సాక్షి, హైదరాబాద్ : ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమా ద్వారా శాండిల్‌వుడ్‌కు పరిచయమైన నటుడు రిషి, రైటర్ స్వాతిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. దీనిపై నటుడు రిషి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ... ‘నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరాడు. నేటికి ఒక మైలు రాయిని దాటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జోడి దొరికింది. మా నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న కన్నడ చిత్రరంగ ప్రముఖలు రిషి, స్వాతిలకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment