పవర్‌లిప్టింగ్‌లో గోవిందమ్మకు బంగారు పతకం | govindamma bags power lifting gold medal | Sakshi
Sakshi News home page

పవర్‌లిప్టింగ్‌లో గోవిందమ్మకు బంగారు పతకం

Published Thu, Jul 21 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

govindamma bags power lifting  gold medal

సింగరాయకొండ: రాష్ట్ర స్థాయి 52 కేజీల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సింగరాయకొండ గురుకుల పాఠశాల జూనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని ఏ గోవిందమ్మ బంగారు పతకాన్ని సాధించినట్లు ప్రిన్సిపాల్ డి. జయ తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో కృష్ణాజిల్లా నందిగామలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్‌లిప్టింగ్ పోటీల్లో ఈ ఘనతను సాధించిందన్నారు.  

ఈ సందర్భంగా గోవిందమ్మను, ట్రైనర్‌గా వ్యవహరించిన జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట కేజీబీవీ పీఈటీ ఉపాధ్యాయిని బి హబ్సిబాను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సూపరింటెండెంట్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement