ఆటోడ్రైవర్‌ ఉసురు తీసిన అప్పులు | Loans made by auto driver | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ ఉసురు తీసిన అప్పులు

Published Tue, Aug 8 2017 11:07 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Loans made by auto driver

ధర్మవరం టౌన్: అప్పులు ఓ ఆటో డ్రైవర్‌ ఉరుసు తీశాయి. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న బాలకృష్ణ (34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అవసరాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లక్ష రూపాయల దాకా అప్పులు చేశాడు. ఆటో ద్వారా సంపాదన కూడా తగ్గడం, రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారుజామున గాంధీనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య లక్ష్మిదేవి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement