Full Bottle
-
సత్యదేవ్ 'ఫుల్ బాటిల్' టీజర్ చూశారా?
‘‘నాలుగు క్వార్టర్స్ ఉంటే ఫుల్ బాటిల్. అలాగే మనిషి జీవితం కూడా ఓ ఫుల్‌బాటిల్ లాంటిదనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు ‘ఫుల్‌బాటిల్’ టైటిల్‌ని పెట్టాడు శరణ్. ఇందులో మెర్క్యూరీ సూరిగా కొత్త సత్యదేవ్‌ని చూస్తారు’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఫుల్ బాటిల్’. జవ్వాజి రామాంజనేయులు, ఎస్.డి కంపెనీ చినబాబు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ–‘‘డార్క్ కామెడీ నా బలం అని భావించి ఈ మూవీ చేశాను’’ అన్నారు. ‘‘సత్యదేవ్‌తో మా బ్యానర్లో మరో సినిమా చేస్తాం’’ అన్నారు రామాంజనేయులు. Happy to launch this Crazy Teaser of #FullBottle 🤗https://t.co/xU0hDbenRc#MercurySoori looks Wild, Wacky-Knacky & Mass @ActorSatyadev 💥Wishing you & the whole team All the best ❤️@itssanjanaanand @sharandirects @actorbrahmaji #FullBottleTeaser pic.twitter.com/SdnqeRGTNl— Vijay Deverakonda (@TheDeverakonda) May 27, 2023 -
'ఫుల్ బాటిల్'తో వస్తున్న యంగ్ హీరో.. కిక్కు ఎక్కాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే
Full Bottle Movie: Satyadev Next With Director Sharan Koppisetty: విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ టైటిల్స్‌తో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల 'స్కైలాబ్' అనే కొత్త తరహా కథతో అలరించిన సత్యదేవ్ ప్రస్తుతం గాడ్సే, గుర్తుందా శీతకాలం మూవీస్తోపాటు కొరటాల శివ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా, హిందీలో 'రామసేతు' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ 'రామసేతు' సినిమాలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సత్యదేవ్ హీరోగా మరో చిత్రం బుధవారం (ఏప్రిల్ 6) ప్రారంభమైంది. ఈ సినిమా 'ఫుల్ బాటిల్' అనే టైటిల్‌తో సినిమా షూటింగ్ మొదలైంది. చదవండి: సత్యదేవ్ పవర్ఫుల్ డైలాగ్‌లు.. ఆలోచింపజేసేలా 'గాడ్సే' టీజర్ 'కిర్రాక్ పార్టీ', సత్యదేవ్ 'తిమ్మరుసు' చిత్రాలను తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి మొదటి రెండు సినిమాలు కన్నడ రీమేక్స్ కాగా, ఇటీవల ఓటీటీ సంస్థ జీ5 కోసం 'గాలివాన' పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కాకినాడ నేపథ్యంలో 'ఫుల్ బాటిల్' రూపొందనున్నట్లు సమాచారం. రామాంజనేయులు జువ్వాజి, ఎస్డీ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో అలరించే సత్యదేవ్ 'ఫుల్ బాటిల్' కిక్కు ఎక్కాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. చదవండి: సత్యదేవ్ భార్యగా నయనతార -
Viral Video: దేవతలా యోగా ఫోజు, పట్టుతప్పి..
ఆరోగ్యం కంటే.. అవతలి వాళ్లను ఆకర్షించడానికే చాలామందికి ఇప్పుడు యోగా ఉపయోగపడుతోంది. రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే రకరకాల భంగిమల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఓ యువతి విచిత్రమైన ఆసనం కోసం ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రమాదకరంగా ఉన్న ఫీట్‌ను ఆ యువతి ప్రయత్నించడం విశేషం. బార్ టేబుల్‌పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి.. చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇంకేం బ్యాలెన్స్ ఆగక వెల్లకిల్లా పడిపోయింది. Hold my beer while I do the goddess yoga pose 🍺🧘♀️ pic.twitter.com/dfQASdfL2S — 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) June 25, 2021 అయితే ఆ యువతికి ఏం జరిగిందనేది, వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్ మై బీర్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు ‘డోంట్ ట్రై దిస్’ అనే క్యాష్షన్ను ఉంచుతున్నారు. ఫొటోలు: బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా -
ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం
సాక్షి, బాన్సువాడ : మద్యం బాటిల్లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పందెంలో ఒకరు మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. చేనులో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్‌కు దిగారు. ఇరువురు సోడా, నీరు కలపకుండా ఫుల్ బాటిల్ సేవించారు. ఇరువురు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు వీరిని ఇళ్లకు పంపించారు. అయితే సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. -
మందు బందీ!
నరసరావుపేటవెస్ట్: జిల్లాలో సగభాగానికి మద్యం సరఫరా చేసే నరసరావుపేట ఏపీ బేవరేజెస్ గోడౌన్లు గురువారం నుంచి మూత పడ్డాయి. గోడౌన్లకు మద్యం తీసుకువచ్చిన లారీలు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నాయి. గోడౌన్ల నుంచి సరఫరా లేక దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం నిల్వలు తగ్గుతున్నాయి. ఇప్పటికే మద్యం దొరకటం లేదనే సాకుతో ఫుల్‌బాటిల్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. షాపులకు కావాల్సిన స్టాక్ ఇవ్వలేని ప్రభుత్వం వారి వద్ద నుంచి లెసైన్స్ ఫీజును మాత్రం ముందుగానే గుంజుకుంది. దీంతో మద్యం సరఫరా లేక, మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్లు అందించలేక బేరాలు పోగొట్టుకుంటూ దుకాణ యజమానులు నష్టాలపాలవుతున్నారు. వారితో పాటు గోడౌన్లకు వచ్చిన మద్యం లారీల నుంచి దిగుమతి, ఎగుమతి చేసే హమాలీలకు రోజువారి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలను పరిశీలిస్తే..మద్యానికి సంబంధించి సుమారు రూ.8వేల కోట్లు ఆదాయ పన్ను చెల్లించాలని ఆ శాఖ జారీ చేసిన నోటీసులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవటంతో బేవరేజెస్ గోడౌన్లను అధికారులు మూసేశారు.దీంతో నాలుగురోజుల నుంచి షాపులకు మద్యం సరఫరా నిలిచిపోయింది. నరసరావుపేటలోని గోడౌన్ల ద్వారా మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు, బార్లకు రూ. కోట్ల విలువైన మద్యం సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడం, ఇదే పరిస్థితి మరో రెండు మూడురోజులు కొనసాగితే మద్యం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని ఆయా షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే బార్ల నిర్వాహకులు లెసైన్స్ ఫీజులను గత డిసెంబర్ చివరికే చెల్లించగా, వైన్స్‌షాపుల యజమానులు ఫిబ్రవరి 20వ తేదీతో చెల్లించేశారు. కాగా గోడౌన్ల వద్ద సరుకు ఎగుమతి, దిగుమతికి సంబంధించి 50 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ రోజువారీ కూలి దక్కుతుంటుంది. నాలుగురోజుల నుంచి పనులు దొరకక పోవటంతో ఇబ్బందిపడుతున్నారు. ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి గోడౌన్లు ఎప్పుడు తెరుస్తారంటూ అధికారులను అడుగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కావటంతో తామేమీ ఇప్పుడే చెప్పజాలమంటూ వారు సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖ మూసేసిన గోడౌన్లను అలానే ఉంచి, నూతన గోడౌన్లను చూసి వాటిలోకి సరుకు దిగుమతిచేసి షాపులకు తరలించాలనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఏమౌతుందో మరో రెండురోజులు వేచి చూడాల్సిందే. -
ఇలా అయితే... కష్టం కదండీ!
వినోదం తాగుబోతు: డాక్టర్ గారు...ఈమధ్య నేను బాగా తాగుతున్నాను. మానేయాలనుకుంటున్నానుగానీ మానేయలేకపోతున్నాను.... డాక్టర్: రోజుకు ఎన్ని పెగ్గులు తాగుతావు? తాగుబోతు: 4 పెగ్గులు డాక్టర్: ఈరోజు నుంచి రోజుకు 3 పెగ్గులు మాత్రమే తాగు. వారం తరువాత కలువు... తాగుబోతు: మీరు చెప్పినట్లే రోజుకు మూడు పెగ్గులు తాగుతున్నానండీ... డాక్టర్: ఈరోజు నుంచి రోజుకు రెండు పెగ్గులు మాత్రమే తాగు... తరువాత కలువు... తాగుబోతు: మీరు చెప్పినట్లే... రోజుకు రెండు పెగ్గులు తాగుతున్నాను. డాక్టర్: ఈరోజు నుంచి ఒక పెగ్గు మాత్రమే తాగు... తాగుబోతు: ఒకే ఒక్క పెగ్గులో ఫుల్‌బాటిల్ పూర్తి చేయడం కష్టం కదండీ!!! -
సీలు భద్రం..మందు మాయం
పెద్దపల్లి : ఫుల్‌బాటిల్ సీలు భద్రంగా ఉండగానే లోపల మద్యం మాయవుతోంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సన్నివేశం కాదు. పెద్దపల్లి ప్రాంతంలోని వైన్సుల్లో జరుగుతున్న దందా. సీల్ ఉన్న బాటిల్లోని మందును మాయం చేసి అందులో నీళ్లు నింపుతూ కల్తీ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. పట్టణానికి చిందం రమేశ్, ఆవునూరి రమేశ్ అనే యువకులు సీసాకు సీల్ ఉండగానే చాకచక్యంగా తొలగించడంలో నేర్పరులు. వీరి నేర్పరితనాన్ని మద్యం దుకాణాల యజమానులు తమ కల్తీ దందాకు ఉపయోగించుకుంటున్నారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని వైష్ణవి 123 నంబర్ గల మద్యం దుకాణం వెనకాల శనివారం వేకువజామున ఈ ఇద్దరు యువకులు మద్యం బాటిళ్ల మూతలు చాకచక్యంగా తీస్తున్నారు. ఒక్కో బాటిల్లోంచి 25 శాతం మద్యం తీస్తూ అక్కడే బకెట్లలో ఉన్న నీళ్లను నింపుతూ మళ్లీ యథావిధిగా మూత బిగిస్తున్నారు. అదే సమయంలో కరీంనగర్‌కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై పి.వెంకట్ తన బృందంతో దాడి చేశారు. రూ.15 వేల విలువైన మద్యం సీసాలు, నీళ్ల బకెట్లు, సేకరించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణాన్ని సీజ్ చేసి యజమాని మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘ఎక్సైజ్’పై అనుమానాలు పెద్దపల్లిలో చాలాకాలంగా మద్యం కల్తీ అవుతోందని మద్యప్రాన ప్రియులు గగ్గోలు పెడుతున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో ఎవరికి వారే మిన్నకుంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మద్యం కొనుక్కుంటున్న పలువురు కల్తీ అవుతోందని వైన్‌షాప్ నిర్వాహకులతో గొడవకు దిగిన సందర్భాలున్నాయి. అక్రమ దందాను స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆధారాల కోసం పట్టణంలో మద్యం వ్యాపారులపై నిఘా వేసినవారే స్థానిక అధికారులను నమ్మకుండా ఎన్ఫోర్స్మెంట్కు ఉప్పందించినట్లు సమాచారం. దీంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రంగంలోకి దిగి మద్యం కల్తీ చేస్తున్నవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, పట్టుకున్న బాటిళ్లు ఖరీదైనవి కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో ఆఫీసర్స్ చాయిస్, ఎంసీ బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్దగా ఖరీదు కాని ఈ మద్యాన్ని కల్తీ చేస్తే ఒరిగేదేమి ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులే వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసు ప్రాధాన్యతను తగ్గించే దిశగా చవక మద్యం బాటిళ్లను కల్తీ చేస్తున్నట్లుగా చూపించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ దిగిన రాత్రే మూతలు మాయం మద్యం దుకాణాల్లోకి స్టాక్ దిగిన రాత్రే మూత ల తొలగింపు నిపుణులు అక్కడకు చేరుకుని మూతలు తొలగించి ఒక్కో బాటిల్లో పావలా వంతు మద్యం తీసి నీళ్లెక్కిస్తున్నారు. ఇలా యజమానులు ఒక్కో బాటిల్‌పై రూ.200 చొప్పున అదనపు లాభం గడిస్తున్నారు. గతేడాది శాంతినగర్ సమీపంలోని మద్యం దుకాణంలో ఖరీదైన మద్యం బాటిళ్లలో రంగునీళ్ల గుడుంబా కలిపి సీల్ వేస్తుండగా ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకోగా, సదరు షాప్ లెసైన్సును రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు బ్రాహ్మణపల్లిలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి ప్రాంతంలో మద్యం కల్తీపై మద్యపాన ప్రియులు ఆందోళన చెందుతున్నారు. -
సిండికేట్లకు ‘రూ.5 వరం’
ఫుల్‌బాటిల్ మద్యం ధరపై రూ.5 అదనంగా అమ్ముకునేందుకు అనధికార అనుమతి లిక్కర్ సిండికేట్లకు సర్కార్ చట్టవిరుద్ధ వరం క్వార్టర్ మీదే రూ.5 అదనంగా తీసుకుంటున్న లిక్కర్ సిండికేట్లు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాల్లో ‘డబుల్’ దోపిడీ ‘సాక్షి’ పరిశీలనలో లిక్కర్ సిండికేట్ల అక్రమాలు బట్టబయలు సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లకు ప్రభుత్వం ‘ఐదు రూపాయల వరం’ ప్రకటించింది. మద్యం ఎమ్మార్పీ ధర మీద రూ.5 అదనంగా వసూలు చేసుకోవడానికి ఎక్సైజ్ కమిషనర్ అనధికారికంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి, లిక్కర్ డీలర్ల అసోషియేషన్ చేసిన ఒత్తిడికి కమిషనర్ తలొగ్గినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న ఎన్టీపీఎల్ మద్యం, కల్తీ మద్యం నిరోధించాలంటే ఎమ్మార్పీ ఉల్లంఘన తప్ప మరో మార్గం లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దొరికిన వెసులుబాటుతో లిక్కర్ సిండికేట్లు క్వార్టర్ బాటిల్ మీద రూ.5 అదనంగా అమ్ముతున్నాయి. ఈ లెక్కన ఫుల్ బాటిల్‌కు రూ.20 పైగా అదనంగా అమ్ముతుండగా... ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాలు పీలేరు, కుప్పంలో క్వార్టర్ మీద రూ.10, ఫుల్ బాటిల్ మీద రూ.40 అదనంగా తీసుకుంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధులు పరిశీలనాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 19 జిల్లాల్లో మద్యం కొనుగోలు చేయగా ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో కూడా గరిష్ట చిల్లర ధర నిబంధన ఉల్లంఘించారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే మద్యం ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఏసీబీ దాడులతో కేసుల పాలై అదనపు ఆదాయాన్ని కోల్పోయిన స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఇప్పుడు సిండికేటుకు పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌కు పెంచిన రూ.5లో రూ 2 ఎకై ్సజ్ అధికారులకు (కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు), రూ.3 లిక్కర్ సిండికేట్లు తీసుకోవాలని రహస్య ఒప్పందం కుదిరినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఏపీబీసీఎల్ డిపోల నుంచి డీలర్లు తీసుకున్న మద్యం వివరాలు దుకాణాల వారీగా తీసుకొని వాటి ఆధారంగా నెలనెల లెక్కలు వేసి డబ్బు పంచుకోవాలని ఎక్సైజ్ సిబ్బంది, మద్యం సిండికేట్ల మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో ఆయన ప్రధాన అనుచరుడు ఓ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుకాణంలో మద్యం కొనుగోలు చేయగా ప్రతి బ్రాండ్ మీద క్వార్టర్‌కు రూ.10 అదనంగా తీసుకున్నారు. ఫుల్ బాటిల్‌కు రూ.40 అదనం. నియోజకవర్గం అంతటా ఇవే ధరలు ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు చం ద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని ఆయన అనుచరుని దుకాణంలో కూడా క్వార్టర్ మీద రూ.10 అదనంగా తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన నియోజకవర్గ కేంద్రం లోనే బినామీ పేరుతో వైన్ షాపు తెరిచారు. దుకాణం తెరిచిన 2 నెలల వ్యవధిలోనే క్వార్టర్ మద్యంకు ఎమ్మార్పీ ధర మీద రూ.10 అదనంగా తీసుకుంటూ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు దొరికిపోయారు. ఇదే జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు కమలాపురంలో రెండు, ఎర్రగుంట్లలో ఒక దుకాణం, ప్రొద్దుటూరులో బార్ అండ్ వైన్స్ బినామీల పేర్లతో ఉన్నాయి. ఈ దుకాణాలన్నింటిలోనూ ఇప్పుడు ఫుల్ బాటిల్ మీద బ్రాండును బట్టి రూ.15నుంచి రూ.25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న 11 మద్యం దుకాణాలను ఒకే సిండికేటు కిందకు తెచ్చారు. అన్ని దుకాణాల్లో కూడా ఒకే ధర ఉంది. ప్రతి క్వార్టర్ మద్యం సీసా మీద బ్రాండును బట్టి ఎమ్మార్పీ మీద రూ.6నుంచి రూ.12 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం సిటీతో పాటు, రూరల్ ప్రాంతంలోని యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి పట్టణాల్లో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అజమాయిషీ కింద 25 మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు నిర్ధారించింది. ఈ దుకాణాల్లో క్వార్టర్‌కు రూ.5 ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోంది. ప్రకాశం జిల్లా చీరాలలో దాదాపు 6 మద్యం దుకాణాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఆధీనంలో ఉన్నాయి. ఈ దుకాణాల్లో క్వార్టర్ చీప్ లిక్కరుకు రూ.10, మీడియం లిక్కర్‌కు రూ.15, ప్రీమియం లిక్కర్‌కు రూ.15 చొప్పున ఎమ్మార్పీ మీద అదనంగా వసూలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాల్లో గత ఏడాది ఏసీబీ దాడుల నేపథ్యంలో కొద్దికాలం స్తబ్దుగా ఉన్న కీలక నేత బంధువులు మళ్లీ తెర మీదకు వచ్చారు. ఆయన సోదరులిద్దరూ, మేనల్లుడు కలిసి విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విశాఖ జిల్లా అనకాపల్లి మద్యం దుకాణాల్లో పాగా వేశారు. క్వార్టర్ సీసా మీద రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి అమ్ముతున్నారు. దీనిపై మాజీ ఎకై ్సజ్ కమిషనర్ శర్మ గతంలోనే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఓ మంత్రి బంధువుల కనుసన్నల్లోనే 2 డివిజన్లలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.20, మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.30 చొప్పున అదనంగా తీసుకుంటున్నారు.