driver ability
-
భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..
ఓ టీనేజ్ అమ్మాయి లండన్ ప్రిన్స్ చార్లెస్‌ని కలిసే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ఆయన చేతుల మీదుగా లండన్ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంది. ఎవరా యువతి, ఏం సాధించిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెచ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందని ఆర్తీ అనే 18 ఏళ్ల రిక్షా డ్రైవర్ లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుని అందుకుంది. ఈ అవార్డు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్ట్చే స్పాన్సర్ చేయబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఇంగ్లీష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తీ ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతులను ప్రేరేపించినందుకుగానూ ఆమెకు ఈ లండన్ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పింక్ రిక్షా ఇనిషియేటివ్ అంటే..ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఇది రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది మహళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధలన గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ముఖ్యంగా వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు. చెప్పాలంటే యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్ కూడా. చాలా చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికిగానూ ఈ ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టాయి. " అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీపుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది" ప్రిన్స్ ట్రస్ట్. ఆర్తీ తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా ఎలా మారిందంటే..ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ఆర్తీ మీడియాతో మాట్లాడుతూ..ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నా. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించింది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలన కూడా నెరవేర్చగలుగుతున్నాను. ఈ చోరవే నాకు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ని కలిసే అవకాశం లభించేలా చేసింది.ఇది ఒక అద్భుతమైన అనుభవంగా పేర్కొంది ఆర్తీ . అంతేగాదు చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్ పట్ల ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. ఆయనతో ఆర్తి తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహానం అని గర్వంగా చెప్పుకొచ్చింది కూడా. ఐదేళ్ల కుమార్తె ఉన్న ఆర్తీ ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొని ఇతర బాలికలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొంది. (చదవండి: 'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?) -
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్‌ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్‌లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్‌కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్‌ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్‌ను వదిలేశారు. జీ20 మీటింగ్‌కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్‌కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం!
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ర్యాపిడోలో రైడ్ బుక్ చేశాడు. కొంతసేపటికి ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మోటార్‌సైకిల్‌పై రావడంతో ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎంతో ఆనందపడిపోయాడు. అయితే అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకున్న అతను కంగుతిన్నాడు. నిషిత్ పటేల్ తన ర్యాపిడో రైడ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుబెర్నెట్స్ మీట్అప్కు వెళ్లేందుకు అతను ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ర్యాపిడో డ్రైవర్ హై ఎండ్ మోటార్ సైకిల్‌పై రావడంతోపాటు, అతనొక నూతన టెక్నాలజీని రూపొందించే ఇంజినీర్ అని తెలిసేరికి అతను కంగుతిన్నాడు. పైగా అతను తాను పనిచేస్తున్న కుబెర్నెట్స్ క్లస్టర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిసే సరికి నిషిత్ పటేల్ షాకయ్యాడు. ఈ పోస్టుకు 6 వేలకు పైగా వ్యూస్ దక్కడంతో పాటు యూజర్స్ నుంచి లెక్కకుమించిన కామెంట్స్ వస్తున్నాయి. ఒక యూజర్ ‘మీరు అతని సైడ్ బిజినెస్ టర్నోవర్ ఎంతో అడగాల్సింది’ అని నిషిత్‌ను అడగగా, ‘అవును ఆ తరువాత నా మదిలో అదే ప్రశ్న వచ్చిందని’ నిషిత్ తెలిపారు. మరో యూజర్ ‘అయితే ఏమైంది? అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యాధికులు ఎన్నో ఏళ్లుగా ఓలా, ఉబర్, ర్యాపిడోలను నడుపుతున్నారు’ అని కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట! You won't believe the crazy @peakbengaluru moment I had today! On my way to a Kubernetes meetup, my Rapido captain pulled up on a Royal Enfield Hunter. Turns out he's a DevOps engineer at a company managing enterprise Kubernetes clusters. Just another day in India's tech capital — Nishit Patel (@nishit130) August 5, 2023 -
కష్టాలకు లొంగని మహిళా ట్యాక్సీ డ్రైవర్.. విదేశాల్లో చదువుకునే స్థాయికి..
ముంబయి: కష్టాలకు లొంగని తత్వం తనది. ఎక్కడో మారుమూల గిరిజన గూడెంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. పరిస్థితులు పరీక్షించినా.. కుటుంబ భారం మీద పడినా.. అమ్మాయి డ్రైవారా..! అంటూ సమాజం చిన్నచూపు చూసినా బెరుకులేని జీవిత ప్రయాణం సాగించింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహాయంతో చివరికి విదేశాల్లో చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకుంది. ఆ యువతి పేరు కిరణ్ కుర్మా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని రేగుంత గ్రామానికి చెందినది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణకు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రేగుంత నుంచి సిరోంచ వరకు 140 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపింది. ప్రస్తుతం ఆమెకు మూడు ట్యాక్సీ లు ఉన్నాయి. మావోయిస్టు ప్రాంతంలో సాహసంతో ట్యాక్సీ సేవలు అందించినందుకు వరల్డ్ క్రాస్ అనే సంస్థ ఆమెను గుర్తించింది. ఇప్పటికీ ఆమెకు 18 అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. తన ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను సంప్రదించింది. దీంతో ఆయన రూ.40 లక్షల స్కాలర్షిప్ను మంజూరు చేశారు. యూకేలో ఏడాది పాటు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో ఆమె చదవనున్నారు. మరో రెండేళ్ల పాటు అక్కడే ఓ సంస్థలో పనిచేయనున్నారు. ఇదీ చదవండి: IIT Bombay: ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ.. -
నువ్వు దేవుడివి సామీ.. మీరు మాత్రం ఇలా చేయకండి..
అలసత్వంతో రోడ్డు దాటుతున్న సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను చాలానే చూసి ఉంటాం. క్షణం కాలంలో చేసే చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. వివరాల ప్రకారం.. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకొని ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు.. సడెన్‌గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో స్పీడ్‌గా వస్తున్న కారు.. అతడికి ఢీకొట్టేది. వెంటనే తేరుకున్న డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బాలుడిని అడ్డుతప్పించాడు. కారు స్టీరింగ్ ఒక్కసారిగా తిప్పడంతో కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన అనంతరం.. తేరుకున్న తల్లి బాలుడిపై కోపంతో ఒక్కటిచ్చింది. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. డ్రైవర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నీ వల్ల ఓ ప్రాణం నిలబడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు. Driver Saved his life ❤️ pic.twitter.com/5xabd9XqlP — CCTV IDIOTS (@cctvidiots) April 11, 2023 -
ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం.. ఏది వైరల్!
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ట్విట్టర్లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్‌గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి. అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్‌తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్‌లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU — Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022 ఇక ఇంటర్నెట్లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
చెరువులో పడిన స్కూల్ బస్సు
పాలకొల్లు సెంట్రల్ : పట్టణానికి చెందిన నారాయణ స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్, స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం గం 5.30గంటలకు స్థానిక బంగారువారి చెరువుగట్టు సాయిబాబా గుడి రోడ్డులో నుంచి వస్తున్న నారాయణ స్కూల్ బస్సుకు ఎదురుగా సైకిల్‌పై విద్యార్థి రావడంతో డ్రైవర్ అతనిని తప్పించేందుకు మార్జిన్లోకి వెళ్లాడు. ఈ సమయంలో ఈ తరుణంలో బస్సు అదుపుతప్పి అర్భన్ హెల్త్ సెంటర్ వద్ద ఎదురుగా ఉన్న శ్మశానం చెరువులో పడిపోయింది. బస్సు పడిపోయిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తాడి అరుణ్‌కుమార్ లోపల ఉన్న 17 మంది విద్యార్థులను బస్సుపైకి చేర్చగా, స్థానికులు కుక్కల రాజు, పెండ్రి పిచ్చయ్య, సైమన్ వారిని బయటకు సురక్షితంగా తీసుకువచ్చారు. అదృష్టం బాగుంది అదృష్టం బాగుండి పెనుప్రమాదం తప్పిందని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి అక్షశ్రీసాయి తండ్రి పెచ్చెట్టి శ్రీనివాస్ చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆయన తనకు నలుగురు సంతానంలో ఒక్కడే ఉన్నాడని, అదృష్టం బాగుండి ప్రమాదం నుంచి బయటపడ్డాడని కంటతడిపెట్టాడు. చెరువు మార్జిన్ పూడిక లోపమే కారణం ఇటీవల ఈ చెరువుకు మార్జిన్ పనులు చేపట్టారు. అరకొర పనులతో మమ అనిపించారు. మార్జిన్లో మట్టి ఉండడంతో నేల ఉందనుకుని బస్సును డ్రైవర్ పక్కకు మళ్లించాడు. అక్కడ మట్టి బలంగా లేకపోవడంతో బస్సు అదుపుతప్పి చెరువులోకి పడిపోయింది. అదృష్టవశాత్తూ.. విద్యార్థుల బస్సు చెరువులో పడినా ఎవరికీ ఏమీ కాలేదు. వెంటనే అక్కడ మార్చిన్‌ను బలంగా పూడ్చాలని, ఆ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.