two veeler
-
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
దేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లేన్ రూపొందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.రోడ్డుపై అన్ని రకాల వాహనాలు ఏకకాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు లేన్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం ద్విచక్ర వాహనాలతో ముడిపడినవే ఉంటున్నాయి.రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం 2022 లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,43,366 మంది గాయపడ్డారు.గత ఏడాది దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. -
టీవీఎస్ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ టూ–వీలర్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ వచ్చే ఏడాది వ్యవధిలో తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. అలాగే విద్యుత్ త్రిచక్ర వాహనాన్ని కూడా రూపొందిస్తోంది. 5 నుంచి 25 కిలోవాట్ల శ్రేణిలో పలు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యూబ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25,000 యూనిట్లకు పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండు ఈ–స్కూటర్లు ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ విక్రయాలు ఈ క్వార్టర్‌లోనే ప్రారంభించనున్నట్లు రాధాకృష్ణన్ చెప్పారు. -
వామ్మో.. వాహనదారుడిని కుమ్మేసిన ఆవు.. వీడియో వైరల్
బ్రస్సీలియా: ఒక్కొసారి మూగజీవాలు రోడ్డుదాటుతున్నప్పుడు వేగంగా ప్రయాణిస్తున్న వాహానాలకు అడ్డుపడుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలతోపాటు మూగజీవాలు కూడా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం. ఈ కోవకు చెందిన ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో చోటుచేసుకుంది. చాపెకో వీధి సందులో నుంచి ఒక ఆవు ఒక్కసారిగి రోడ్డుపైకి దూసుకొచ్చింది. అప్పుడు రోడ్డుపై అనేక వాహానాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ఆవు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రదారుడిని వెళ్లి ఢీకొట్టింది. ఈ హఠాత్పరిమాణంతో బైకర్ రోడ్డుపై పడ్డాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలు కూడా ఆగిపోయాయి. ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటం.. ఎక్కువ స్పీడ్ లేకపోవడం వలన చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ సంఘటన గత నెల అక్టోబరు 27న జరిగింది. దీన్నిరోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి తన మిత్రుడికోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆవు పరుగెత్తుకురావడాన్ని గమనించి వీడియోతీశాడు. ఈ తర్వాత.. వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు..’, ‘పాపం.. ఆవుకు కూడా గాయమైనట్టుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
అలా గంటకు ఆరుగురు మత్యువాత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ఆధారపడి తిరుగుతున్నారు. కరోనా వైరస్ విజంభణ నేపథ్యంలో ఈ ద్విచక్ర వాహనాల రద్దీ బాగా పెరిగింది. దేశంలో పలు కారణాల వల్ల ఈ వాహనాలపై ప్రయాణించేవారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. వారిలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. దేశంలో గంటకు ఆరుగురు మరణిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2019లో రోడ్డు ప్రమాదాల్లో మూడోవంతకుపైగా అంటే, 37 శాతం మంది టూ వీలర్ రైడర్స్ మరణించారని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సంస్థ మంత్రిత్వ శాఖా ఓ నివేదికలో వెల్లడించింది. రైడర్లకు సరైన శిక్షణ లేకపోవడం, లైసెన్స్‌లు ఇవ్వడంలో పొరపాట్లు చోటు చేసుకోవడం, అధ్వాన్నమైన రోడ్లు, సురక్షితంకానీ హెల్మట్ల వల్లనే రైడర్ల ప్రాణాలు పోతున్నాయి. సరైన హెల్మట్లను ఉపయోగించినట్లయితే 42 శాతం ప్రాణాంతక గాయాల నుంచి టూ వీలర్ రైడర్లను రక్షించవచ్చని, 69 శాతం వరకు తలకు తగిలే గాయాల నుంచి రక్షణ కల్పించ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో సూచించింది. (2019లో చనిపోయి.. 2020లో బ్రతికొచ్చింది!) జాతీయస్థాయిలో తలసరి ఆదాయం రేటు గణనీయంగా పెరిగినాకొద్దీ టూ వీలర్ల సంఖ్య పెరగుతూ వస్తుందని, దేశం ఎంత పేదగా ఉంటే, వద్ధి రేటు అంత ఎక్కువగా ఉంటుందని ‘ది యునైటెడ్ స్టేట్స్ మోటార్ సైకిల్ హెల్మెట్ స్టడీ’లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత జాతీయ సగటు ఆదాయం రేటు బాగా పెరిగింది. దాంతో టూ వీలర్ల కొనుగోలు రేటు బాగా పెరిగిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్’ నిర్వహించిన సర్వేలో తేలింది. 2013 నుంచి 2017 సంవత్సరం మధ్య కాలంలో భారతీయుల సగటు ఆదాయం 28 శాతం పెరిగింది. ఈ కాలంలోనే ఇతర వాహనాల కొనుగోళ్ల శాతం 44 శాతం పెరగ్గా, ఒక్క టూ వీలర్ల కొనుగోళ్ల శాతం 46 శాతం పెరగడం విÔó షం. గతేడాదిలో దేశంలో 2.12 కోట్ల టూ వీలర్లు అమ్ముడు పోయాయి. (నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్) ఈ నేపథ్యంలో టూ వీలర్ట కొనుగోళ్ల పెరగుదలతోపాటు వాటి ప్రమాదాలు ఎక్కువే అయ్యాయి. మతుల సంఖ్య కూడా పెరగుతూ వస్తోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరగు పర్చాలని, వాహనాలను నడపడంలో తగిన శిక్షణ కచ్చితంగా ఇవ్వాలని, అందుకు అనుగుణంగా లైలెన్సింగ్ విధానంలో అవకతవకలను సమూలంగా నిర్మూలించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా బారీ జరిమానాలు విధించడంతోపాటు ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకరావాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మాస్ మార్కెట్లోకి బెనెల్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్ బెనెల్లి... భారత్‌లో మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జబక్ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ఆ సమయానికి తమ తయారీ కేంద్రం కూడా రెడీ అవుతుందని, ఆ ప్లాంటులో ఇవి రూపుదిద్దుకుంటాయని చెప్పారాయన. 200 సీసీలోపు మోడళ్ల ధర ఎక్స్‌షోరూంలో రూ.2 లక్షల లోపే ఉంటుందని పేర్కొన్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బెనెల్లి ప్రస్తుతం 18 రకాల మోడళ్లను విక్రయిస్తోంది. డిసెంబర్లో మూడు మోడళ్లు.. మహవీర్ గ్రూప్ కంపెనీ అయిన ఆదీశ్వర్ ఆటోరైడ్ ఇండియా (ఏఏఆర్ఐ) భారత్‌లో బెనెల్లి పంపిణీదారుగా ఉంది. హైదరాబాద్‌లో ఏఏఆర్ఐ అసెంబ్లింగ్ ప్లాంటును నెలకొల్పింది. ఈ కేంద్రంలో డిసెంబర్ తొలి వారంలో ద్విచక్ర వాహనాల అసెంబ్లింగ్ మొదలు కానుంది. రెండో వారం నుంచి ఇవి విక్రయ కేంద్రాలకు చేరతాయని వికాస్ వెల్లడించారు. ‘అసెంబ్లింగ్ ప్లాంటు కోసం కంపెనీ రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టింది. వార్షిక సామర్థ్యం ఒక షిఫ్టుకు 7,000 యూనిట్లు. బెనెల్లి టీఎన్టీ 300, 302ఆర్, టీఎన్టీ 600ఐ బైక్‌లను రీలాంచ్ చేస్తున్నాం. వీటి ధరలు ఎక్స్ షోరూంలో వరుసగా రూ.3,50,000, రూ.3,70,000, రూ.6,20,000గా ఉంటాయి. అయిదేళ్ల వారంటీ ఇస్తున్నాం. ప్రస్తుతం 15 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. మరో 25 కేంద్రాలు మార్చికల్లా రానున్నాయి’ అని వివరించారు. -
జోరు తగ్గిన హీరో మోటో
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల అగ్రగామి సంస్థ హీరో మోటో కార్ప్ జూన్ త్రైమాసికం ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. నికర లాభం అర శాతం తగ్గి రూ.909 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం రూ.8,809 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.914 కోట్లు, ఆదాయం రూ.8,622 కోట్లుగా ఉన్నాయి. రాయిటర్స్ పోల్‌లో లాభం రూ.1,001 కోట్లు, ఆదాయం రూ.9,067 కోట్ల మేర ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. ప్రధానంగా రెండంశాలు కంపెనీ లాభాలను ప్రభావితం చేశాయి. తయారీ పరంగా హరిద్వార్‌లోని కేంద్రానికున్న పన్ను ప్రయోజనాలు ఈ ఏడాది మార్చితో ముగిసిపోయాయి. ఇక కమోడిటీ వ్యయాలు పెరిగిపోవడంతో ఎబిటా మార్జిన్ 15.6 శాతానికి పరిమితమైంది. అయితే, ఎబిటా మరీ పడిపోకుండా కంపెనీ ధరల పెంపు, వ్యయాలకు కోత వంటి చర్యలను తీసుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎబిటా 16.3 శాతంగా ఉంది. అయితే, క్రితం ఏడాది ఇదే కాలంలో జీఎస్టీ లేనందున, నాటి ఫలితాలతో పోల్చి చూడడం సరికాదని కంపెనీ పేర్కొంది. సవాళ్లున్నా ముందుకే ‘‘అంతర్జాతీయ ధోరణులతో కమోడిటీ ధరల్లో అస్థిరతల కారణంగా వాహన పరిశ్రమపై గణనీయమైన ప్రభావం పడింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఈఏడాది మిగిలిన కాలంలో పరిశ్రమ వృద్ధి కొనసా గుతుంది. వర్షాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాలతో రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. రానున్న నెలల్లో ప్రీమియం మోటారు సైకిళ్లు, స్కూటర్ల విడుదలతో సానుకూల దిశగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఏథెర్ ఎనర్జీలో రూ.130 కోట్ల పెట్టుబడులు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథెర్ ఎనర్జీలో మరో రూ.130 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 66,320 కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లు (సీసీడీ) ఏథెర్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. ‘‘సీసీడీల మార్పిడి తర్వాత ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో వాటా పెరుగుతుంది. ఈ లావాదేవీ ఆగస్ట్ 31కి పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో కార్ప్‌నకు 32.31 శాతం వాటా ఉంది. కీలక గణాంకాలు ఇవీ... ►జూన్ త్రైమాసికంలో కంపెనీ 21,06,629 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల సంఖ్య 18,53,647గా నమోదైంది. ► హరిద్వార్ యూనిట్‌కు పన్ను మినహాయింపులు తీరిపోవడం వల్ల లాభంపై ప్రభావం పడినట్టు కంపెనీ తెలిపింది. పన్ను వ్యయాలు రూ.379 కోట్ల నుంచి రూ.433 కోట్లకు పెరిగాయి. ► ముడి పదార్థాల వ్యయాలు రూ.5,475 కోట్ల నుంచి రూ.6,131 కోట్లకు పెరిగాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు రూరల్: మండలంలోని శెట్టిగుంట సమీపంలో కడపతిరుపతి హైవే పక్కన బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరంగుల వెంకట రమణ (25) మృతి చెందాడు. ఏపీ 04 ఏయూ 5158 నంబరు ద్విచక్ర వాహనంలో వెళతూ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్న ఆయనను ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గుర్తించి వెంటనే 108కు ఫోన్ చేశారు.108 వాహనంలో గాయపడిని వ్యక్తిని తిరుపతి రుయాకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి బంధువు ఆవులకుంట రామయ్య తెలిపారు. మృతుడికి భార్య , 2 సంవత్సరాల కుమార్తె మీనాక్షి ఉన్నారు. మృతుని స్వగ్రామం జానకిపురం కాగా, వీవీ.కండ్రిక పంచాయతీలో ఉన్న ఆర్.వడ్డిపల్లెలో ఇతను వివాహం చేసుకొని అక్కడే కాపురం ఉంటున్నాడు.