ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ 55 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగలు అత్యాచారం జరిపి ఉరివేశారు.
ముజుఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ 55 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగలు అత్యాచారం జరిపి ఉరివేశారు. ఈ ఘటన ముజుఫర్ నగర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి విచారణ చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు.
ఇక ఇదే జిల్లాలో మరో హత్య కూడా వెలుగు చూసింది.ముత్‌బార్ గ్రామంలో ఓ 20 ఏళ్ల యువకుడిని అగంతకులు తుపాకీతో కాల్చి చంపారు.మూడు బుల్లెట్ గాయాలైన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న బూత్‌కాల్ పోలీసులు విచారణ చేపట్టారు.