
సాక్షి, సత్యసాయి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతన్నల సంఘీభావం తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులు ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
కాగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం పేరుతో సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతన్న నేస్తం పథకాన్ని స్వాగతిస్తూ లబ్దిదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శివానగర్ దాకా సాగిన ర్యాలీలో.. జై జగన్ అంటూ ధర్మవరం చేనేత కార్మికులు నినాదాలు చేశారు.