హిమాలయాల్లో చలి ఎలా ఉంటుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చలికి తగ్గా బట్టలు కొన్ని రక్షణ పద్ధతలు పాటించకపోతే అంతే సంగతులు. అలాంటిది ఓ వ్యక్తి గడ్డకట్టే మంచులో హాయిగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. ఓ పక్కన మంచు కురుస్తుంది. అయినా అవేమి పట్టనట్లు చాలా ప్రశాంతంగా యోగి పుంగవుడిలా మెడిటేషన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అతన ఆహార్యం సైతం యోగిశ్వరుడిలానే ఉంది.
మన పురాణాల్లో కొందరు యోగులు, సిద్ధులు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారని విన్నాం కానీ చూడలేదు. కానీ ఈ యోగి దర్శనంతో అది నిజం అనేందుకు ఈ ఘటన బలం చేకూర్చింది. 'వాల్మికి మహర్షి' కావడానికి ముందు బోయవాడని తెలుసు కదా!. ఆ తర్వాత ఆయన రామ్.. రామ్ అంటూ వేలయేళ్లు తపస్సు చేసి వాల్మికి మహర్షి అయ్యాడు. ఎందుకంటే అన్నేళ్లు తపస్సు చేస్తున్నప్పుడూ ఆయన చుట్టు పుట్టలు కట్టాయి.
తపస్సు పూర్తి చేసుకుని పుట్ట(వల్మీకం) నుంచి బటయకు వచ్చాడు కాబట్టి ఆయన్ను వాల్మీకి మహర్షి అన్నారు. మరీ ఇలా మంచులో తపస్సు చేస్తూ... అతని చూట్టూ మంచులా గడ్డకట్టుకుపోతున్న ఈ వ్యక్తిని హిమ మహర్షి అని పిలుస్తారో ఏమో గానీ చూడటానికి ప్రశాంత వదనంతో ఉన్న గొప్ప యోగిలా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: తవ్వకాల్లో రెండు వేల ఏళ్ల నాటి కాంస్య చెయ్యి..దానిపై మిస్టీరియస్..!)
Comments
Please login to add a commentAdd a comment