Watch: How Driver Avoids Colliding With This Child, Video Goes Viral - Sakshi
Sakshi News home page

నువ్వు దేవుడివి సామీ.. మీరు మాత్రం ఇలా చేయకండి..

Published Wed, Apr 12 2023 7:39 PM | Last Updated on Wed, Apr 12 2023 7:51 PM

Driver Avoids Colliding With Child Video Viral - Sakshi

అలసత్వంతో రోడ్డు దాటుతున్న సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను చాలానే చూసి ఉంటాం. క్షణం కాలంలో చేసే చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చాకచక్యంగా డ్రైవింగ్‌ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. 

వివరాల ప్రకారం.. స్కూల్‌ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకొని ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు.. సడెన్‌గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో స్పీడ్‌గా వస్తున్న కారు.. అతడికి ఢీకొట్టేది. వెంటనే తేరుకున్న డ్రైవర్‌ ఎంతో చాకచక్యంగా బాలుడిని అడ్డుతప్పించాడు. కారు స్టీరింగ్‌ ఒక్కసారిగా తిప్పడంతో కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. 

ఈ ఘటన అనంతరం.. తేరుకున్న తల్లి బాలుడిపై కోపంతో ఒక్కటిచ్చింది. ఇక, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డ్రైవర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నీ వల్ల ఓ ప్రాణం నిలబడింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement