Kannada Actor Rishi's Interesting Real-Life Love Story - Sakshi
Sakshi News home page

ఆరోజే 'ఐ లవ్‌యూ' చెప్పుకున్నాం.. బుక్స్‌ ఇచ్చి అందులో ఏం రాసేవాడంటే!

Published Thu, Jun 10 2021 10:54 AM | Last Updated on Thu, Jun 10 2021 12:45 PM

Kannada Actor Rishis Real Life Love Stroy - Sakshi

బెంగళూరు : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ లవ్‌స్టోరీ ఉంటుంది. కన్నడ హీరో రిషి  లైఫ్‌లో కూడా ఓ అందమైన ప్రేమకథా చిత్రం ఉంది. ‘పరేషన్‌ అలమేలమ్మ’ సినిమతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రిషి  2019లో స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్‌ కహానీ ఎలా మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు వంటి విషయాలను స్వాతి ఇటీవలె షేర్‌ చేసుకుంది. 'నా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాను. సిటీ కొత్త కదా సరదాగా ఓరోజు  థియేటర్‌కు వెళ్లాం. అక్కడే  మొదటిసారిగా రిషిని చూశాను. హీరోగా అతడి మొదటి సినిమా అది. అంత మంది జనాల మధ్య రిషి హైట్‌, తన స్మైల్‌ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్‌లో తనను కలవడానికి వెళ్లా. మీరు డ్యాన్స్‌ చాలా బాగా చేశారు అని చెబుతుంటే బ్లష్‌ అయిపోయాడు. అది నన్ను మరింత అట్రాక్ట్‌ చేసింది.

మరుసటి రోజు రిషి ప్రొఫైల్‌ ఫేస్‌బుక్‌లో దొరికొంది. దీంతో మెసేజ్‌ చేశా. అటువైపు నుంచి రిప్లై రావడంతో ఇద్దరం చాటింగ్‌ చేసేకునేవాళ్లం ఓ రోజు రిషి కాఫీకి రమ్మని పిలిచాడు. అలా సరదాగా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఓ రోజే నేను నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేశా..దీంతో రిషి నేను ఇదే చెప్పాలనుకున్నాను అనడంతో ఇద్దరం మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనుకున్నాం. అదేరోజు సాయంత్రం  ఫోన్‌లో ఇద్దరం ఐ లవ్‌యూ చెప్పుకున్నాం. రిషి సినిమాల్లో ఉండటం, నాకు 9-5 జాబ్‌ కావడంతో  వారానికి ఒకసారి కంటే ఎక్కువ కలిసేవాళ్లం కాదు. కానీ ఉన్నంతసేపు చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నా కోసం బుక్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చి అందులో నువ్వు నా లైఫ్‌ని మరింత అందంగా మార్చేశావు అంటూ ఎంతో క్యూట్‌ కొటేషన్స్‌ రాసి ఇచ్చేవాడు.

ఇక నేను కూడా వీలు కుదిరినప్పుడల్లా తనకు సెట్స్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చేదాన్ని. ఇక రిషి ఫస్ట్‌ మూవీ ‘పరేషన్‌ అలమేలమ్మ’ హిట్‌ కావడంతో ఇక పెళ్లిచేసుకుందామా అని రిషి అడిగాడు. నేను కూడా ఎస్‌ చెప్పాను. వెంటనే మా నిశ్చితార్థం జరిగింది. ఇక తమిళ, కన్నడ సంప్రదాయాల ప్రకారం మా పెళ్లి జరిగింది. ఆరోజు తాళి కట్టే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రిషి అడగడంతో ..ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని నువ్వు అనుకోవట్లేదా అని చెప్పిన వెంటనే తాళి కట్టేశాడు. ఇదే విషయంపై అప్పుడప్పుడూ రిషిని ఏడిపిస్తుంటాను. ఇక పెళ్లి తర్వాత హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లలేకపోయాం. కరోనా కావడంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక రిషి తన ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటాడు. ఈ ప్యాండమిక్‌ పూర్తైన వెంటనే ఓ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చాలా ప్లాన్స్‌ ఉన్నాయి' అంటూ తన లవ్‌స్టోరీ బయటపెట్టింది. ఇక సర్వజనికారిగే సువర్ణవాకాష అనే చిత్రంలో రిషి చివరిసారిగా కనిపించాడు. 

చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే..
కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement