చేనేత కార్మికురాలి బలవ్మనరణం
Published Sat, Jan 16 2016 10:37 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ధర్మవరం: అప్పుల భారం తీరే దారికానరాక ఒక చేనేత కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన నర్సింహులు, గోవిందమ్మ(37) దంపతులు చేనేత కార్మికులు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాటు ఇటీవలి కాలంలో నేత పని దొరకటం కష్టమైంది. ఈ నేపథ్యంలో వారికి రూ.3 లక్షల వరకు అప్పులున్నాయి. కుటుంబం గడవటం కష్టం కావటంతో మనస్తాపం చెందిన గోవిందమ్మ శనివారం వేకువజామున ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Advertisement
Advertisement