రష్మిక మందన్నా-విజయ్‌ దేవరకొండ : ‘ఫైటింగ్‌’ వైరల్‌ | 2018 Tweet Conversation Between Vijay Deverakonda And Rashmika Mandanna Trending On Social Media - Sakshi
Sakshi News home page

రష్మిక మందన్నా-విజయ్‌ దేవరకొండ : ‘ఫైటింగ్‌’ వైరల్‌

Published Fri, Feb 23 2024 4:54 PM | Last Updated on Fri, Feb 23 2024 5:35 PM

Vijay Deverakonda old tweet for Rashmika Mandanna latest post goes viral - Sakshi

ప్రేమపక్షులుగా అందరి నోళ్లలో నానుతున్న టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి  చుట్టూ చాలా కాలంగా డేటింగ్ పుకార్లు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు, ఇద్దరూ విహార యాత్రలు,  రహస్యంగా కలిసి సందడి చేస్తూ ఉండటం ఈ ఊహాగానాలకు  మరింత ఆజ్యం పోస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల వీరి నిశ్చితార్థం  ఫిక్స్‌ అంటూ పుకార్లు వ్యాపించాయి కూడా. తాజాగా మరో ఆసక్తికర పరిణామం ఫ్యాన్స్‌ మధ్య చర్చకు దారి తీసింది.

ప్రతిష్టాత్మక ‘ఫోర్బ్స్ ఇండియా అండర్ 30’ జాబితాలో తాజాగా స్థానం దక్కించుకుంది రష్మిక. దీంతో ఆమెను అభినందిస్తూ విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఇలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని.. మరెందరిగో స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, డియర్ కామ్రేడ్' మేకింగ్ సమయంలో 2018లో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్ల స్వీట్‌ వార్‌ నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతోంది.  ఫోర్బ్స్‌లో ప్లేస్‌ దక్కినందుకు రష్మిక పార్టీ అడిగితే.. నేను నీ కోసం పోరాడుతుంటే,  నువ్వు పార్టీ కోసం అడుగుతున్నవా? అన్న ట్వీట్‌కు  రష్మిక రిప్లైయ్‌ కూడా  ఇచ్చింది. 

‘‘విజయ దేవరొండ ఓహ్ ప్లీజ్!! ఫోర్బ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారు..ఇది వావ్!! కాబట్టి కంజూస్‌గా(పిసినారిగా) ఉండటం మానేసి.. ఇప్పటికైనా  పార్టీ ఇవ్వండి!!” అంటూ  పోస్ట్‌ పెట్టింది. ఇపుడు మళ్లీ  2018 నాటి పోస్ట్‌ పిక్‌ను కూడా జోడిస్తూ  సోషల్‌ మీడియాలోతెగ షేర్‌ అవుతోంది. 

'గీత గోవిందం'తో మొదలై 'డియర్ కామ్రేడ్' దాకా వీరి ఆన్-స్క్రీన్ మ్యాజిక్ ఆన్-స్క్రీన్‌కు పాకిందని  ఊహాగానాలొచ్చాయి అయితే వీరిద్దరూ పెదవి విప్పడంలేదు.  

కాగా తెలుగుతో పాటు భాషల్లో బ్లాక్ బస్టర్స్ మూవీలతో ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకుంది  రష్మిక. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీభామ. ఇటీవల మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో  స్టైలిష్‌ లుక్‌తో  అందర్నీ కట్టి పడేసింది.

కాగా 2018లో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీగా ‘ఫోర్బ్స్ ఇండియా అండర్ 30’  విజయ్ దేవరకొండకి స్థానం దక్కింది. వరుసగా రెండుసార్లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement