ఆ పదం చాలా పవర్‌ఫుల్‌ ..! | Hero Rishi acts in i love you movie | Sakshi
Sakshi News home page

ఆ పదం చాలా పవర్‌ఫుల్‌ ..!

Published Sun, Nov 5 2017 9:01 PM | Last Updated on Sun, Nov 5 2017 9:10 PM

Hero Rishi acts in i love you movie - Sakshi

ఐలవ్‌యూ అనే ప్రేమికుల సంకేతం 143. ఈ తరం ప్రతి ప్రేమికుడి నోట వినిపించే మాట 143. మూడక్షరాలే అయినా చాలా పవర్‌ఫుల్‌ పదం ఇది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో చిత్రం రానుంది. ఐ టాకీస్‌ పతాకంపై సతీష్‌చంద్ర పాలేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రిషి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడమే కాక హీరోగా కూడా నటించారు.

ఈ చిత్రంలో​ ప్రియాంకశర్మ, నక్షత్ర హీరోయిన్‌లుగా పరిచయం అవుతున్నారు. ఇందులో సీనియర్‌ నాటీనటులు నటించారు. ఒక కీలక పాత్రలో నిర్మాత సతీష్‌చంద్ర పాలేట​నటించారు. విజయయ్‌ భాస్కర్‌ సంగీతాన్ని అందించారు. ఇది ప్రేమ, వినోదం, సెంటిమెంట్‌ అంటూ జనరంజక అంశాలతో కూడి ఉంటుందని రిషి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా 143 ఉంటుందని అన్నారు. ఈ చిత్ర తమిళనాడు హక్కులను ఆర్‌పీఎం. సినిమాస్‌ అధినేత రాహుల్‌ పొందారు. ఈ నెల 10వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement