
యూ టర్న్ తీసుకునేందుకు వీలు లేని పర్వత రోడ్డు అంచు వద్ద డ్రైవర్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్టర్‌లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్‌గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి.
అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్‌తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్‌స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్‌లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్‌లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022
ఇక ఇంటర్నెట్‌లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది.
(చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో)