బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి | 13 youths die in bar fire in France | Sakshi
Sakshi News home page

బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి

Published Sun, Aug 7 2016 1:38 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి - Sakshi

బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి

13 మంది దుర్మరణం
ర్యోన్ (ఫ్రాన్స్): ఉత్తర ఫ్రాన్స్‌లోని ర్యోన్ పట్టణంలో శనివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. ఘటనలో మరో ఆరుగు రు గాయాలపాలయ్యారు. ఓ బార్‌లో పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా, కేకు కోస్తున్న సమయం లో కొవ్వొత్తుల నుంచి వచ్చిన మంటలు పక్కకు వ్యాపించి క్షణాల్లో పాలిస్టిరీన్ సీలింగ్‌ను తాకాయి. కాలిపోతున్న సీలింగ్ నుంచి విషవాయువులు వెలువడడంతో వాటిని పీల్చిన 13 మంది మరణించారు. ఘటనపై ప్రధాని మాన్యుయేల్ వాల్స్ విచారం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాల్లో ఫ్రాన్స్‌లో జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement