platinum disc
-
నీ జతగా నేనుండాలీ మూవీ ప్లాటీనమ్ డిస్క్ వేడుక
-
పోరా పోవే మూవీ ప్లాటీనమ్
-
ప్రేమలో మార్పులు
ఈ పదిహేనేళ్లలో ప్రేమలో వచ్చిన మార్పే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ప్రదీప్ బెట్నో, ఇషా తల్వార్, మధుమతి ఇందులో ప్రధాన పాత్రధారులు. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. సానా వెంకట్రావ్, ఉపేంద్రకుమార్ గిరడ నిర్మాతలు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా, ప్రదీప్‌కుమార్.వి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. మధుర శ్రీధర్, బి.ఎ.రాజు చిత్ర యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులు, యూనిట్ సభ్యులు ఆకాంక్షించారు. -
ప్రేమలో ఏబీసి ఏంటి..?
అజయ్, రిషి, రూబీ పరిహార్, శ్రీఐరా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసి’. తలారి నాగరాజు దర్శకుడు. జె.వి.రెడ్డి నిర్మాత. ఏలేందర్ బైగళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య, మల్టీడైమన్షన్ వాసు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది. వి.సముద్ర, అశోక్‌కుమార్, స్టీవెన్ శంకర్, రామసత్యనారాయణ, డార్లింగ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. లవ్, యాక్షన్, ఎంటర్టైనర్ ఇదని, నెలాఖరున సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు వచ్చే లాభాలను తన అమ్మానాన్నల పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి ఉపయోగిస్తానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఇ.ఎస్.హెచ్.ప్రసాద్. -
నేను ఫుల్ హ్యాపీ - పూరి జగన్నాథ్
‘‘నిర్మాతగా, దర్శకునిగా ఈ సినిమా విషయంలో నేను ఫుల్ హ్యాపీ. సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. నితిన్ కథానాయకుడిగా పూరీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘హార్ట్ ఎటాక్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా పూరీ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశాడు. ప్రకాష్‌రాజ్ తన సొంత సినిమా పనిమీద బిజీగా ఉన్నా... అవన్నీ కాసేపు పక్కనపెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాతో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం రోజురోజుకీ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. పంపిణీదారులందరూ హ్యాపీగా ఉన్నారు. అనూప్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ సినిమా విజయానికి ఓ కారణాలు. నా కెరీర్లోనే దిబెస్ట్ అనదగ్గ ఫైట్స్ ఇందులో చేశాను. రామ్-లక్ష్మణ్ సూపర్ ఫైట్స్ ఇచ్చారు. హ్యాట్రిక్ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నితిన్ చెప్పారు. పూరీజగన్నాథ్‌తో పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుందని, ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని అనూప్‌రూబెన్స్ కోరారు. అందరూ సిన్సియర్ ఎఫెర్ట్ పెట్టడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కరభట్ల, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మల్లిగాడు’ నవ్విస్తాడు
‘‘నేను నటించిన పలు చిత్రాలకు ఉదయ్‌రాజ్ మంచి కథలు ఇచ్చాడు. ఆయన ఈ చిత్రకథ చెప్పగానే నచ్చింది. ఈ మధ్యకాలంలో దాదాపు సీరియస్ సినిమాలకే పరిమితమయ్యాను. ఈ చిత్రంలో నా మార్క్ వినోదం, సెంటిమెంట్ ఉంటుంది. పెళ్లి సందడి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రాల తరహాలో బ్రహ్మానందం, నా కాంబినేషన్లో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిది’’ అన్నారు శ్రీకాంత్. రచయిత ఎ. ఉదయ్రాజ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీకాంత్, మనోచిత్ర జంటగా మల్లెల సీతారామరాజు, పిల్లాడి స్వాతి నిర్మించిన చిత్రం ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. రఘురాం స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్ యూనిట్ సభ్యులకు షీల్డులు అందజేశారు. ఇంకా ఈ వేడుకలో ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి, ప్రసన్నకుమార్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మల్లెల సీతారామరాజు అన్నారు. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు. -
‘దిల్‌దివానా’ సందడి
నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : నెల్లూరుకు చెందిన యువకుడు రోహిత్‌రెడ్డి హీరోగా నటించిన దిల్‌దివానా చిత్ర యూనిట్ నగరంలో మంగళవారం సందడి చేసింది. ప్లాటినమ్ డిస్క్ ఆవిష్కరణ కోసం నెల్లూరుకు వచ్చిన సినీ నటులు డీఆర్ ఉత్తమ్ హోటల్లో బస చేశారు. హీరోలు రోహిత్‌రెడ్డి, రాజ్‌అర్జున్, హీరోయిన్లు నేహాదేశ్‌పాండే, కృతికా సింగాల్, దర్శకులు కిరణ్ తుమ్మా, నిర్మాత రాజారెడ్డి, సంగీత దర్శకుడు రామ్నారాయణతో పాటు యూనిట్ సభ్యులను చూసేందుకు యువత పోటీపడ్డారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సింహపురిలో పుట్టి నటుడిగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో ఓ సినిమాను చిత్రీకరించి ఇక్కడి రుణం తీర్చుకుంటానని చెప్పారు. దర్శకుడు కిరణ్తుమ్మా మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. డైమండ్స్ విడుదల నగరంలోని జైన్‌గోల్డ్ షోరూంను దిల్‌దివానా చిత్ర యూనిట్ సందర్శించారు. వజ్రాభరణాలను తిలకించి అలంకరించుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం జైన్‌గోల్డ్ ఆధ్వర్యంలో డైమండ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. నటులు రోహిత్, రాజ్, నేహ, కృతికలు వాటిని ధరించారు. అనంతరం జైన్‌గోల్డ్ అధినేత మణిలాల్ జైన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో వీవీఎస్/ఈఎఫ్ క్వాలిటీతో నూరుశాతం దోషరహితమైన వజ్రాలను గ్యారెంటీతో విక్రయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం నరేంద్రజైన్, పారస్మల్జైన్, రాజేష్‌జైన్ పాల్గొన్నారు. నెల్లూరు బిర్యానీ సూపర్ వీఆర్సీ సెంటర్లోని ఉన్న శుభమస్తు షోరూంలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరోయిన్లు నేహా, కృతిక మాట్లాడుతూ నెల్లూరు చాలా బాగుందన్నారు. ఇక్కడి వారి అభిమానం జీవితంలో మరిచిపోలేమని చెప్పారు. నెల్లూరు బిర్యానీ సూపర్ అన్నారు. అనంతరం ఇక్కడి సిబ్బంది, అభిమానులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో బయ్యా శ్రీనివాసులు, బయ్యా రమణయ్య, బయ్యా రవి పాల్గొన్నారు. -
అనగన గా... అలా జరిగింది
శ్రీరాజ్ బళ్లా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఎన్వీఎస్ అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్లా నిర్మాతలు. రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య పాత్రధారులు. రవివర్మ బళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన రేలంగి నరసింహారావు, ఆర్పీ పట్నాయక్, కొడాలి వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్‌లు యూనిట్‌కి శుభాకాంక్షలు అందించి, జ్ఞాపికలు అందజేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని శ్రీరాజ్ నమ్మకం వ్యక్తం చేశారు.