బ్రస్సీలియా: ఒక్కొసారి మూగజీవాలు రోడ్డుదాటుతున్నప్పుడు వేగంగా ప్రయాణిస్తున్న వాహానాలకు అడ్డుపడుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలతోపాటు మూగజీవాలు కూడా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సంఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో చోటుచేసుకుంది. చాపెకో వీధి సందులో నుంచి ఒక ఆవు ఒక్కసారిగి రోడ్డుపైకి దూసుకొచ్చింది. అప్పుడు రోడ్డుపై అనేక వాహానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ఆవు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రదారుడిని వెళ్లి ఢీకొట్టింది. ఈ హఠాత్పరిమాణంతో బైకర్ రోడ్డుపై పడ్డాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలు కూడా ఆగిపోయాయి. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటం.. ఎక్కువ స్పీడ్ లేకపోవడం వలన చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ సంఘటన గత నెల అక్టోబరు 27న జరిగింది.
దీన్నిరోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి తన మిత్రుడికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆవు పరుగెత్తుకురావడాన్ని గమనించి వీడియోతీశాడు. ఈ తర్వాత.. వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు..’, ‘పాపం.. ఆవుకు కూడా గాయమైనట్టుంది..’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment