Woman Tries Goddess Yoga Pose On Bar Table Bottle Goes Wrong, Video Viral - Sakshi
Sakshi News home page

మందు బాటిళ్ల మీద దేవతా ఫోజు.. తర్వాత ఏమైందంటే?

Published Mon, Jun 28 2021 9:07 AM | Last Updated on Mon, Jun 28 2021 10:56 AM

Woman Tries Goddess Yoga Pose On Bar Table Bottles Goes Wrong - Sakshi

ఆరోగ్యం కంటే.. అవతలి వాళ్లను ఆకర్షించడానికే చాలామందికి ఇప్పుడు యోగా  ఉపయోగపడుతోంది. రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్‌ అటెన్షన్‌ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే రకరకాల భంగిమల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఇక ఓ యువతి విచిత్రమైన ఆసనం కోసం ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.   

ప్రమాదకరంగా ఉన్న ఫీట్‌ను ఆ యువతి ప్రయత్నించడం విశేషం. బార్‌ టేబుల్‌పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి.. చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇంకేం బ్యాలెన్స్‌ ఆగక వెల్లకిల్లా పడిపోయింది.

అయితే ఆ యువతికి ఏం జరిగిందనేది, వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్‌ మై బీర్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి వైరల్‌ అయిన ఈ వీడియోను షేర్‌ చేస్తున్న పలువురు ‘డోంట్‌ ట్రై దిస్‌’ అనే క్యాష్షన్‌ను ఉంచుతున్నారు.

ఫొటోలు: బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement