ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం! | Valentine's Day is Age no Bar. Rishi Kapoor Posts a Video That Explains | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం!

Published Fri, Feb 12 2016 8:11 PM | Last Updated on Mon, Feb 10 2020 3:26 PM

ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం! - Sakshi

ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం!

ప్రేమికుల రోజుకు వయసుతో పని లేదంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. ప్రేమను పంచుకోడానికి వయసుతో సంబంధం లేదని  సందేశం ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే ప్రతివారూ జరుపుకోదగ్గ రోజన్న విషయం... ప్రతివారికీ తెలియాలని ఆయన  ట్వీట్ చేశారు. లవ్.. రొమాన్స్ యువతకు మాత్రమే పరిమితం కాదంటున్నారు.  

ఏభై ఏళ్ళ వివాహ జీవితాన్ని పూర్తి చేసిన రిషికపూర్.. దంపతుల్లో ఉండే ప్రేమను నిరూపించే ఓ హార్ట్ టచ్చింగ్ వీడియోను యూట్యూబ్.. కాట్ ఇన్ యాక్షన్ ఛానెల్ లో పోస్ట్ చేశారు.  ఒకరికోసం ఒకరు అనేందుకు ఇప్పుడా వీడియో తార్కాణంగా నిలుస్తోంది. ఒకరి ఆహారంపట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, సమయానికి మందులు గుర్తు చేయడం, ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ ప్రేమను నిలబెడతాయని... ఆప్యాయత అనురాగాన్నీ పెంచుతాయని, నిస్వార్థంగా బతికేలా చేస్తాయని ఆ దంపతులను చూస్తే అర్థమౌతుంది.

ఇప్పటిదాకా ఆమె దృష్టిలో నేనొక్క పని కూడా సరిగా చేయలేదని.. అయితే వివాహ జీవితం 54 ఏళ్ళు సజావుగా సాగిపోయిందని రిషికపూర్ నవ్వుతూ చెప్తున్నారు. జీవితాంతం వాలెంటైన్ గా ఉండాలనుకున్నవారు మరి ఆ అన్యోన్య దాంపత్యాన్ని వీక్షించాల్సిందే...

So true.... You never too old for Valentines Day! Well done Sarah https://t.co/5KQs94GSqz

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement