సత్యదేవ్‌ 'ఫుల్‌ బాటిల్‌' టీజర్‌ చూశారా? | Full Bottle Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

సత్యదేవ్‌ 'ఫుల్‌ బాటిల్‌' టీజర్‌ వచ్చేసింది

Published Mon, May 29 2023 3:22 AM | Last Updated on Mon, May 29 2023 7:17 AM

Full Bottle Movie Teaser Launch - Sakshi

శరణ్, రామాంజనేయులు, సత్యదేవ్, కోన వెంకట్‌

‘‘నాలుగు క్వార్టర్స్‌ ఉంటే ఫుల్‌ బాటిల్‌. అలాగే మనిషి జీవితం కూడా ఓ ఫుల్‌బాటిల్‌ లాంటిదనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు ‘ఫుల్‌బాటిల్‌’ టైటిల్‌ని పెట్టాడు శరణ్‌. ఇందులో మెర్క్యూరీ సూరిగా కొత్త సత్యదేవ్‌ని చూస్తారు’’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఫుల్‌ బాటిల్‌’.

జవ్వాజి రామాంజనేయులు, ఎస్‌.డి కంపెనీ చినబాబు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ–‘‘డార్క్‌ కామెడీ నా బలం అని భావించి ఈ మూవీ చేశాను’’ అన్నారు. ‘‘సత్యదేవ్‌తో మా బ్యానర్‌లో మరో సినిమా చేస్తాం’’ అన్నారు రామాంజనేయులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement