ప్రతీకాత్మక చిత్రం
పారిస్: అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లోని ఫ్రిజ్‌లో ఓ మహిళ మృతదేహం దొరకడం కలకలం రేపుతోంది. వివరాలు.. ఫ్రాన్స్‌లోని ఓ ఇంటిని కొత్త సంవత్సరం తొలినాడైన బుధవారం సాయంత్రం మంటలు చుట్టుముట్టాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఆర్పివేసిన అనంతరం ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ఫ్రిజ్‌లో ముక్కలు ముక్కలుగా నరికిన 83 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఇంట్లో నివసించే మృతురాలి మనవడిని పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
చదవండి:
కలహాల మంటలు..
Comments
Please login to add a commentAdd a comment