Govindamma
-
సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలా..!
తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. నిత్యం భక్తుల రద్దీగా ఉండే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలంటే అంత సులభం కాదు. అయితే గంటల కొద్దీ.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడకుండా కేవలం ఒక్కరోజులోనే స్వామి దర్శనం చేసుకునేలా ఐఆర్సీటీసీ ‘గోవిందం’ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ‘గోవిందం టూర్’లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేస్తారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734లో సాయంత్రం 5.25 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 6.10గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు రాత్రి 7.38 గంటలకు చేరుతుంది. తెలంగాణ నుంచి ఏపీలోని ప్రముఖ పట్టణాల మీదుగా ‘గోవిందం టూర్’ రైలు ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి హోటల్‌కు భక్తులు వెళ్లి చెక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరుతారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6.25 గంటలకు ట్రైన్ నెంబర్ 12733 ఎక్కుతారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, అక్కడ నుంచి లింగంపల్లికి ఉదయం 7.35గంటలకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులకు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏసీ వాహనంలో రవాణా, హోటల్లో బసతో పాటు, వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం స్పెషల్ ఎంట్రీని రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ టూర్లో బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ తరహా టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. కేటగిరీ వారిగా ధరలు..సింగిల్ షేరింగ్: 3(ఏసీ): రూ.6790లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.4940లుట్విన్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుత్రిపుల్ షేరింగ్3(ఏసీ): రూ.5660లు స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.3800లుపిల్లలకు బెడ్(5 నుంచి 11 ఏళ్లు)3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు పిల్లలకు బెడ్ లేకుండా3(ఏసీ): రూ.4750ల స్టాండర్డ్(ఎస్ఎల్): రూ.2890లు (చదవండి: -
లోకేష్ ఛాంబర్ ఎదుట మహిళ ఆవేదన
- 8 నెలలుగా పడిగాపులు - మంత్రి లోకేష్ ఛాంబర్ ఎదుట మహిళ ఆవేదన - ఇద్దరు పిల్లలకు తీవ్ర చర్మ వ్యాధితో నరకయాతన సాక్షి, అమరావతి: తన ఇద్దరు పిల్లలకు తీవ్రమైన చర్మ వ్యాధి రావడంతో చికిత్సకు సహాయం చేయాలని ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఒక మహిళ తీవ్ర ఆందోళనకు గురై మంత్రి లోకేష్ ఛాంబర్ ఎదుట పడిపోయింది. విజయవాడ రాణిగారితోటకు చెందిన మూలె గోవిందమ్మ (35) ఇద్దరు పిల్లలు మోహన్‌రెడ్డి (10), నాగేంద్రకుమారి (15)లు కొన్నేళ్లుగా తీవ్ర చర్మవ్యాధితో బాధపడుతున్నారు. ఒళ్లంతా పొట్టు, పొలుసులా వచ్చింది. తాపీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించే గోవిందమ్మ భర్త, ఆమె చాలా ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమిటో గుర్తించలేకపోయారు. పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత లేక 8 నెలలుగా సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మధ్యలో ఒకసారి సీఎం చంద్రబాబును కలిస్తే పాపకు మాత్రం వికలాంగులకిచ్చే పెన్షన్, మందుల కోసం కొద్ది డబ్బు ఇస్తున్నారు. బాబుకు ఎలాంటి సహాయం అందడంలేదు. ఇద్దరికీ జబ్బు రోజురోజుకూ ముదిరిపోతుండడంతో గోవిందమ్మ సచివాలయంలోని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలోనికి అనుమతించలేదు. శుక్రవారం కూడా పిల్లలతో గోవిందమ్మ సచివాలయానికి రాగా ముఖ్యమంత్రి లేరని, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ను కలవాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. దీంతో ఉదయం నుంచి ఇద్దరు పిల్లలతోనే లోకేష్ ఛాంబర్ వద్ద పడిగాపులు కాసినా పట్టించుకోలేదు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గోవిందమ్మ ఒక్కసారిగా కిందపడి కొట్టుకోవడం మొదలు పెట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా బయటకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తేరుకుంది. తన పిల్లలకు బాగోలేదని వాపోయింది. -
నైటింగేల్ గోవిందమ్మ
అమ్మలకు అమ్మ తల్లి కడుపులో నవమాసాలు కదలాడి బాహ్య ప్రపంచంలోకి రాగానే బిడ్డకు తొలి స్పర్శ నందించి తొలి ఊపిరికి ఆసరాగా నిలిచిన ఆ చేతులు... బిడ్డకు జన్మనిచ్చే క్షణాల్లో మానవశక్తికి అతీతంగా వంద డెసిబుల్స్ బాధను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిచ్చి పునర్జన్మను పొందే ఆ తల్లికి ఆసరానిచ్చే∙ఆ చేతులు... రోగులకు ఆప్యాయతతో సేవ చేసిన ఆ చేతులు... ఇప్పుడు అత్యున్నత పురస్కారాన్ని అందుకోబోతున్నాయి. ఎంచుకున్న వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయటంతో పాటు ఆ వృత్తిలో కొనసాగటం అదృష్టంగా భావించి ముందుకు సాగితే పురస్కారాలు, ప్రశంసలు వారి చెంతకు చేరుతూనే ఉంటాయనడానికి ఇదే నిదర్శనం. నర్సింగ్ వృత్తిని అత్యంత పవిత్రమైనదిగా, సేవకు ప్రతిరూపంగా మలిచిన ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ పేరిట జాతీయ స్థాయిలో అందించే ఆవార్డుకు ఆంధ్రప్రదేశ్ తరపున నర్స్ గోవింద ‘అ’మ్మ ఎంపికయ్యారు. ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక నైటింగేల్ అవార్డును ఈనెల 12న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆమె అందుకోనున్నారు. ఈ అవార్డు కింద మెడల్, ధ్రువపత్రంతో పాటు రూ.50 వేలు నగదు బహుమతి అందిస్తారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఆళ్లమూడి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు వేజెండ్ల చెంచురామయ్య, నాగేంద్రమ్మ దంపతులకు 1976 మార్చి 15న పుట్టిన గోవిందమ్మ రేపల్లెలోని ఎస్‌ఎన్‌బీటీ డిగ్రీ కశాలలో డిగ్రీ, విజయవాడలోని యూనివర్శిటీ జనరల్ ఆసుపత్రిలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేశారు. అనంతరం వృత్తిలో కొనసాగుతూ ఇగ్నో నుంచి దూరవిద్య ద్వారా బీఎస్సీ(నర్సింగ్), ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ద్వారా ఎంబీఎ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశారు. 1999 జులై 9న స్టాఫ్ నర్సుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2003 వరకు కనగాల, 2004 నుంచి 2007 వరకు చండ్రాజుపాలెం, 2007 నుంచి 2013 వరకు కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 2013 నుంచి ప్రస్తుతం కనగాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు అందుకోనున్న సందర్భంగా గోవిందమ్మ గురించి ఆమె మాటల్లోనే... అత్తమ్మ అండ... ఆయన ప్రోత్సాహం... ఉద్యోగం వచ్చిన వెంటనే నామేనమామ పెదపూడి కోటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావుతో వివాహం అయింది. అప్పటినుంచి అత్తమామలతో కలిసే ఉంటున్నాను. నా భర్త శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపీయూపీ పాఠశాల, ఆరేపల్లెలో పనిచేస్తున్నారు. మాపాప నాగశ్రీ ప్రవల్లిక, బాబు రోహిత్ చంద్. అందరి పిల్లలనూ నేను కాపాడితే, నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడింది మాత్రం మా అత్తమ్మ యశోదే. నా భర్త, అత్తమ్మల అండదండలు ఉండబట్టే నేను ఈ రోజు అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా నిరుపేదలైన గర్భిణులు కాన్పులకు వచ్చేవారు. అప్పుడు ఏమాత్రం విసుగు లేకుండా నవ్వుతూ నన్ను నా భర్త ఆసుపత్రిలో వదిలిపెట్టడంతో పాటు ఆయన కూడా ఆసుపత్రి ఆవరణలోనే నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఎన్నో. ప్రసవం అనంతరం తల్లీబిడ్డా సురక్షితం అన్న తరువాత నాతో పాటు నాకుటుంబ సభ్యులూ ఆనంద పడటం అలవాటైపోయింది. కాన్పు జరిగేవరకూ తిట్లూ చీవాట్లూ... కాన్పు తర్వాత దణ్ణాలూ... దీవెన లూ! కాన్పుల సమయంలో గర్భిణీలు పడే బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో ఆమె బంధువులు మాపై కోపాన్నీ, అసహనాన్నీ ప్రదర్శిస్తుంటారు. అయినప్పటికీ తల్లి, బిడ్డల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ఓర్పుతో నేర్పుగా కాన్పులను పూర్తి చేయాల్సి ఉంటుంది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసిన వెంటనే అప్పటివరకు ఎంతో కోపంతో మా మీద చిరాకు పడిన బంధువులు ఒక్కసారిగా ఎంతో ఆప్యాయతను చూపుతూ ఆత్మీయులుగా మారిపోయే ఆ క్షణం పడిన కష్టాన్ని సైతం మరిపించి ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంతో రిస్క్ చేయాల్సిన పరిస్థితి బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో గర్భిణుల ప్రసవ సమయంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. గ్రామాల్లో గర్భిణీలు నొప్పులు మొదలయ్యాక ఆసుపత్రికి రావటం అలవాటు. అటువంటి పరిస్థితుల్లో ఆర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి వద్దే నొప్పులు ఎక్కువయిన సమయంలో ఆసుపత్రికి వచ్చేవారు. పరిస్థితులు సంక్లిష్టంగా మారిన ఆ క్షణాలలో అప్పటికప్పుడు పెద్దాసుపత్రులను తరలించే అవకాశం ఉండేది కాదు. దాంతో పలు సందర్భాల్లో డాక్టర్ల సలహాలతో రిస్కీ డెలివరీలు చేశాను. అదే పరిస్థితి కనగాల పీహెచ్సీలో ఎదురైంది. ఉబ్బసంతో బాధపడుతున్న ఓ గర్భిణికి నెబ్యూలైజర్ పరికరాలను ఉపయోగించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ల సలహాలతో ప్రసవం చేశాను. తల్లీ బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లారు. కనగాల పీహెచ్సీ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల పీహెచ్‌సీల పరిధిలోని గర్భిణీలు కాన్పులకు కనగాలకు వస్తున్నారు. ప్రసవం జరిగేటప్పుడే కాదు... ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం సలహాలు, సూచనలు అందించటం అలవాటుగా మారింది. కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు ఉద్యోగం, కుటుంబం రెండు రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నాను. రెండిటికి సమాన ప్రాధాన్యతనిస్తూ కదిలితేనే సాఫీగా ముందుకు సాగగలుగుతాం. దానికి తగినట్లుగా ప్రణాళికతో ముందుకు సాగే విధంగా నా భర్త శ్రీనివాసరావు పూర్తి సహకారం అందిస్తున్నారు. కు. ని. ఆపరేషన్లపై అవగాహన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వాహణలో ఆమె పాత్ర సాటిలేనిది. కాన్పులకు వచ్చే మహిళలు, బంధువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై అవగాహన కలిగిస్తూ, ఎఎన్ఎంల సహకారంతో గోవిందమ్మ పనిచేసిన పీహెచ్సీలలో అధిక శాతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించటంలో సఫలీకృతులయ్యారు. వృద్ధుల పట్ల ఆప్యాయతతో... ఆసుపత్రికి వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించి వారికి ధైర్యాన్ని అందిస్తూన్న తీరును గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఆమె పనిచేసిన పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల ప్రజలు నేటికీ గోవిందమ్మను గుర్తు చేసుకుంటున్నారంటే ఆమె సేవానిరతి, రోగుల పట్ల ఆమె చూపే శ్రద్ధాసక్తులను అర్థం చేసుకోవచ్చు. అవార్డులు ఆమె సొంతం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ అందించే ఉత్తమ అవార్డును జిల్లా స్థాయిలో 2010 నుంచి 2016 వరకు వరుసగా ఆరుసార్లు అందుకున్నారు. ప్రభుత్వం అందించే జిల్లా ఉత్తమ స్టాఫ్ నర్సుగా 2014 ఆగస్టులో అవార్డు వరించింది. ఆళ్లమూడిలో ఆనందం తమ ఊరి ఆడబిడ్డకు ప్రతిష్ఠాత్మక పురస్కారం అభించటంతో ఆళ్లమూడి గ్రామంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది. గోవిందమ్మ తల్లితండ్రులకు బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. నాకు ఇష్టమైన నర్సింగ్ కోర్స్‌ను చదివించిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటాను.పలు సందర్భాల్లో డాక్టర్ల సలహాలతో రిస్కీ డెలివరీలు చేశాను.ఉబ్బసంతో బాధపడుతున్న ఓ గర్భిణికి నెబ్యూలైజర్ పరికరాలను ఉపయోగించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో డాక్టర్ల సలహాలతో ప్రసవం చేశాను. నా కుటుంబ సభ్యుల సహకారం ఉండబట్టే నేను ఈ పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పొచ్చు. – గడ్డం వాసు, సాక్షి, రేపల్లె -
పవర్‌లిప్టింగ్‌లో గోవిందమ్మకు బంగారు పతకం
సింగరాయకొండ: రాష్ట్ర స్థాయి 52 కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరాయకొండ గురుకుల పాఠశాల జూనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ఏ గోవిందమ్మ బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్ డి. జయ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌లిప్టింగ్ పోటీల్లో ఈ ఘనతను సాధించిందన్నారు. ఈ సందర్భంగా గోవిందమ్మను, ట్రైనర్‌గా వ్యవహరించిన జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట కేజీబీవీ పీఈటీ ఉపాధ్యాయిని బి హబ్సిబాను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సూపరింటెండెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హత్యా? ఆత్మహత్యా?
-మహిళ అనుమానాస్పద మృతి సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ దక్షిణ ముఖద్వారం సమీపంలోని మంచినీళ్లగుంట పక్కనే పొలాల్లో తడమండలం వేనాడుకు చెందిన వెట్టి గోవిందమ్మ (55) అలియాస్ కిల్లిమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. మంచినీళ్లగుంట పక్కనే పొలం ఉన్న రాయపు హరిహరకుమార్ అనే అతను సోమవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లడంతో శవాన్ని చూసి సమాచారం అందజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై బలమైన గాయాలుండటంతో హత్యగా భావించారు. ముందు గుర్తు తెలియని శవంగా భావించారు. నాగరాజపురంలో మృతురాలు కుమారుడు రవి కూడా అందరిలాగే శవాన్ని చూడడానికి వచ్చి గుర్తించారు. వేనాడులో కాపురం వుంటూ అప్పుడప్పుడు కుమారుడి వద్దకొచ్చి ఉంటుండేది. శనివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి వేనాడుకు వెళ్లిఉంటుందని భావించారు. అయితే ఈమెకు మద్యం అలవాటు ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి కొట్టి చంపేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు వుండడంతో హత్యగానే భావించి కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై గంగాధర్‌రావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత కార్మికురాలి బలవ్మనరణం
ధర్మవరం: అప్పుల భారం తీరే దారికానరాక ఒక చేనేత కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన నర్సింహులు, గోవిందమ్మ(37) దంపతులు చేనేత కార్మికులు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాటు ఇటీవలి కాలంలో నేత పని దొరకటం కష్టమైంది. ఈ నేపథ్యంలో వారికి రూ.3 లక్షల వరకు అప్పులున్నాయి. కుటుంబం గడవటం కష్టం కావటంతో మనస్తాపం చెందిన గోవిందమ్మ శనివారం వేకువజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
75 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
గుంటూరు: ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. 75 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం తిమ్మిల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈనెల 27 రాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్ల మండలానికి చెందిన గోవిందమ్మ(75) గత మూడేళ్లుగా.. తిమ్మిల్లి గ్రామంలో బిక్షాటన చేస్తూ.. శివాలయంలో నివాసముంటోంది. శనివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు తన దగ్గరకు వచ్చారని అందులో సైదులు (40) అనే వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.