ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి | we should be carefull with love : ajay | Sakshi
Sakshi News home page

ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి

Published Fri, Feb 21 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి

ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి

 పేమలో జాగ్రత్తగా ఉండకపోతే ఎదురయ్యే పరిణామాలు, ప్రమాదాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసీ’. తలారి నాగరాజుని దర్శకునిగా పరిచయం చేస్తూ జేవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అజయ్, రిషి, శ్రీఐరా, రూబీ ముఖ్య తారలు. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఏబీసీ అంటే ‘ఆల్వేస్ బీ కేర్‌ఫుల్’ అని అర్థం. యాక్షన్ ఓరియంటెడ్ లవ్ థ్రిల్లర్ ఇది.

 

వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం టీనేజ్ పిల్లలతో పాటు పెద్దలు కూడా చూసే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న పాటల్లో ఓ పాటను కీరవాణిగారు పాడటం విశేషం’’ అని చెప్పారు. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని నాగరాజు అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్‌రెడ్డి, మాటలు: శ్రీముత్యం ఇజ్జరౌతు,  కెమెరా: ఇ.సి.హెచ్. ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement