
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పోలీసులకు హాస్టల్ సూపరింటెండెంట్ ఫిర్యాదు
తిరుపతి క్రైమ్: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది.
ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం
బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.
దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment