దేశంలో ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక లేన్ రూపొందించే ప్రణాళికను పరిశీలిస్తోంది. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
రోడ్డుపై అన్ని రకాల వాహనాలు ఏకకాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది. వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు లేన్లను ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం ద్విచక్ర వాహనాలతో ముడిపడినవే ఉంటున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం 2022 లో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,43,366 మంది గాయపడ్డారు.
గత ఏడాది దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment