సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రవాణా వ్యవస్థ అవసరమైన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై ఆధారపడి తిరుగుతున్నారు. కరోనా వైరస్ విజంభణ నేపథ్యంలో ఈ ద్విచక్ర వాహనాల రద్దీ బాగా పెరిగింది. దేశంలో పలు కారణాల వల్ల ఈ వాహనాలపై ప్రయాణించేవారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. వారిలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. దేశంలో గంటకు ఆరుగురు మరణిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2019లో రోడ్డు ప్రమాదాల్లో మూడోవంతకుపైగా అంటే, 37 శాతం మంది టూ వీలర్ రైడర్స్ మరణించారని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సంస్థ మంత్రిత్వ శాఖా ఓ నివేదికలో వెల్లడించింది. రైడర్లకు సరైన శిక్షణ లేకపోవడం, లైసెన్స్‌లు ఇవ్వడంలో పొరపాట్లు చోటు చేసుకోవడం, అధ్వాన్నమైన రోడ్లు, సురక్షితంకానీ హెల్మట్ల వల్లనే రైడర్ల ప్రాణాలు పోతున్నాయి. సరైన హెల్మట్లను ఉపయోగించినట్లయితే 42 శాతం ప్రాణాంతక గాయాల నుంచి టూ వీలర్ రైడర్లను రక్షించవచ్చని, 69 శాతం వరకు తలకు తగిలే గాయాల నుంచి రక్షణ కల్పించ వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో సూచించింది. (2019లో చనిపోయి.. 2020లో బ్రతికొచ్చింది!)
జాతీయస్థాయిలో తలసరి ఆదాయం రేటు గణనీయంగా పెరిగినాకొద్దీ టూ వీలర్ల సంఖ్య పెరగుతూ వస్తుందని, దేశం ఎంత పేదగా ఉంటే, వద్ధి రేటు అంత ఎక్కువగా ఉంటుందని ‘ది యునైటెడ్ స్టేట్స్ మోటార్ సైకిల్ హెల్మెట్ స్టడీ’లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత జాతీయ సగటు ఆదాయం రేటు బాగా పెరిగింది. దాంతో టూ వీలర్ల కొనుగోలు రేటు బాగా పెరిగిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్’ నిర్వహించిన సర్వేలో తేలింది. 2013 నుంచి 2017 సంవత్సరం మధ్య కాలంలో భారతీయుల సగటు ఆదాయం 28 శాతం పెరిగింది. ఈ కాలంలోనే ఇతర వాహనాల కొనుగోళ్ల శాతం 44 శాతం పెరగ్గా, ఒక్క టూ వీలర్ల కొనుగోళ్ల శాతం 46 శాతం పెరగడం విÔó షం. గతేడాదిలో దేశంలో 2.12 కోట్ల టూ వీలర్లు అమ్ముడు పోయాయి. (నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్)
ఈ నేపథ్యంలో టూ వీలర్ట కొనుగోళ్ల పెరగుదలతోపాటు వాటి ప్రమాదాలు ఎక్కువే అయ్యాయి. మతుల సంఖ్య కూడా పెరగుతూ వస్తోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే రద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వ రవాణా వ్యవస్థను మెరగు పర్చాలని, వాహనాలను నడపడంలో తగిన శిక్షణ కచ్చితంగా ఇవ్వాలని, అందుకు అనుగుణంగా లైలెన్సింగ్ విధానంలో అవకతవకలను సమూలంగా నిర్మూలించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా బారీ జరిమానాలు విధించడంతోపాటు ప్రజల్లో అవగాహన, చైతన్యం తీసుకరావాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment