Rishi
-
తరగతి గదిలో బాలికపై లైంగిక దాడి!
తిరుపతి క్రైమ్: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రఘువరన్‌కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్‌లు రిలీజ్ చేశాడు. రఘువరన్‌కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్‌గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
కుటుంబమంతా చూడాల్సిన చిత్రం
‘‘మాధవే మధుసూదన’ సినిమాని రామచంద్ర రావుగారు చాలా స్పష్టతతో తీశారు. ప్రతి సన్నివేశంలో ఆయన అనుభవం నాకు కనిపించింది. కుటుంబమంతా కలిసి థియేటర్స్‌లో చూడాల్సిన చిత్రం ఇది’’ అని నటుడు సుమన్ అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికి లోక్రే జంటగా నటించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24 విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ – ‘‘సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. నేనే డైరెక్టర్,ప్రోడ్యూసర్‌గా మా అబ్బాయి తేజ్‌ని హీరోగా పెట్టి సినిమా చేశా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘మాధవే మధుసూదన’తో ఒక మంచి ప్రయత్నం చేశాం’’ అని తేజ్ బొమ్మదేవర అన్నారు. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్‌లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు
జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు. గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇదీ చదవండి: బైడెన్ చొరవ.. ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్.. గాజాకి అందనున్న మానవతా సాయం -
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్‌కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్‌ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా
సూర్యాపేట క్రైం: మలేసియా సముద్రతీరంలో సూర్యాపేట యువకుడు రిషివర్ధన్‌రెడ్డి(21) గల్లంతయ్యారు. మోటకట్ట వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారుడు రిషివర్ధన్ మలే సియాలో సరుకుల రవాణా నౌకలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లభించలేదని, బుధవారం సాయంత్రంలోగా తెలుస్తుందని అధికారులు ఫోన్లో తెలిపారు. దీంతో బిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. ఎలారా బతికేది? మూడ్రోజుల క్రితం ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మురిపించావు. ఆ మాటల్ని ఇంకా మరువనే లేదు. అంతలోనే సముద్రంలో కొట్టుకుపోయావని చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది? కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా. – రిషివర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు -
తాళి కట్టేముందు ఆ కన్నడ హీరో కాబోయే భార్యను ఏం అడిగాడంటే!
బెంగళూరు : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ లవ్‌స్టోరీ ఉంటుంది. కన్నడ హీరో రిషి లైఫ్‌లో కూడా ఓ అందమైన ప్రేమకథా చిత్రం ఉంది. ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రిషి 2019లో స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్ కహానీ ఎలా మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు వంటి విషయాలను స్వాతి ఇటీవలె షేర్ చేసుకుంది. 'నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాను. సిటీ కొత్త కదా సరదాగా ఓరోజు థియేటర్‌కు వెళ్లాం. అక్కడే మొదటిసారిగా రిషిని చూశాను. హీరోగా అతడి మొదటి సినిమా అది. అంత మంది జనాల మధ్య రిషి హైట్, తన స్మైల్ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్లో తనను కలవడానికి వెళ్లా. మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెబుతుంటే బ్లష్ అయిపోయాడు. అది నన్ను మరింత అట్రాక్ట్ చేసింది. మరుసటి రోజు రిషి ప్రొఫైల్ ఫేస్బుక్లో దొరికొంది. దీంతో మెసేజ్ చేశా. అటువైపు నుంచి రిప్లై రావడంతో ఇద్దరం చాటింగ్ చేసేకునేవాళ్లం ఓ రోజు రిషి కాఫీకి రమ్మని పిలిచాడు. అలా సరదాగా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఓ రోజే నేను నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేశా..దీంతో రిషి నేను ఇదే చెప్పాలనుకున్నాను అనడంతో ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాం. అదేరోజు సాయంత్రం ఫోన్లో ఇద్దరం ఐ లవ్యూ చెప్పుకున్నాం. రిషి సినిమాల్లో ఉండటం, నాకు 9-5 జాబ్ కావడంతో వారానికి ఒకసారి కంటే ఎక్కువ కలిసేవాళ్లం కాదు. కానీ ఉన్నంతసేపు చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నా కోసం బుక్స్ గిఫ్ట్‌గా ఇచ్చి అందులో నువ్వు నా లైఫ్‌ని మరింత అందంగా మార్చేశావు అంటూ ఎంతో క్యూట్ కొటేషన్స్ రాసి ఇచ్చేవాడు. ఇక నేను కూడా వీలు కుదిరినప్పుడల్లా తనకు సెట్స్‌లో సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని. ఇక రిషి ఫస్ట్ మూవీ ‘పరేషన్ అలమేలమ్మ’ హిట్ కావడంతో ఇక పెళ్లిచేసుకుందామా అని రిషి అడిగాడు. నేను కూడా ఎస్ చెప్పాను. వెంటనే మా నిశ్చితార్థం జరిగింది. ఇక తమిళ, కన్నడ సంప్రదాయాల ప్రకారం మా పెళ్లి జరిగింది. ఆరోజు తాళి కట్టే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రిషి అడగడంతో ..ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని నువ్వు అనుకోవట్లేదా అని చెప్పిన వెంటనే తాళి కట్టేశాడు. ఇదే విషయంపై అప్పుడప్పుడూ రిషిని ఏడిపిస్తుంటాను. ఇక పెళ్లి తర్వాత హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లలేకపోయాం. కరోనా కావడంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక రిషి తన ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటాడు. ఈ ప్యాండమిక్ పూర్తైన వెంటనే ఓ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి' అంటూ తన లవ్‌స్టోరీ బయటపెట్టింది. ఇక సర్వజనికారిగే సువర్ణవాకాష అనే చిత్రంలో రిషి చివరిసారిగా కనిపించాడు. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు -
విశాఖలో ఆటా పాటా
ఋషి, శిల్పతేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘హనీ ట్రాప్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సందర్భంగా వి.వి. వామన రావు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కథని సమకూర్చాను. ఋషి, శిల్ప తేజులపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించాం. విశాఖ షెడ్యూల్ నేటితో పూర్తవుతుంది. కథ డిమాండ్ మేరకు సునీల్‌గారు అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఇది ఒక సోషల్ థ్రిల్లర్ మూవీ. యువతకి నచ్చే అంశాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. వామనరావుగారు కథకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు పొందుతారు. డిసెంబర్ నుండి హైదరాబాద్‌లో జరిగే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా: ఎస్ వి శివరాం. -
తాగిన మైకంలో...
విజయ్, మమత, రిషీ, బేబీ సుహాన, సతీష్, లడ్డు, తేజశ్విని ముఖ్య పాత్రల్లో రాజా విక్రమ నరేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘అమృత నిలయం’. ఆర్.పి. సమర్పణలో రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రాజా విక్రమ నరేంద్ర మాట్లాడుతూ– ‘‘తాగిన మైకంలో యువత చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లోని ఓ అంధుడి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ద్వారా మంచి సందేశం ఇస్తున్నాం. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ బాలికల చేత ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేయించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రధాన కథ అనాథగా మారిన అంధుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ‘అపరాజిత సేవా సమితి’లోని అనాథ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించాం. మా బ్యానర్ నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపైనా చేస్తాం’’ అన్నారు రామమోహన్ నాగుల, ప్రవీణ్ కుమార్. -
నటుడు రిషి, రైటర్ స్వాతిల నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్ : ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమా ద్వారా శాండిల్‌వుడ్‌కు పరిచయమైన నటుడు రిషి, రైటర్ స్వాతిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. దీనిపై నటుడు రిషి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ... ‘నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరాడు. నేటికి ఒక మైలు రాయిని దాటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జోడి దొరికింది. మా నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న కన్నడ చిత్రరంగ ప్రముఖలు రిషి, స్వాతిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
డాక్టర్ రిషి
తెలుగులో చిన్న బడ్జెట్ సినిమాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. మంచి సందేశాన్నిస్తూ, ‘అవార్డు సినిమా’గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... రిషి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతనికి చుట్టూ సమస్యలే కనిపిస్తున్నాయి. దేనికీ ఒక పరిష్కారం కనిపించడం లేదు. ఆ రాత్రి వేళ, చీకట్లో కలిసిపోయిన ఆ చెట్టునీడ కింద కూర్చొని ఉన్న రిషీకి, తన పక్కన్నే కూర్చున్న వ్యక్తి అక్కణ్నుంచి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తోంది – ‘బీ పాజిటివ్’. ఎగిరి గంతేశాడు రిషి. పరిష్కారం దొరికింది. కార్తీక్‌ది, తనదీ బీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. అంటే కార్తీక్‌కు తన గుండె సరిపోయే అవకాశం ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి చెక్ చేయించాడు. సరిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన గుండెను డొనేట్ చేస్తూ సంతకం చేశాడు. రిషి ఆలోచనలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కార్తీక్ ఎప్పుడు పరిచయం తనకు? రిషి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు. ప్రేమించిన అమ్మాయి పూజ ఎంగేజ్మెంట్ జరిగిపోతోందంటే ఆగలేకపోయాడు. ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్యాంగ్‌గా తీసుకెళ్లి ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నాడు. పూజ నాన్నతో గొడవ పడ్డాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి, ఒకరి చేతులు ఇంకొకరి చేతుల్లోకి తీసుకొని బయటపడ్డారు. రిషికి అప్పటికి తాను చేస్తున్న పెద్ద అడ్వెంచర్ ఇదని తెలుసు. ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్‌కి తిరిగొస్తున్న సమయంలో బస్‌లో కార్తీక్‌ను మొదటిసారి చూశాడు రిషి. ఆయాసంతో కొట్టుకున్నాడు కార్తీక్. వయసు పదేళ్లు కూడా ఉండదు. ‘‘అమ్మా! నొప్పి..’’ అంటూ అమ్మ పక్కనే సీట్లో అలాగే కూలబడి కొట్టుకున్నాడు. రిషి లేచి కార్తీక్‌ని చూశాడు. ‘‘రిషీ! ఎక్కడికి? మనకు వైద్యం అందించడానికి లైసెన్స్ లేదు.’’ అంది పూజ, రిషి కార్తీక్ దగ్గరికి వెళుతుంటే ఆపుతూ. ‘‘లేదు మనం వెళ్లాల్సిందే!’’ అంటూ కదిలాడు రిషి. కార్తీక్‌ను దగ్గరకు తీసుకున్నాడు. ఛాతీపై నొక్కుతూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆయాసం తగ్గింది. కదలిక లేకుండా పడుకున్నాడు కార్తీక్. ‘‘బాబు కోమాలోకి వెళ్లాడు.’’ అంటూ అంబులెన్స్‌కు కాల్ చేశాడు రిషి. హాస్పిటల్లో చేర్చుకోవడానికి డ్యూటీ డాక్టర్లు కూడా లేరు. ఇంకా ఫైనలియర్ కూడా పూర్తి చేయని రిషికి, ఒక పేషెంట్‌ని ఇలా అడ్మిట్ చేసుకోకూడదని, ట్రీట్మెంట్ ఇవ్వకూడదని తెలుసు. కానీ తప్పలేదు. ఆ రాత్రంతా నిద్రపోకుండా కార్తీక్‌కు పరీక్షలు చేస్తూనే ఉన్నాడు. కార్తీక్‌కు కాలేజీ డీన్, ప్రొఫెసర్ల నుంచి పోరు మొదలైంది. ఎంబీబీఎస్ పూర్తి చేయకముందే వైద్యం ఎలా చేస్తావంటూ గొడవ చేశారు. ‘‘యూ థింక్ యూకెన్ హీల్ పీపుల్?’’ అడిగాడు ప్రొఫెసర్. ఆయనంటే ఆ కాలేజీలో అందరికీ గౌరవం, భయం. ‘‘అబ్సల్యూట్లీ!’’ ధీమాగా సమాధానమిచ్చాడు రిషి. డీన్, ప్రొఫెసర్ కాసేపు గుసగుసగా మాట్లాడుకొని, ‘‘ఓకే! ఇది మీకు ప్రాజెక్టు అసైన్మెంట్గా ఇస్తున్నా. నెలరోజుల్లోపుగా కేసు మొత్తం స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మా అందరినీ ఆ రిపోర్ట్‌తో సాటిస్ఫై చేయాలి. చేయలేకపోతే నువ్వు మెడిసిన్ ఇంకో ఇయర్ కంటిన్యూ చేయాలి. యూ గేమ్?’’ రిషి ఆలోచనల్లో పడ్డాడు. కాకపోతే ఈ ఛాలెంజ్ గురించి కాదు అతను ఆలోచిస్తున్నది. కార్తీక్ ఆ నెల రోజులైనా బతుకుతాడా అని. ‘‘నీకింకో ఛాయిస్. సారీ చెప్తున్నట్టు రాసిస్తే, మొదటి తప్పు కింద ట్రీట్ చేసి వదిలేస్తాం.’’ ఆలోచనల్లో పడ్డ రిషీని కదిలిస్తూ చెప్పాడు డీన్. పూజ సహా, చుట్టూ ఉన్నవాళ్లంతా ‘రిషీ! సారీ చెప్పు.’ అని రిషిని కదిలిస్తున్నారు. రిషి కొద్దిసేపు ఏం మాట్లాడకుండా ఆలోచించి, ‘‘నేను ఒప్పుకుంటున్నాను. రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. కానీ నెలలో కాదు, వారంలో!’’ అన్నాడు. డీన్, ప్రొఫెసర్ షాక్‌కు గురైనట్టు చూస్తూ ఉండిపోయారు. కార్తీక్‌కు చెయ్యాల్సిన టెస్టులన్నీ చేసి, చెప్పినట్టే వారానికి రిపోర్ట్‌తో తిరిగొచ్చాడు రిషి. రిపోర్ట్ మొత్తం చదివిన టీమ్, ‘‘సో, ఏం సజెస్ట్ చేస్తావు?’’ అనడిగింది.‘‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే సొల్యూషన్’’ చెప్పాడు రిషి. ‘‘గుండెమార్పిడా? అతనికి కేవలం ఏడేళ్లు. ఆర్ యూ ష్యూర్? నీ కెరీర్ రిస్క్‌లో ఉంది.’’ చివరి మాట నొక్కిపట్టి చెప్పాడు ప్రొఫెసర్. ‘నాకు తెలుసు.’ అని ధీమాగా తలూపాడు రిషి. రిషికి కార్తీక్ కేసును డీల్ చేసే అవకాశమిచ్చింది టీమ్. రిషితో పాటు అతని ఫ్రెండ్స్ అందరికీ ఊహించనంత దగ్గరైపోయాడు కార్తీక్. కార్తీక్ అల్లరి కూడా వాళ్లందరికీ ఆనందమే. కానీ ఆ ఆనందం, ఆ అల్లరీ ఎక్కువ రోజులు అలా ఉండటం లేదు. ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతున్నాడు కార్తీక్. రిషికి భయం పెరిగిపోతోంది. టెన్షన్ ఎక్కువైపోతోంది. కార్తీక్‌కు గుండె కావాలి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గుండె ఎక్కణ్నుంచి వస్తుంది? ఎవరు దానం చేస్తారు? ఆ సమస్యకు తోడు కొత్తగా ఇంకో సమస్య అతని ముందుకొచ్చి నిలబడింది. ‘‘బ్రెయిన్ ట్యూమర్. ట్యూమర్ పక్కనే బ్లడ్ క్లాట్ అయింది. డబ్లీ డేంజరస్.’’ తల తిరిగి పడిపోయిన రిషీ రిపోర్ట్స్ చూసి డాక్టర్ చెప్పిందీ మాట. ‘‘ఎన్నాళ్లు?’’ అడిగాడు రిషి.‘‘రేపు.. ఎల్లుండి? మ్యాగ్జిమమ్ మూడు నెలలు.’’ ‘‘నేను చనిపోతున్నా. అంతేగా!’’ అభావంగా చెప్పాడు రిషి. అప్పట్నుంచి తన సమస్యలకు పరిష్కారాలే లేవని తిరుగుతున్నాడు. పరిస్థితులను తిట్టుకుంటున్నాడు. అలాగే దేవుడ్ని కూడా! ‘బీ పాజిటివ్’. తన పక్కన్నే కూర్చున్న వ్యక్తి ఈ మాట చెప్పకపోయి ఉంటే, కార్తీక్ ఈరోజు తన గుండెను దానం చేసి, ఆ గుండెతో కార్తీక్‌ను బతికించవచ్చన్న ఆలోచన చేసేవాడు కాదు. ఇంత ప్రశాంతంగా ఇలాగతాన్ని తల్చుకునేవాడూ కాదు. కానీ కార్తీక్‌కు ఇప్పటికిప్పుడే గుండె కావాలి. రిషి చనిపోయేంతవరకూ ఆ పసివాడు ఆగలేకపోవచ్చు. రిషి ఒక ఆలోచన చేశాడు. చుట్టూ ఉన్న వాళ్లు వారించినా, చట్టం ఒప్పుకోకపోయినా, సమాజం ఆందోళన పడ్డా, కార్తీక్ కోసం ఆ పని చేయాలనుకున్నాడు, చావు తనని పిలవకముందే తానే చావును వెతుక్కుంటూ వెళ్లాలని. -
నటుడు రిషీతో ప్రేమాయణం గురించి?
తమిళసినిమా: అంగాంగ ప్రదర్శనకు పేరు గ్లామర్ కాదు అంటోంది యువ నటి మంజిమామోహన్. అచ్చం యన్బదు మడమైఇల్లడా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన మలయాళ భామ ఈమె. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందు పోగుమ్, ధనుష్ సరసన పవర్ పాండి వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా ఎందుకనో అంత బిజీ నాయకి కాలేకపోయింది. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్‌తో దేవాట్టం చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా నటి మంజిమామోహన్‌తో చిట్‌చాట్.. ప్ర: నటుడు గౌతమ్‌కార్తీక్ నటించిన అడల్ట్ కామెడీ చిత్రం ఇరుట్టు అరైయిల్ మురట్టు చిత్రం గురించి మీ అభిప్రాయం? జ: నాకేం చెప్పాలో తెలియడం లేదు. గౌతమ్ కార్తీక్ ఇటీవల నటించిన రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాలను నేను చూడలేదు. అయితే చాలా విషయాలు విన్నాను. ప్రేక్షకులకు ఆ చిత్రాలు నచ్చాయి. ఇలాంటి మార్పును ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. అయితే అలాంటి చిత్రాలు మాత్రమే కాకుండా వైవిధ్యభరిత కథాచిత్రాలన్నింటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి నా సొంత అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాను. ప్ర: మంజిమామోహన్ రొమాన్స్ రహస్యం గురించి? జ: నాకు రొమాన్స్ రహస్యం అంటూ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే అందుకు టైమే లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే. మంచి చిత్రాల్లో నటించాలి. మీరన్నట్టే అలాంటిదేమైనా ఉంటే మొదట అమ్మానాన్నలకు చెబుతాను. ఆ తరువాత మీకే తెలుస్తుంది. ఇతనే నీకు భర్త అని నా మనసు చెప్పాలి. ఇప్పటి వరకూ ఎవరినీ అలా నా మనసు చెప్పలేదు. అలా చెప్పినప్పుడు చూద్దాం. ఇంకో విషయం చెబితే మీరే ఆశ్చర్యపోతారు. నాకింత వరకూ ఎవరూ ఐలవ్యూ చెప్పలేదు. నా స్నేహితుల ద్వారానే రాయబారం పంపారు. అలాగే ఎవరైనా చెప్పినా వెంటనే ఓకే చెప్పే మనస్తత్వం నాది కాదు. తొలి చూపులోనే పుట్టే ప్రేమపై నాకు నమ్మకం లేదు. ప్ర: అందాలారబోత లేకుండా కథానాయికలు నిలదొక్కుకోవడం సాధ్యమా? జ: నా దృష్టిలో గ్లామర్‌కు అంగాంగ ప్రదర్శనకు వ్యత్యాసం ఉంది. ఒళ్లు చూపించి నటించడం నా వల్ల కాదు. నా శరీర సౌష్టవానికి అది నప్పదు కూడా. చీర ధరించి కూడా శృంగారాన్ని ఒలకబోయవచ్చు. పాత్రకు అవసరం అయితే దాన్ని నేను చేయగలను. కథ చెప్పినప్పుడే ఈ విషయం గురించి దర్శక నిర్మాతలతో స్పష్టంగా చర్చిస్తాను. ప్ర: నటుడు రిషీతో ప్రేమాయణం అంటూజరుగుతున్న ప్రచారం గురించి? జ: రిషీ నాకు క్లోజ్ ఫ్రేండ్ అని మాట వరసకు చెప్పను. తను నిజంగానే నాకు మంచి స్నేహితుడు.. నేను ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నానంటే కనీసం అలాంటి ఫొటో అయినా బయట పడాలి.అలాంటిదేమీ లేకుండా కొందరు కథలల్లుతున్నారు.కాబట్టి అలాంటి వదంతుల గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. -
ఆ పదం చాలా పవర్ఫుల్ ..!
ఐలవ్యూ అనే ప్రేమికుల సంకేతం 143. ఈ తరం ప్రతి ప్రేమికుడి నోట వినిపించే మాట 143. మూడక్షరాలే అయినా చాలా పవర్ఫుల్ పదం ఇది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో చిత్రం రానుంది. ఐ టాకీస్ పతాకంపై సతీష్‌చంద్ర పాలేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రిషి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడమే కాక హీరోగా కూడా నటించారు. ఈ చిత్రంలో ప్రియాంకశర్మ, నక్షత్ర హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇందులో సీనియర్ నాటీనటులు నటించారు. ఒక కీలక పాత్రలో నిర్మాత సతీష్‌చంద్ర పాలేటనటించారు. విజయయ్ భాస్కర్ సంగీతాన్ని అందించారు. ఇది ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అంటూ జనరంజక అంశాలతో కూడి ఉంటుందని రిషి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా 143 ఉంటుందని అన్నారు. ఈ చిత్ర తమిళనాడు హక్కులను ఆర్పీఎం. సినిమాస్ అధినేత రాహుల్ పొందారు. ఈ నెల 10వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఒక్క ‘నమస్తే’తో దొరికిపోయాడు
►ఆ కవలలు రియల్ హీరోలు ►చిన్న అనుమానమే పెద్ద దొంగను పట్టించింది. ►ఈ సారి థాయ్ మసాజ్‌కు ప్లాన్ ►మూడుసార్లు పోలీసులకు బురిడీ సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో గత పదేళ్లుగా చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేస్తే కచ్చితంగా పని చేసుకెళ్లే ఓ చైన్‌స్నాచర్ పదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఎలాగైనా అతడిని పట్టుకోవాలని నిర్ణయించుకున్న పోలీసులు పార్కు బ్లూ ప్రింట్ తీసుకుని, దొంగతనాలు జరిగిన తీరుపై సమీక్షించారు.. అయినా ఖాకీలను బురిడీ కొట్టిస్తూ ఎప్పటికప్పుడూ తనదైన రీతిలో పని కానిచ్చేస్తున్నాడు. దీంతో అతడి కోసమే ప్రత్యేకంగా పార్కు చుట్టూ 60 కెమెరాలు ఏర్పాటు చేయడమేగాక పార్కులో ఉన్న మరో 25 కెమెరాలపై నిఘా ఉంచారు. అయినా స్నాచింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉండటంతో మరో 20 కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించారు. అయితే ఇన్ని కెమెరాలకు చిక్కని నిందితుడు కేవలం ఒక ‘‘నమస్తే’’కు దొరికిపోయాడు. ఇద్దరు సినీ కవలలైన స్టంట్ మాస్టర్లు అతడిని పట్టించి రియల్ హీరోలుగా మిగిలారు.. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకట్వేర్‌రావు మంగళవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కార్మికనగర్ ప్రాంతానికి చెందిన నర్సయ్య అలియాస్, నర్సింహ అలియాస్ రిషీ చిన్నా(25) కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన కేబీఆర్ పార్కులో ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు బంగారు గొలుసులు (250 గ్రాములు), ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో మాదాపూర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినప్పటికీ పోలీసులను బురిడీ కొట్టించి బయట పడినట్లు తెలిపారు. నిందితుడితోపాటు చోరీసొత్తును కొనుగోలు చేసిన ఓం నగర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణచారిని కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. రిచ్‌గా ఉండాలని... నర్సింహ అలియాస్ రిషీచిన్నా చదివింది పదో తరగతి. విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకనే అతను అందుకోసం చోరీల బాట పట్టాడు. 10వ తరగతి వరకు స్థానిక ఆలియా ప్రభుత్వ పాఠశాలలో చదివిన అతను దానికి సమీపంలోనే ఉన్న సుజాత హైస్కూల్లో చదివినట్లు చెప్పుకొనేవాడు. చేతిలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ పట్టుకుని బీటెక్ చదివానంటూ అందరినీ నమ్మించేవాడు. పబ్బులకు వెళ్లాలని, గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగాలని, విదేశీ టూర్లు, బీచ్‌లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునేవాడు. అదే ఆలోచన నర్సింహను రిషీగా మార్చింది. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను సొంతం చేసుకొనేలా చేసింది. కేబీఆర్ పార్క్ కొట్టిన పిండి నర్సింహకు పోలీసులు సేకరించిన కేబీఆర్ బ్లూప్రింట్ కంటే ఎక్కువగా పార్కు చుట్టూ ఉన్న కెమెరాలు, ఎక్కడి నుంచి వెళ్లాలి, ఎక్కడి నుంచి లోపలికి రావాలి అనే ప్రతి విషయం తెలుసు. దీంతో అతను కేబీఆర్ పార్కు చాలా సేఫ్ ప్లేస్‌గా భావించాడు. ఇక్కడే రెండు నెలల వ్యవధిలో స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇందుకోసం ప్రతి రోజూ పార్క్‌కు వచ్చేవాడు. వాకింగ్ చేసినట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించేవాడు. తోటి వాకర్లకు అనుమానం రాకుండా మసలుకునేవాడు. పట్టించిన నమస్తే.. పార్కుకు వచ్చే నర్సింహ చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా ఉన్నట్లు నటించేవాడు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే వాకర్లను గుర్తుపెట్టుకొనేవాడు. ఈ నేపథ్యంలో అతను రోజూ పార్కుకు వస్తున్న కవల స్టంట్ మాస్టర్లకు నమస్తే పెట్టేవాడు. ఈ క్రమంలో అగస్టు 19న సుశీల దేవి అనే వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కున అతను అక్కడి నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండగా వారు ఎదురయ్యారు. ఎప్పటిలానే నర్సింహ వారికి నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం ముందుకు వచ్చిన వారికి స్నాచింగ్ జరిగిందని తెలియడం, ఆ సమయంలో అటువైపు అతనొక్కడే వెళ్లడంతో అతనిపై అనుమానం వచ్చింది. తాజాగా నాలుగు రోజుల క్రితం పార్కుకు వచ్చిన నర్సింహను గుర్తించిన వారు అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సింహను అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని తనకేమీ తెలియదంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. థాయ్ మసాజ్‌కు వెళ్లాలని.. నర్సింహకు థాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడ మసాజ్ చేయించుకోవాలని కోరిక. ఈ నేపథ్యంలో అతను నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్కుకు వచ్చాడు. అక్కడ స్నాచింగ్‌కు పాల్పడి తరువాత దసరాకు ముందు మరోసారి పంజా విసరాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. బంగారాన్ని డబ్బులుగా మార్చుకొని థాయిలాండ్‌కు వెళ్లి మసాజ్ చేయించుకోవాలనుకున్నట్లు తెలిపారు. మూడుసార్లు టోకరా.. కేపీహెచ్‌బీలోనూ అతను గతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకోగా, తాను బీటెక్ స్టూడెంట్‌నని నమ్మించి బురిడీ కొట్టించాడు. మాదాపూర్‌లో చైన్‌స్నాచింగ్ కేసులోనూ అలాగే తప్పించుకున్నాడు. కేబీఆర్ పార్కులోనూ స్నాచింగ్‌కు పాల్పడి బంజారాహిల్స్ పోలీసులకు చిక్కిన సమయంలోనూ ఇలాగే చెప్పడంతో పోలీసులు నమ్మి వదిలేశారు. చివరికి ఇలా కేబీఆర్ పార్కులో వాకర్లా నటించి స్నాచింగ్‌లకు పాల్పడుతూ వాకర్లు ఇచ్చిన సమాచారంతో నాటకార్ నర్సింహ నాటకానికి తెరపడింది. సంబంధిత వార్త.. ఇంట్లో నర్సింహ.. బయట రిషి! -
థ్రిల్ ఫుల్
రిషి, సోనియా మాన్ జంటగా ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’. శ్రీ వెంకటేశ్వర సూపర్మూవీస్ బ్యానర్‌పై ఆకుల వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ సూరి మాట్లాడుతూ– ‘‘ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఖర్చుకు వెనకాడకుండా ఎ. వెంకటేశ్ నిర్మించారు. విజయ్ కురాకుల మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ‘సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకేత్తించేలా శేఖర్ సూరి అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ చిత్రంలా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఎ. వెంకటేశ్. -
‘ఎ ఫిల్మ్ బై అరవింద్’లా...
రిషి, సోనియామాన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్‌పై ఆకుల వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’. శేఖర్ సూరి దర్శకుడు. విజయ్ కురాకుల సంగీత దర్శకుడు. ఈ చిత్రం మే ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘శేఖర్ సూరి ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ని అద్యంతం ఉత్కంఠ కలిగేలా తీశారు. ఆ సినిమాలానే ఈ ‘డాక్టర్ చక్రవర్తి’ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నిర్మాత వెంకటేష్ సహకారం మాటల్లో చెప్పలేనిది. విజయ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు చిత్రదర్శకుడు శేఖర్ సూరి. ఈ చిత్రానికి ఎడిటింగ్: తిరుపతిరెడ్డి, కెమెరా: రాజేందర్. -
రిషి వ్యాలీ.. చదువులు జాలీ
అమలు కానున్న నూతన విద్యావిధానం ఉపాధ్యాయ సంఘాల హర్షం భానుగుడి (కాకినాడ సిటీ) : 30 ఏళ్లనాటి విద్యావిధానానికి మళ్లీ మహర్దశ రానుంది. ఒకప్పటి ప్రాచీన విద్యావిధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం సాహాసోపేత నిర్ణయం తీసుకుంది. రిషివ్యాలీ రివర్ విద్యావిధానానికి కొన్ని మెరుగులు దిద్దనుంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లోను, దశలవారీగా మిగిలిన అన్ని పాఠశాలల్లోను ఈ పద్ధతిని అమలు పర్చనుంది. ఇందుకోసం శిక్షణ కార్యక్రమాలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రతి మండలానికి రెండు చొప్పున జిల్లాలో 330 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత, 615 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో తొలుత ఒకటి, రెండు తరగతులకు ఫైలట్ ప్రాజెక్టుగా రిషివ్యాలీ విధానాన్ని అమలు చేయనున్నారు. అనంతరం మూడు నుంచి ఐదు తరగతులకు ఈ విధానాన్ని కొనసాగిస్తారు. ప్రతి మండలానికి రెండు చొప్పున జిల్లాలో 128 పాఠశాలల్లో ఈ విధానం అమలు కానుంది. ఈ నెల 11న అమరావతిలో రాజీవ్‌విద్యామిషన్ పీవోలు, ఏఎంవోలు రిషివ్యాలీ రివర్ (రిషివ్యాలీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్)పై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం (ఈ నెల 13) నుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విద్యావిధానానికి ఆనందలహరి అభ్యసన అనే పేరును ఖరారు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో జిల్లాలోని అన్ని మండలాలకు విస్తరించనున్నారు. రిషివ్యాలీ రివర్ విద్య అంటే.. రివర్ విద్యలో నాలుగో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉండవు. బ్యాగుల మోత కూడా లేదు. కార్డులు, బొమ్మలు, ఆటపాటల ద్వారా విద్యావిధానం సాగుతుంది. విద్యార్థులకు బడి అంటే భయం పోతుంది. డ్రాపౌట్స్ సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. విద్యార్థుల శ్రద్ధంగా చదువుకుంటే సహచరులతో పనిలేకుండా ముందు పాఠాలకు వెళ్లిపోవచ్చు. చదువులో ఏ స్థాయిలో ఉండేది రివర్ విద్య ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. బడికి పిల్లలను ఆకర్శించడమే కాకుండా బడి వాతావారణం సైతం ఈ విద్యావిధానంతో మారనుంది. బృందాలుగా విద్యార్థులు చదువుకోవచ్చు. తద్వారా ఆలోచనలను పంచుకునే వెసులుబాటు అధికంగా ఉంటుంది. వెనుకబడిన చోట, అవసరం ఉన్న చోట విద్యార్థిని ప్రోత్సహించడానికి ఆస్కారం ఉంది. పక్కరాష్ట్రాల్లో అమలు తమిళనాడులో ఏబీఎల్ (యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్), కర్ణాటకలో నలి–కలి, కేరళలోని రెండు జిల్లాల్లో ఎప్పుడో ఈ విద్యావిధానాన్ని అమలు చేశారు. మన దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇథోపియా, ఆఫ్రికా ఐవరీ కోస్ట్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. శిక్షణ అనంతరం నిర్ణయం పాఠశాలల ఎంపికకు సంబంధించి విద్యాశాఖాధికారితో శిక్షణ అనంతరం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విద్యావిధానం ద్వారా సరికొత్త ఫలితాలను అందుకునేందుకు సమన్వయంతో ముందుకు వెళతాం. జిల్లావ్యాప్తంగా సదస్సుల ద్వారా ఉపాధ్యాయుల్లో అవగాహనకు కృషిచేస్తాం. - మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీవో ఉత్తమ ఫలితాలు సా«ధ్యమే రిషివ్యాలీ విద్యావిధానంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమే. విద్యార్థుల్లో విషయ చర్చకు ఈ విధానంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చేయడం ద్వారా నేర్చుకోవడం వల్లఎక్కువకాలం విద్యార్థికి జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది. శిక్షణ అనంతరం పాఠశాలల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలపై ప్రణాళిక వివరిస్తాం. - అబ్రహం, డీఈవో -
ఎంసెట్–3లో సత్తాచాటిన రిషి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్(నీట్) అకాడమి స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంసెట్–3 ఫలితాలలో తన సత్తా చాటుకుంది. సందీప్‌రెడ్డి 135 మార్కులతో 1053వ ర్యాంకు, శ్రీహరి 132 మార్కులతో 1828వ ర్యాంకు, చైతన్య 131 మార్కులతో 2,343వ ర్యాంకు, ఎం.పవన్‌కుమార్ 127 మార్కులతో 2414వ ర్యాంకు, బి.నవీన 126 మార్కులతో 2,605వ ర్యాంకు, డి.శ్రావణి 128 మార్కులతో 2,760వ ర్యాంకు, పి.శ్రీలేఖ 127 మార్కులతో 2,990వ ర్యాంకు, 3వేల నుంచి 5వేల లోపు ర్యాంకు సాధించిన వారు నలుగురు విద్యార్థులు, 4వేల నుంచి 7వేలలోపు ర్యాంకులు ముగ్గురు విద్యార్థులు సాధించారని కరస్పాండెంట్ చంద్రకళావెంకట్ తెలిపారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 10 నుంచి 15మంది డాక్టర్లను తయ్యారు చేస్తామని న్యూ రిషి మెడికల్ అకాడమి వెలిగెత్తి చాటిందని పేర్కోన్నారు. విద్యార్థులు, ర్యాంకుల సాధనకు తోడ్పడిన అధ్యాపకులు, తల్లిదండ్రులను, విద్యార్థులను కరస్పాండెంట్ చంద్రకళా వెంకట్, సైకాలజిస్టు లక్ష్మణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం!
ప్రేమికుల రోజుకు వయసుతో పని లేదంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. ప్రేమను పంచుకోడానికి వయసుతో సంబంధం లేదని సందేశం ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే ప్రతివారూ జరుపుకోదగ్గ రోజన్న విషయం... ప్రతివారికీ తెలియాలని ఆయన ట్వీట్ చేశారు. లవ్.. రొమాన్స్ యువతకు మాత్రమే పరిమితం కాదంటున్నారు. ఏభై ఏళ్ళ వివాహ జీవితాన్ని పూర్తి చేసిన రిషికపూర్.. దంపతుల్లో ఉండే ప్రేమను నిరూపించే ఓ హార్ట్ టచ్చింగ్ వీడియోను యూట్యూబ్.. కాట్ ఇన్ యాక్షన్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఒకరికోసం ఒకరు అనేందుకు ఇప్పుడా వీడియో తార్కాణంగా నిలుస్తోంది. ఒకరి ఆహారంపట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, సమయానికి మందులు గుర్తు చేయడం, ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ ప్రేమను నిలబెడతాయని... ఆప్యాయత అనురాగాన్నీ పెంచుతాయని, నిస్వార్థంగా బతికేలా చేస్తాయని ఆ దంపతులను చూస్తే అర్థమౌతుంది. ఇప్పటిదాకా ఆమె దృష్టిలో నేనొక్క పని కూడా సరిగా చేయలేదని.. అయితే వివాహ జీవితం 54 ఏళ్ళు సజావుగా సాగిపోయిందని రిషికపూర్ నవ్వుతూ చెప్తున్నారు. జీవితాంతం వాలెంటైన్ గా ఉండాలనుకున్నవారు మరి ఆ అన్యోన్య దాంపత్యాన్ని వీక్షించాల్సిందే... So true.... You never too old for Valentines Day! Well done Sarah https://t.co/5KQs94GSqz — Rishi Kapoor (@chintskap) February 11, 2016 -
ఆరోగ్యవంతమైన భయం..ఆదర్శవంతమైన జీవితం..!
పిల్లలకు ఏదైనా మంచి మాట చెప్పాలనిపించినప్పుడు, నా బుద్ధికి తోచినవి మంచివే అయినా చెప్పకూడదు. నాకు మంచిదనిపించింది నిజంగా మంచిది కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఇప్పుడు మంచి విషయమనుకుని నేను చెప్పినది మరుసటి ఏడాదికి మారిపోవచ్చు. అప్పుడు నేను ఇలా చెప్పకుండా ఉండాల్సిందని చెప్పే అధికారం నాకుండదు. స్వబుద్ధికి తోచిన విషయాన్ని పదిమంది ఆచరించవలసిన విషయంగా ఎప్పుడూ చెప్పకూడదు. పదిమంది ఆచరించడం కోసం నిర్భయంగా చెప్పగలిగిన మాట ఒక్కటే ఉంటుంది. దానినే ఆర్యోక్తి అంటారు లేదా ఋషి వాక్కు. ఋషి దార్శనికుడు. భగవంతుని ఆగ్రహం చేత సర్వం తెలుసుకున్నవాడు. కాబట్టి అటువంటివాడు పదిమందిని మంచిమార్గంలో నడవండని ఒకమాట చెబితే... భగవంతుడు కూడా మాట్లాడడు. ఆ స్థాయిని పొందినవాడు ఋషి. ఆర్య అంటే పెద్దరికం. అందువల్ల ఏదైనా చెప్పేటప్పుడు ఆర్యోక్తినే స్వీకరించి చెప్పవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఒక మాటంటాడు. ధృతి, దృష్టి, మతి, దాష్ట్యం సకర్మ నశీయతి’ అంటాడు. ఇది ఆర్యోక్తి. ఒక్క విద్యార్థులకే కాదు, మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికీ ఇది అన్వయమవుతుంది. ధృతి అంటే పట్టుదల, నిర్ణయం. దృష్టి’ అంటే మీరు ఒక పనిని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆది పూర్తిగాక ముందే మీ వైభవాన్ని, కీర్తిని పొందడం. దానివల్ల వచ్చే పొగడ్తకోసం పోకుండా నిలదొక్కుకోగలగడం. మతి’ అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసినదానిగా చేయకుండా పోవడం, దాష్ట్యం’ అంటే చెయ్యకుండా ఉండవలసిన పనిని చెయ్యకుండా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని పొంది ఉండడం. ఈ నాలుగూ ఎవరు పొంది ఉంటారో వాడు తలపెట్టిన పనిలో విఫలంకాడు. వాడు దేనిని సాధించాలనుకున్నాడో దానిని సాధించితీరతాడు. ‘ధృతి’ అంటే పట్టుదల, నిర్ణయం అని చెప్పుకున్నాం గదా! ఏవిధమైన ముందు నిర్ణయం లేకుండా చేసే ప్రయాణం గమ్యాన్ని చేర్చదు. బాటసారిలాగా నడుస్తుంటాడు. అంతే. గమ్యానికి చేరడానికి నడవాలి తప్ప నడవడం కోసం నడవకూడదు. నీవు జీవితంలో ఏం చేద్దామకుంటున్నావ్ ! ఏమవ్వాలకుంటున్నావ్ ! అది గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి, ఆ నిర్ణయాన్ని సాధించుకోవడానికి పట్టుదలతో నడవాలి. అలా పట్టుదలతో నడిచే ప్రయాణాన్ని ధైర్యం అని పిలుస్తాం. నిర్భయత్వం, ధైర్యం అని రెండుమాటలున్నాయి. వీటిని జాగత్తగా పరిశీలించండి. నిర్భయత్వం ధైర్యం కాదా? ఆయనకు భయంలేదు’ అన్నాననుకోండి. అంటే ధైర్యం ఉన్నట్లా? ధైర్యంగా ఉన్నాడు’ అన్నాననుకోండి. భయం లేకుండా ఉన్నాడనేనా? ఈ రెండూ ఒకటే అయితే, మరి శాస్త్రంలో రెండింటినీ విడివిడిగా ఎందుకు చెప్పినట్లు? ఆయన ధైర్యంగా ఉన్నాడు’ అంటే దాని అర్థం... ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉన్నాడని. దానిలో మళ్ళీ రెండుంటాయి. హృదయవ్యవస్థలోని రక్తంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్లాగా ఒకటి పాడు చేస్తుంది, మరొకటి బాగు చేస్తుంది. ఏది మనిషిని బాగు చేస్తుందో ఆ భయం ఉండాలి. ఏది పాడు చేస్తుందో దానిని బయటికి వ్యక్తం చేయకూడదు.ధైర్యం అంటే - ఏది బాగుచేస్తుందో అది దగ్గర ఉన్నవాడు, ఏది పాడు చేస్తుందో అది దగ్గర లేనివాడు-అని. నేను చాలా ధైర్యంగా ఉంటానండీ, ఏ పనైనా చేస్తా’’ అంటే దానర్థం - చెయ్యవద్దన్న పనిచేస్తాడని కాదు. ఉదాహరణకు ఒక విద్యార్థిగా కళాశాలలో ప్రవేశించి ఒక పిల్ల చెయ్యకూడని పనిచేసింది, దొంగతనం చేసింది. ఆ దోషానికి తిట్టవలసిన అవసరం ఉన్నా, ఆ పిల్ల జీవితంలో ఎందుకూ పనికిరాదని నిర్ధారించడం కుదరదు. దోషాన్ని సంస్కరించవలసి ఉంటుంది. దోషం లేకుండా ఎవరుంటారు? అసలు దోషం లేకుండా ఈ ప్రపంచాన్ని సిద్ధం చేశారనుకోండి. అప్పుడు ఈ ప్రపంచానికి నీవు అక్కరలేదు, శాస్త్రమూ అక్కరలేదు. అందరికీ ఇన్ని మంచి మాటలు చెప్పే నేను నా చిన్నతనంలో తెలియక దోషభూయిష్టంగా ప్రవర్తించాను. అంతమాత్రంచేత నేను సమాజంలో పనికిమాలిన వాడినికాదు. దోషాన్ని గుప్తంగా సంస్కరించాలి. గుణాన్ని సభాముఖంగా స్వీకరించాలి. ఎందుచేత? అది ఆదర్శం. వైద్యం గుప్తం, జ్యోతిష్యం గుప్తం. అవి ఒక్కరికే తెలియాలి. మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే డాక్టర్ వైద్యాన్ని సభాముఖంగా చేయడు. ఒక్కొక్కరిని పిలిచి చేస్తాడు. దోషాన్ని గుప్తంగా సంస్కరిస్తాడు. ఉపన్యాసం చెప్పేటప్పుడో... అది ఒక్కొక్కరిని కూర్చో పెట్టుకుని చెప్పకూడదు. అందరికీ కలిపి చెప్పాలి. ఉపన్యాసం వర్షం లాంటిది. నిర్భయత్వం, ధైర్యం... ఈ రెండింటికీ మధ్యన ఉన్నది ఆరోగ్యవంతమైన భయం. మీరు చదువుకుంటున్నారు. వృద్ధిలోకి వ స్తున్న విద్యార్థులు. రేపు మీరు పెద్దపెద్ద పదవుల్లోకి వెడతారు. కానీ అప్పుడు కూడా మీకు మీ నాన్నగారంటే భయం. అంటే మీనాన్నగారు మిమ్మల్ని ఏదో చేసేస్తారని కాదు కదా! మా నాన్నగారలా చేయొద్దన్నారు. అందుకని నేనది చేయను. చేస్తే ఆయన బాధపడతారు. ఆయన అంగీకరించరు. ఆయనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నా అభ్యున్నతికి కారణం కాదని మా నాన్నగారు తిడతా. అందుకే నేనటువంటి పని చేయను’’ అంటారు. ఇప్పుడు చెప్పండి మీది పిరికితనమనాల్సి ఉంటుందా లేక ఆరోగ్యవంతమైన భయం అనాల్సి ఉంటుందా! జీవించి ఉన్నంతకాలం ఈ ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉండాలి. అందుకే చావుపట్ల భయం, తండ్రిపట్ల భయం. తల్లిపట్ల భయం. మీ లెక్చరర్ అంటే మీకు భయం, గౌరవం. ఆయన వద్దన్న పని చేయరు. దానిలో ఉన్న విశేషణ మేమిటంటే... వారెప్పుడూ మీ అభ్యున్నతినే కోరుకుంటుంటారు. ఏ కారణం చేతకూడా మీరు ఓడిపోవడాన్ని వారు అంగీకరించరు. మీరు వృద్ధిలోకి రావాలని సదా ఆకాంక్షిస్తుంటారు. మీ శక్తికి తగిన మాటలే చెబుతారు. శక్తికి మించినవి మీకు చెప్పి వాటి ఆచరణలో మీరు చతికిలపడితే వైఫల్యం చెందుతారనీ, వైఫల్యం చెందితే మీరింక లేవలేరని వారి ఆందోళన. అలా ఎందుకు? వారు మీ అభ్యున్నతిని కోరుకుంటున్నారు కాబట్టి. తల్లిదండ్రులు బిడ్డలకోసం ఏత్యాగమైనా చేస్తారు. వారు ఒక వయసు వరకు కీర్తిగా బతకాలనుకుని తాపత్రయపడతారు. అది దాటిన తరువాత నా కొడుకు కీర్తివంతుడై బతకాలని ఆశిస్తారు. ఈ ఆరోగ్యవంతమైన భయాన్ని విస్మరించడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. దీన్ని విడిచిపెట్టకుండా ఉండడంలోనే సంస్కారం అన్నమాటకు అర్థం ఉంది. మా నాన్నగారు నాకు చెప్పేదేమిటండీ, ఇంత వయసు వచ్చింది నాకు ఆమాత్రం తెలియదా’’ అని స్వతంత్రించడం ప్రమాదహేతువే. దాని ఫలితం తెలిసిన తర్వాత దాన్ని దిద్దుకోలేరు. ‘‘అదే మా నాన్నగారు నన్ను కన్నారు, పెంచి పెద్దచే శారు, చదువుచెప్పించారు, ఏ కాలేజయితే బాగుంటుందని పదిమందిని అడిగి నిర్ణయించారు, వారు సుఖంగా, సంతోషంగా బతకడం మాని డబ్బు దాచి నా ఫీజు కట్టారు.. అనారోగ్యంగా ఉన్నా పెద్ద ఆస్పత్రులకు వెళ్ళకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, అటువంటి వారేది చెప్పినా నా అభ్యున్నతి కోసమే చెప్తారు’’ అని అన్నారకోండి. అదీ ఆరోగ్యకరమైన భయం అంటే. జీవితంలో మీ ఒక వ్యక్తిని ఆదర్శంగా స్వీకరించండి. అలా స్వీకరించ లేదనుకోండి, మీకు మార్గదర్శనం లభించదు. అస్తమానం మీకు ఇది మంచి, ఇది చెడు, ఇదిలా చెయ్యి ఇదిలా వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్ననాడు మీ మనసు ఆయనకు వినబడాలి. మీరు ఆయన జీవితాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళ జీవితాలు కూడా చాలా కష్టపడితే తప్ప మహాత్ములు కాలేదన్న విషయాన్ని గుర్తించాలి. వాళ్ళేమీ తెల్లవారేటప్పటికి మహాత్ములు కాలేదు. వాళ్ళ జీవితాలేమీ పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చినవాడు మాత్రమే లోకానికి దార్శనికంగా నిలబడతాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి వచ్చి వాటిని దాచకుండా చెబుతూ మీరు ఇలా బతకవలసి ఉంటుందని చెప్పగలిగినవాడు మాత్రమే మీకు ఉపకారం చేయగలడు. అందుకే మీకొక రోల్ మోడల్ ఉండాలని, మీరు ఒకరిని ఆదర్శంగా తీసుకోండని అంటుంటారు. మీరలా ఒక కట్టుబాటుకు వశపడడం అనేది మీకు రాలేదనుకోండి. అది రాకపోతే మీ అభ్యున్నతి అక్కడితో ఆగిపోతుంది. ఆయన ైధైర్యంగా ఉన్నాడు’ అంటే దాని అర్థం... ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉన్నాడని. దానిలో మళ్ళీ రెండుంటాయి. హృదయవ్యవస్థలోని రక్తంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్లాగా ఒకటి పాడు చేస్తుంది, మరొకటి బాగు చేస్తుంది. ఏది మనిషిని బాగు చేస్తుందో ఆ భయం ఉండాలి. ఏది పాడు చేస్తుందో దానిని బయటికి వ్యక్తం చేయకూడదు.ధైర్యం అంటే - ఏది బాగుచేస్తుందో అది దగ్గర ఉన్నవాడు, ఏది పాడు చేస్తుందో అది దగ్గర లేనివాడు-అని. నేను చాలా ధైర్యంగా ఉంటానండీ,ఏ పనైనా చేస్తా’’ అంటే దానర్థం - చెయ్యవద్దన్న పనిచేస్తాడని కాదు. -
పిల్లలు కాదు... పిడుగులు
నేటి బాలలే...రేపటి పౌరులు. ఈ అంశాన్నే నేపథ్యంగా తీసుకుని చేసిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రిషి ప్రధాన పాత్రలో రషీద్ బాషా దర్శకత్వంలో ఎస్. ఇబ్రహీమ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఆరుగురు పిల్లలు పిడుగులై, అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేశారన్నదే ఈ సినిమా ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:కిషన్‌సాగర్, సంగీతం: శ్రీ వెంకట్. -
ఆమె అపురూపం
ప్రతి భర్త తన భార్యను బంగారంలా భావిస్తూ, అపురూపంగా చూసుకుంటే ప్రతి ఇల్లు నందనవనం అవుతుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘శ్రీమతి బంగారం’. రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక ముఖ్య తారలుగా శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై చెన్న శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధ బాపు, నిర్వహణ: జీవీ సత్యనారాయణ. -
అందమైన ప్రేమకథ
‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని స్నేహితుడి పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం ఆరంభం కానుంది. గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రమణ మల్లం దర్శకత్వంలో కన్నెగంటి వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘విజయ్, రేష్మీ మీనన్ పాల్గొనగా ఇటీవల ఫొటోషూట్ చేశాం. జంట చూడచక్కగా ఉంది. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రిషి పాత్ర ద్వారా అందర్నీ ఆకట్టుకున్న విజయ్ ఈ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: సురేంద్రకృష్ణ, మాటలు: నిరూప్, సంగీతం: రథన్. -
నా ఊరే..నా చిత్రం
అడుగులు నడకలు నేర్పిన ఇల్లు... కోయిల చిలుకల ఆవాసాలైన చెట్లు...నేడు వర్ణ రంజితమై ప్రకాశిస్తున్నాయి. పల్లె పడచుల వయ్యారాలు.. వారు అలంకరించుకున్న వస్త్రాభరణాలు...కాన్వాస్‌పై కవితలల్లుతున్నాయి. పుట్టిన ఊరు.. పెరిగిన పరిసరాలు.. కనులను తాకి... కలలను రేపిన ప్రతి దృశ్యం ఇప్పుడు అపు‘రూపం’. మనసును తడిమి.. కుంచెగా మారిన ‘జీవన చిత్రం’ తోట వైకుంఠం. తెలంగాణ సంస్కృతికి విశ్వఖ్యాతి తెచ్చిన రుషి.. తన నేపథ్యమే ‘చిత్రమై’... స్ఫూర్తి నింపుతున్న వైకుంఠం ప్రయాణం ‘సిటీ ప్లస్’కు ప్రత్యేకం. కరీంనగర్ జిల్లాలో మాది మారుమూల గ్రామం... బూరుగుపల్లి. వేములవాడకు ఐదు కిలోమీటర్లు. ఇప్పటికీ మా ఊరికి బస్సు లేదు. చిన్నప్పటి నుంచీ ఆర్టిస్టును కావాలనే కోరిక. మెట్రిక్యులేషన్ తరువాత 1960లో చిత్రకళ నేర్చుకోవాలని హైదరాబాద్‌కు వచ్చా. ఇక్కడి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఓ ఫ్రెండ్ ఉండేవాడు. సీనియర్. ఎందుకొస్తావు ఇక్కడికి! ఇది నేర్చుకుని మహా అయితే డ్రాయింగ్ టీచర్ కాగలవు.. అంటూ నిరాశపరచాడు. నేనేమో.. ఏ ఎలక్ట్రికలో, మెకానికలో (ఐటీఐ) నేర్చుకోవచ్చంటే... నాన్నతో కొట్లాడి మరీ సిటీకి వచ్చా. అంతా కొత్తగా... సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్లి అక్కడి నుంచి నగరానికి రైల్లో వచ్చా. రైలును చూడటం అప్పుడే. కాచిగూడ స్టేషన్లో దిగా. జట్కా బండ్లు, సైకిళ్లు, రిక్షాలు.. విద్యుత్ కాంతులు... పెద్ద హంగామా! కోఠి భారతీయ విద్యాభవన్ సమీపంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఉండేది. గంగారామ్ అని మంచి సింగర్. ఆయనతో కలసి హాస్టల్లో ఉండేవాడిని. హైదరాబాద్ రావడానికి ఆయనే సాయం చేశాడు. అన్నీ కలిపి ఇరవై... రూమ్ అద్దె, భోజనం, ఇతర ఖర్చులూ అన్నీ కలిపి నెలకు ఇరవై రూపాయల్లో అయిపోయేది. అప్పట్లో దుర్గా విలాస్‌లో ఫుల్ మీల్స్ 60 పైసలు. బృందావన్‌లో గ్రాండ్ భోజనం రూపాయే. సీనియర్ల సహవాసం... ప్రముఖ ఆర్టిస్టులు సూర్యప్రకాశ్, లక్ష్మాగౌడ్ కాలేజీలో నాకు సీనియర్లు. కాలేజీలో చెప్పే పాఠాలేవీ నాకు ఆర్ట్‌లా అనిపించలేదు. తిరిగి వెళ్లిపోదామన్నంత ఫీలింగ్. కానీ, నాన్నతో కొట్లాడి వచ్చా కదా..! అందుకే ఆగానేమో! రూమ్మేట్ సత్యానంద్. ఆయనది కాకినాడ. ఎడ్యుకేటెడ్. హోదాగల పెద్ద ఫ్యామిలీ వాళ్లది. పెయింటింగ్స్ బాగా వేసేవాడు. ఆయనకు సైకిల్ ఉండేది. అప్పట్లో అదో స్టేటస్ సింబల్. ఓసారి కాళీయమర్దనం వేయమంటే... అంతా ఒకేలా గీశారు. అతనొక్కడే డిఫరెంట్‌గా, అద్భుతంగా వేశాడు. అతని ఆర్ట్‌లో మోడ్రనైజేషన్ కనిపించేది. ఫతే మైదాన్.. పబ్లిక్ గార్డెన్... నన్ను ప్రోత్సహించి, కొత్త మార్గం చూపింది లక్ష్మాగౌడ్. ఓసారి ఫతేమైదాన్కు తీసుకెళ్లాడు. అక్కడున్న స్ట్రీట్ చూసి... యాజ్ ఇటీజ్‌గా గీయమన్నాడు. తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్.. అక్కడి పరిసరాలు, గుర్రాలు, జట్కాలు. చివరకు అదో హాబీగా మారిపోయింది. రోజూ కాలేజీకి వెళ్లే ముందు పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లి... పూల తోటలు, మసీద్ వంటివన్నీ గీస్తూ ఉండేవాడిని. ఫ్రెండ్స్ షరీఫ్, అబ్బూరి గోపాలకృష్ణ, నరసింహారావు, కర్నారావు (ప్యారిస్) కూడా బాగా ప్రోత్సహించారు. అంతా కాపీనేగా! ఏంచేయాలన్నా నాకు డబ్బు సమస్య. దాంతో పెయింటింగ్స్ వేయలేకపోయా. 1964లో బాంబే వెళ్లి కొన్ని ట్రయల్స్ వేశా. వర్కవుట్ కాలేదు. వెనక్కి వచ్చేశా. దేవరకొండ వెళ్లి ఓ ప్రైవేటు స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా చేరా. రెండుమూడేళ్లు చేసి, నచ్చక వదిలేశాను. బరోడా (1970) మహారాజా గైక్వాడ్ స్కూల్లో ఇండియన్ అండ్ వెస్ట్రన్ ఆర్ట్‌పై చర్చాగోష్టి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల నుంచి ఆర్టిస్టులు వచ్చారు. ఎవర్ని చూసినా.. హీరోలా పోజిచ్చేవారు. వాళ్లంతా... ‘మీ భారత్‌లో ఏముంది.. అంతా వెస్ట్రన్ ఆర్ట్‌ను కాపీ కొట్టడమేగా’ అన్నారు. అప్పుడు ఆలోచించా.. నా ప్రత్యేకత, శైలి ఏముందని! నేటివిటీనే నేపథ్యం... వెనక్కి వచ్చి మళ్లీ ఉద్యోగంలో చేరా గానీ... మనసు మాట వినడం లేదు. అవే కామెంట్స్ రింగుమంటున్నాయి. అదే నాలో ఆలోచనలు రేపింది. స్థానిక పరిసరాలు, సంస్కృతి, సంప్రదాయాలు తీసుకొని పెయింటింగ్స్ వేస్తే వాటిల్లో జీవ కళ ఉంటుందని అర్థమైంది. నా ఊరు... నేను చూసిన మనుషులు... అక్కడి పండుగలు... పబ్బాలు... ఇప్పుడు ఇవే నా ఆర్ట్‌కు మూలం. శ్రమ జీవి ముఖం చూస్తే... అతడి కథ, కష్టం తెలుస్తుంది. అంత డెప్త్ ఉంటుందా మోములో. పల్లె పడచులు వేసుకొనే వస్త్రాలు, ధరించే ఆభరణాలు, పాలేర్లు, ఆడుకోవడం, ముస్తాబవడం, చిలుక, అద్దం.. ఇలా అన్నీ నా ఊళ్లో చిన్నప్పటి నుంచి నేను చూసినవే. నా ఆర్ట్ అంతా లైన్స్, ఫ్లాట్ సర్ఫేస్, డాట్స్. అన్నీ ప్రకృతిలో కనిపించే ప్రైమరీ కలర్సే. ‘మై కలర్స్ ఓన్లీ బిలాంగ్స్ టు మై విలేజ్’. అందుకే నా చిత్రాల్లో లైట్స్, షాడోస్ ఉండవు. దాంతో తొలినాళ్లలో అవి ఎవరికీ నచ్చలేదు. ఇవేం పెయింటింగ్స్ అన్నారు. హుస్సేన్‌కు నచ్చింది... నాలుగైదేళ్లు ఇలా గడిచిపోయాయి. భోపాల్‌లో పెయింటింగ్ ఎగ్జిబిషన్. అందులో ప్రదర్శించే పెయింటింగ్స్ సెలెక్ట్ చేయడానికి ఓ కమిషన్ వేశారు. దానికి లక్ష్మాగౌడ్ హెడ్. దాదాపు 70 మంది ఫైనలిస్టుల్లో నా పేరు కూడా ఉంది. ప్రదర్శనలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి కొందర్ని నియమించారు. రెండు రౌండ్లు అయిపోయాయి. నా బొమ్మను ఎవరూ పట్టించుకోలేదు. చివరిగా ఎంఎఫ్ హుస్సేన్ వచ్చారు. ఓ రౌండ్ వేసి... ఠక్కున నా పెయింటింగ్ సెలెక్ట్ చేశారు. లిస్టులో నా పేరుంది. షాకయ్యా. అప్పుడు ఆనందం వర్ణించలేదు. అదే నా లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందులో ప్రైజ్ రూ.25 వేలు. నా పెయింటింగ్ రూ.500కు అమ్ముడైంది. అదే మొదటిది. ఇప్పుడైతే ఎంతైనా ఇచ్చి కొనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా, నా ధ్యాసంతా బొమ్మలు వేయడమే. 2000లో అమెరికా వెళ్లినప్పుడు అక్కడ అందరూ నన్ను గుర్తు పట్టారు. ఆ గొప్ప నాది కాదు, నా బొమ్మలది. వాటిలోని తెలంగాణ సంస్కృతిది.