bar
-
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
సనత్‌నగర్: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్ దోపిడీకి ఎస్ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
మద్యం షాపులు అప్పగించాలంటూ బార్లో టీడీపీ నేత వీరంగం
-
హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు మందు తాగిన బార్ కూల్చివేత
ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్లోని బార్పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్‌పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. -
దర్శిలో బార్‌కు తాళం వేసిన టీడీపీ నేతలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నూతన సంస్కృతికి తెరలేచింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే నరసరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు దర్శి వచ్చి ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. మూడు రోజులుగా బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు ఇవ్వకుండా నిర్వాహకులను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈ కొత్తసంస్కృతి ఏమిటని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు దర్శి వచ్చి పట్టణంలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత ‘పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం రండి..’ అని చెప్పి వెళ్లారని బార్లో పని చేసేవారు చెబుతున్నారు. నిర్వాహకులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు తమకు సంబంధంలేదని, ఎక్సైజ్వారిని సంప్రదించండని చేతులు దులిపేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులను నిర్వాహకులు కలవగా.. ‘బార్ మూసేస్తే పోలీసులను కలవండి. మాకు ఎలాంటి సంబంధం ఉండదు’ అని బదులిచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.దీంతో మూడు రోజులుగా కేబీ బార్ అండ్ రెస్టారెంట్ తెరవలేదు. ఈ విషయంపై బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ‘నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు తమ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళతాం’ అని చెప్పారు. -
బార్‌పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్‌పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్‌కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్‌కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్‌కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్‌టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
పాయింట్ బ్లాంక్‌లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్‌ను దుండగులు పాయింట్‌బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్‌తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్‌ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్‌ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
ఎంత బరితెగింపు! సీజ్ చేసినా.. మద్యం బార్ నిర్వహణ
జడ్చర్ల: ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన మద్యం బార్ యథావిధిగా కొనసాగడం జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఓ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న బార్ నుంచి గత నెల 15న ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించి డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బార్లో ఉండాల్సిన మద్యం కాటన్లు ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా బయటకు తరలించడంపై ఎక్సైజ్ అధికారులు విచారించి బార్‌ను సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ బార్‌ను నిర్వాహకులు యథావిధిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు ఎక్సైజ్ సీఐ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. తాము మద్యం బార్‌ను సీజ్ చేశామని, బార్‌ను మళ్లీ యథావిధిగా కొనసాగిస్తుండడంపై తమకు తెలిసిందన్నారు. మరోసారి విచారించి బార్‌ను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. -
బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..
జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు! -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్‌లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్‌లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్‌ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా
బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్‌కు చెందిన అబ్దుల్ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్ బార్ (23), తన కుమారుడు అబ్దుల్ సాద్‌తో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్ దిగువన ఎస్కే ప్ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్ బార్ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఇది గమనించిన అబ్దుల్ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్ సాద్ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి. -
బార్లో రగడ..పదిమంది అరెస్టు
బార్లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు సంబంధించి పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని బార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నిన్న సాయంత్రం ముంబై బార్ సిబ్బందికి కస్టమర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం వంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు సిబ్బందిని, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Mumbai Bar Brawl Caught On Camera, 10 Arrested Read here: https://t.co/djgS4TaDUJ pic.twitter.com/3nTUca4O7f — NDTV Videos (@ndtvvideos) April 8, 2023 (చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్) -
ఆ బార్‌తో నాకెలాంటి సంబంధం లేదు
నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించకున్న నటి కీర్తి సురేష్. ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారించింది. అయితే అలాంటి పాత్రలు ఈ అమ్మడికి సరిపడలేదనే విమర్శలు వచ్చాయి. కీర్తీసురేష్ గ్లామరస్‌గా నటించిన చిత్రాల్లో సర్కారి వారి పాట చిత్రం మినహా మిగిలినవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో తమిళంలో అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో నటించిన సాని కాగితం చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విషయం ఏమిటంటే ఇది డిగ్లామర్ పాత్రే. తనకు జరిగిన అన్యాయంపై బాగా ప్రతీకారాలతో రగిలిపోయే పాత్రను కీర్తి సురేష్ సమర్థంగా పోషించి ప్రశంసలు అందుకుంది. అలా చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ దసరా అనే తెలుగు చిత్రంలో డిగ్లామర్ పాత్రలో నటించి మరోసారి నటిగా తన పరిణితిని చాటుకుంది. ఇక అసలు విషయానికి వస్తే దసరా చిత్రంలో సిల్క్ బార్ మద్యం దుకాణం కీలకంగా ఉంటుంది. కాగా బార్ ముందు నటి కీర్తి సురేష్ ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో సిల్క్ బార్ సెట్‌ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాలని, అంతకంటే ఆ బార్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్‌కు లైక్‌ల వర్షం కురుస్తోంది. -
బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు..
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని రెస్టారెంట్ అండ్ బార్‌పై రైడ్ చేసిన పోలీసులు లోపల చూసి షాక్ అయ్యారు. రహస్యంగా నిర్మించిన ఓ గదిలో 17 మంది మహిళలను చూసి అవాక్కయ్యారు. మరో నలుగురు మహిళలు బార్లో డాన్స్ చేస్తూ కన్పించారు. దహిసార్ ప్రాంతంలో శుక్రవారం ఈ దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది కస్టమర్లు, ఐదుగురు సిబ్బందితో పాటు బార్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. సీక్రెట్ రూంలో రహస్యంగా దాచిన 17 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మహిళలను కన్పించకుండా దాచాలనే నిర్వహకులు రహస్యంగా ఓ గదిని నిర్మించి బలవంతంగా వారిని అందులో ఉంచారని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
బార్లోకి చొరబడి కాల్పులు.. 12 మంది మృతి!
మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. బార్లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్ మేకర్స్‌కు తయారీ హబ్‌గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్ మన్యూయెల్ లోపేజ్ ఒబ్రేడర్.. గ్యాంగ్ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్‌కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
బార్లో అర్ధరాత్రి కాల్పులు.. 14 మంది మృతి..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్‌కు శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్‌లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్‌గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్‌లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్‌కు వచ్చారు. చదవండి: (నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం) అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితురాలితో పాటు విష్ణు, విక్రమ్‌లు మంగళవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌కు వచ్చారు. యువతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబీకులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
బార్ల సంఖ్య పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బార్ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగిన బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా, 840 బార్ల లైసెన్స్‌లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
బార్లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో..
శివాజీనగర(బెంగళూరు): నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న బార్‌పై సీసీసీ పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 64 మంది మహిళలను కాపాడారు. నగరంలోని ఉప్పార పేటలో బార్లో డీజే పెట్టి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ( చదవండి: టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి? ) మరో ఘటనలో.. క్రికెట్ బెట్టింగ్.. వ్యక్తి అరెస్ట్ బనశంకరి: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి రూ. లక్షకు పైగా నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వినోబానగర్‌లో నవాజ్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
బార్ నడుపుతున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ!
మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను లీజుకు తీసుకుని చీకటి వ్యాపారం చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ షాపులకు సరఫరా చేయాల్సిన మద్యాన్ని బార్‌కు మళ్లించి ప్రభుత్వ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా.. అదే మద్యాన్ని సదరు బార్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని నిలదీసిన వ్యాపార భాగస్వామిపై సీఐ, ఎస్ఐ కిరాయి రౌడీలతో దాడులు చేయించగా.. ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో బాధితుడైన నాదెళ్ల వెంకట శివకుమార్ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఆనందరెడ్డి తన భార్య నిర్మల పేరిట మదనపల్లె అవెన్యూ రోడ్డులో ఆనంద్ బార్ పేరిట గతంలోనే లైసెన్స్ పొందాడు. దీనిని ఎక్సైజ్ విభాగంలోని మదనపల్లె మద్యం డిపోలో పనిచేస్తున్న సీఐ జవహర్‌బాబు, ఎస్ఐ సురేష్‌కుమార్, స్థానిక ఏబీఐ కాలనీలో ఉండే నాదెళ్ల వెంకట శివకుమార్ కలిసి లీజుకు తీసుకున్నారు. కాగా, సీఐ, ఎస్ఐ ప్రభుత్వ మద్యం షాపులకు కేటాయించాల్సిన బీర్లు, ఖరీదైన మద్యాన్ని బార్‌కు మళ్లించి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్న విషయం భాగస్వాముడైన వెంకట శివకుమార్‌కు తెలిసింది. ఈ విషయాన్ని బార్ యజమాని ఆనంద్‌కు తెలియజేశాడు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మాల్సిన మద్యాన్ని బార్లో అమ్మటం నేరం కాబట్టి ఆ నేరం తనపైకి వస్తుందన్న భయంతో 20 రోజుల క్రితం బార్‌కు తాళాలు వేసి తనకు సరుకు వద్దని సీఐ, ఎస్ఐలకు తెగేసి చెప్పాడు. ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఐ జవహర్‌బాబు, ఎస్ఐ సురేష్‌కుమార్ ఆదివారం కిరాయి రౌడీలతో బార్ తలుపులు ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకున్న వెంకట శివకుమార్‌పై దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు వెంకట శివకుమార్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు బార్ వద్దకు చేరుకుని ముగ్గురు రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని టూటౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. -
బీరు కొనుగోలు ‘గొడవ’.. బార్లో యువకులపై నిర్వాహకుల దాడి
మేడిపల్లి: మద్యం సేవించడానికి బార్‌కు వెళ్లిన ఇద్దరు యువకులపై బార్ నిర్వాహకులు, సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌కు చెందిన దంతూరి సాయి కృష్ణ, సాయిరాం స్నేహితులు. వారిరువురు మద్యం సేవించేందుకు సోమవారం ఉప్పల్ డిపో సమీపంలోని దర్బార్ బార్‌కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వెయిటర్‌కు వీరిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో బార్ సిబ్బంది మూకుమ్మడిగా వీరిద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పక్కనే ఆస్పత్రిలో చేర్పించగా సమాచారం అందుకున్న బార్ సిబ్బందిలో మరికొందరు అక్కడికి వెళ్లి వారిని మరోసారి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిపై కేసు నమోదు.. బార్ నిర్వాహకులు, సిబ్బంది ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కటిక కుమార్, జగన్, అమ్మోజు నవీన్, చెంచు వీరేశ్, సుదగాని నర్సింహ్మ, బర్ల రాజిరెడ్డి, చొక్కాల రాజవర్థన్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బార్ వద్ద ఆందోళన ... సాయి కృష్ణ, సాయిరాంపై దాడిని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు దర్బార్ బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. బార్ అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన ఇద్దరు బారు నిర్వాహకులపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దం పగిలిపోయింది. సంఘటనా స్థలానికి వచ్చిన మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
Hyderabad: మద్యం మత్తులో గ్యాంగ్‌వార్
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్రూంను ఏర్పాటు చేసి మినీబార్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్‌లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..
Mumbai Dance Bar Raid: అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఓ బార్‌పై పోలీసులు దాడులు చేశారు. బార్ మొత్తం వెతికినా వారికి అక్కడ తప్పుగా ఏం దొరకలేదు. కానీ అక్కడున్న ఓ అద్దంపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే అద్దాన్ని పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులను షాక్‌కు గురయ్యారు. అద్దం వెనకాల ఓ సీక్రెట్ రూమ్ బయటపడింది. అందులోకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 యువతులు ఒకరి వెనక ఒకరు బయటకు వస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీక్రెట్ బేస్మెంట్లో ఈ చీకటి దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.అసలు ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే. వివరాలు.. ముంబై అంధేరిలోని దీప బార్‌పై ఆదివారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. దీప బార్లో యువతులను కస్టమర్ల ముందు వికృతంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు బార్‌పై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడి గురించి సమాచారం అందుకున్న బార్ యాజమాన్యం అప్రమత్తమై యువతలను వెంటనే అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్‌చేసే ఓ రహస్య గదిలోకి పంపారు. దీంతో పోలీసులు గంటలపాటు బార్ మొత్తం సెర్చ్ చేసిన ఎవరూ దొరకలేదు. వాష్‌రూం, కిచెన్, స్టోర్‌రూమ్‌లలో వెతికినా మొత్తం ఖాళీగా ఉంది. దీంతో బార్ ఓనర్, మేనేజర్, వెయిటర్స్‌ను పోలీసులు విచారించారు. కానీ తమ బార్లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం లేదని, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఆరోపణలు కొట్టిపారేశారు. చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య అయితే పోలీసులకు అప్పటికీ నమ్మకం కలగలేదు. అంతేగాక మేకప్ రూమ్‌లో తగిలించి ఉన్న పెద్ద అద్దం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. పోలీసులు ఆ అద్దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా.. అది కుదరలేదు. అనంతరం పెద్ద సుత్తి తీసుకొచ్చి అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. అద్దం వెనకాల పెద్ద సొరంగంలా ఉన్న ఓ రహస్య గది ఉంది. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది. కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు వచ్చారు. 17 మంది యువతలను పోలీసులు రక్షించి.. రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే.. There are shocking cases from Mumbai, the capital of Maharashtra. Now, recently, 17 girls have been detained by the Social Service Branch of Mumbai Police in Deepa bar in Andheri last Sunday night. @DGPMaharashtra pic.twitter.com/wIpE2PMYFU — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021 దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎన్జీఓ ప్రెసిడెంట్ రాజ్ మజీ ట్విటర్లో షేర్చేశారు. దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది. మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఉన్న యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయట వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే సీక్రెట్ రూమ్‌ను రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో బెడ్స్, ఏసీలు అన్నీ ఉన్నాయి. అంతేగాక రహస్య గదిలో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! Deepa Bar Andheri pic.twitter.com/dJeGm5YDbI — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021