ఎంసెట్–3లో సత్తాచాటిన రిషి
Published Fri, Sep 16 2016 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్(నీట్) అకాడమి స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంసెట్–3 ఫలితాలలో తన సత్తా చాటుకుంది. సందీప్‌రెడ్డి 135 మార్కులతో 1053వ ర్యాంకు, శ్రీహరి 132 మార్కులతో 1828వ ర్యాంకు, చైతన్య 131 మార్కులతో 2,343వ ర్యాంకు, ఎం.పవన్‌కుమార్ 127 మార్కులతో 2414వ ర్యాంకు, బి.నవీన 126 మార్కులతో 2,605వ ర్యాంకు, డి.శ్రావణి 128 మార్కులతో 2,760వ ర్యాంకు, పి.శ్రీలేఖ 127 మార్కులతో 2,990వ ర్యాంకు, 3వేల నుంచి 5వేల లోపు ర్యాంకు సాధించిన వారు నలుగురు విద్యార్థులు, 4వేల నుంచి 7వేలలోపు ర్యాంకులు ముగ్గురు విద్యార్థులు సాధించారని కరస్పాండెంట్ చంద్రకళావెంకట్ తెలిపారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 10 నుంచి 15మంది డాక్టర్లను తయ్యారు చేస్తామని న్యూ రిషి మెడికల్ అకాడమి వెలిగెత్తి చాటిందని పేర్కోన్నారు. విద్యార్థులు, ర్యాంకుల సాధనకు తోడ్పడిన అధ్యాపకులు, తల్లిదండ్రులను, విద్యార్థులను కరస్పాండెంట్ చంద్రకళా వెంకట్, సైకాలజిస్టు లక్ష్మణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement