నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించకున్న నటి కీర్తి సురేష్. ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారించింది. అయితే అలాంటి పాత్రలు ఈ అమ్మడికి సరిపడలేదనే విమర్శలు వచ్చాయి.
కీర్తీసురేష్ గ్లామరస్‌గా నటించిన చిత్రాల్లో సర్కారి వారి పాట చిత్రం మినహా మిగిలినవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో తమిళంలో అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో నటించిన సాని కాగితం చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విషయం ఏమిటంటే ఇది డిగ్లామర్ పాత్రే. తనకు జరిగిన అన్యాయంపై బాగా ప్రతీకారాలతో రగిలిపోయే పాత్రను కీర్తి సురేష్ సమర్థంగా పోషించి ప్రశంసలు అందుకుంది.
అలా చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ దసరా అనే తెలుగు చిత్రంలో డిగ్లామర్ పాత్రలో నటించి మరోసారి నటిగా తన పరిణితిని చాటుకుంది. ఇక అసలు విషయానికి వస్తే దసరా చిత్రంలో సిల్క్ బార్ మద్యం దుకాణం కీలకంగా ఉంటుంది. కాగా బార్ ముందు నటి కీర్తి సురేష్ ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో సిల్క్ బార్ సెట్‌ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాలని, అంతకంటే ఆ బార్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్‌కు లైక్‌ల వర్షం కురుస్తోంది.
ఆ బార్‌తో నాకెలాంటి సంబంధం లేదు
Published Tue, Apr 4 2023 6:55 AM | Last Updated on Tue, Apr 4 2023 6:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment