జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు.
గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి.
ఇదీ చదవండి: బైడెన్ చొరవ.. ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్.. గాజాకి అందనున్న మానవతా సాయం
Comments
Please login to add a commentAdd a comment