ఫ్రీజర్‌లో చిన్నచిన్న మంచుకొండలా ఐస్ పేరుకుపోతుంది. ఇలా గడ్డకట్టిన ఐస్‌పైన కొన్ని ఆహార పదార్థాలు పెడితే పాడవుతాయి. ఐస్ ఒకపట్టాన కరగదు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్య తీరిపోతుంది.
కొండలా ఉన్న మంచు మాయం కావాలంటే..
👉: రిఫ్రిజిరేటర్ పవర్ స్విచ్ ఆపేసి గడ్డకట్టిన ఐస్‌ను కరిగించాలి.
👉: ఇప్పుడు బంగాళదుంపను శుభ్రంగా కడిగి రెండు ముక్కలు చేయాలి. రెండు ముక్కలతో ఫ్రీజర్ ర్యాక్స్‌ను రుద్దాలి. మూలల్లో కూడా జాగ్రత్తగా రుద్దాలి. ఇలా చేస్తే ఫ్రీజర్‌లో త్వరగా మంచు ఉండలు ఏర్పడవు.
👉: అవసరాన్ని బట్టి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను మార్చుకుంటూ ఉంటే ఐస్ ఏర్పడదు.
👉: ఫ్రీజర్‌లో అతిగా ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఎక్కువ మొత్తంలో వస్తువులు పెడితే ఐస్ ఏర్పడడానికి ఖాళీ ఉండదని కుక్కేస్తుంటారు. ఫ్రీజర్‌లో ఎంత ఎక్కువమొత్తంలో వస్తువులు ఉంటే అంత ఎక్కువ తేమ ఏర్పడి ఐస్‌గా మారుతుంది.
👉: చాలామంది ఇంటిని శుభ్రం చేస్తుంటారు కానీ రిఫ్రిజిరేటర్‌ను పెద్దగా పట్టించుకోరు. కనీసం పదిరోజులకొకసారి స్విచ్ ఆపేసి, లోపల ఉన్న పదార్థాలను బయటపెట్టి శుభ్రం చేస్తే ఐస్ సమస్య అంతగా ఉండదు. గార్డెన్‌లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే...
👉: అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. ∙అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్‌లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ∙ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. ∙పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ∙ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ∙ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గిపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది.
(చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!)
Comments
Please login to add a commentAdd a comment