భార్యతో సహా పోలీసు ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో పోలీసు దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. సాయుధ రిజర్వు (ఎఆర్) కు చెందిన కానిస్టేబుల్ సుందర పాండి (29) భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక సూసైడ్ వీడియోను కూడా రికార్డు చేశాడు. గురువారం చెన్నై ఎర్నావూరులో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది.
సుందర 18 నెలల క్రితం రామనాథపురంలోని శశికళ (23) తో వివాహం జరిగింది. ఆదినుంచి వీరిది కలహాల కాపురమే. ఈ సమస్యల కారణంగా వీరు వేరుగా జీవిస్తున్నారు. అయితే ఇటీవల పెద్దలు, బంధువుల కలగజేసుకుని కాపురాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో ఎర్నావూరులోని భారతీయ నగర్లో నెల క్రితంనుంచి మళ్లీ కలిసి వుండటం ప్రారంభించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదుగానీ శశికళ జూన్ 12 ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స తర్వాత కోలుకున్న ఆమె గత బుధవారం తిరిగి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చింది. తెల్లవారేసరికి ఇద్దరూ ఉరి వేసుకుని చనిపోయి కనిపించారు. అయితే ఆత్మహత్యకు ముందు తన చావుకు అత్తమామలే కారణమంటూ ఒక వీడియో ను స్నేహితులకు షేర్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.