ఓ కామాంధుడు రెచ్చిపోయాడు.
గుంటూరు: ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. 75 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం తిమ్మిల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఈనెల 27 రాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పిడుగురాళ్ల మండలానికి చెందిన గోవిందమ్మ(75) గత మూడేళ్లుగా.. తిమ్మిల్లి గ్రామంలో బిక్షాటన చేస్తూ.. శివాలయంలో నివాసముంటోంది. శనివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు తన దగ్గరకు వచ్చారని అందులో సైదులు (40) అనే వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.