
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది.
తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734లో సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు.
ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ నెంబర్ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.
కేటగిరీ వారిగా ధరలు..
సింగిల్ షేరింగ్:
3(ఏసీ): రూ.6790లు స్టాండర్డ్(ఎస్‌ఎల్): రూ.4940లు
ట్విన్ షేరింగ్
3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్‌ఎల్): రూ.3800లు
త్రిపుల్ షేరింగ్
3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్‌ఎల్): రూ.3800లు
పిల్లలకు బెడ్(5 నుంచి 11 ఏళ్లు)
3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్‌ఎల్): రూ.2890లు
పిల్లలకు బెడ్ లేకుండా
3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్‌ఎల్): రూ.2890లు
(చదవండి: