న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ వచ్చే ఏడాది వ్యవధిలో తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. అలాగే విద్యుత్ త్రిచక్ర వాహనాన్ని కూడా రూపొందిస్తోంది. 5 నుంచి 25 కిలోవాట్ల శ్రేణిలో పలు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యూబ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25,000 యూనిట్లకు పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండు ఈ–స్కూటర్లు ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ విక్రయాలు ఈ క్వార్టర్‌లోనే ప్రారంభించనున్నట్లు రాధాకృష్ణన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment