకునేవారూ దీన్ని ఎంచుకుంటున్నారు మా దగ్గర 40 వరకూ రూట్స్ ఉన్నాయి. వీటిలో తేలికగా చేసేవి కష్టంగా చేసేవి.. ఇలా ఉంటాయి. చాలా మంది హాబీగా చేస్తుంటే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నవారూ పెరుగుతున్నారు. వారానికో రోజు అవుట్‌డోర్‌లో న్యాచురల్ రాక్స్ దగ్గర చేయిస్తున్నాం. – రంగారావు, క్లైంబింగ్ శిక్షకులుఈవెంట్స్ నిర్వహిస్తున్నా..కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ ప్రారంభించి ఇప్పుడు దీంతో కనెక్ట్ అయ్యాను. వారాంతాల్లో క్లైంబింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నా. సాహసక్రీడలపైన ఆసక్తి ఉంటేనే దీన్ని ఎంచుకోవాలి. – చాణక్య నాని, క్లైంబర్‘గ్రీస్’లో రాక్ క్లైంబింగ్‌కు వెళ్తున్నాం..గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ద్వారా 12 సంవత్సరాల క్రితం క్లైంబింగ్ పరిచయమైంది..ఆ తర్వాత రాక్ క్లైంబింగ్ ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ క్లైంబర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఇన్‌స్టాలో మా గ్రూప్‌కి 2500 మంది సభ్యులున్నారు. వీరిలో కనీసం 200 మంది గ్రూప్ యాక్టివిటీలో పాల్గొంటుంటారు. వరంగల్‌లో ఉన్న పాండవుల గుట్ట నగరానికి 2 గంటల ప్రయాణ దూరంలోని అడక్కల్ వంటి ప్రదేశాల్లోనే కాక రాష్ట్రం దాటి మనాలి, కర్ణాటకలోని హంపి, బాదామి వంటి ప్రాంతాలతో పాటుగా ఇతర దేశాలైన వియత్నాం, ఇండోనేషియాలో కూడా క్లైంబింగ్ ఈవెంట్స్ చేశాం. త్వరలోనే మన దేశం నుంచి గతంలో ఎవరూ వెళ్లని స్థాయిలో అతిపెద్ద గ్రూప్‌గా గ్రీస్‌కి ఈ డిసెంబర్లో క్లైంబింగ్ యాక్టివిటీ చేపట్టనున్నాం. – రేణుక, హైదరాబాద్ క్లైంబర్స్ -
ఆడి ఇటలీ అధినేత కన్నుమూత.. 10వేల అడుగుల ఎత్తునుంచి కిందపడి
ఆడి ఇటలీ అధినేత 'ఫాబ్రిజియో లాంగో' (Fabrizio Longo) ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు.ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. పర్వతాలను ఎక్కే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదం జరిగింది. తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు, వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్ రిట్రీవల్ బృందం తదుపరి పరీక్ష కోసం అతని మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదం జరగటానికి కారణాలు ఏంటనే దిశగా విచారణ జరుగుతోంది.ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తరువాత 2002లో లాన్సియా బ్రాండ్‌కు నాయకత్వం వహించారు. 2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు. -
Hyderabad: కిలిమంజారో పర్వతం.. అధిరోహించిన ప్రీతం!
లక్డీకాపూల్: నగరం నుంచి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయసు్కలలో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 16 ఏళ్ల ఎన్సీసీ క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు. 8 రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల 17న చేరుకున్నారు. ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంతో కూడిన ప్రీతం గత నెల 12న యాత్ర చేపట్టాడు. మరింత ఎతైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన తపన అని ప్రీతం అన్నారు. ‘కిలిమంజారో నిటారుగా, కంకర, ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించింది. శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారత జాతీయ జెండా, ఎన్సీసీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేశా’అని అన్నారు. -
కొండ అంచుపై బెదరకుండా!
రోమ్: గతుకుల రోడ్లపై సైకిల్ సవారీ అంటే చాలా మంది భయపడిపోతారు. పడితే మోకాలి చిప్పలు పగలడం ఖాయమని అందరికీ తెలుసు. అలాంటిది అంతెత్తునుంచి పడితే భూమ్మీద నూకలు చెల్లిపోవడం ఖాయమని తెల్సి కూడా కొండ అంచుపై సైకిల్ తొక్కి ఈ సైక్లిస్ట్ తనకు భయం లేదని, సాహసమే తన ఊపిరి అని చాటాడు. ఇంత ఎత్తులో సైకిల్ తొక్కుతుంటే తొక్కే వారికే చెమటలు పడతాయిగానీ ఈ వీడియో చూసిన వారికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు. ధైర్యంగా, దిలాసాగా శిఖరాగ్రంపై సైకిల్ మీద దూసుకెళ్తున్న ఈ పర్వతారోహణ సైక్లిస్ట్ పేరు మాక్రో బసాట్. ఇటలీలోని ప్రఖ్యాత డోలమైట్ పర్వతాలపై తాను చేసిన సైకిల్ సవారీని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్చేశాడు. ‘‘తప్పులకు తావు లేదు. ఆనందంతో నా హృదయం జ్వలిస్తోంది. ఆనంద అడ్రినలిన్ హార్మోన్‌తో మైమరిచిపోయా. ఇలా చేయడం నాకెంతో ఇష్టం’అంటూ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశాడు. వీడియో చూస్తున్నంతసేపు ‘‘అరెరే.. పట్టుతప్పి పడిపోతాడేమో’’అని మనసులో అనుకోవడం ఖాయం. View this post on Instagram A post shared by Marco Bassot (@marcobassot) ఈ వీడియోను ఆన్లైన్లో ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించడం విశేషం. ఈయనను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టారు. ‘‘వీడియో చూసిన ఐదు సార్లూ షాక్‌కు గురయ్యా’, ‘చావంటే ఇతనికి భయం లేదనుకుంటా. చావుకు కూడా ఇతనంటే భయమేమో. అందుకే అది ఇతని దరి చేరట్లేదు’, ‘ఇదైతే కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో కాదుకదా!’, ‘వీడియో చూస్తున్నంతసేపు నా బీపీ పోటెత్తింది’, ‘51 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిని వదిలేసి తమ్ముడు స్వర్గంలో విహారానికి బయల్దేరాడు’, ‘మాటల్లేవ్’అంటూ ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు. -
అసాధ్యం కాస్త సుసాధ్యం.. ముచు ఛిష్‌ను జయించారు
ఢిల్లీ: ఈ భూమ్మీద మనిషి ఇప్పటికీ అధిరోహించని పర్వతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటిగా మన పొరుగున పాకిస్తాన్‌లోని ముచు ఛిష్ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు దానిని కూడా జయించేశారు.తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువైంది. కారకోరం రేంజ్‌లోని 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తైన ముచు ఛిష్ పర్వతాన్ని ఎట్టకేలకు అధిరోహించారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం.. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ ఘనత సాధించింది. డెనెక్ హక్, రాడోస్లావ్ గ్రోహ్, జరోస్లావ్ బాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు.గతంలో ఎందరో పర్వతాహరోహకులు దీనిని అధిరోహించే ప్రయత్నంలో భంగపడ్డారు. కిందటి ఏడాది ఓ బృందం.. 7,200 మీటర్ల దాకా వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కి తిరిగి వచ్చేసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన పర్వతారోహకులు.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. అయితే ఈసారి అదే దేశానికే చెందిన బృందం ఒకటి ఎట్టకేలకు ఆ ఘనత సాధించింది. -
22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెదరని స్థితిలో మృతదేహం!
22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫ్ల్గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు). ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. -
గడ్డకట్టే చలిలో మెడిటేషన్ చేస్తున్న యోగి! వీడియో వైరల్
హిమాలయాల్లో చలి ఎలా ఉంటుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చలికి తగ్గా బట్టలు కొన్ని రక్షణ పద్ధతలు పాటించకపోతే అంతే సంగతులు. అలాంటిది ఓ వ్యక్తి గడ్డకట్టే మంచులో హాయిగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఓ పక్కన మంచు కురుస్తుంది. అయినా అవేమి పట్టనట్లు చాలా ప్రశాంతంగా యోగి పుంగవుడిలా మెడిటేషన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అతన ఆహార్యం సైతం యోగిశ్వరుడిలానే ఉంది. మన పురాణాల్లో కొందరు యోగులు, సిద్ధులు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారని విన్నాం కానీ చూడలేదు. కానీ ఈ యోగి దర్శనంతో అది నిజం అనేందుకు ఈ ఘటన బలం చేకూర్చింది. 'వాల్మికి మహర్షి' కావడానికి ముందు బోయవాడని తెలుసు కదా!. ఆ తర్వాత ఆయన రామ్.. రామ్ అంటూ వేలయేళ్లు తపస్సు చేసి వాల్మికి మహర్షి అయ్యాడు. ఎందుకంటే అన్నేళ్లు తపస్సు చేస్తున్నప్పుడూ ఆయన చుట్టు పుట్టలు కట్టాయి. తపస్సు పూర్తి చేసుకుని పుట్ట(వల్మీకం) నుంచి బటయకు వచ్చాడు కాబట్టి ఆయన్ను వాల్మీకి మహర్షి అన్నారు. మరీ ఇలా మంచులో తపస్సు చేస్తూ... అతని చూట్టూ మంచులా గడ్డకట్టుకుపోతున్న ఈ వ్యక్తిని హిమ మహర్షి అని పిలుస్తారో ఏమో గానీ చూడటానికి ప్రశాంత వదనంతో ఉన్న గొప్ప యోగిలా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Piyush Goyal (@goyalpp) (చదవండి: తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!) -
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్‌ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
ఫ్రిజర్‌లో మంచుకొండలా ఐస్ పేరుకుపోతుందా?
ఫ్రీజర్‌లో చిన్నచిన్న మంచుకొండలా ఐస్ పేరుకుపోతుంది. ఇలా గడ్డకట్టిన ఐస్పైన కొన్ని ఆహార పదార్థాలు పెడితే పాడవుతాయి. ఐస్ ఒకపట్టాన కరగదు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్య తీరిపోతుంది. కొండలా ఉన్న మంచు మాయం కావాలంటే.. 👉: రిఫ్రిజిరేటర్ పవర్ స్విచ్ ఆపేసి గడ్డకట్టిన ఐస్‌ను కరిగించాలి. 👉: ఇప్పుడు బంగాళదుంపను శుభ్రంగా కడిగి రెండు ముక్కలు చేయాలి. రెండు ముక్కలతో ఫ్రీజర్ ర్యాక్స్‌ను రుద్దాలి. మూలల్లో కూడా జాగ్రత్తగా రుద్దాలి. ఇలా చేస్తే ఫ్రీజర్‌లో త్వరగా మంచు ఉండలు ఏర్పడవు. 👉: అవసరాన్ని బట్టి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను మార్చుకుంటూ ఉంటే ఐస్ ఏర్పడదు. 👉: ఫ్రీజర్‌లో అతిగా ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఎక్కువ మొత్తంలో వస్తువులు పెడితే ఐస్ ఏర్పడడానికి ఖాళీ ఉండదని కుక్కేస్తుంటారు. ఫ్రీజర్‌లో ఎంత ఎక్కువమొత్తంలో వస్తువులు ఉంటే అంత ఎక్కువ తేమ ఏర్పడి ఐస్‌గా మారుతుంది. 👉: చాలామంది ఇంటిని శుభ్రం చేస్తుంటారు కానీ రిఫ్రిజిరేటర్‌ను పెద్దగా పట్టించుకోరు. కనీసం పదిరోజులకొకసారి స్విచ్ ఆపేసి, లోపల ఉన్న పదార్థాలను బయటపెట్టి శుభ్రం చేస్తే ఐస్ సమస్య అంతగా ఉండదు. గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... 👉: అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. ∙అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ∙ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. ∙పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ∙ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ∙ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గిపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!) -
సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!
మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్కోర్ట్ కుటుంబం నివశిస్తుంది. వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు. సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా! అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా..
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక విషయాల్లో విభిన్నత కనిపిస్తుంది. జనం వివిధ నగరాల్లో కనిపించే వైవిధ్యానికి ఆకర్షితులవుతుంటారు. కొన్ని అంశాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిలో సముద్రాలు, పర్వతాలు, జలపాతాలు, నదులు మొదలైనవాటికి మనం ఎంతో ప్రాధాన్యతనిస్తుంటాం. అయితే వీటన్నింటి మధ్య ఒక పర్వతంపై ఏకంగా 900 ఆలయాలు ఉన్న విషయం మీకు తెలుసా? ఈ పర్వతం భారతదేశంలోనే ఉంది. ఇది భక్తుల నమ్మకాలకు ప్రతీకగా నిలిచింది. దేశంలో అత్యధిక ఆలయాలు కలిగిన పర్వతం ఇదేకావడం విశేషం. ఈ అద్భుత పర్వతం ఎక్కడుంది? దీనివెనుకగల చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మహాపర్వతంపేరు ‘శత్రుంజయ పర్వతం’. ఇది పాలీతానా శత్రుంజయ నది ఒడ్డున ఉంది. ఈ పర్వతంపై సుమారు 900 ఆలయాలు ఉన్నాయి. ఇన్ని ఆలయాలు ఉన్నకారణంగానే ఈ పర్వతం భక్తులకు ఆలవాలంగా మారింది. ప్రతీయేటా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ అద్భుత పర్వతం మనేదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది భావ్‌నగర్ జ్లిలాకు వెలుపలు భావ్‌నగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పర్వతంపై జైన తీర్థంకరుడు భగవాన్ రుషబ్‌దేవ్ ధ్యానం చేశాడని చెబుతారు. ఆయన ఇక్కడే తన తొలి ఉపదేశాన్ని ప్రవచించారట. ఈ పర్వతంపై గల ప్రధాన ఆలయం అత్యంత ఎత్తున ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 3 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 24 తీర్థంకరులలోని 23 మంది తీర్థంకరులు ఈ పర్వతాన్ని సందర్శించారు. ఈ కారణంగా ఈ పర్వతానికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు. పాలరాతి నిర్మాణాలు.. పర్వతంపై నిర్మితమైన ఆలయాలన్నీ పాలరాతితో నిర్మితమయ్యాయి. ఈ ఆలయాల నిర్మాణం 11వ శతాబ్ధంలో జరిగింది. ఈ ఆలయాలలో పలు కళాకృతులు కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడినంతనే ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతుంటుంది. అలాగే చంద్రుని వెలుగులోనూ ఆలయాలు తళుకులీనుతాయి. ఏకైక శాకాహార నగరంలో.. ప్రపంచంలోని ఏకైక శాకాహార నగరంగా గుర్తింపు పొందిన పాలీతానాలో ఈ పర్వతం ఉంది. ఈ నగరం శాకాహారులకు చెందినదిగా పేరు గడించింది. ఇక్కడివారెవరూ మాసం ముట్టరు. ఈ లక్షణమే ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? -
ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు!
జాగ్రత్తగా చూస్తే ఈ ఫొటోలో కొండశిఖరంపై ఒక కట్టడం కనిపిస్తోంది కదూ! కొండశిఖరంపై వెలసిన ఈ కట్టడం ఒక చర్చి. కొండశిఖరంపైకి ఎక్కి దీనిని చేరుకోవడానికి లోహపు నిచ్చెన మెట్లదారి మాత్రమే దిక్కు. ఇది జార్జియాలో ఉంది. ‘కాటస్కీ పిల్లర్’గా ప్రసిద్ధి పొందింది. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎలాంటి ఆధారాలు లేవు. తొలిసారిగా పద్దెనిమిదో శతాబ్దిలో జార్జియన్ ప్రిన్స్ వాఖుస్తి తన పుస్తకంలో ఈ నిర్మాణం గురించి ప్రస్తావించాడు. తర్వాత 1944లో అలెగ్జాండర్ జాపారిడ్జ్ అనే పర్వతారోహకుడు తన బృందంతో కలసి ఈ కట్టడాన్ని సందర్శించాడు. చాలాకాలంగా దీనిని ఎవరూ ఉపయోగించకుండా విడిచిపెట్టేశారు. అయితే, 1999 నుంచి వివిధ దేశాలకు చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. దీని నిర్మాణ శైలిని బట్టి, ఈ చర్చిని పదమూడో శతాబ్దిలో నిర్మించి ఉంటారని వారి అంచనా. -
విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెపలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్ 7వ తేదీన యూరప్‌లోని ఎల్బ్రోస్ పర్వతాలను ఎక్కారు. -
Mali mountain forest: వాళ్లు అడవిని సృష్టించారు
కోరాపుట్ (ఒడిశా): అది ఒడిశాలోని మారుమూల కోరాపూట్ జిల్లా. అందులో మరింత మారుమూలన ఉండే గిరిజన గ్రామం. పేరు ఆంచల. 1990ల నాటి సంగతి. వంట చెరుకు కోసమని, ఇతర అవసరాలకని ఊరి పక్కనున్న పవిత్ర ‘మాలీ పర్వతం’ మీది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తూ పోయారు. ఫలితం...? చూస్తుండగానే పచ్చదనం జాడలనేవే లేకుండా గుట్ట పూర్తిగా బోసిపోయింది. జరిగిన నష్టాన్ని గుర్తించేలోపే మరుభూమిగా మారింది. దాని పై నుంచి వచ్చే అందమైన సెలయేటి ధార కూడా శాశ్వతంగా ఆగిపోయింది. దాంతో అడవి బిడ్డలైన ఆ గిరిజనులు తల్లడిల్లారు. ముందుగా మహిళలే కళ్లు తెరిచారు. చిట్టడవికి తిరిగి జీవం పోసి పవిత్ర పర్వతానికి పూర్వపు కళ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 30 ఏళ్లు అకుంఠిత దీక్షతో శ్రమించారు. తమకు ప్రాణప్రదమైన అడవికి పునఃసృష్టి చేసి నారీ శక్తిని మరోసారి చాటారు. ఫలితంగా నేడు కొండమీది 250 ఎకరాల్లోనే గాక ఊరి చుట్టూ పచ్చదనం దట్టంగా పరుచుకుని కనువిందు చేస్తోంది. ఒక్కతాటిపై నిలిచి... అయితే ఈ బృహత్కార్యం చెప్పినంత సులువుగా ఏమీ జరగలేదు. ఇందుకోసం గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి కష్టపడ్డారు. మొదట్లో మూణ్నాలుగు కుటుంబాలు ఒకేచోట వండుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా వంట కోసం కట్టెలపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటూ వచ్చారు. సేంద్రియ సాగుకు మళ్లారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకున్నారు. అంతేగాక చెట్లను నరికే వారికి రూ.500 జరిమానా విధించారు. ముక్కు పిండి మరీ వసూలు చేయడమే గాక నలుగురిలో నిలబెట్టి నలుగు పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారు. చెట్లు నరికేందుకు దొంగతనంగా ఎవరూ కొండపైకి వెళ్లకుండా ఒక కుటుంబాన్ని కాపలాగా పెట్టారు. వారికి జీతమిచ్చేందుకు డబ్బుల్లేకపోవడంతో ఊరంతా కలిసి వారికి 10 కిలోల రాగులిస్తూ వచ్చామని సుపర్ణ అనే గ్రామస్తురాలు గుర్తు చేసుకుంది. ఈ ఉద్యమం మొదలైన రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో నవ వధువుగా తాను ఊళ్లో అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది. ‘‘మా శ్రమ ఫలించి మేం నాటిన చెట్లు చిగురించడం మొదలు పెట్టినప్పటి మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’’ అని చెబుతూ సవిత అనే మరో గ్రామస్తురాలు సంబరపడిపోయింది. కొసమెరుపు 30 ఏళ్ల కింద మూగబోయిన జలధార కూడా మహిళల మొక్కవోని ప్రయత్న ఫలితంగా మళ్లీ ప్రాణం పోసుకుంది. కొండ మీది నుంచి జలజలా పారుతూ ఒకప్పట్లా కనువిందు చేస్తోంది! (క్లిక్: లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!) -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?) -
రష్యా అగ్ని పర్వతంపై మెరిసిన త్రివర్ణం
మరిపెడరూరల్/ముషీరాబాద్: గిరిజన సాహసికుడు యశ్వంత్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. పర్వత శ్రేణిపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన భూక్య రాంమ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్‌కు చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఇష్టం. గతేడాది జూన్‌లో జమ్మూకశ్మీర్‌లోని 5,602 మీటర్ల ఎత్తయిన ఖార్డుంగ్లా పర్వతాన్ని, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జూన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తయిన యునామ్ మంచు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ క్రమంలో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు యశ్వంత్‌ను రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతారోహణకు ఎంపిక చేశారు. యశ్వంత్ 5,642 మీటర్ల ఎత్తయిన ఈ అగ్ని పర్వతాన్ని ఇటీవలే అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. -
అసలు పేరు ‘నగ్న పర్వతం’.. కానీ పర్యాటకులు మరోలా పిలుస్తారు!
కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో అంతే భయాన్నీ క్రియేట్ చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. పాకిస్తాన్‌లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది. ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). నంగా పర్బత్ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. 1953లో హెర్మన్ బుహ్ల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరూ వచ్చింది. ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్‌ను మోస్ట్ డేంజరెస్ అండ్ థ్రిల్లింగ్ టూర్ అంటారు పర్వత పర్యాటక ప్రియులు. -
ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం.. ఏది వైరల్!
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్టర్లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్‌గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి. అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్‌తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్‌లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU — Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022 ఇక ఇంటర్నెట్లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
20 మంది టీంలో ఐదుగురు చనిపోయారు.. అయినా..
సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్‌లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం.. ఎక్కడంటే !
కొరాపుట్(భువనేశ్వర్): పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవమాలి పర్వతం కొరాపుట్ జిల్లాకు మరింత వన్నె తెస్తోంది. పొట్టంగి సమితి కొఠియా సమీపంలోని ఈ పర్వతాన్ని చేరుకునేందుకు రోడ్డుమార్గం, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కుందిలి సంత నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తయిన ఈ శిఖరం ఉంది. సముద్ర మట్టానికి 1,762 మీటర్లు ఎత్తులో నిలిచిన ఈ పర్వతం, 1996 తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. 2018లో 29,350 మంది, 2019లో 29,950 మంది పర్యాటకులు సందర్శించినట్లు పర్యాటక విభాగం తెలిపింది. కరోనా కారణంగా 2020లో పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినా(9765 మంది), 2021లో ఇప్పటివరకు 14,688 మంది సందర్శించినట్లు పర్యాటక విభాగం అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య ) దినదిన ప్రవర్ధమానంగా.. సిమిలిగుడకి చెందిన సాహిద్ లక్ష్మణ్ నాయక్ యువజన సంస్థ నిర్వహించిన పర్వతారోహణతో దేవ్‌మాలి పర్వతం బాహ్య ప్రపంచానికి పరిచయమైంది. ప్రస్తుత భువనేశ్వర్ ఎంపీ అపరాజితా షడంగి.. కొరాపుట్ జిల్లా కలెక్టర్‌గా(2000సంవత్సరం) పనిచేసిన సమయంలో దేవ్‌మాలి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శిఖరానికి చేరుకొనేందుకు రహదారి నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఐదు టవర్లు నిర్మించారు. 2001లో కొరాపుట్ జిల్లా సాంస్కృతిక ఉత్సవం పరభ్ ఇక్కడే ప్రారంభమైంది. దీంతో పర్వతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. 2004–05లో దమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) ఈ పర్వతం అభివృద్ధికి రూ.35 లక్షలు మంజూరు చేసింది. పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, వ్యూ పాయింట్, త్రాగునీటి సదుపాయం, స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారు. ఆపై పర్యాటక విభాగం, అటవీ శాఖ, ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో దేవ్‌మాలి ప్రాంతం అభివృద్ధి చెందింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకులలో అధిక శాతం మంది దేవ్‌మాలిని సందర్శించడం విశేషం. అభివృద్ధికి మరిన్ని నిధులు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవ్‌మాలి పర్వతం అభివృద్ధికి డీపీఎం నుంచి రూ.1.25 కోట్లు, పర్యాటక విభాగం నుంచి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ అబ్దుల్ అక్తర్, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాడి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క దేవ్‌మాలిని సందర్శించి, పర్వతం అభివృద్ధికి నిధుల వినియోగింపై సమీక్షించారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పొట్టంగి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి, టికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయించారు. చదవండి: టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే.. -
షాకింగ్ వీడియో: సెకను వ్యవధిలో తప్పింది.. చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు!
నిన్నటి వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూట్టిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ఈ ఘటన కొన్ని నెలల కింద జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: Guinness World Record: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!
న్యూయర్క్: చాలా మంది ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అడవులు గుండా సుదీర్ఘ ప్రయాణం కాలినడకన(ట్రెక్కింగ్) చేస్తుంటారు. పైగా ఆ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎటువంటి ఆపదల ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో పయనమవుతారు. ఏదైనా సమస్య ఎదురైతే రెస్య్కూ సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటపడతారు. అయితే ఇలానే ఒక వ్యక్తి అమెరికాలోని కొలరాడోలోని మౌంట్ ఎల్బర్ట్ అనే పర్వతం గుండా సుదీర్ఘ ప్రయాణ నిమిత్తం ఉదయం 8 గంటలకు కాలినడకన పయనమయ్యాడు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ మేరకు అతను ఎంతసేపటికి రాకపోయేసరికి లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ (ఎల్సీఎస్ఏఆరర్) అతను గల్లంతైనట్లు గుర్తించి ఆ వ్యక్తి ఆచూకి నిమిత్తం ఐదుగురి రెస్కూ సిబందిని పంపించింది. ఈ క్రమలో ఆ సిబ్బంది అతని ఫోన్ కాల్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించటానికీ చూశారు. కానీ అతను గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తున్న కాల్స్‌ని రిసీవ్ చేసుకోకవపోవడంతో సిబ్బంది అతన్ని గాలించలేకపోయారు. దీంతో వారు వెనుకకు వచ్చి మరో ప్రాంతం గుండా గాలించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయమే తను బస చేస్తున్న హోటల్‌కి సురక్షితంగా రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైగా రెస్క్యూ టీమ్ తన కోసం వెతుకుతున్నట్లు అతనికి తెలియదు. దీంతో ఎల్సీఎస్ఏఆర్ దయచేసి ప్రయాణ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి గమ్యానికి తిరిగి చేరుకోలేనప్పుడు మీ ఆచూకి నిమిత్తం రెస్క్యూ బృందం వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోండి అని నొక్కి చెప్పింది. ఈ మేరకు దయచేసి పదేపదే తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్స్‌కి సమాధానం ఇవ్వండంటూ ప్రయాణికులకు లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!) -
ఎల్బ్రస్ శిఖరంపై సు'గంధం' పరిమళం
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల బాలుడు ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ప్రముఖ శిఖరం ఎల్బ్రస్ను అతి పిన్న వయసులోనే అధిరోహించిన తొలి భారతీయ బాలుడిగా రికార్డు సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి కుమారుడైన గంధం భువన్ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం (5,642 మీటర్లు)ను ఈ నెల 18వ తేదీన అధిరోహించి చరిత్ర సృష్టించాడు. అనంతపురానికి చెందిన కోచ్ శంకరయ్య, విశాఖపట్నానికి చెందిన పర్వాతారోహకుడు, అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్ భూపతిరాజు వర్మ, కర్ణాటక నుంచి నవీన్ మల్లేష్ బృందంతో కలిసి భువన్ సెప్టెంబర్ 11న రష్యాకు బయలుదేరాడు. ఈ నెల 12న టెర్స్‌కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం 13 వ తేదీన 3,500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18వ తేదీన 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకుని ఉదయం 8:00 గంటలకు (మాస్కో సమయం) మన జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందం ప్రస్తుతం పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ నెల 23న భారత్‌కు తిరిగి రానుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్ శిక్షణతోనే ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకులు అందించిన మెళకువల వల్లే తాను ఈ ఘనతను సాధించినట్టు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దేశంలో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలున్నారని, వారికి తగిన ప్రోత్సాహం, అవకాశం కల్పిస్తే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తారని స్పష్టం చేశాడు. అతి శీతల వాతావరణం సవాల్‌గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ తాను అనుకున్న విధంగా సాహసోపేతమైన యాత్రను ముగించినట్టు తెలిపాడు. -
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
-
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
సాక్షి, అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
ప్రాణం తీసిన నెట్వర్క్ సమస్య
భువనేశ్వర్: ఆన్లైన్ పాఠాలు వినేందుకు కొండ మీదకు వెళ్లిన విద్యార్థి తిరిగి కిందకు రాలేదు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి విద్యార్థి ప్రాణాలు విడిచిన ఘటన రాయగడ జిల్లా, పద్మపూర్ సమితి, పండరగుడలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పండగరగుడలో నివశిస్తున్న ఆంధ్రయ జగరంగ(13).. జగరంగ కటక్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా వీరికి కేవలం ఆన్లైన్లోనే పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో నెట్వర్క్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు జగరంగ కొండపైకి వెళ్లి, పాఠాలు వింటుంటారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆంధ్రయ కొండపైకి వెళ్లాడు. వానలు కురుస్తున్న కారణంగా ఆ దారంతా జారుడుగా ఉండడంతో ప్రమాదవశాత్తు అక్కడి కొండపై నుంచి కిందికి జారిపడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. ఈ విషయంపై తోటి విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతడిని వైద్యసేవల కోసం పద్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత వైద్యం కోసం అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కి తరలిస్తుండగా, మార్గం మధ్యంలో ఆ విద్యార్థి చనిపోయాడు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. -
బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం
కాంగో: కాంగోలోని బుకావుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కివూ ప్రావిన్స్‌లోని ఓ కుగ్రామం లుహిహి. అక్కడి ప్రజలు తట్టా, బుట్టా చేతికి ఏది దొరికితే అది పట్టుకొని పక్కనే ఉన్న కొండపైకి పరుగులు పెడుతున్నారు. ఏంటి మట్టి కోసం అనుకుంటున్నారా? కానేకాదు. బంగారం తవ్వుకొచ్చుకునేందుకు. మరి ఆ కొండ మామూలు కొండ కాదు. అచ్చంగా బంగారు కొండ. అసలు మట్టిని కూడా వదిలిపెట్టని మనజనం. ఇక బంగారం కొండ దొరికితే వదులుతారా? అదే జరిగింది ఇక్కడ కూడా. ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆ కుగ్రామంలో బంగారం గని బయటపడింది. ఆ కొండలోని 60 నుంచి 90 శాతం మట్టిలో బంగారం ఉన్నట్టు బయటపడింది. అంతే దీంతో అక్కడి ప్రజలు పలుగు పారలు పట్టుకొని కొండమీదికి చీమల దండులా పాకేశారు మట్టిలో దాగివున్న బంగారు ఖనిజం కోసం. పలుగూ పారా ఉంటే సరే, ఏదీ లేకపోతే చేతుల్తోనే మట్టిని తోడేస్తున్నారట అక్కడి జనం. పలువురు గని ఉన్న ప్రాంతంలోని మట్టిని సంచుల్లో నింపేసుకున్నారు. కొందరేమో వాటిని ఇళ్ళల్లో కుప్పలు పోసుకుంటే, మరికొంత మంది అంతదూరం ఈ బరువెందుకు మోయాలనుకున్నారో ఏమో, అక్కడే నీళ్ళు పెట్టుకుని మట్టిని కడిగేసి, బంగారాన్ని సంచుల్లో నింపుకుంటున్నారు. ఈ వీడియోని అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంత మంతా ఇసుక వేస్తే రాలనంత జనం వెల్లువెత్తడంతో పాలకులకు చేసేదేం లేక తవ్వకాలపై నిషేధం విధించాల్సి వచ్చింది. A video from the Republic of the Congo documents the biggest surprise for some villagers in this country, as an entire mountain filled with gold was discovered! They dig the soil inside the gold deposits and take them to their homes in order to wash the dirt& extract the gold. pic.twitter.com/i4UMq94cEh — Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021 -
లవ్ ప్రపోజ్.. ప్రేమ జంటకు చేదు అనుభవం
కాన్బెర్రా: సాధారణం ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను తెలుపడానికి ప్రేమికులంతా భిన్నంగా ఆలోచిస్తూ సాహసాలు చేస్తుంటారు. ఎందుకంటే తన ప్రేమ ప్రపోజల్ ఎదుటి వ్యక్తికి సర్ప్రైజింగ్తో పాటు, ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం ఉంచాలనుకుంటారు. అలా భిన్నంగా ప్రయత్నించిన ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి 650 ఎత్తైన కొండపై తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పిన అనంతరం కొద్ది క్షణాలకు ఆ మహిళ కొండపై నుంచి జారి కింద పడింది. అంత ఎత్తైన కొండపై నుంచి పడినప్పటికి ఆమె ప్రాణాలతో బయటపడిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి తను ప్రేమిస్తున్న 32 ఏళ్ల మహిళకు ప్రపోజ్ చేయడానికి కారింథియా కొండపైకి ట్రెక్కింగ్‌కు తీసుకేళ్లాడు. వారు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కిన అనంతరం అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను అంగీకరించిన ఆ మహిళ ఆకస్మాత్తుగా కొండపై నుంచి కాలు జారి కింద పడిపోయింది. కాగా అక్కడ అంతా మంచు ఉండటంతో సదరు మహిళ ఈ ఘోర ప్రమాదం నుంచి బతికి బట్టకట్టింది. అయితే ఆమె పడిపోతున్న సమయంలో ఆ యువకుడు ఆమె చేయి పట్టుకుని పైగి లాగే ప్రయత్నం చేస్తూ అతడు కూడా కింద పడిపోయాడు. ఈ క్రమంలో 50 అడుగుల వద్ద అతుడు ఓ కొండ అంచును సపోర్టు చేసుకుని కింద పడిపోకుండా గాల్లో వ్రేలాడాడు. ప్రమాదంలో ఉన్న ఈ జంటను గమనించిన బాటసారులు వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని రక్షించింది. అయితే ఆ వ్యక్తిని మాత్రం హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. సదరు పోలీసుల అధికారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మంచు లేకపోయింటే పరిస్థితి మరోలా ఉండేది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిచించాం. ఈ ప్రమాదంలో అమ్మాయికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అతడి కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో వైద్యులు చికిత్స చేసి కట్టుకట్టారు’ అని ఆయన పేర్కొన్నారు. -
డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాక్చమ్ కుగ్రామం
డాక్టర్ శిల్ప న్యూఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్ హాస్పిటల్లో డాక్టర్. అది గత ఏడాది అక్టోబర్ వరకు. ఇప్పుడామె హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లా బ్లాక్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తోంది. ఈ రెండింటి మధ్య ఓ అందమైన జ్ఞాపకం కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ అనే కుగ్రామం. ఆ అందమైన జ్ఞాపకం శిల్పకు మాత్రమే కాదు ఆ గ్రామస్థులకు కూడా. డాక్టర్ లేని హాస్పిటల్ డాక్టర్ శిల్ప పుట్టింది చత్తీస్‌గడ్‌లో. అప్పటికి ఆమె తండ్రి అక్కడ కేంద్ర పరిశ్రమల భద్రత విభాగం అధికారిగా ఉన్నారు. తండ్రి బదలీలతోపాటు ఆమె అనేక ప్రదేశాలను చూసింది. ముంబయి వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్న వైద్యసేవలను గమనించింది. ఒక మోస్తరు పట్టణాల్లో ఉండే చిన్న హాస్పిటళ్లనూ చూసింది. ఇవేకాక... ఒకసారి స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో టూర్‌కెళ్లినప్పుడు మనదేశంలో డాక్టర్ ముఖం చూడని గ్రామాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది. ప్రభుత్వ వైద్యకేంద్రాలలో పోస్టింగ్ అందుకున్న డాక్టర్లు ఆ మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయడానికి వెళ్లకపోవడమనే వాస్తవం ఆమెను కలచివేసింది. ఇదంతా ముప్పై ఏళ్ల లోపే. అందుకే న్యూఢిల్లీ నుంచి నేరుగా హిమాలయాల బాట పట్టింది. ఆ వెళ్లడం బదలీ మీద కాదు, స్వచ్ఛందంగా. న్యూఢిల్లీ ఉద్యోగాన్ని వదిలేసి సిమ్లా పరిపాలన విభాగం నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పేరు నమోదు చేసుకుంది శిల్ప. ఆమెను ఇంటర్వ్యూ చేసిన వైద్య అధికారులు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా, రాక్చమ్ పబ్లిక్ హెల్త్ సెంటర్ పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయగలిగింది, కానీ డాక్టర్లను పంపించలేకపోతోంది. ఎవర్ని నియమించినా సెలవు మీద వెళ్లే వాళ్లే కానీ వైద్యం చేయడానికి ఆ గ్రామానికి వెళ్లేవారు కాదు. శిల్ప ఆ ఇంటర్వ్యూ వెళ్లడంలో ఉద్దేశమే వైద్యం అందని గ్రామాలకు వైద్య సేవలనందించడం. దాంతో ఆమె సంతోషంగా వెళ్లింది. రాక్చమ్లోని పీహెచ్సీ తాళాలు తీసి గ్రామస్థుల సహాయంతో శుభ్రం చేయించింది. నర్సు కానీ, ఇతర వైద్య సిబ్బంది కానీ ఎవరూ లేరు. డాక్టర్ శిల్ప అన్నీ తానే అయి వైద్య సేవలు మొదలు పెట్టింది. డాక్టర్ డ్యూటీ మానరాదు రాక్చమ్లో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు. నడి వయసు దాటిన వారిలో దాదాపుగా ఓ యాభై మందికి పైగా బీపీ, డయాబెటిస్తో బాధపడుతున్నారు. కానీ తమకు అనారోగ్యం ఉందన్న సంగతి వాళ్లకు తెలియదు. వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడడం, హాస్పిటల్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసింది డాక్టర్ శిల్ప. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు... అందరికీ వైద్య ప్రదాత ఆమె. కరోనా సమయంలో ఇంటికి రమ్మని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు పిలిచినప్పుడు ‘డాక్టర్ రోగానికి భయపడకూడదు. అలా భయపడి పారిపోవడం వైద్యవృత్తికే అవమానం’ అని చెప్పింది శిల్ప. ఆమె అన్నట్లుగానే... కరోనాకు వెరవకుండా రాక్చమ్ గ్రామంలో ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి ఎవరిలోనైనా వ్యాధి లక్షణాలున్నాయేమోనని పరీక్ష చేసింది. అనుమానం వచ్చిన వారికి జాగ్రత్తలు సూచిస్తూ అవసరమైన వారిని సంగ్లా గవర్నమెంట్ హాస్పిటల్‌కు పంపించేది. అలా నోటి మాట ద్వారా ఆమె సేవలు తెలుసుకున్న సంగ్లా వైద్య అధికారులు కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయంలో ప్రత్యేకమైన వైద్య సేవల కోసం శిల్పను సంగ్లాకు బదలీ చేశారు. ఇప్పుడామె సంగ్లాలో విధులు నిర్వర్తిస్తోంది. కానీ రాక్చమ్ గ్రామస్థులు అప్పుడప్పుడూ ఆమెను చూడడానికి వస్తుంటారు. అనారోగ్యంతో వచ్చిన వాళ్లు డాక్టర్ శిల్ప దగ్గరే చూపించుకుంటామని పట్టుపడుతున్నారు. వైద్యరంగం, డాక్టర్లు డబ్బు కోసం రోగి ప్రాణాలతో ఆడుకుంటున్న రోజుల్లో ఇలాంటి డాక్టర్ గురించి తెలిస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. పుట్టింటి ఆత్మీయత రాక్చమ్ నాకు డ్యూటీ స్టేషన్ మాత్రమే కాదు, పుట్టింటితో సమానం. గ్రామస్థులు నన్ను ఎంతగానో ప్రేమించేవారు. మహిళలు రోజూ ఎవరో ఒకరు హాస్పిటల్‌కు వచ్చి నేను పేషెంట్లను చూడడం పూర్తయ్యే వరకు నాకు తోడుగా ఉండేవారు. వాళ్లింటికి భోజనానికి, టీకి తీసుకెళ్లేవారు. భోజనం అయిన తర్వాత నన్ను ఇంటి దగ్గర దించి వెళ్లేవాళ్లు. నేను వాళ్లకు వైద్యం మాత్రమే చేశాను. వాళ్లు నాకు ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమను పంచారు. – డాక్టర్ శిల్ప -
చరిత్రకు సాక్షీభూతం ఎండ్రిక పర్వతం
ప్రకృతి అందాలకు నెలవు విశాఖ మన్యం.. కొండ లోయలు.. విరిసిన పచ్చదనం.. మదిని దోచే మేఘాలు.. జలపాతాల సోయగాలు.. వడిసే పూల పరిమళాలు.. మంచు తెరలు.. మొత్తంగా మన్యం ప్రకృతి పంచే అందాల విందు అద్భుతం. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుందే గానీ తనివి తీరదు. అందంతో పాటు ఎన్నో విశేషాల సమాహారం విశాఖ మన్యం.. పెదబయలు మండలంలోని ఎండ్రిక పర్వతం కూడా ఇందులో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 4,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతం చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తోంది. పెదబయలు(అరకు): ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో మన్యంలోని ఓ తెగతో పన్ను వసూళ్లకు ముఠాదారి వ్యవస్థను ఏర్పాటుచేశారు. వీరితో సమావేశాలు నిర్వహించడానికి ఎండ్రిక పర్వతాన్ని వేదికగా చేసుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పరిపాలనపరమైన అంశాలను ఈ సమావేశాల్లో చర్చించేవారు. బ్రిటిష్ పాలకులు ఈ పర్వతంపై ఒక స్థూపాన్ని, విడిది భవనాన్ని కూడా నిర్మించారు. ఇవి శిథిలమైనప్పటికీ.. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలేఉన్నాయి. మన్యంలో ఎత్తైన ప్రదేశంగా పేరు గాంచిన ఎండ్రిక పర్వతం సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ రోజుల్లో ఆంగ్లేయులు ఏనుగులు, గుర్రాలు వినియోగించి ఈ పర్వతం ఎక్కి.. సమావేశాలు నిర్వహించేవారట. బ్రిటిష్ వారి హయాంలోనే ఇక్కడ రకరకాల పండ్ల తోటల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి, మామిడి, నిమ్మ, జామ, ఉసిరి వంటి పండ్ల తోటలున్నాయి. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా ఉన్నట్టు మన్యం ప్రజలు చెబుతారు. పర్వతంపై ఊట చెరువు ఎండ్రిక పర్వతంపై ఓ ఊట చెరువు ఉంది. ఇందులో ఏడాది పొడవున నీరు ఉంటుంది. దీన్ని ఆధారంగా మూడు కొండ గెడ్డలు ఏర్పడ్డాయి. పెదబయలు మండలంలోని అరడకోట వైపు ప్రవహించే బొంగదారి గెడ్డ, లక్ష్మీపేట వైపు ప్రవహించే రెయ్యిలగెడ్డ, కిముడుపల్లి వైపు ప్రవహించే గేదె గెడ్డకు ఈ ఊట చెరువే ఆధారం. గతంలో ఈ పర్వతం ఎత్తు, పరిసరాలపై పురావస్తు శాఖ పరిశోధనలు నిర్వహించింది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించింది. కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. కొండమీద చెరువు.. ఆ పేరెలా వచ్చింది.. ఎండ్రిక పర్వతం సమీపంలో ఓ చెరువు ఉంది. అందులో బంగారం, వెండి రంగులతో కూడిన ఎండ్రిక(పీత)లు ఉండేవట. అందుకే దీనికి ఎండ్రికమ్మ పర్వతంగా పిలిచేవారని పెద్దలు చెబుతారు. అలాగే ప్రజల నుంచి కప్పం వసూళ్ల చేసేందుకు బిట్రిష్ ప్రభుత్వం నియమించిన సర్ ఎండ్రిక్ అనే వ్యక్తి ఇక్కడ ఎక్కువ కాలం పరిపాలన సాగించారని, ఈ పేరే ఈ పర్వతం పేరుగా మారిందని అంటారు. కిముడుపల్లి పంచాయతీ పరిధిలోని ఈ పర్వతంపైకి లక్ష్మీపేట, వనభంగి తదితర పంచాయతీ ప్రజలు తరచూ వెళుతుంటారు. ఈ పర్వతం ఆధ్యాతి్మక ప్రాంతంగా కూడా ప్రాచుర్యం పొందింది. కార్తీక పౌర్ణమి రోజున ఎండ్రికమ్మ దేవతకు గిరిజనులు పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక వనసమారాధనలు కూడా జరుగుతాయి. బ్రిటిష్ వారు కొండపై ఏర్పాటు చేసిన జెండా దిమ్మ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ఎండ్రిక పర్వతం ఎత్తైన సుందర ప్రదేశం. ఇక్కడకు వెళ్లితే ఎంతో అనుభూతినిస్తుంది. కుడాసింగి ఘాటీ నుంచి చిన్నపాటి రోడ్డు ఉంది. అయితే ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పర్వతంపై ‘వ్యూ పాయింట్’ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అక్కడ వెళ్లిన వెంటనే తిరిగిరావడం కష్టం. పర్యాటకుల కోసం విడిది ఏర్పాటు చేయాలి. పర్యాటక శాఖ దృష్టి సారించి ఈ పర్వతాన్ని అభివృద్ధి చేయాలి. - ఎం.అప్పలనాయుడు, కూడాసింగి, పెదబయలు మండలం బ్రిటిష్ వారు నిర్మించిన భవనంలో మిగిలిన పునాదులు దొరలు పిలిస్తే వెళ్లాల్సిందే.. మా గ్రామంలోనే ముఠాదారులు ఉండేవారు. కొండపై ఆంగ్లేయులకు సేవలు చేయడానికి ఇక్కడ ప్రజలను తీసుకెళ్లేవారు. అలా మా నాన్న కూడా కొండ మీదకు వెళ్లి వచ్చేవారు. ఒక్కసారి వెళితే.. 10 రోజులు అక్కడే ఉండేవారు. అక్కడ ఉన్నన్ని రోజులూ దొరలు సేవలు చేయించుకునేవారని చెప్పేవారు. - ఓండు కరణం, రైతు, కిముడుపల్లి, పెదబయలు మండలం ఏనుగులు, గుర్రాల మీద దొరలు వచ్చేవారు ఆంగ్లేయులు ఏనుగులు, గుర్రాల మీద వచ్చేవారు. వనభంగి నుంచే వారికి కావాల్సిన సామన్లు పట్టుకెళ్లేవారు. ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చే వారు కాదు. ఎండ్రిక పర్వతం మీద స్థావరంలో 70 మంది వరకు దొరలు ఉండేవారు. ఎండ్రిక పర్వతం నుంచి చూస్తే.. ఏజెన్సీ మొత్తం కనిపిస్తుంది. - పల్టాసింగి భీమన్న, రైతు, వనభంగి, పెదబయలు మండలం పరిశీలిస్తాం.. జిల్లాలో అభివృద్ధికి నోచుకోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి.. ఏపీ పర్యాటక శాఖ అనుమతి తీసుకుని ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎండ్రిక పర్వతం పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలన చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. - రాంప్రసాద్, రీజనల్ డైరెక్టర్, పర్యాటక శాఖ, విశాఖపట్నం ఎండ్రికమ్మ గుడి -
11,240 అడుగుల ఎత్తు.. మంచులో పట్టుతప్పి
ఒట్టావా : కెనడాకు చెందిన భారతీయ సంతతికి 16 ఏళ్ల గుర్భాజ్ సింగ్ మౌంట్ హుడ్ పర్వాతిధిరోహణ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు. పర్వతాన్ని అధిరోహిస్తూ 500 అడుగుల లోతుకు జారిపడినట్లు స్దానిక మీడియా ఓ నివేదికలో తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. గుర్భాజ్ సింగ్ మంగళవారం తన మిత్రులతో కలిసి 11,240 అడుగుల ఎత్తైన మౌంట్ హుడ్ అధిరోహించాడు. ఈ క్రమంలో మంచులో పట్టుతప్పి 500 అడుగుల కిందకు జారిపడ్డాడు. దీంతో అతడి కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ టీం 10,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న అతన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. పటిష్టమైన శిక్షణ, ధృడమైన హెల్మెట్ ధరించడం వల్ల గుర్భాజ్ తక్కువ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై గుర్భాజ్ సింగ్ తండ్రి రిషమ్దీప్ సింగ్ స్పందిస్తూ.. ‘మంచు కారణంగా గుర్బాజ్ ఇబ్బంది పడతాడని భావించా. గుర్బాజ్ గాయం నుంచి కోలుకోగానే అతడితో కలిసి నేను కూడా పర్వతాన్ని అధిరోహిస్తా.’ అని అన్నారు. యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం, మౌంట్ హుడ్ ఒరెగాన్‌లో ఎత్తైన శిఖరమని, అమెరికాలోనే అత్యధికంగా సందర్శించే శిఖరమని.. ప్రతి సంవత్సరం 10,000 మందికి పైగా ప్రజలు పర్వతాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. -
‘శిఖర’ సమానం
రాంగోపాల్‌పేట్: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్ అర్షద్(26), ఆర్యవర్ధన్(17)లపై ప్రత్యేక కథనం... కాలు లేదని కుంగి పోలేదు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్ల కుమారుడు షేక్ అర్షద్(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్ సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే.. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహకారంతో బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అర్షద్, ఆర్యవర్ధన్ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్ఎఫ్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్‌లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు. 16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్ గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్ లింబ్‌తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది. 13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్ జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 2020లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాం 2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్‌కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. – ఆదిత్య మెహతా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
హద్దులు దాటితే..!
పూర్వం మగధ రాజధాని రాజగృహ నగర సమీపంలో ఒక పెద్ద పర్వతం ఉండేది. దాని మీద గరుడ జాతి పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ పక్షుల పేరు మీద దానికి గృధ్రకూట పర్వతం అనే పేరు వచ్చింది. ఆ పర్వతం మీద అపనందుడు అనే గరుడుడు ఉండేవాడు. మంచి బలశాలి కావడం వల్ల ఆకాశంలో అవలీలగా ఎగిరి రాగలిగేవాడు. అతని పుత్రుడు మిగాలోపుడు. అతను కూడా తండ్రిని మించిన రెక్కబలం కలవాడు. కుర్రతనపు జోరు మీద కన్నూమిన్నూ కానేవాడు కాదు. ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. కంటికాననంత దూరం ఎగిరి వచ్చేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. బిడ్డను పిలిచి– ‘‘కుమారా! మిగాలోపా! నీ విహంగ విన్యాసాల గురించి విన్నాను. మంచిదే! కానీ, నాయనా! ఒక్కో జీవికి ఒక్కో హద్దు ఉంటుంది. అలాగే పక్షులకు కూడా! మన గరుడ పక్షులకూ ఒక హద్దు ఉంది. ఆకాశంలో మనం లేచిపోయి నేలను చూసినప్పుడు ఈ ప్రాంతం నాలుగు మూలలా కనిపించేంత వరకే మనం పోవాలి. ఆ హద్దు దాటి పోతే, మన ప్రాణాల మీదికి మనం తెచుకున్నట్లే. నింగి నుండి నేలరాలడం తప్పదు. ఇకనుండి వేగంలో, ఎత్తులో నీ హద్దుల్లో నీవుండు’’ అని చెప్పాడు. తండ్రి చెప్పాడే కానీ, తనయుడు దాన్ని చెవికెక్కించుకోనేలేదు. ఒక రోజున మిగిలిన పక్షులు వద్దని వారించినా వినకుండా సహజ వాతావరణ పరిధిని దాటి ఇంకా పైపైకి పోయాడు మిగాలోపుడు. అక్కడ మేఘాల్లో సుడిగాలి రేగింది. ఆ సుడిలో చిక్కుకున్న అతని దేహం ఛిద్రమైపోయింది. ప్రాణాలు కోల్పోయిన మిగాలోపుని శరీర భాగాలు గాలిలోనే ఎటో కొట్టుకుపోయాయి. అతని మరణం అతని పరివారాన్ని కుంగదీసింది. తండ్రి తల్లడిల్లాడు. అతని మీద ఆధారపడ్డ భార్యాబిడ్డలు భుక్తి కోల్పోయారు. గృధ్రకూట పర్వతం మీద ఛిద్రమైన పక్షి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దల మాట వినకపోవడం, తమ హద్దులు తాము తెలుసుకోలేకపోవడం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఎంతటి విపత్తును కలిగిస్తాయో బుద్ధుడు చెప్పిన గొప్ప కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
రెక్కల పర్వతం
యువరాజు సుసేనుడు తనకెంతో ఇష్టమైన వేటకు బయలుదేరాడు సపరివార సమేతంగా. ఒకసారి వేటకు వస్తే కనీసం వారం పదిరోజులైనా సమయం తెలియక లీనమైపోతాడు. ఈసారి మహారాణి అనారోగ్యం, మహారాజు దేశ సుభిక్షానికై తలపెట్టిన యజ్ఞం వంటి కార్యక్రమాలవల్ల ఆరునెలలు వేటకు వెళ్ళలేకపోయాడు. ఇప్పుడిక అవన్నీ ఓ కొలిక్కివచ్చి కాస్త వీలు చిక్కగానే వేటకు బయలుదేరాడు సుసేనుడు తండ్రి వారింపదలచినా పట్టించుకోకుండా.అందమైన ఒక లేడి పిల్లను అనుసరిస్తూ వాయువేగంతో వెళ్ళగల తన గుర్రాన్నేసుకుని సైన్యానికంటే చాలాదూరమైపోయి అడవిలోలోపలికి వచ్చేశాడు సుసేనుడు. వున్నట్టుండి కళ్ళముందు వెళ్ళిన లేడి కనిపించకుండా మాయమైపోయింది. సుసేనుడు చుట్టూ పరికించాడు. మరికాస్తముందుకెళ్ళే సరికి ఓ పర్వతం కనిపించింది. దానిమీదికి ఎక్కిందేమోనని విశాలంగా ఉన్న ఆ పర్వతం మొదలు నుంచి గుర్రాన్ని కొంచెం పైకి ఎక్కించాడు సుసేనుడు. వేగంగా చీకట్లు అలుముకున్నాయి. ఒక చెట్టు క్రింద గుర్రాన్ని వదిలి, చిన్న నెగడు వెలిగించి క్రూరమగాలు దగ్గరికి రాకుండా చేసి చెట్టెక్కి పెద్ద కొమ్మమీద విశ్రమించాడు. ఉదయకిరణాల పలకరింపుతో మెలకువ వచ్చింది. గబగబా చెట్టు దిగి గుర్రాన్నెక్కి పర్వతం క్రిందకు వచ్చాడు. కానీ, రాత్రి తాను వచ్చిన చోటు కాదని త్వరగానే గ్రహించాడు. అదొక నదీ తటాకం. స్వచ్ఛంగా వుంది నీళ్ళు.స్నానపానాలుచేసి దొరికిన పళ్ళేవో తిన్నాడు. గుర్రం కూడా గడ్డి మేయసాగింది.దగ్గర్లో గలగల నవ్వులు వినిపించి ఉలిక్కి పడ్డాడు. మెల్లగా ఆ దిక్కుకు వెళ్ళి చూస్తే, కొందరు కన్యలు నదిలో జలకాలాడుతూ తనకు అర్ధం కాని భాషలో మాట్లాడుకోసాగారు. వారిలో ఒకమ్మాయి సుసేనుడ్ని పసిగట్టి తోటి వారికి తెలియకుండా అతన్ని సమీపించింది. సుసేనుడు ఆశ్చర్యంగా చూశాడు. ‘ఎవర్నువ్వు? ప్రాణాలమీద ఆశలేక వచ్చావా?‘ అంటూ గంభీరంగా గద్దించి అడిగింది.‘మీరెవరు? ఇది అడవి కదా? ఎవరైనా వచ్చే అవకాశం వుంది. నేనెందుకు రాకూడదు? మీలాగే నేనూ వచ్చా‘ అన్నాడు సుసేనుడు.‘ఇది అడవికాదు. పర్వతపురి ద్వీపం. మేము నలుగురం పర్వతపురి రాజు గోవర్ధనుని పుత్రికలం. నీవిక్కడికి ఎలా వచ్చావు?‘ అని ప్రశ్నించింది. అతనాశ్చర్యపోయి తన వృత్తాంతం చెప్పాడు.‘ఓ..అయితే రాత్రి మేము వాహ్యాళిగా ఎక్కి వచ్చిన శంఖు పర్వతాన్ని నీవు ఎక్కావన్నమాట‘ అని నవ్వింది.‘అదేమి పర్వతం? దాన్నెక్కితే నేనిక్కడికి ఎలా రాగలిగాను?‘ అంటూ అడిగాడు ప్రసేనుడు.‘అది మా ప్రయాణాలకోసం వాడుకునే రెక్కల పర్వతం. సరే. నీ వునికి గుర్తిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు రాజు. నిన్ను నా మందిరం లో దాస్తాను. ఈలోపు మరోసారి అక్కడికెళ్ళినపుడు నిన్ను అక్కడికి చేర్చుతాను‘ అని సుసేనుడ్ని, గుర్రాన్ని ముత్యం, పగడం గా మార్చి హారంలో ధరించి తన భవనానికి వెళ్ళింది.ఆమెకున్న శక్తి వల్ల రాత్రి మనిషి, గుర్రమై పగలు ముత్యం పగడం గా మారటం మరో సోదరి గమనించి ఆరాత్రి తాను తస్కరించి గులాబి, బంతి పువ్వులుగా మార్చి తనమందిరానికి తీసుకెళ్ళింది. మూడవ రోజు మరో సోదరి చూసి ఉంగరము, కంకణముగా చేసి తనతో పట్టుకుపోయింది. నాలుగవరోజు అందరికంటే చిన్న చెల్లెలు తెలుసుకుని తన శక్తితో పావురము, చిలుకగా మార్చి వారిమీది జాలితో బయటకుతెచ్చి వదిలిపెట్టింది. ఇద్దరూ శంఖుపర్వతం చేరగానే దానికి పెద్దపెద్ద రెక్కలు మొలిచి గాల్లోకి ఎగిరింది. సముద్రాలుదాటి వారిని మళ్ళీ అడవిలో వదిలి వెళ్ళిపోయింది.బ్రతుకుజీవుడా అనుకుంటూ యువరాజు తనకోసం భయపడి గాలిస్తున్న సైనికులను చేరి కోటకు వెళ్ళాడు. కానీ, అతనా నలుగురు కన్యలనూ వారి అపురూప లావణ్యాన్ని మరువలేక బెంగతో మంచం పట్టాడు.విషయం తెలుసుకున్న మహారాజు గోవర్ధనుడికి సందేశం పంపగా, అప్పటికే అతని గారాల పుత్రికలు సుసేనుడినే తమ కలల రాకుమారుడని తండ్రికి తెలిపి వుండటంతో సంతోషించి తన పుత్రికలనిచ్చి వివాహం చేశాడు. వారి శక్తి యుక్తులే కాక, మామగారి అండ కలిగినందున శత్రువుల భయం లేకుండా అనేక సంవత్సరాలు నిరాటంకంగా రాజ్యపాలనచేశాడు సుసేనుడు. -
ఎవరెస్ట్ శిరసొంచిన వేళ..
ఒంగోలు కల్చరల్: ‘లే..గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించవద్దు’ స్వామి వివేకానంద మహితోక్తులు ఒంగోలుకు చెందిన డిగ్రీ విద్యార్థి షేక్ హిమాంషాపై విశేష ప్రభావం చూపాయి. ఎవరికీ అందకుండా ఠీవిగా నిలబడి అంబర చుంబనం చేస్తున్న మౌంట్ ఎవరెస్ట్ మెడలు వంచాలనే ఆలోచన ఆ నవ యువకునిలో ఉదయించింది. అందుకు ప్రభుత్వ చేయూత, జిల్లా స్టెప్ అధికారుల ప్రోత్సాహం తోడైంది. అనేక వడపోతల తరువాత 40మందినుండి ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు కేవలం అయిదుగురిని ఎంపికచేసారు. కొన్ని నెలల కఠోర శిక్షణ తరువాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అర్ధరాత్రి ప్రపంచం గాఢ నిద్రలో జోగుతున్న వేళ హిమాంషా కన్ను పొడుచుకున్నా కానరాని నిశీధిలో జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎగురవేసి భారతావని పులకించేలా, గర్వించేలా చేశాడు. దారిపొడుగునా భయపెట్టే శవాలను, అకస్మాత్తుగా సంభవించే వాతావరణ మార్పులను పట్టించుకోకుండా లక్ష్యం వైపే పురోగమించి ఆత్మ విశ్వాసంలో యువతకు ఆదర్శంగా నిలిచాడు. కరాటేతోపాటు ఇతర ఆటల్లోనూ హిమాంషాకు ఆసక్తి ఉంది. పలు అవార్డులు కూడా సాధించి తన సత్తా చాటాడు. ఒంగోలు బిడ్డ.. మస్తాన్, మస్తాన్‌బీ దంపతుల రెండో కుమారుడు హిమాంషా. మస్తాన్ తొలుత ఒంగోలుకు సమీపంలోని ఉలిచిలో నివాసం ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మరింత మేలైన ఉపాధి కోసం ఆయన తన కుటుంబంతో 1991లో ఒంగోలుకు చేరుకున్నారు. హిమాంషా 10వ తరగతి దామోదర స్కూల్లో, ఇంటర్ ఉమామహేశ్వర కళాశాలలో, స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివాడు. కరాటేలో ప్రావీణ్యం చదువుతోపాటు కరాటే, కుంగ్ ఫూపై కూడా హిమాంషా దృష్టి సారించాడు. కుబియా నాయక్ వద్ద కరాటేలో శిక్షణ పొందాడు. కరాటేలో 2012లో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించాడు. కుంగ్ ఫూలో జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2016లో ఎన్సీసీ ‘సి’ సర్టిఫికెట్ సాధించాడు. దానితోపాటు కబడ్డీ టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. క్రీడాంశాలతోపాటు మనసును కదిలించే సంగీతమన్నా హిమాంషాకు మక్కువ ఎక్కువ. స్టెప్ ప్రకటనే ప్రేరేపణ ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు యువత దరఖాస్తు చేసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ విభాగమైన స్టెప్ 2017 నవంబర్ నెలలో హిందూ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన హిమాంషాను ఆకర్షించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలాగైనా అధిరోహించి తీరాలనే ఆశయంతో మాంషా దరఖాస్తు చేశాడు. రన్నింగ్, జంపింగ్, హైజంప్, లాంగ్‌జంప్ తదితర అంశాల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీల్లో ఎన్నికయ్యాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా హిమాంషా ఎంపికయ్యాడు. మొత్తం 40 మందిని అధికారులు ఎంపిక చేయగా హిమాంషా వారిలో ఒకడు. సిక్కిం, డార్జిలింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణానంతరం 40 మంది బృందంలో 20 మందికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో పహల్గాంలోని జవహర్లాల్ నెహ్రూ పర్వతారోహణ శిక్షణ సంస్థలో మరిన్ని మెళకువలు నేర్పించారు. శారీరక, మానసిక దారుఢ్యాన్ని ఎలా పెంచుకోవాలో, పర్వతారోహణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో హిమాంషా శిక్షణ పొందాడు. కఠోర శిక్షణ అనంతరం కేవలం 10మంది రంగంలో మిగిలగా వారికి ఫిబ్రవరి–మార్చి నెలలో లడఖ్‌లో 15 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చివరకు 40 మంది బృందంలో హిమాంషాతోపాటు మరో నలుగురు మాత్రమే ఎవరెస్ట్ ఎక్కేందుకు తుది జాబితాలో స్థానం సాధించారు. ఏప్రిల్ 22న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. చైనా వైపు నుంచి.. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు చైనా వైపు మార్గాన్ని హిమాంషా బృందం ఎంచుకుంది. క్యాంప్ 1లో 6400 మీటర్లు, క్యాంప్ 2లో 7,900 మీటర్లు, క్యాంప్ 3లో 8,300 మీటర్ల ఎత్తుకు హిమాంషా చేరుకున్నాడు. దారిపొడవునా 22కు పైగా పర్వతారోహకుల మృతదేహాలు కనిపించినా హిమాంషా భయపడలేదు. ఫలించిన కల అంచెలంచెలుగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన హిమాంషా మే 16వ తేదీ రాత్రి 1.55 నిమిషాలకు తన బృందంలోని వారి కన్నా కొన్ని గంటల ముందుగా 8848 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకుని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. 2018 ఎవరెస్ట్ శిఖరారోహణ సీజన్లో ఆ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడుగా కూడా హిమాంషా రికార్డు సృష్టించాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఖ్యాతిని సాధించిన తొలి వ్యక్తి కూడా హిమాంషానే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించి సర్టిఫికెట్ అందజేసింది. అధికారుల అభినందనలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హిమాంషాను యూత్ సర్వీసెస్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, కోమలి కిషోర్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రిన్సిపాల్ ఆంజనేయులు, పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు అభినందించారు. ఒంగోలులో హిమాంషా అభినందన ర్యాలీ కూడా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హిమాంషాను సన్మానించారు. ఆత్మవిశ్వాసం ముఖ్యం యువతకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఒకరిని గుడ్డిగా అనుసరించడం కాకుండా తాము దేనికి సరిపోతామో యువత నిర్ణయించుకోవాలి. అదే సమయంలో ప్రోత్సాహం కూడా అవసరం. యువతకు సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు చాలా అద్భుతాలు సాధించి చూపగలరు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అతి ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది నా ఆశయం. అలాగే ఆర్మీలో పారా కమాండర్‌గా ఉద్యోగం చేయాలనేది ఆశయం. నేను ఇప్పటి వరకు సాధించినదేమైనా ఉంటే దానికి నా తల్లిదండ్రులైన మస్తాన్, మస్తాన్‌బీ, సోదరుడు అంజావలి, వదిన అనూష కారణం. వారు ప్రతి విషయంలో నన్ను వెన్నుతట్టి ఫ్రోత్సహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – హిమాంషా -
శివయ్యా.. బతికించావయ్యా..!
దోమలపెంట(అచ్చంపేట) : శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో కొండచరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడం తో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. శివయ్యా.. బతికించావయ్యా.. అంటూ ప్రయాణికులు ఊపరిపి పీల్చుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ ప్రాం తంలో కుండపోత వర్షం కురిసింది. ఆనకట్ట వద్ద శ్రీశైలం ఘాట్‌రోడ్డులో వర్షపు నీరు వరదలా ప్రవహించడంతో రోడ్డు ప్రొటక్షనల్ కూలిపోయింది. దీంతో కొండ చరియలు దిగువనున్న ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. ఎస్పీఎఫ్ సేవలు భేష్ సమాచారం అందుకున్న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్తు కేంద్రం రక్షణ బాధ్యతలు చూస్తున్న ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్) ఎస్ఐలు జి.శ్రీనివాస్, ఎం.రంగయ్య, సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అనంతరం బండరాళ్ల తొలగింపు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రసాద్, పాతాళగంగ అంజిలు సైతం స్పందించి టూరిజం పనులు చేస్తున్న ప్రొక్లయిన్తో రోడ్డుపై అడ్డంగా పడిన బండరాళ్లను తీయించారు. వీటిని తీయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వస్తున్న వాహనాలన్నింటిని ఈగలపెంట వద్దనున్న జెన్కో గ్రౌండ్లో పార్క్ చేయించారు. జరిగిన సంఘటనను తెలియపరచి కొండచరియలను తొలగించిన తర్వాత పంపించారు. మరోవైపు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వాహనాలను భూగర్భ కేంద్రం పీఏటీ ప్రాంతం వద్ద నిలిపివేయించారు. రాళ్లను తొలగించిన అనంతరం నెమ్మదిగా ఘాట్‌నుంచి దాటించారు. అనంతరం భూగర్భ కేంద్రం చీఫ్ ఇంజినీర్ మంగేష్‌కుమార్ ఎస్పిఎఫ్ పోలీసులు పర్యాటకులు, భక్తులకు అందించిన సేవలను ప్రశంసించారు. ప్రమాదకరంగా రహదారి ఇదిలాఉండగా కొండచరియలు పడిన ప్రతి సారి రోడ్డుపైనున్న మరో రోడ్డులో కూలిపోయిన రోడ్డు ప్రొటక్షన్ వాల్ క్రమంగా పెద్దదవుతూనే ఉంది. దీంతో రాళ్లు ద్రొర్లుతూ వచ్చి దిగువ రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆనకట్ట ఘాట్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా మారింది. ఆర్అండ్బీ అధికారులు యుద్దప్రాతిపదికన స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆకలితో అలమటించిన ప్రయాణికులు ఇదిలాఉండగా అనుకోని విధంగా ట్రాఫిక్ జామ్ కావడంతో మూడు గంటలపాటు ప్రయాణికులు వాహనాల్లో ఇబ్బంది పడ్డారు. ఈగలపెంటలో పర్యాటకులు, భక్తులు వాహనాలు, ఆర్టీసి బస్సులను నిలిపివేయడంతో నిరీక్షించాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న హోటళ్లలో టీ, టిఫిన్ అయిపోవడంతో చాలామంది ఆకలితో అలమటించారు. తాగడానికి, సేద తీరడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో పర్యాటకులు ఇక్కట్ల పాలయ్యారు. -
కొండ చిలువ కసరత్తులు
ఆడబోయిన తీర్థం ఎదురయినట్టు... అని సామెత. ఇక్కడ మాత్రం పూర్తి రివర్సయ్యింది. తీర్థమాడటానికి వైష్ణోదేవి వెళ్లే భక్తులకు పే...ద్ద కొండచిలువ.. అదేనండీ పదిహేనడుగుల పైథాన్ ఒకటి జమ్మూలోని కాట్రా స్టేషన్లో ఓ పిల్లర్ మీద ఇలా పాకుతూ దర్శనమిచ్చింది. ఇంకేముంది, భక్తులు బెంబేలెత్తిపోయారు. ఈ కొండచిలువగారు పిల్లర్ మీదికి పాకుతూ ఉన్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి, సన్నిహితులకు వాట్సప్ చేశారు. దాదాపు 45 సెకండ్లున్న ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. చురుకయిన వాళ్లెవరో ఈ విషయాన్ని వన్యప్రాణి సంరక్షణ శాఖ వారికి చేరవేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి స్థానికుల సాయంతో కొండచిలువను భద్రంగా పట్టుకుని, సురక్షితంగా తీసుకెళ్లిపోయారు. తీరా ఆ తర్వాత తేలిందేమంటే, అది వైష్ణోదేవి వెళ్లే దోవలో జరిగింది కాదని, ముంబైలోని దాదర్ స్టేషన్లో చిత్రీకరించిన దృశ్యమన్నారు. అది కూడా కరెక్ట్ కాదనే వాళ్లూ ఉన్నారు. ఎక్కడిదైతే మాత్రం ఏమిటి, పైథాన్ విన్యాసాలు నిజమే, వైరల్ అయ్యిందా లేదా అన్నదే మనకు కావలసింది! -
21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!
అర్జెంటీనాః టుకుమాన్ ప్రావిన్స్ ఎత్తైన గ్రొట్టో పర్వతప్రాంతంలో ఓ వ్యక్తి 40 ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాడు. మనిషి సంచారం ఉండని ఆ ప్రాంతంలోని గుహలో ఒంటరిగా ఉంటున్న అతడ్ని... ఇప్పుడంతా '21 సెంచరీ కేవ్ మ్యాన్' అని పిలుస్తున్నారు. పర్వతప్రాంతంలో ఏకాంతంగా గడుపుతున్న 79 ఏళ్ళ పెడ్రో ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కనిపిస్తాడు. తనకు ప్రకృతి వనాలమధ్య ఒంటరిగా నివసించడం ఎంతో ఇష్టమని చెప్తున్నాడు. తాను ప్రస్తుతం నివసిస్తున్న గుహకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పట్టణం శాన్ పెడ్రో డి కొలాలో లో పుట్టి పెరిగిన పెడ్రో... బొలీవియా బొగ్గు రావాణా కోసం 14 ఏళ్ళ వయసులోనే ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అక్కడినుంచీ 40 ఏళ్ళ క్రితమే తిరిగి వచ్చేసిన అతడు.. ప్రకృతి మధ్య జీవించాలనే తన చిన్ననాటి కల సాకారం చేసుకోవడంలో భాగంగా గ్రోట్టో పర్వత ప్రాంతంలోని గుహలో శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. నాగరిక సమాజంలో బతికిన రోజులను గుర్తు చేసుకుంటూ... మద్యం, హింస మనిషిని నాశనం చేస్తాయని చెప్తున్నాడు. అందుకే తాను అడవిని ఇష్టపడతానని, అక్కడ నివసించే జంతువులే తన కుటుంబ సభ్యులని అంటున్నాడు. పర్వత ప్రాంతంలో నివసించే సింహాలు, ఇతర మాంసాహారుల బారినుంచీ రక్షణకోరే 11 కోళ్ళు, 2 మేకలకు తన గుహలో రాత్రిపూట ఆశ్రయం కల్పిస్తున్నాడు. అవి పగలంతా పర్వతప్రాంతంలో ఆహారంకోసం సంచరించి తిరిగి రాత్రి సమయంలో పెడ్రో గుహకు చేరుకుంటుంటాయి. తెల్లవారుజామున కాకుల కూతలు మొదలయ్యే 3 గంటల ప్రాంతంలోనే పెడ్రో కూడా నిద్రనుంచీ మేల్కొంటాడు. ముందుగా అక్కడ దొరికే కట్టెలతో మంటను రాజేసి, ఆ వెలుగులోనే అక్కడ దొరకే సేంద్రియ అల్పాహారాన్ని భుజిస్తాడు. తెల్లవారిన అనంతరం రైఫిల్ పట్టుకొని పర్వత ప్రాంతంలో వేటకు వెళ్ళడమో.. లేదంటే అక్కడకు మూడు గంటలు నడిచి వెళ్ళే దూరంలో ఉన్న చిన్న పర్యటక పట్టణం శాన్ పెడ్రో డి కొలాలో వెళ్ళడమో చేస్తుంటాడు. గుహనుంచీ పట్టణానికి వచ్చిన అతడ్ని అక్కడి ప్రజలే కాక పర్యటకులూ సాదరంగా ఆహ్వానిస్తారని, ఎవ్వరికీ హాని తలపెట్టని మంచి మనిషిగా పెడ్రోను గుర్తిస్తారని అతడి మేనల్లుడు జువాన్ కార్లోస్ పేర్కొన్నాడు. తనకు వచ్చే నెలవారీ పెన్షన్ 100 డాలర్లను తీసుకొని అతడు తనకు, తనతో ఉండే జంతుజాలానికీ కావలసిన వస్తువులను పట్టణంనుంచీ కొనుగోలు చేసి, తిరిగి కాలినడకన తన గుహకు తీసుకెడుతుంటాడు. మూడు గంటలపాటు కాలినడక అంటే కొంత కష్టమైనా.. పెడ్రో దాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనిదే మనుగడ లేదని వాదిస్తున్న నేటి తరుణంలో పెడ్రోమాత్రం విద్యుత్, గ్యాస్, టెలిఫోన్ వంటి సౌకర్యాలేమీ లేకుండా జీవిస్తున్నాడు. అయితే పర్వతాల్లో కూడా సిగ్నల్ అందుకునే బ్యాటరీ శక్తి కలిగిన ఓ అరుదైన అలారంతో కూడిన పాత రేడియో మాత్రం అతని వద్ద ఉంటుంది. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే అతడ్ని సందర్శించేందుకు మాత్రం ఎంతోమంది పర్యటకులు వెడుతుంటారని, మోడ్రన్ కేవ్ మ్యాన్ గా పెడ్రోను పిలుస్తారని పెడ్రో మేనల్లుడు ఒకరు చెప్తున్నారు. అంతేకాక పాఠశాల విద్యార్థులు సైతం అతడ్ని చూసేందుకు, గుహకు ప్రత్యేక ట్రిప్ లు ఏర్పాటు చేసుకుంటారని తెలిపాడు. అయితే తనకు ప్రపంచం మొత్తం కాలి నడకన తిరగాలన్న కోరిక ఉందనీ, కానీ మధ్యలో ఎంతో సముద్రం ఉందని, సమయం వస్తే అదికూడా దాటే ప్రయత్నం చేస్తానని.. పెడ్రో 79 ఏళ్ళ వయసులోనూ యువకుడిలా తన ఆసక్తిని వ్యక్తబరుస్తున్నాడు. -
21వ శతాబ్దపు 'కేవ్ మ్యాన్'..!
-
అచ్చం సినిమాల్లో మాదిరిగానే..!
బెర్న్: సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సన్నివేశాలు నిజంగా జరిగితే ఎలా ఉంటుంది. స్విజర్లాండ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం హాలివుడ్ చిత్రాలు.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఇటాలియన్ జాబ్లలోని సన్నివేశాలను తలపించింది. కొండపైన ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొని, అంతటితో ఆగకుండా కిందకు వచ్చి.. ముందు చక్రాలు గాల్లో తేలేలా ఎవరో ఆపినట్లు ఆగింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాక్టర్‌ను చూసి షాక్ తీన్నారు. ట్రాక్టర్ ఏమాత్రం ముందుకు కదిలినా కింద ఉన్న రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉండటంతో క్రేన్ సహాయంతో జాగ్రత్తగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్టర్ డ్రైవర్‌ను రక్షించారు. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. -
శిఖరము అంచు.. ముక్తిని పంచు!
సాక్షి, స్కూల్‌ఎడిషన్: ఆశ్రీతులకు ఆశ్రయమిచ్చేది ఆశ్రమం. అందులో హిందూ సన్యాసులంటే అది మఠం. బౌద్ధసాధువులంటే బౌద్ధారామం. ప్రపంచంలో ఇలాంటి ఆశ్రమాలు బోలెడన్నీ ఉన్నాయి. భారతదేశంలో వీధికో ఆశ్రమం ఉంది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగానే ఆశ్రమాల్లోనూ తేడాలున్నాయి. కొన్ని ఆశ్రమాలు జనావాసాలకు దగ్గరగా ఉండి సులభంగా సందర్శించేందుకు వీలుంటుంది. మరి కొన్ని మారుమూల ప్రాంతాల్లోని కొండలు, పర్వతాలపై ఉంటాయి. ఒకప్పుడు ఈ ఆశ్రమాలను చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కఠోర శ్రమ, పట్టుదల, నిష్ట ఉన్న వారే ఈ ఆరామాలను చేరుకోనేవారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఆశ్రమాలన్నీ ప్రఖ్యాత పర్యాటక స్థలాలుగా మారిపోయాయి. రోపింగ్, ట్రెక్కింగ్, ఆశ్రమం వరకు మెట్ల నిర్మాణం వంటి ఏర్పాట్ల ద్వారా ఈ ఆరామాలను సందర్శించేందుకు వీలుకల్పించారు. అలాంటి వాటిపై ఓ లుక్కేద్దాం. హ్యాంగింగ్ మొనాస్ట్రీ, చైనా చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ హెంగ్ పర్వతపు పశ్చిమ అంచున భూమి నుంచి 75 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిని వేలాడే ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాల్లో ఇది ఒకటి. ఈ పర్వతం డాటాంగ్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉంది. చైనాలోని ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా, చారిత్రక స్థలంగా విలసిల్లుతోంది. క్రీ.శ 491లో ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. చైనాలో బుద్ధిజమ్, టావోయిజమ్, కన్ఫూషియనిజమ్లతో కూడిన ఏకైక టెంపుల్ ఇదే. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ టెంపుల్స్‌లో ఇది ఒకటి. మెటియోరా, గ్రీస్ ఈ ఆశ్రమం గ్రీస్‌లో ఉంది. గ్రీకు భాషలో ‘మెటియోరా’ అంటే గాలిలో వేలాడతీసినది లేదా పైన ఉండే స్వర్గం లేదా ఆకాశం మధ్యలో ఉండేది అని అర్థం. ఈ ఆరామం ఆరు మఠాల కలయికగా ఎత్తై కొండపైన ఉంది. గ్రీస్‌లోని పవిత్రమైన ఆశ్రమాల్లో ముఖ్యమైంది. మధ్య గ్రీస్‌లోని పిండస్ పర్వతాలకు సమీపంలో కాలాంబాకా పట్టణానికి దగ్గరలో ఉంది. కొండపైన ఈ ఆరు ఆరామాలను నిర్మించారు. ఈ ఆశ్రమాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 11వ శతాబ్దంలో సన్యాసులు ఈ ఆశ్రమాల్లో నివసించేవారు. ప్రస్తుతం ఇది గ్రీస్‌లో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా నిలుస్తోంది. టాంగ్ కాలాట్, మైన్మార్ మైన్మార్‌లోని పోపా అగ్నిపర్వతంపై బాగాన్ నగరానికి 50 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 737 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రముఖ బౌద్ధఆరామం. దీన్ని చేరుకునేందుకు పర్వతం కింది నుంచి 777 మెట్లను నిర్మించారు. మైన్మార్‌లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి. పోపా పర్వతంపై ఉన్న గుళ్లను, ఈ ఆశ్రమాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. టాక్ట్సాంగ్ పాల్ఫుగ్, భూటాన్ ఈ ఆశ్రమాన్ని ‘ద టైగర్స్ నెస్ట్’ అని కూడా పిలుస్తారు. హిమాలయ పర్వతప్రాంతంలోని ప్రముఖ బౌద్ధ ఆరామం. భూటాన్‌లోని పారో లోయకు ఆనుకోని ఉన్న పర్వతపు అంచున నిర్మించిన గుళ్ల సముదాయం. సముద్రమట్టం కన్నా 3120 మీటర్ల ఎత్తులో ఉంది. టాక్ట్సాంగ్ సెంగే సామ్డప్ గుహలో 1692లో నిర్మించారు. ఈ ఆశ్రమం భూటాన్‌లోనే ప్రముఖ పర్యాటక స్థలంగా, సాంస్కృతిక కేంద్రంగా పరిఢవిల్లుతోంది. సుమేలా మొనాస్ట్రీ, టర్కీ 1600 సంవత్సరాల క్రితం టర్కీలోని అల్టెమ్డెరే లోయను ఆనుకోని ఉన్న పర్వతంపై నిర్మించారు. సముద్రమట్టం కంటే 1200 మీటర్ల ఎత్తులో ఉంది. రాతితో నిర్మించిన చర్చి, విద్యార్థులు చదువుకునేందుకు గదులు, లైబ్రరీ ఈ ఆశ్రమంలో ఉన్నాయి. టర్కీలోని ప్రముఖ పర్యాటకస్థలాల్లో ఇది ఒకటి. ఈ ఆరామంలోని గోడలపై ఏసుక్రీస్తు, మేరీ మాత జీవితవిశేషాలకు వివరిస్తూ గీసిన కుడ్యచిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 1923 నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చింది. -
జూనియర్ బాహుబలి కోసం ఓ తల్లి పాట్లు
లండన్: ఆడుతూ పాడుతూ అల్లరిగా తిరిగే తొమ్మిదేళ్ల కొడుకు శ్యామ్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడా, ఎక్కడా ? అని వెతుకుతున్న ఆ తల్లికి ఆకాశం నుంచి హెల్ప్...హెల్ప్...అంటూ గాలి మాటున లీలగా కొడుకు గొంతు వినిపించింది. తల పెకైత్తి చూడగా బోచ్ ఒడ్డున కొండపై 40 అడుగుల ఎత్తుపైన చిక్కుకున్న కొడుకు కనిపించాడు. కేట్ ఆర్మ్స్బై అనే 39 ఏళ్ల ఆ తల్లి కొడుకును రక్షించడం కోసం కొండ ఎక్కడం ప్రారంభించింది. పర్వతాలు ఎక్కడంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కొండపై చిక్కుకున్న కొడుకును ఎలాగైనా రక్షించాలనే తాపత్రయంతో జారుతున్న రాళ్లనే పట్టుగా చేసుకొని ఎంతో పట్టుదలతో పైకి చేరుకుంది. కొడుకును అక్కున చేర్చుకుంది. అంతే....అక్కడి నుంచి కిందకు దిగడానికిగానీ, పెకైక్కడానికిగా ఎలాంటి మార్గం కనిపించలేదు. కొడుకును రక్షించబోయి తాను 40 అడుగుల ఎత్తుపై చిక్కుకు పోయింది. హెల్ప్...హెల్ప్....అంటూ అరవడం ఇప్పుడు తనవంతయింది. బీచ్ ఒడ్డునే ఉన్న కేట్ భర్త బీచ్ వద్దనున్న తోటి పర్యాటకుల సహాయాన్ని అర్థించాడు. ఎవరికి ఏం చేయాలో తెలియలేదు. నావెల్ హెలికాప్టర్‌కు ఫోన్ చేయాలని ఎవరో సలహా ఇచ్చారు. ఎలా ఫోన్ చేయాలి ? అక్కడి ఎవరి ఫోన్లకు సిగ్నల్స్ అందడం లేదు. కేట్ భర కిలోమీటర్ దూరం వరకు పరుగెత్తికెళ్లి అక్కడ సిగ్నల్స్ దొరకడంతో ఫోన్ చేశారు. కార్న్‌వాల్ నుంచి ‘సీ కింగ్’ హెలికాప్టర్ వచ్చి కొండపై చిక్కుకున్న తల్లీ కొడుకులను రక్షించారు. రిస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి మొత్తం మూడు గంటలు పట్టింది. అప్పటి వరకు తల్లీ కొడుకులిద్దరు బిక్కుబిక్కుమంటూ కొండరాయిపైనే గడిపారు. ఇలాంటి సందర్భాల్లో రక్షించడానికి తాముండగా, మీరెందుకు రిస్క్ తీసుకుంటారని హెలికాప్టర్ సిబ్బంది ఆ తల్లిని హెచ్చరించి వెళ్లిపోయారు. మొత్తం ఆపరేషన్‌ను తోటి పర్యాటకులు తమ కెమేరాల్లో బంధించారు. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన కేట్ కుటుంబం సౌత్ డెవాన్ ప్రాంతానికి విహారానికి ఇటీవల వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. -
పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం
అది మెక్సికోలోని అత్యంత ఎత్తైన మంచు పర్వతం. దానిని చూడగానే వెంటనే పర్వతారోహణ చేయాలన్నఆలోచన మనసులో మెదలుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కొంతమంది పికో డీ ఒరిజాబా అనే ఈ 5,610 మీటర్ల పర్వతాన్ని అధిరోహించి షాక్ గురయ్యారు. అందుకు కారణం పర్వతపు చివరి అంచులో శిథిలమై ఉన్న ఓ మృతదేహం. కేవలం ఎముకలు, పుర్రె మాత్రమే అక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని కిందికి వచ్చాక వారు సమీప అధికారులతో చెప్పగానే మొత్తం పన్నెండు మంది కలిసి తగిన రక్షణలతో అక్కడికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకొన్నారు. 50 ఏళ్ల కింద ఓ వ్యక్తి పర్వతారోహణకు అక్కడికి వెళ్లి చనిపోయి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి సదరు వ్యక్తి వివరాలు గుర్తిస్తామని చెప్తున్నారు. -
ఈ పర్వతమిక మిట్టల్ సొంతం!!