ప్రేమలో ఏబీసి ఏంటి..? | What do mean by premalo abc ? | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఏబీసి ఏంటి..?

Published Mon, May 12 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

ప్రేమలో ఏబీసి ఏంటి..?

ప్రేమలో ఏబీసి ఏంటి..?

అజయ్, రిషి, రూబీ పరిహార్, శ్రీఐరా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసి’. తలారి నాగరాజు దర్శకుడు. జె.వి.రెడ్డి నిర్మాత. ఏలేందర్ బైగళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య, మల్టీడైమన్షన్ వాసు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది.
 
 వి.సముద్ర, అశోక్‌కుమార్, స్టీవెన్ శంకర్, రామసత్యనారాయణ, డార్లింగ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్ ఇదని, నెలాఖరున సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు వచ్చే లాభాలను తన అమ్మానాన్నల పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి ఉపయోగిస్తానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఇ.ఎస్.హెచ్.ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement