freezer
-
ఫ్రిజర్‌లో మంచుకొండలా ఐస్ పేరుకుపోతుందా?
ఫ్రీజర్‌లో చిన్నచిన్న మంచుకొండలా ఐస్ పేరుకుపోతుంది. ఇలా గడ్డకట్టిన ఐస్పైన కొన్ని ఆహార పదార్థాలు పెడితే పాడవుతాయి. ఐస్ ఒకపట్టాన కరగదు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్య తీరిపోతుంది. కొండలా ఉన్న మంచు మాయం కావాలంటే.. 👉: రిఫ్రిజిరేటర్ పవర్ స్విచ్ ఆపేసి గడ్డకట్టిన ఐస్‌ను కరిగించాలి. 👉: ఇప్పుడు బంగాళదుంపను శుభ్రంగా కడిగి రెండు ముక్కలు చేయాలి. రెండు ముక్కలతో ఫ్రీజర్ ర్యాక్స్‌ను రుద్దాలి. మూలల్లో కూడా జాగ్రత్తగా రుద్దాలి. ఇలా చేస్తే ఫ్రీజర్‌లో త్వరగా మంచు ఉండలు ఏర్పడవు. 👉: అవసరాన్ని బట్టి రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలను మార్చుకుంటూ ఉంటే ఐస్ ఏర్పడదు. 👉: ఫ్రీజర్‌లో అతిగా ఆహార పదార్థాలను పెట్టకూడదు. ఎక్కువ మొత్తంలో వస్తువులు పెడితే ఐస్ ఏర్పడడానికి ఖాళీ ఉండదని కుక్కేస్తుంటారు. ఫ్రీజర్‌లో ఎంత ఎక్కువమొత్తంలో వస్తువులు ఉంటే అంత ఎక్కువ తేమ ఏర్పడి ఐస్‌గా మారుతుంది. 👉: చాలామంది ఇంటిని శుభ్రం చేస్తుంటారు కానీ రిఫ్రిజిరేటర్‌ను పెద్దగా పట్టించుకోరు. కనీసం పదిరోజులకొకసారి స్విచ్ ఆపేసి, లోపల ఉన్న పదార్థాలను బయటపెట్టి శుభ్రం చేస్తే ఐస్ సమస్య అంతగా ఉండదు. గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... 👉: అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. ∙అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ∙ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. ∙పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ∙ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ∙ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గిపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!) -
ఫ్రీజర్‌లో భార్య మృతదేహం.. భర్త చెబుతున్నదిదే..
మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఉదంతం వెలుగుచూసింది. ఫ్రీజర్‌లో ఉంచిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 30 గంటల ముందే ఆమె మరణించిందని పోలీసులు చెబుతున్నారు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేశాడని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. అయితే తమ కుమారుని రాకకోసం మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచామని మృతురాలి భర్త చెబుతున్నాడు. ఫ్రీజర్‌లో మృతదేహం.. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళితే రీవా పరిధిలోని జివులా గ్రామానికి చెందిన భరత్ మిశ్రా భార్య సుమిత్ర మృతి చెందిందనే వార్త జూలై 2న మృతురాలి సోదరునికి తెలిసింది. దీంతోవారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతోపాటు భరత్ ఇంటికి చేరుకున్నాడు. భరత్ ఇంటిలో ఫ్రీజర్‌లో ఉన్న అతని భార్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. భర్తే హంతకుడు? మృతురాలి సోదరుడు అభయ్ రాజ్ తన సోదరిని ఆమె భర్త భరత్ కొట్టి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరిని అతను చాలాకాలంగా వేధిస్తూ వస్తున్నాడని, ఇప్పుడు హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచాడని ఆరోపించాడు. అయితే మృతురాలి భర్త.. తన భార్య అనారోగ్యంతో జూన్ 30న మృతిచెందిందని, ఈ విషయాన్ని ముంబైలోని తన కుమారుడు హర్షకు తెలియజేసి, ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచానని చెబుతున్నాడు. కుమారునితో మాట్లాడిన తర్వాతనే.. భరత్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమారుడు ముంబైలో ఉంటాడని, అతను వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని, అందుకే లయన్స్ క్లబ్ నుంచి ఫ్రీజర్ తెప్పించి, దానిలో తన భార్య మృతదేహాన్ని సురక్షితంగా ఉంచానని తెలిపాడు. తన భార్య పైల్స్‌తో బాధపడుతున్నదని, ఈ వ్యాధి తగ్గేందుకు ఆమె మంత్రగాడిని ఆశ్రయించిందని, అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిదని వివరించాడు. తమ కుమారుడు ముంబైలో ఉంటాడని, వాడితో మాట్లాడాకనే తన భార్య మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచానని భరత్ తెలిపాడు. పోస్టుమార్టం రిపోర్టు కోసం.. పోలీసు అధికారి విజయ్ సింగ్ మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రిపోర్టు వచ్చిన తరువాతనే మహిళ మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందన్నారు. ఇది కూడా చదవండి: ముంబై చూసేందుకు వచ్చి..ఎన్ఆర్ఐ కుర్రాడి విషాదాంతం -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
101 ఏళ్ల తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కుమారుడు.. 18 నెలలుగా
అమ్‌స్టర్‌డ్యామ్: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచాడు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇతడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇతను కూడా వృద్ధుడే కావడం గమనార్హం. వయసు 82 ఎళ్లు. ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. అయితే తన తండ్రిని చాలా మిస్ అవుతానని, ఆయనతో మాట్లాడలేకుండా తాను ఉండలేని కుమారుడు బదులిచ్చాడు. అందుకే మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి రోజు ఆయనతో మాట్లాడుతున్నానని, ఫలితంగా మరోధైర్యాన్ని పొందుతున్నానని తెలిపాడు. అయితే తండ్రి ఎలా చనిపోయాడు అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మృతికి సంబంధించి కుమారుడిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో ఫ్లాట్‌కు వచ్చి చెక్ చేసినట్లు వివరించారు. కాగా.. ఈయన తండ్రి చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని పొరుగింటి వారు చెప్పారు. మరోవైపు కుమారుడి వయసు కూడా 82 ఏళ్లు కావడంతో అతను సరిగ్గా నడవలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు. ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉందని, వస్తువులు కూడా సరిగ్గా సర్దుకోలేదని పేర్కొన్నారు. ముందు ఇల్లు సర్దుకోవాలని అతనికి వారం రోజులు గడువు ఇచ్చారు. అతను స్వతహాగా తన పనులు చేసుకునే స్థితిలో ఉన్నట్లు కూడా కన్పించడం లేదని, ఇతరుల సాయం కావాల్సి వస్తుందేమోనని పోలీసులు చెప్పారు. వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామన్నారు. కాగా.. నెదర్లాండ్స్‌లో 2015లో కూడా ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని రెండేళ్లపాటు ఫ్రిజ్లోనే దాచాడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఇలా చేశాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకడంతో రూ.36 లక్షలు (40వేల యూరోలు) జరిమానా చెల్లించాడు. చదవండి: నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే! -
మూవీని మించిన బ్రతుకు పోరాటం.. నడి సంద్రాన ప్రాణాల కోసం ఆరాటం
మనిషి జీవితంలో కొన్ని ఘటనలు జీవించి ఉన్నంత కాలం గుర్తుండిపోతాయి. ప్రకృతి విపత్తు, మానవ తప్పిందం కారణంగానో జీవితంలో ఊహించిన పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది. అలాంటి ఘటనల వల్ల చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పటో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అన్న చందంగా ఒడ్డుకు చేరుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్ అనే వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుడటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. అయితే, ఆరోజు అతడికి అదృష్టం కలిసివచ్చింది. పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్ సముద్రంపై తేలడం చూశాడు. దీంతో వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫీజర్ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది. అప్పటికైతే ఫ్రీజర్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్నా తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయాడు. ఇలా దాదాపు 11 రోజులపాటు ఫ్రీజర్‌లోనే తలదాచుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ షార్క్‌లు, తిమింగళాలు తిరిగినా భయపడకుండా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశాడు. సరిగ్గా అదే సమయంలో అతడిలాగే సముద్రంలోకి బోటులో కొందరు వ్యక్తులు చేపల వేటకు వచ్చారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడుతున్న ఫ్రీజర్‌ను చూసి అటుగా బోటును అటుగా తిప్పారు. వారి ఊహించిన రీతిలో రోడ్రిగో కనిపించడంతో అతడిని తమ బోటులోకి ఎక్కించుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడిని సురినామ్ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో 11 రోజుల జీవితంలో విధితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. 🇧🇷 Un pescador brasileño pasó 11 días en el mar sin comida ni agua, pero sobrevivió flotando dentro de un congelador. Romualdo Macedo Rodrigues, de 44 años, partió del norte de Brasil en un bote de madera a fines de julio. ⬇️⬇️ pic.twitter.com/rw8MSsCV5s — Tribuna Digital7 (@TribunaLibreES) September 4, 2022 -
ఎంత చెప్పినా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో..
టోక్యో : తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఉదంతం జపాన్‌లో వెలుగుచూసింది. టోక్యోలోని ఓ అపార్ట్మెంట్లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో తల్లితో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరిలో అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సిందిగా యజమాని ఆదేశించారు. అయితే ఎంతచెప్పినా ఇంటిని వదిలి వెళ్లకపోవడంతో ఆమెపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. (అధ్యక్షుడి హత్యకు కుట్ర.. విషంతో లేఖ) తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేక పోయానని, అందుకే తనతోనే అపార్ట్మెంట్లో ఉంచుకున్నానని యోషినో తెలిపింది. గత పదేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రీజర్‌లోనే దాచి ఉంచినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. మహిళ చనిపోయే నాటికి 60 ఏళ్ల వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆమె ఎప్పుడు చనిపోయింది? ఏ కారణంగా చనిపోయింది అన్నది వెల్లడి కాలేదని పేర్కొన్నారు. (లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్) -
2 రోజులుగా ఇంట్లోనే కరోనా డెడ్‌బాడీ
కోల్‌కతా: కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఎదురుగా ఉంచుకుని ఓ కుటుంబం రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. కోల్‌కతాకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే కరోనా పరీక్ష చేసుకున్న తర్వాతే చికిత్స చేస్తామని పంపించివేశారు. దీంతో ఇంటికి తిరిగి వచ్చేయగా అతడు కొద్ది గంటల్లోనే మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని మార్చురీకి తీసుకువెళ్లగా డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు అతనికి కోవిడ్ ఉందా? లేదా? అనే విషయం తెలిసేంతవరకు మరణ ధృవీకరణ పత్రం ఇవ్వలేమని వైద్యులు తిరస్కరించారు. (టీబీ అండ్ కరోనా) ఎలాగైనా దహన సంస్కారాలు జరిపించడంటూ అతని కుటుంబ సభ్యులు ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం శూన్యమైంది. మరోవైపు శవం వాసన వస్తుండటంతో మంగళవారం ఉదయం అతని కుటుంబసభ్యులు ఐస్‌క్రీం ఫ్రీజర్ కొని మృతదేహాన్ని అందులో పెట్టి ఉంచారు. అదేరోజు సాయంత్రం అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైద్యాధికారులకు తెలియజేయగా కనీస స్పందన కరువైంది. దీంతో ఆ రోజు కూడా శవంతోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరాఖరికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు నివాసానికి చేరుకుని మృతదేహాన్ని తీసుకువెళ్లారు. సుమారు 50 గంటల తర్వాత ఆ కుటుంబం ఉంటున్న భవనాన్ని శానిటైజ్ చేశారు. (చలో పల్లె‘టూరు’) -
ఫ్రిజ్‌లో ముక్కలు ముక్కలుగా మృతదేహం
పారిస్: అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లోని ఫ్రిజ్‌లో ఓ మహిళ మృతదేహం దొరకడం కలకలం రేపుతోంది. వివరాలు.. ఫ్రాన్స్‌లోని ఓ ఇంటిని కొత్త సంవత్సరం తొలినాడైన బుధవారం సాయంత్రం మంటలు చుట్టుముట్టాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పివేసిన అనంతరం ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ఫ్రిజ్‌లో ముక్కలు ముక్కలుగా నరికిన 83 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఇంట్లో నివసించే మృతురాలి మనవడిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. చదవండి: కలహాల మంటలు.. దొరికిపోతామనే భయంతో ఢీ కొట్టారు -
ఐస్‌క్రీమ్‌ను నాలుకతో చప్పరించి..
-
ఛీ..యాక్.. ఇంత వికృతమా!
ఓ యువతి షాప్‌లోని ఐస్‌క్రీమ్‌ను తన నాలుకతో చప్పరించి.. ఆ తర్వాత దానిని తిరిగి ఫ్రీజ్‌లో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది సరదాకు చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఈ వీడియోలో సదరు యువతి ఓ కిరాణ కొట్టులోని ఫ్రీజ్ నుంచి బ్లూ బెల్లా ఐస్‌క్రీమ్ టబ్ మూత తీసి.. వికారంగా నాలుకను బయటకు తీసి.. ఆ ఐస్‌క్రీమ్‌ను చప్పరించింది. అనంతరం మళ్లీ ఐస్‌క్రీమ్ టబ్‌కు మూతపెట్టి.. మళ్లీ దానిని యథాతథంగా ఫ్రీజ్‌లో పెట్టింది. ఈ వీడియోలో నవ్వుతూ ఆమె ఇలా చేస్తుండగా ఆమె స్నేహితురాలు ప్రోత్సహిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. తొమ్మిది సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోని ఎక్కడ తీశారు? ఎవరీ యువతి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? తెలియరాలేదు. ఎంతటి సైకో ప్రవర్తన ఇది? అంటూ బ్లైండ్ డెన్సెస్టు అనే నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ యువతి చర్య చాలా వికృతంగా, దారుణంగా ఉందని, ఇలా ప్రవర్తించిన యువతిపై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
దేవాలయంలో 40 పులుల మృత దేహాలు
బాంకాక్: పవిత్ర దేవాలయం పులుల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. థాయ్ లాండ్ వన్యప్రాణి సంరక్షణ అధికారులు వివాదాస్పద బౌద్ధ ఆలయంలో 40 మృతి చెందిన పులి పిల్లలను బుధవారం గుర్తించారు. దక్షిణ బ్యాంకాక్ లోని కంచన్ పురిలో గల యానాసంపన్న ఆలయం టైగర్ టెంపుల్ గా ప్రసిద్థి చెందింది. ఇక్కడ ఆలయం పులుల స్మగ్లింగుకు వేదికగా మారిందని గతకొంత కాలంగా ఆరో్పణలు వస్తున్నాయి. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు దేవాలయంలోని కిచెన్‌లోని ప్రీజర్‌లో 40 పులి పిల్లల మృత దేహాలను గుర్తించారు. అక్కడ ఉన్న 85 పులులను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ పార్క్ డైరెక్టర్ తెలిపారు. గత కొంత కాలంగా థాయ్ లాండ్ వన్యప్రాణుల అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. చైనాలో సాంప్రదాయ వైద్యంలో పులుల భాగాలను ఉపయోస్తారు. -
ఫ్రిజ్‌లో ఇరుక్కొని ఐదుగురు చిన్నారుల మృతి
కేప్‌టౌన్: ఆడుకుంటూ ఫ్రిజ్‌లో దాక్కున్న ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఆఫ్రికాలోని కకామస్లో చోటు చేసుకుంది. వరుసకు సోదరులైన చిన్నారులందరూ మూడు ఏళ్ల నుంచి ఏడేళ్ల మధ్య వయసు వారే. పిల్లల నాయనమ్మ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయడంతో చిన్నారులు మరణించిన విషయం బయటకు వచ్చింది. ఫ్రిజ్ డోర్ లాక్ అవడంతో అందులోనే ఇరుక్కొని గాలి ఆడక చిన్నారులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చంపి ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు!
జోహన్నెస్ బర్గ్ : ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన కేసులో ఓ వ్యక్తిని దక్షిణాఫ్రికా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జెనిటాలియా అనే మహిళను దారుణంగా హత్యచేసిన ఓ డానిష్ వ్యక్తిని అరెస్టుచేశారు. ఆ మహిళ మృతదేహాన్ని కిరాతకంగా 21 ముక్కలుగా చేయడంతో పాటు ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రీజ్ లో భద్రపరిచాడు. మృతదేహం నుంచి వాసన వస్తుందేమోనని భావించిన నిందితుడు ఈ పని చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఇంట్లో మత్తు ఇచ్చే పరికరాలు, ఆపరేషన్ చేసే పరికరాలు లాంటివి గుర్తించారు. ఆ వ్యక్తి వల్ల గతంలో ఎవరికైనా హాని జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ ఫ్రీ స్టేట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. జెనిటాలియాపై ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. సోమవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. నిందితుడి వల్ల గతంలో ఎవరైనా లైంగిక దాడులకు గురయినట్లయితే తమను సంప్రదించి వివరాలు తెలపాలని పోలీసు అధికారి హంగ్వాని ములాడ్జి పేర్కొన్నారు. -
ఫ్రీజర్‌లో 70 మొసళ్ల తలలు..
సిడ్నీ: ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 70 మొసళ్లను వేటగాళ్లు చంపి వాటి తలలను ఫ్రీజర్‌లో వదిలి పెట్టి వెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ఆస్ట్రేలియాలోని హంటీ డూ అనే గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. గ్రామంలోని ఒక దుకాణం వెనక వైపు పడిఉన్న ఫ్రీజర్‌లో మొసళ్ల తలలను కొందరు చిన్న పిల్లలు ముందుగా గుర్తించారు. సమాచారాన్ని అందుకున్న వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఈ సంఘటన పై విచారణ ప్రారంభించారు. మొసలి చర్మానికి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో మంచి గిరాకీ ఉంది. మొసళ్ల చర్మం కోసం వేటాడినట్టు అధికారులు భావిస్తున్నారు. మొసళ్లు ఆస్ట్రేలియాలో క్షీణిస్తున్న జాతిగా గుర్తించారు. ఎవరైనా మొసళ్లను చంపినట్టు రుజువైతే కఠినశిక్షనలను కూడా అమలు చేస్తున్నారు. మొసళ్ల నుంచిప్రజలకు రక్షణ కల్పించే కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కడ నివసిస్తున్న కొన్ని వర్గాల వారికి వాటిని చంపే అవకాశం కల్పిస్తారు. -
శవాల రోదన...!
ఖమ్మం సిటీ: జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో అనాథ శవాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సంబంధీకులు వచ్చినా కూడా గుర్తించలేనంతగా తయారవుతున్నాయి. ‘రోగికి మందులేయటమే ఇక్కడ గగనం. శవాలను కూడా ఏం పట్టించుకునేది...’ అన్నట్టుగా ఈ ఆస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ దయనీయంగా తయారైంది. అనాధ శవాలను భద్రపరిచేందుకు ఆరేళ్ల క్రితం రెండు ఫ్రీజర్లు ఈ ఆస్పత్రికి మంజూరయ్యాయి. ఇవి కొంతకాలం కింద మూలనపడ్డాయి. నిపుణులు మరమ్మతు పనిచేసిన తరువాత వారం పది రోజులపాటు బాగానే పనిచేసి, ఆ తరువాత మూలనపడేవి. ఇవి ఇలా తరచూ మొరాయిస్తుండడంతో ఆస్పత్రి అధికారులు కూడా మరమ్మతు చేయించకుండా పక్కన పడేశారు. దీంతో, మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పక్కకు పడేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దుర్గంధం భరించలేక మిగతా శవాలకు కూడా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించలేకపోతున్నారు. విధి నిర్వహణలో భాగంగా మార్చురీకి వచ్చిన ఓ కానిస్టేబుల్.. పురుగులు పట్టి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని చూసి వాంతులు చేసుకుచేసుకున్నాడు. దీనినిబట్టి ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఊహించుకోవచ్చు. రైలు కిందపడి మృతిచెందిన వారి దేహాలను ఆచూకీ కోసం మార్చురీలో మూడు, నాలుగు రోజులపాటు ఉంచుతారు. కానీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వీటిని ఒక్క రోజు కూడా ఉంచడం లేదు. వారి సంబంధీకులు ఆ తరువాత వచ్చినప్పటికీ.. కడసారి చూపు దక్కడం లేదు. కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపించాం... కొత్త ఫ్రీజర్లకు ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య చెప్పారు. ఇప్పుడున్న ఫ్రీజర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని అన్నారు. సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో కొత్త ఫ్రీజర్లు తెప్పించేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో కూడా మాట్లాడామని అన్నారు.ప్రస్తుతం ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. -
ఫ్రీజర్‌లో స్వామీజీ..
ఈయన పేరు అశుతోష్‌జీ మహారాజ్. దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ వ్యవస్థాపకులు. పంజాబ్‌లోని నూర్‌మహాల్ గ్రామంలో అశుతోష్‌జీకి పేద్ద ఆశ్రమమే ఉంది. వివాదాస్పదుడిగా పేరొందారు. విషయమేమిటంటే.. గత నెలన్నరగా ఈయన ఫ్రీజర్‌లో ఉన్నారు. అక్కడ ఈయనకేం పని అని అనుకుంటున్నారా? వాస్తవానికి ఈయన జనవరి 29న మరణించారు. వైద్యులు ఈసీజీ సహా అన్ని పరీక్షలు చేసి.. గుండెపోటుతో అశుతోష్‌జీ మరణించినట్లు ప్రకటించారు. కానీ ఆశ్రమ నిర్వాహకులు, సన్నిహిత భక్తులు మాత్రం నమ్మలేదు. అశుతోష్‌జీ బతికే ఉన్నారని.. ఆయన ధ్యానంలోకి వెళ్లారని.. సమాధి స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆయన తిరిగొచ్చేవరకూ శరీరం పాడవకుండా ఉండటానికి ఫ్రీజర్‌లో పెట్టారు. అప్పట్నుంచి అశుతోష్‌జీ ఫ్రీజర్‌లోనే ఉన్నారు. ఆయన తప్పక తిరిగొస్తారని, ఫ్రీజర్ నుంచి తమకు సందేశాలు కూడా పంపుతున్నారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో కేసు కూడా వేశారు. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అశుతోష్‌జీ క్లినికల్ డెడ్ అని చెప్పిన సర్కారు.. ఆయన శరీరాన్ని ఏం చేయాలన్నది ఆశ్రమం ఇష్టమని చెప్పి, చేతులు దులుపుకుంది. అయితే, ఆశ్రమం పేరిట 1,500 కోట్ల ఆస్తులున్నాయని.. అశుతోష్‌జీ చనిపోయేలోపు వారసుడి పేరును ప్రకటించనందున ఆ డబ్బంతా చారిటబుల్ ట్రస్టుకు వెళ్లిపోతుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకే ఆయన మరణించారన్న విషయాన్ని ప్రకటించడం లేదన్న వాదనా ఉంది. అయితే, అశుతోష్‌జీ తిరిగొస్తారని, వారసుడిని ప్రకటిస్తారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. -
చనిపోయిన స్వామి బతికొస్తారని భక్తుల హడావిడి
ఇంతకీ ఆయన బతికున్నట్టా? లేనట్టా? కోర్టులు ఆయన చనిపోయారని అంటూంటే, భక్తులు మాత్రం గురువుగారు సమాధిలో ఉన్నారు. కాస్సేపట్లో లేచి వస్తారని వాదిస్తున్నారు. ఆరు వారాలుగా ఆయన భౌతిక కాయాన్ని ఎవర్నీ ముట్టనీయడం లేదు. పోలీసులు, సర్కారు స్వాములోరి సంగతేమి చేయాలో తెలియక తికమకపడుతున్నారు. పంజాబ్ లోని నూర్ మహల్ అనే కుగ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దేశ విదేశాల్లో దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతున్న అశుతోష్ మహారాజ్ ఆరు వారాల క్రితం జనవరి 29న గుండెపోటుతో చనిపోయారు. ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించేశారు. కానీ భక్తులు మాత్రం ఆయన బతికే ఉన్నారని, ప్రస్తుతం సమాధి స్థితిలో ఉన్నారని వాదిస్తున్నారు. అంతే కాదు, కళ్లు మూసుకుంటే చాలు ఆయన కనిపించి సందేశాలు పంపుతున్నారని కూడా చెబుతున్నారు. 'నా శరీరాన్ని కాపాడండి. నేను త్వరలో వస్తున్నాను' అని కూడా చెబుతున్నారట. అందుకే ఆయన్ని శవాలను ఉంచే ఫ్రీజర్ లో భద్రపరిచి ఉంచారట. ప్రభుత్వం, పోలీసులు శవానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. భక్త సమూహం మాత్రం ఏమాత్రం పడనీయడం లేదు. అశుతోష్ మహారాజ్ కి దేశ విదేశాల్లో భక్తులున్నారు. ఆయన ఆశ్రమాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఒక పదిహేనేళ్ల క్రితం పశ్చిమబెంగాల్ లో వామపక్షాలకు సన్నిహితుడైన బాలక్ బ్రహ్మచారి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చనిపోయిన 60 రోజుల వరకూ భౌతికకాయాన్ని అలాగే వుంచి, స్వామి వారు వస్తారని భక్తులు భజనలు చేశారు. చివరికి ఓ రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇవన్నీ చూస్తుంటే 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా' అనుకోవాల్సిందే కదూ!!