మంగళూరు: అతివేగం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే పలు సందర్భాల్లో చూసి ఉంటాం. హైస్పీడ్ కారణంగా ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎంతగా ప్రచారం, అవగాహాన కల్పిస్తున్న కొందరు పెడచెవిన పెడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నిషాత్(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నిషాంత్ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది. ఇక, మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Horrible accident caught on #CCTV in #Mangalore : A 21year old student from Kerala Muhammad Nishath (21) died on the spot when his bike skidded and hit a pole.
— Siddhant Anand (@JournoSiddhant) July 19, 2023
The impact was such that he received multiple injuries on the head and died on the spot. pic.twitter.com/G6ztKFRlqz
ఇది కూడా చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment